అబ్బాయి పెళ్ళి

1
12

[dropcap]ర[/dropcap]జని చాలా చక్కని భావాలున్న మహిళ. సహయం చెయ్యడంలో ముందుకు వస్తుంది. స్నేహితులకి బంధువులకి కూడా ఆమె ఎంతో ఇష్టము. ఏ ఫంక్షన్ అయినా ముందుకు వచ్చి నిలబడుతుంది. అదే ఆమెకు శ్రీరామరక్ష. పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి. అంతా సుఖంగా ఉన్నారు. అయితే రజని చెల్లెలు మగపిల్లలు ఇద్దరు పెళ్ళికి ఉన్నారు. మంచి చదువులు చదివారు. స్పురద్రూపులు, మంచి పెళ్ళి కూతుళ్ళు కోసం గేలం వేసి వెతుకుతోంది. ఎక్కడ మంచి అందమైన పిల్లలు దొరకడం లేదు. చదువు, డబ్బు ప్రక్కన పెట్టి పిల్ల అందం చాలనుకుంది. అదీ అంతంత మాత్రమే. పదేళ్ళ క్రితం ఆడపిల్ల వద్దని అందరూ అబ్బాయిలనే కన్నారు. ఇప్పుడు ఆడపిల్లలు తక్కువైపోయారు అనే కంటే అసలు లేనే లేరు అనుకోవాలి. వయస్సు తగ్గ పిల్లలు ఉండటం లేదు. భర్త వదిలేసిన పిల్లలు చాలామంది ఉన్నారు. భర్త పోయిన పిల్లలు చాలామంది ఉన్నారు. అందులో కొందరికి పిల్లలున్న వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వీరేశలింగం గారి రోజులు వచ్చాయా? ఇది విచిత్రంగా ఉంది.

కాలింగ్ బెల్ చప్పుడవుతోంది. ఎవరా అనుకుంటు వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా పెళ్ళివారు. భవాని పిలుపులకి వచ్చింది. తమ అపార్టమెంట్ ఎదురుగా చిన్న హోటల్ నడుపుతుంది. భర్త, భార్య, పిల్లలు అంతా కష్టపడి పనిచేసేవారు. పిల్లల్ని పాలిటెక్నిక్ చదివించారు. పెద్దవాడిని పంచాయితిలో సూపర్ మేనేజర్ ఉద్యోగం వచ్చింది. వెంటనే పిల్లాడికి సంబంధం కుదిర్చి పెళ్ళి చేసేస్తున్నారు. కోడలు బి.ఎ. చదివిందిట. పిల్ల పేర డాబా ఉంది. పెళ్ళికి ఖర్చులకు లక్ష రూపాయలు విడిగా ఇచ్చారుట. అని చెప్పింది. చిన్న కుటుంబాల వాళ్ళు మగపిల్లల పెళ్ళిళ్ళు తొందరగా చేసేస్తున్నారు. ఇద్దరు కష్టపడి సంపాదించుకుంటున్నారు. చాలా సంతోషం అనుకుని శుభలేఖ పుచ్చుకుంది.

భవాని వెళ్ళాక తలుపువేసి వచ్చి గదిలో సోఫాలో నీరసంగా చతికిల బడింది. చెల్లెలు మగ పిల్లలిద్దరు రామలక్ష్మణులు కనిపించారు. వాళ్ళిద్దరు కవల పిల్లలు. చక్కగా ఇంజనీర్స్ చదివారు. చక్కని ఉద్యోగాలు చేస్తున్నారు. మరిదిగారు కూడా కష్టపడి పెళ్ళి కూతుళ్ళును వెతుకుతున్నారు. దొరకడం లేదు. మగపిల్లలు పూజలు, హోమలు, జపాలు ఇలా సిద్ధాంతులు చెప్పినవి చేయిస్తోంది.

గతంలో ఆడపిల్ల చేత అట్లతద్ది నోము, రుక్మిణీ కళ్యాణము చదివించడము, బొమ్మలకి పెళ్ళి చేయించడము, శివ కళ్యాణం చూపించడము ఇలా ఎన్నో ప్రక్రియలు చేసేవారు. పూర్ణిమ పూజలు, లలిత సహస్రము చదివించడం లాంటివి చేసి పాతికేళ్ళు వచ్చేటప్పుకి పెళ్ళి చేసి ముప్ఫై ఏళ్ళు వచ్చేటప్పుటికి ఇద్దరు పిల్లల్ని కనేవారు. ఇప్పుడు అమ్మాయిలకి, అబ్బాయిలకి, అందరికి ఎవరి ఇష్టలు వారివి. అప్పటికి రెండు సంబంధాలు ఎదురు వెళ్ళి మా పిల్లని చేసుకుంటాము అని అడిగితే మరి మా అమ్మాయి ఇష్టం అంటూ తప్పించుకున్నారు. ఆ మధ్య అశ్విని కొడుక్కి ఒకళ్ళు సంబంధం చెపితే “మా అబ్బాయి సాఫ్ట్‌వేర్ కదా హైఫై కోడలు కావాలి” అన్నది.

“అంటే ఏలా! ఉండాలి” అనే ప్రశ్న వచ్చింది.

“ఆ ఏముంది ఒక్కతే కూతురు, సాఫ్ట్‌వేర్ జాబ్, ఫ్లాట్ అన్ని హంగులు కావాలి. కనీసం నెలకి 2లక్షలు సపాదించే కేపాసిటీ ఉండాలి.”

“ఇన్ని హంగులున్న పిల్లలయితే వయస్సులో పెద్దది అవ్వచ్చు కదా!”

“పెద్దదయితేనేవి గొప్ప కోడలు కావాలి. అదే నా జీవిత ఆశయము” అన్నది.

అశ్విని మాటలకి ఆశ్చర్య పడటం తప్ప సమాధానం చెప్పే అవకాశం లేదు. అశ్వని ఎవరి మాట వినదు. వంట వార్పులు ఏనాడు మర్చిపోయారు. క్యాంటిన్లు, క్యాటరింగ్లు విజృంభించిన రోజులు. అలా అశ్వని కొడుక్కి ఎన్ని సంబంధాలు వచ్చిన ఏదో వంకలు చెప్పేది. చివరకు ఒక హైదరాబాద్ సంబంధం కుదిర్చింది. అయితే ఆ పెళ్ళివారు “ఇప్పుడు మేము మీ స్తోమతకు తగినట్లు పెళ్ళి చేయ్యలేము. ఓ 10 లక్షలు సర్దండి, మీకు తాజ్‍లో పెళ్ళి చేస్తాం” ఆన్నారు.

అశ్వని ఆలోచించింది. ’ఉభయ ఖర్చులు నేనే పెట్టి చేస్తాను. మీరు మీ పిల్లతో రండి” అని చెప్పింది.

ఏలూరు తెచ్చుకుని పెళ్ళి చేసుకున్నారు. ఇదేనా హైఫై కావాలంటే అని అందరూ వెళ్ళబెట్టారు.

ఏమిటి అందరికి కుజదోషాలు ఉన్నాయా? శాఖలు, గోత్రాలు, జాతకాలు ఇలా రకరకాల గొప్ప కోరికలతో మగ పిల్లల జీవితాలతో తల్లిదండ్రులే ఆడుకుంటారు. ఆడ జనాభా తగ్గిన ఈ సమాజంలో యాభై ఏళ్ళ పెళ్ళికొడుకులు చాలామంది ఉన్నారు. గతంలో ఆడపిల్లలచేత పెళ్ళికి పూజలు చేయించినట్లు నేటితరంలో అబ్బాయిలు పూజలు చేస్తున్నారు. అబ్బాయిల తల్లిదండ్రులు పూజలు చేస్తున్నారు.

సమాజంలో పద్దతులు తిరగబడ్డాయి. అమ్మాయిల సంపాదన వచ్చాక సంపాదనే ధ్యేయంగా జీవితాశయాలు మారిపోతున్నాయి. హైటెక్ అత్తగారు, హైఫై కోడళ్ళుగా మారింది. వయస్సు ఎక్కువైనా పర్వాలేదు. సంపాదన ఘనంగా ఉండాలి. ఎప్పుడైతే ఆశయాలు ఆచరణలు మారయో కుటుంబ వ్యవస్థ బీటలు వారింది. క్రమంగా పెళ్ళాడామంటారు, కానీ సామారస్యం ఉండదు.

‘పెళ్ళిళ్ళు స్వర్గంలో నిశ్చయం అవడం కాక పెళ్ళిళ్ళు సంపాదనతో ముడిపడ్డాయి. నేటి సమాజం ఎట్లు పయనిస్తోందో తెలియదు.’ అనుకుంది రజని.

తల్లిదండ్రులు పెంపకంలోనే ఈ పునాది రావాలి. భార్య పాట్లు భర్తకి, భర్త పాట్లు భార్యకి మంచి, గౌరవం, మర్యాద ఉండేలా పెంచాలి. అత్తమామలు కోడల్ని కన్నపిల్లలా చూస్తే ఈ సమస్యలు ఉండవు అని గుర్తిస్తే ఆనాడే శుభసంకల్పము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here