ఆచార్యుడా వందనం

0
7

[box type=’note’ fontsize=’16’] ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా యువకవి మంగుదొడ్డి రవికుమార్ అందిస్తున్న కవిత “ఆచార్యుడా వందనం”. [/box]

[dropcap]అ[/dropcap]జ్ఞానమనే అంధకారమును తొలగించువాడవు
విజ్ఞానమనే వీధుల్లో విహరింపజేయగలవు
దేహమందు చైతన్యమనే స్ఫూర్తిని నింపగలవు
త్యాగగుణము తరువుకాదు గురువంటూ చూపగలవు
పసిడిపలుకులను పసిడిమయం చేయగలవు
అమవసి పొలమున అక్షరసేద్యము పూను రైతన్నవు
కపటము కడలిన వదలగ కల్మషముకు శత్రుడవు
మాయమైన మానవతను మదినిండా కలవాడవు
వృత్తిధర్మము వ్యష్ఠిగాక సంతుష్ఠి గాంచువాడవు
చెడు మెదళ్ళ నిండ మంచి పంచు పరోపకారుడవు
సకలశాస్త్రమంత తెలిసినట్టి శారదాంబ పుత్రుడవు
పుక్కిటల్లె పురాణాలు పుచ్చుకొన్న పుస్తకాల మిత్రుడవు
బాలబాలికలకు బాసటగా నిల్చినట్టి నాయకుడవు
చెడును తుంచి మమత పంచు మానవతావాదుడవు
తెలివితేటల వీణ మీటు నవకళాకారుడవు
కులమతాలు పక్కనెట్టి నీతిబోధ గాంచు బోధకుడవు
మట్టినైన మాణిక్యము చేయునట్టి మాంత్రికుడవు
ఆలనపాలనమున అమ్మనాన కు మారుపేరువు నీవు
మనసంతా గాయమైనా మచ్చలేని నాయకుడవు
ఎల్లలోకమునంత గెలిచినట్టి ధీరుడవు నీవు పాధ్యాయుడవు.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here