అద్వైత్ ఇండియా-12

0
13

[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘అద్వైత్ ఇండియా’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]

[పది రోజుల్లో రాబర్ట్ మామూలు మనిషవుతాడు. నరసింహశాస్త్రి చేసిన సహాయం గురించి భార్యాకూతురు చెప్తే నమ్మడు. ఆఫీసుకు వెళ్ళాకా, ఇండియా డబ్బు చెల్లించి పశువులను విడివించిన విషయం తెలుస్తుంది. రెండు గంటలు ఆఫీసులో ఉండి ఇంటికి వస్తాడు. వరండాలో కూర్చుని – ఇండియాని గట్టిగా పిలుస్తాడు. ఇండియా, ఆమె వెనుకే ఆండ్రియా కూడా బయటకి వస్తారు. తన సంపాదనతో పశువులని ఎందుకు విడిపించావని కోపంగా అడుగుతాడు. అది మీ సంపాదన కాదు, నాది అంటుంది ఆండ్రియా. రైతులు మీకు జేజేలు పలికారంటుంది. వాళ్ళ జిందాబాద్‍లు తనకి అనవసరమని, తన ఆఫీసు వ్యవహారాల్లో వాళ్ళిద్దరూ జోక్యం చేసుకోవడం తప్పని అంటాడు. ఇండియా తన అభిప్రాయం చెబుతుంది. నా కళ్ళ ముందు పుట్టినదానివి, నాకే నీతులు చెప్తావా అని కూతుర్ని కసురుకుంటాడు. అతనితో మాట్లాడడం అనవసరమని, తల్లీ కూతుళ్ళు అక్కడ్నించి లేచి, ఆండ్రియా స్థాపించిన అనాథ శరణాలయానికి వెళ్ళిపోతారు. అది కార్తీక మాసం చివరి సోమవారం. ఉదయం ఐదు గంటలకే నిద్ర లేచిన రాబర్ట్, ఆండ్రియా కూతురు గదిలోకి వెళ్ళి చూస్తే, అక్కడ ఇండియా ఉండదు. బయటకి వచ్చి చూస్తే పోర్టికోలో కారు ఉండదు. కాసేపటికి కారులో సుల్తాన్, ఇండియా వస్తారు. నాకు చెప్పకుందా ఎక్కడికి వెళ్ళావని రాబర్ట్ గద్దిస్తే, నదికి వెళ్ళి స్నానం చేసి, శివాలయానికి వెళ్ళొస్తున్నాని చెప్తుంది ఇండియా. నువ్వు క్రిస్టియన్‍ని వని మర్చిపోకు, హిందువుల ఆలయానికి వెళ్ళి పెద్ద తప్పు చేశావని అంటాడు. ఆ ప్రభువు తనకి ఏ శిక్ష వేసినా ఆనందంగా అనుభవిస్తానని అంటుంది ఇండియా. ఆండ్రియా బయటకు వచ్చి – ఇండియా వయసొచ్చిన పిల్ల అనీ ఏది మంచో ఏది చెడో తనకు బాగా తెలుసనని, అనవసరంగా కూతురుపై ఆవేశాన్ని ప్రదర్శించవద్దని చెప్తుంది. యజ్ఞానికి నరసింహశాస్త్రి.. రెడ్డిరామిరెడ్డిగారు అన్ని ఏర్పాట్లు చేస్తారు. అనుకున్న విధంగా మూడు రోజుల పాటు సాగిన యజ్ఞం విజయవంతంగా పూర్తవుతుంది. మేఘాలు కమ్మి పెద్ద వాన కురుస్తుంది. ఈ మూడు రోజుల పాటు అక్కడే ఉండి కార్యక్రమాన్నంతా ఫోటోలు తీస్తుంది ఇండియా. వాన కురిసినప్పుడు అందరితో పాటూ తాను నాట్యం చేస్తుంది. గురువుగారి ఆశీస్సులు తీసుకుంటుంది. ఆ ఆ రాత్రి, మర్నాడు ఉదయం కుంభవృష్టి కురుస్తుంది. తాను చూసినవన్నీ వివరంగా అమ్మమ్మకి ఉత్తరం రాస్తుంది ఇండియా. – ఇక చదవండి.]

అధ్యాయం 23:

[dropcap]అ[/dropcap]ది 1882వ సంవత్సరం. ఆంగ్లేయులు ‘మద్రాస్ ఫారెస్టు యాక్ట్’ను ఏర్పరచారు. దానిలోని అంశాల ప్రకారం అరణ్యవాసులకు స్వేచ్ఛా సంచారానికి అంతరాయాలు.. ఆంక్షలు ఏర్పడ్డాయి. వారు పరంపరంగా సాగించే ‘పోడు’ వ్యవసాయ విధానాన్ని సాగించలేకపోయారు. అరణ్య సంపద మీద ఆధిపత్యం ఆంగ్లేయుల పరం అయింది. కోయలు, భిల్లులు వారి సహజ వనజీవిత విధానానికి దూరమై కూటికి గుడ్డకు కష్టపడవలసిన స్థితి ఏర్పడింది.

అల్లూరి సీతారామరాజుగారు 1897 జూలై నాల్గవ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగ్గిల్లు గ్రామంలో క్షత్రియుల కులంలో జన్మించారు. 1921 నాటికి సహాయ నిరాకరణ ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. బ్రిటీషు ప్రభుత్వాన్ని పడగొట్టాలని భావించారు.. కారణం గాంధీజీ అహింసా ప్రబోధనా పద్ధతి వారికి నచ్చలేదు. ఆ మార్గం మీద నమ్మకం కుదరలేదు. తన కోర్కె నెరవేరడానికి.. తెల్లవారిని దేశం నుండి వెళ్ళగొట్టడానికి యుద్ధమే శరణ్యం అని నమ్మారు.

1921 జూలైలో చిట్టగాంగుకు వెళ్ళి అక్కడ జరిగిన బెంగాల్ విప్లవకారుల రహస్య సమావేశంలో పాల్కొన్నారు.

ఆంగ్లేయులు.. గతంలో యీస్ట్ ఇండియా కంపెనీ పేర వ్యాపారానికిగా మన దేశంలో ప్రవేశించి.. రాజ్యకాంక్షతో వారు రెండు రెండు రాజ్యాల మధ్యన పగను పెంచి ఒక వైపున చేరి, యుద్ధాలను సాగించారు. రాజ్యాలను కొల్లగొట్టారు. విలువైన కోహినూరు వజ్రాన్ని.. అపహరించారు. సుగంధద్రవ్యాల కోసం వ్యాపారులుగా వచ్చిన వారు.. మన దేశంలోని మనవారిలో లేని సఖ్యతను ఆసరాగా తీసుకొని.. మన వారికి ఆంక్షలు పెట్టి.. పాలనాధికారాన్ని చేజిక్కించుకొని.. దేశానికి పాలకులైనారు. అంతటితో ఆగక వనసీమల్లో నివశించే అమాయక ఆటవీకులకు అంతరాయాన్ని కలిగించి.. వారి స్వేచ్ఛా జీవితానికి వ్యవసాయానికి నిబంధనలను.. చట్టాలను ప్రవేశపెట్టి ఫారెస్టు యాక్ట్‌ను ప్రవేశ పెట్టారు. వారి నుండి పన్నులను ఆశించారు.

సీతారామరాజుగారు.. చిట్టగాంగు నుండి తిరిగి వచ్చిన తర్వాత 1922 జనవరి.. నుంచి ‘రంప’ ఉద్యమాన్ని.. ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా.. గూడెం కొండల్ని తన కార్యకలాపాలకు స్థావరంగా ఎన్నుకొన్నారు అల్లూరి సీతారామరాజుగారు. ఆంగ్లేయుల చర్యలకు శాసనాలకు భయపడిపోయి కష్టాల్లో వున్న గిరివాసులు వారి ఉద్యమానికి స్వాగతం పలికారు. వారి ఆశయాన్ని ఆమోదించారు. వారి వద్ద విలువిద్యను అభ్యసించారు శ్రీరాజుగారు. వారి ప్రియతమ నాయకుడయ్యారు.

అధ్యాయం 24:

బావమరదులు అద్వైత్.. రాఘవ గోదావరీ నది ఒడ్డుకు వాహ్వాళికి వచ్చారు.

“రాఘవా!..”

“ఏం బావా!..”

“రేపు నీవు వెళ్ళవలసిందేనా!..”

“ఐదు రోజుల లీవు అయిపోయింది కదా బావా!.. వెళ్ళాలి.”

“సరే.. జాగ్రర్తగా మసలుకో. ప్రతిసారీ నేను నీకు చెప్పే మాటే యిది..” చిరునవ్వుతో రాఘవ ముఖంలోకి చూచాడు అద్వైత్.

“నా మీద నీకు వున్న అభిమానానికి అది తార్కాణం బావా!..” నవ్వాడు రాఘవ. క్షణం తర్వాత.. “బావా!.. నీతో ఒక విషయం చెప్పాలి!..” అన్నాడు.

“ఏమిటది?…”

“నేను అల్లూరి సీతారామరాజుగారిని చూచాను. వారి ప్రసంగాన్ని విన్నాను”

“ఎక్కడ?.. ఆశ్చర్యంతో అడిగాడు అద్వైత్.

“విశాఖపట్నంలో..” అని చెప్పి,

“బావా!.. వారి మాటల్లో ఎంతో దేశభక్తి.. ఆటవీకులపైన ఎంతో అభిమానం.. ఆంగ్లేయుల చర్యలపైన అసహ్యం.. ప్రతిఘటన.. నిండి వుంది. అంతిమశ్వాస వరకు తన పోరాటాన్ని సాగిస్తానని వారు చెప్పారు.” అన్నాడు రాఘవ.

అద్వైత్ ఆశ్చర్యంతో రాఘవ ముఖంలోకి చూచాడు.

“రాఘవా!.. ఆ భగవంతుడు కొందరిని కొన్ని ప్రత్యేక కార్యాచరణకుగా నిర్దేశిస్తాడు. ఆ కోవకు చెందిన వారే శ్రీ అల్లూరి సీతారామరాజుగారు. వారి నిర్ణయాలను నేను ఆక్షేపించను. కానీ.. అందరూ అల్లూరి సీతారామరాజుగా కాలేరు..”

“సంకల్పం దృఢంగా వుంటే.. ఎందుకు కాలేరు బావా!..”

అద్వైత్ విరక్తిగా నవ్వాడు.

“నీవు అన్న ఆ సంకల్పానికి అధినేత ఆ సర్వేశ్వరుడే రాఘవా!.. శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదన్న మాటను గుర్తు చేసికో!..” కొన్నిక్షణాలు రాఘవ మౌనంగా వుండి తర్వాత..

“బావా!.. యథార్థం చెప్పాలంటే నాలో అలాంటి సంకల్పం వుంది” తన నిశ్చితాభిప్రాయాన్ని మెల్లగా చెప్పాడు రాఘవ.

“నీ మీద నీ కుటుంబానికి సంబంధించిన బాధ్యతలు వున్నాయి. రాఘవా!.. సీత.. అత్తయ్యా జీవితాలు నీ ఆధారంగానే ముందుకు సాగాలి. యీ విషయాన్ని మరచిపోకు!.. కొడుకును కోడలిని పోగొట్టుకొన్న అత్తయ్యకు నీవు ఆరవప్రాణంరా!.. సీత భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దవలసిన బాధ్యత నీపైన వుంది. మరచిపోకు!..” అనునయంగా చెప్పాడు అద్వైత్.

“మరి శ్రీరాజు గారికి ఏ బాధ్యతలూ లేవంటావా బావా!.. నా అనేవారెవరూ లేని వారే సంఘసంస్కర్తలౌతారంటావా!..”

“చెప్పాను కదరా!.. అది ఆ సర్వేశ్వరుని నిర్ణయం అని..” తీక్షణంగా చూచాడు అద్వైత్ రాఘవ ముఖంలోకి.

ఆ క్షణంలో రాఘవ చూపులు వారికి మూడవందల అడుగుల దూరంలో వున్న ఓ జంట పైన లగ్నమైవున్నాయి.

“బావా!.. అటు చూడు..”

అద్వైత్ ఆ వైపుకు చూచాడు.

“వాడు మన పాండురంగ కదూ!..”

“అవున్రా!..” ఆశ్చర్యంతో అన్నాడు అద్వైత్.

“మరి ప్రక్కన వున్న ఆడపిల్ల!..”

“త్వరగా పద..”

ఇరువరూ వేగంగా వారి వైపుకు నడిచారు.

కొద్ది నిముషాల్లో వారిని సమీపించారు.

వీరి పాదరక్షల సవ్వడిని విని, పాండురంగ.. ఆ అమ్మాయి వెను తిరిగి చూచారు.

అద్వైత్.. రాఘవ వారిని సమీపించారు. వారిరువురూ భయాందోళనలతో లేచి నిలుచున్నారు.

“పాండురంగా!..” ఆశ్చర్యంతో అన్నాడు అద్వైత్.

“సుమతీ!.. నీవు వీడితో!..” అది రాఘవ ఆశ్చర్యపు మాట.

పాండురంగ వెంటనే అద్వైత్ కాళ్ళ మీద పడ్డాడు.

“బావా!.. సుమతి అంటే నాకు ఎంతో యిష్టం. ఆమెకూ నా విషయంలో అదే అభిప్రాయం. బాల్య వితంతువు జీవితాంతం వెధవరాలనే పేరుతో బ్రతకడం నా అభిప్రాయానికి వ్యతిరేకం. మేమిరువురం వివాహం చేసికోవాలని నిర్ణయించుకొన్నాము. మామయ్యగారిని ఒప్పించి మా వివాహాన్ని నీవే జరిపించాలి” తాను చెప్పదలచుకొన్నది చెప్పేసి దీనంగా అద్వైత్ ముఖంలోకి చూచాడు పాండురంగ, సుమతి.. ఆ యిరువురి ముఖాలను ఒక్కసారి చూచి.. కన్నీటితో తల దించుకొంది.

పాండురంగ నిర్ణయాన్ని విన్న అద్వైత్ రాఘవలు ఆశ్చర్యపోయారు. వెంటనే బదులు మాట్లాడలేకపోయారు. పాండురంగ సాహసం.. నిర్ణయం.. రాఘవకు నచ్చింది. అతని ముఖంలో చిరునవ్వు వెలిసింది.

తాను వంగి అద్వైత్ కాళ్ళ చెంతనే ఇసుకలో మోకాళ్ళ మీద కూర్చొని వున్న పాండురంగను సమీపించి అతని భుజాలను పట్టుకొని పైకి లేపి నవ్వుతూ..

“రంగా!.. తమ్ముడూ!.. నా కన్నా చిన్నవాడివైనా నీలోని విశాల భావం నాకు నచ్చిందిరా!.. నీ నిర్ణయం అమోఘం. అమ్మా!.. సుమతీ భయపడకు. మా బావకు మిమ్మల్ని ఇక్కడ చూచిన కారణంగా షాక్. వారింకా తేరుకోలేదు. మా మామయ్యా.. యీ నా బావా నా మాటను కాదనరు. మా వారందరితో మాట్లాడి మీ వివాహాన్ని నేను జరిపిస్తాను” అద్వైత్‌ను తట్టి.. “బావా!.. ఏమంటావ్?..” నవ్వాడు రాఘవ.

అద్వైత్ తొట్రుపాటుతో రాఘవ ముఖంలోకి చూచాడు.

“బావా!.. వీరురువురూ వివాహం చేసికోవాలని నిర్ణయించుకొన్నారు. మనం వారి వివాహాన్ని త్వరలో మన పెద్దలతో మాట్లాడి జరిపించాలి. అర్థం అయిందా!..” తన చేతిని అద్వైత్ చంకకు తాకించాడు.

అద్వైత్ ఒళ్ళు జలదరించింది. పెదవుల పైన చిరునవ్వు.

“ఒరేయ్ చిన్నబావమరదీ!.. నీవు మంత్రోచ్చారణలోనే కాదు సంస్కరణల విషయంలోనూ అసాధ్యుడివిరా!.. రంగా!.. యీ విషయంలో రాఘవ మాటే నా మాట. అమ్మా!.. సుమతీ, మీ యిరువురి వివాహం త్వరలో జరుగుతుంది..” తన కుడి చేతిని పైకెత్తి మనసారా ఆ యిరువురినీ పెద్దవాడైన కారణంగా ఆశీర్వదించాడు ఆద్వైత్.

అందరి ముఖాల్లోనూ ఎంతో ఆనందం.

“సరే ఇక పదండి..” అన్నాడు రాఘవ.

నలుగురూ నడక ప్రారంభించారు.

***

ఇండియా… తన గ్రాండ్ మదర్‌తో వారికి ఎదురయింది. వారిని సమీపించి..

“హలో బ్రదర్ రాఘవా!.. యజ్ఞంలో మీ పాత్ర పోషణం విశేషం” నవ్వుతూ చెప్పి అద్వైత్ ముఖంలోకి చూచింది.

ఆ చూపుల్లో కొంటెతనం గోచరించింది అద్వైత్‍కు. తనను గురించి ఏ రీతిగా ప్రసంగాన్ని ప్రారంభిస్తుందో అనే సందేహంతో ముందుగానే..

“ఇండియా!.. వీడు నా చిన్న బావమరది పాండురంగ.. ఆమె పేరు సుమతి. మా బంధువుల అమ్మాయి. వీరిరువురి వివాహం త్వరలో జరగబోతుంది” నవ్వుతూ చెప్పాడు అద్వైత్.

“ఓ.. వెరీ గుడ్!..” తన గ్రాండ్ మదర్‌ను చూస్తూ.. “గ్రానీ!.. హి యీజ్ మిస్టర్ అద్వైత్.. మై తెలుగు మాస్టర్.. నెక్స్ట్.. రాఘవ మై బెస్ట్ ఫ్రండ్, దే టు.. హి యీజ్ పాండురంగ.. ఆల్సో మై ఫ్రండ్.. షి యీజ్..” ఇండియా పూర్తి చేయక మునుపే..

“సుమతి.. ఆల్సో యువర్ ఫ్రండ్” నవ్వుతూ చెప్పాడు రాఘవ.

“నమస్తే మేడం…” సగౌరవంగా మేరీకి నలుగురూ నమస్కరించారు.

“నమస్తే.. నమస్తే!.. మిస్టర్ అద్వైత్… మై గ్రాండ్ డాటర్ ఇండియా రోట్ ఏ లాంట్ అబౌట్ యు.. అండ్ యువర్ ఫామిలీ. ఐ కేమ్ టు నో దట్ యువర్ ఫాదర్ యీజ్ గ్రేట్ డ్యాన్సర్ అండ్ అన్‌కంపేరబుల్ హ్యూమన్ హ్యావింగ్ హెవన్లీ పవర్స్. ఐ విల్ మీట్ హిమ్ టుమారో.. ప్లీజ్ టెల్ హిమ్!..” చెప్పింది మేరీ నవ్వుతూ.

“ఓకే మేడం!..” చిరునవ్వుతో చెప్పాడు అద్వైత్.

“బావా!.. ఇక మనం బయలుదేరుదాం” అన్నాడు రాఘవ.

“ఆఁ..” చెప్పి, మేరీ వైపు చూచి.. “మేడమ్!.. వుయ్ విల్ టేక్ లీవ్!..” అన్నాడు అద్వైత్.

“ఓకే.. ఓకే!..” అంది మేరీ

నలుగురూ ముందుకు నడిచారు. వెళుతున్న వారిలో ఇండియా చూపులు అద్వైత్‌పై లగ్నమై వున్న విషయాన్ని మేరీ గ్రహించింది.

“ఇండియా!..”

“యస్ గ్రానీ!…” తొట్రుపాటుతో అంది ఇండియా.

“టెల్ మీ ట్రూత్..”

“వై షుడ్ ఐ లై గ్రానీ!..”

“యు ఆర్ లవింగ్ అద్వైత్, యీజింట్ ఇట్!…”

“అఫ్ కోర్స్. డే డ్రీమ్స్ కాట్ బి ట్రూ గ్రానీ.. ఐ నో హు యామై ఆల్సో.. ఐ నో హు యీజ్ అద్వైత్.. హి యీజ్ ఎ మ్యాన్ ఆఫ్ మెర్సీ అండ్ మ్యాన్ ఆఫ్ ప్రిన్స్‌పల్స్.. ఐ మే నాట్ కరెక్టు టు హిమ్.” విచారంగా చెప్పింది ఇండియా.

“మీన్స్!.. యు వాంట్ టు కిల్ యువర్ విష్!..”

“వెన్ వుయ్ హ్యోవ్ నో క్వాలిఫికేషన్స్.. విష్ కాంట్ బి ఫ్రూట్‌ఫ్రుల్ గ్రానీ!..” జిజ్ఞాసగా అంది ఇండియా.

“వాటీజ్ ల్యాకింగ్ విత్ యు?..”

“ఐ యామ్ నాట్ హిందూ!..”

“సో వాట్.. లవ్ యీజ్ డివైన్, డోన్ట్ యు నో!..”

“ఐనో!.. బట్.. హి యీజ్ ఆర్థోడాక్స్.. హి విల్ నాట్ మేక్ ఎనీ మూమెంట్ ఎగైనెస్ట్ హిజ్ ఫాదర్ వర్డ్.. మోర్ ఓవర్ మై ఫాదర్ యీజ్ హేటింగ్ దెం. బికాస్ ఆప్ మి అద్వైత్ షుడ్ నాట్ బి యిన్ ట్రబుల్స్. యీ యీజ్ గ్రేట్ పర్సన్ లైక్ యు.. ఐకెన్ లవ్ హిమ్, టిల్ మై లాస్ట్ బ్రీత్ గ్రానీ!..”

మేరీ ఆశ్చర్యంతో చూచింది ఇండియా ముఖంలోకి కొన్ని క్షణాలు..

‘యస్!.. వాట్ యుసెడ్ యీజ్ రైట్.. యువర్ ఫాదర్ యీజ్ రియల్లీ ఏ డెవిల్.. నాట్ హ్యుమన్!..” విచారంగా అంది మేరీ.

“గ్రానీ!..”

“యస్ బేబీ!..”

“యు హ్యావ్ టు టాక్ విత్ మై గురూజీ!..”

“అబౌట్ వాట్..”

“అద్వైత్ విజిట్ టు లండన్.. హి యీజ్ ఎ గ్రేట్ డ్యాన్సర్. స్టిల్ ఐ హ్యావ్  టు లెర్న్ ఏ లాట్ ఫ్రమ్ హిమ్ గ్రానీ!.. అండ్ యిన్ ఆల్ యువర్ స్కూల్స్ హి హ్యాజ్ టు ఓపన్ డాన్స్ క్లాసెస్. దటీజ్ మై విష్..”

“ఓకే డియర్. ఐ విల్ టాక్ విత్ యువర్ గురూజీ..” అంటూ ఇండియా ముఖంలోకి చూచింది. ఆమె కళ్ళలో తొణికిసలాడుతున్నాయి కన్నీరు. మౌనంగా ఇరువురూ మెల్లగా ముందుకు నడిచారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here