అలనాటి అపురూపాలు-1

1
8

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

తిక్కవరపు వెంకట రమణారెడ్డి

యువ తిక్కవరాపు వెంకట రమణారెడ్డి అరుదైన చిత్రం

నాటకాలలో నటించేందుకే తిక్కవరపు వెంకట రమణారెడ్డి నెల్లూరు విఆర్ కాలేజీలో హిందీ రెండవ భాషగా – చదివారు. కళాశాలలోనూ, బయట లెక్కలేనన్ని నాటకాల్లో పాల్గొన్నారు. కాలేజీని వీడి, సర్టిఫికెట్ కోర్సు చేసి శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా అర్హత పొందారు. ఆయన గూడూరులో ఫస్ట్ క్లాస్ వ్యాక్సినేటర్‌గా పని చేయడం ప్రారంభించారు. కానీ ఎల్లప్పుడూ నాటకాలు వేయడంలో నిమగ్నమయ్యేవారు. 8 సంవత్సరాల పాటు – ఏకపాత్రాభినయనం చేసే వి.చంద్రశేఖర్ గారి బృందంలో కూడా ఉన్నారు. వెంకటగిరి అమెచ్యూర్స్ క్లబ్ సభ్యుడిగా నాటకాలు వేశారు. ఒక రోజు ఒక ప్రదర్శనలో పాల్గొని, దానిలో తెలుగు బోధించే తమిళుడిగా మేజిక్ లాంతరు స్టడీస్ కామెడీ షో చేశారు. ఈ ప్రదర్శన ఒక సరదా కార్యక్రమం, చూసి జనాలు తెగ నవ్వుకున్నారు. ఈ ప్రదర్శన, అనంతరం లభించిన కీర్తి – వారి ఉద్యోగంలో యజమానికి నచ్చలేదు. దీనితో విసుగు చెంది, నాటకాలలో నటించకుండా చేయాలనే ఉద్దేశంతో, వారు ఆయనను ఒక కొండ ప్రాంతానికి బదిలీ చేశారు. మనసంతా నటనే నిండిపోవడంతో, ఆయన తన ఉద్యోగాన్ని వదిలి పూర్తి సమయం నాటకాల్లో కామెడీ ఆర్టిస్ట్‌గా ఉండాలని నిర్ణయించుకున్నారు. వారికి మొదటి సినిమా అవకాశం త్యాగయ్య చిత్ర నిర్మాతల నుండి వచ్చింది. వారు షూటింగ్‌కి, వెళ్ళగా తల గొరిగించుకోవాలని చెప్పారట. వెంటనే ఆ షూటింగ్ నుండి పారిపోయారు. వారి నాటకాలు విజయవంతం కావడంతో, చాలా మంది సినీ నిర్మాతలు వారి ప్రదర్శనలను గమనించడం ప్రారంభించారు. వారికి అభిమాని అయిన శంకర్ రెడ్డి అనే నిర్మాత ఉన్నారు. ఆయన వెంకట రమణారెడ్డి గారిని ఒత్తిడి చేసి – 1952 నాటి చిత్రం ‘మానవతి’ లో నటించటానికి ఒప్పించారు. అది వారి మొదటి చిత్రం. అతను ‘జంగమ’ పాత్ర పోషించాల్సి వచ్చింది (పురాణాలలో పేర్కొన్నట్లు – జంగమలంటే శివుడి శిష్యులుగా భావించే సంచార సన్యాసులు. ఏ ఇంటికైనా ఒక జంగమ వెళితే, ఆ ఇంటికే సాక్షత్తు శివుడే వెళ్ళినట్టుగా అనుకుంటారు. జంగమకి మంచి భిక్ష ఇచ్చి స్థానికులు దీవెనలు తీసుకుంటారు). ఈ పాత్ర కోసం ఆయనకు దండలు వేసి చేతిలో గంట ఉంచారు. దర్శకుడు వై.వి.రావు కెమెరా వద్ద నిలబడి – హీరో మీదుగా మారువేషంలో ఉన్న హీరోయిన్ ముఖాల వైపు చూడమని చెప్పారు…. ఈ పాత్రకి డైలాగులు లేవు, కేవలం మూకాభినయం చేయాల్సి వచ్చింది. ఆయన హాస్య వ్యక్తీకరణలను నెమ్మదిగా ఇచ్చారు. సినిమాల కోసం అభినయాన్ని ఎలా వేగవంతం చేయాలో వై.వి.రావు వారికి నేర్పించి సరిదిద్దారు… ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూడలేదు…. వారిది ఎంతో అద్భుతమైన కెరీర్…..


ఉత్తరాది, దక్షిణాది సినీనటుల క్రికెట్ మ్యాచ్

1953లో జనవరి 11 న, మద్రాసులోని కార్పొరేషన్ స్టేడియంలో (రిప్పన్ బిల్డింగ్స్ వెనుక), సెలబ్రిటీల వన్‌డే క్రికెట్ మ్యాచ్‌ చూడడానికి 15,000 మంది జనం గుమిగూడారు. మద్రాస్ మరియు బొంబాయి చిత్ర పరిశ్రమల సినీ తారలు ఒకరిపై ఒకరు పోటీపడ్డారు. సినీ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (సిటిఎ) చే, చలన చిత్ర పరిశ్రమ కార్మికుల కోసం నిధులను సమీకరించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ప్రతి కార్యక్రమం ద్వారా సేకరించిన మొత్తం సగం విరాళం ఇవ్వాలని వారు నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో చేపట్టిన తుఫాను సహాయక చర్యల కోసం విరాళంగా ఇవ్వడానికి మద్రాస్ వాటాను సగానికి విభజించాలని నిర్ణయించారు. 29 ఏళ్ల కృష్ణస్వామి, అప్పటి కార్యదర్శి – ఈ మ్యాచ్ ఉత్తరాది, దక్షిణాది చిత్ర పరిశ్రమల కళాకారులను కళ పరంగా, ఇంకా సాంకేతికంగా సన్నిహితం చేస్తుంది అని అన్నారు.

కృష్ణస్వామి మరియు అతని సహచరులు నెలల ముందుగానే ప్రణాళిక రూపొందించారు. సినీనటులకు ఏర్పాట్లు సులువు కాదు. 22-సీట్ల స్పెషల్ డకోటా ఫ్లైట్ బొంబాయి నుండి మద్రాస్‌కు చార్టర్డ్ చేయబడింది, అక్కడ వారు కొన్నెమరా హోటల్‌లో బస చేశారు. సినీ తారలు పది కార్ల సముదాయంతో స్టేడియంలో తిరిగారు, ఇది జనాలను మరింత ఆకర్షించింది. మొట్టమొదటిసారిగా జనాలు సినిమా, క్రికెట్‌ల కలయికను చూశారు. ఇంతకు ముందెన్నడూ ఇంత దగ్గరగా ప్రజలు ఇంత మంది నటీనటులను చూడలేదు. ఉత్తరాది తారలలో దిలీప్ కుమార్, ప్రేమ్‌నాథ్, రాజ్ కపూర్, నర్గీస్, నిమ్మీ, నిరుపా రాయ్, పి జైరాజ్, గోపీ, ఆఘా, కుల్దీప్ కౌర్, బేగం పారా, ఓం ప్రకాష్, డేవిడ్, అన్వర్ హుస్సేన్, ప్రాణ్ మొదలైనవారు ఉన్నారు.

దక్షిణాది చిత్రాల తరఫున – ట్రావెన్కోర్ సోదరీమణులు లలిత, పద్మిని, రాగిణి, డాన్సర్ కమలా లక్ష్మణ్, సావిత్రి, పుష్పవల్లి, శాంతకుమారి, రావు బాలసరస్వతి, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వి.రంగారావు, ముక్కామల, పేకేటి శివరావు, జూనియర్ శివరంజని, షావుకారు జానకి, కృష్ణకుమారి, టంగుటూరి సూర్యకుమారి, శివాజీ, జెమిని గణేషన్, ఇంకా ఫేమస్ మేకప్ మ్యాన్ హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

      

బొంబాయి జట్టుకి కెప్టెన్‌గా దిలీప్ కుమార్, మద్రాస్ జట్టుకి కెప్టెన్‌గా వీణా బాలచందర్ వ్యవహరించారు. మద్రాస్ గవర్నర్ శ్రీ ప్రకాష్‌కు ఇరు జట్లను పరిచయం చేశారు. ఆయన ప్రసంగించి మ్యాచ్ ప్రారంభం కావడానికి టాస్ వేశారు. మద్రాస్ టీమ్ టాస్ గెలవగా, ఉదయం 11 గంటలకు మ్యాచ్ ప్రారంభమైంది. వారి కోరిక మేరకు నియమాలు రూపొందించారు. నటుడు డేవిడ్ తన అద్భుతమైన వ్యాఖ్యానాన్ని ఆరంభించారు. మద్రాస్ జట్టు 14 వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేసింది. బాంబే జట్టు మధ్యాహ్నం 3 గంటలకు బ్యాటింగ్ ప్రారంభించింది. వారు 154 పరుగులు చేసి 12 వికెట్లు కోల్పోయారు. బొంబాయి జట్టు గెలిచి సంతోషించింది. ఆ సాయంత్రం, జెమిని ఎస్ఎస్ వాసన్ ఉడ్‌ల్యాండ్స్ హోటల్‌లో ఇరు జట్లకు పార్టీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here