అక్షర సౌరభం

1
13

[శ్రీ సాగర్ రెడ్డి రచించిన ‘అక్షర సౌరభం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]క[/dropcap]వి మస్తిష్కంలో జనించే అక్షర శిశువు,
సమాజ కాగితంపై స్వేచ్ఛగా పారాడితే,
అసమానతల చిరునామా గల్లంతై..
ఆనంద సమాజం ఆవిర్భవిస్తుంది!!

కవి కలం జాలురాల్చిన అక్షర ముత్యం
లక్షణమైన జీవితాన్ని అందించే ఙ్ఞానం-
సమాజాన తిమిరం తొలగించే దీపం,
తరాలు గడచినా ఇగిరిపోని గంధం!!

సాహిత్య పిపాసకుల ఉత్సాహానికి,
విని, వీక్షించే ప్రతిఘటనా ఒక అంశం-
సాహితీ సేద్యంలో నిత్య సంతోషం-
కవన వనం కడు కమనీయ శోభితం!!

గాడితప్పని రచనా వ్యాసంగ పర్వం-
సాహితీ ఆకాశంలో మెరిసే చుక్కలై,
వెలుగుల సంబరంతో విరాజిల్లితే-
విద్వేషపూరిత అక్షర ఆరాటమంతా-
వివాదాల గుంతలో దుర్గంధమయం!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here