అమ్మ కడుపు చల్లగా-15

0
10

[box type=’note’ fontsize=’16’] అంటార్కిటికా ప్రాంతాలలో వచ్చిన మార్పులు భూమండలంపై మిగిలిన ప్రాంతాలను చాలా వేగంగా, త్వరగా ప్రభావితం చేస్తాయని ఈ వ్యాసంలో వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి. [/box]

[dropcap]సు[/dropcap]విశాలమైన ప్రకృతి వ్యవస్థలో ప్రతి భాగమూ, ప్రతి అంశమూ ఒక దానితో ఒకటి ముడిపడి ఉందన్న విషయం విస్మరించరానిది. పర్యావరణంలో సంచరించే విపరిణామాలకు ప్రభావితం కాగల 20 నగరాలలో 13 మనం దేశంలో ఉన్నాయని పరిశోధకుల అధ్యయనాలు చెప్తున్నాయి. ముంబై, చెన్నై వంటి నగరాలలో తుఫానులు సృష్టించిన బీభత్సం తెలిసిందే, అయినా దిద్దుబాటు చర్యలు శూన్యం.

ఏడు వేల కిలోమీటర్ల తీరప్రాంతంలో 3000 కిలోమీటర్ల పైగా తీరప్రాంతం తుఫానుల కారణంగా అతలాకుతలమైతున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ఒరిస్సా, పశ్చిమబెంగాల్ ముప్పు తీవ్రంగా ఉండే ప్రాంతంలో ఉన్నాయి.

తుఫానులకు సంబంధించి గతంలో కొన్ని అంచనాలు, లెక్కలు ఉండేవి. అవి ఏడాదికి సగటున 5 తుఫానులు మించవు. తీవ్రస్థాయిలో విరుచుకు పడే తుఫాను త్వరగా బలహీనపడుతుంది. బంగాళాఖాతంలో కంటే అరేబియా సముద్రంలో 2° ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది.

ఇలాంటివి ఇప్పుడు ఆ అంచనాలన్నీ వాస్తవంలో సరిపోటం లేదు. కారణం – అరేబియా సముద్రంలోనూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సముద్ర జలాలు వేడెక్కిన కొద్దీ తుఫానుల ముప్పు పెరగడం సహజ పరిణామం. ఇటీవలి సంవత్సరాలలో తుఫానుల సంఖ్య 25% మించి పెరిగిందని అధ్యయనాలు చెప్తున్నాయి. తుఫాను తాకిడి/తీవ్రతలను అంచనా వేయడంలోనూ పాత లెక్కలు కొరగాకుండా ఉన్న పరిస్థితి!

వేడెక్కుతున్న గాలులు:

గాలి తీరులో మార్పులు ప్రాకృతికమే అయినప్పటికీ – మానవ చర్య కారణంగా గాలిలో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయి. మితిమీరిన ఉద్గారాల కారణంగా వేడెక్కిన గాలులు సముద్ర జలాలనూ ప్రభావితం చేస్తున్నాయి. గాలుల కారణంగా వేడేక్కిన సముద్ర జలాలు తమ సహజమైన ప్రవాహశక్తి కారణంగా ఆ వేడిని క్రొత్త ప్రాంతాలకూ వ్యాపింపజేస్తున్నాయి.

అంటార్కిటికా వద్ద గాలులను ‘వెస్టర్లీస్’గా పేర్కొంటారు. ఉత్తర దిశ నుండే వేడిగాలులు అంటార్కిటికా ప్రాంతాన్ని ప్రభావితం చేస్తున్న కారణంగా అక్కడి గాలులు మరింత శక్తిమంతంగా మారి దక్షిణం వైపు కదులుతున్నాయి. ఫలితంగా అక్కడి మంచు ఫలకాలు కరిగిపోతున్నాయి. మంచు ఫలకాలు తగ్గిపోయిన కొద్దీ ఆ ప్రాంతం సముద్రపు జలాలుగా రూపాంతరం చెందిపోవడం స్వాభావికంగా జరిగేదే. కాని ఆ కారణంగా వేడెక్కే జలరాశులు మరింత అధికమవుతాయి. ఎన్నో సంవత్సరాలుగా ఆర్కిటిక్ ప్రాంతంలో జరుగుతున్నది అదే. ఇప్పుడు అంటార్కిటికా ప్రభావితం అవడాన్ని చూస్తున్నాం.

ఉద్గారాలు:

గాలిలో కార్బన్ డయాక్సైడ్ పెరిగిపెతోంది. ఈ వాయువు గాలి ఉష్ణోగ్రతలో మార్పుకు ముఖ్యకారణం అవుతోంది. గ్లేసియర్స్ కారణంగా ఏర్పడిన శీతల వాతావరణంతో కూడిన ఆర్కిటిక్, అంటార్కిటికా ప్రాంతాలు ఏ మార్పుకైనా చాలా తేలికగా గురి అవుతాయి. మిగిలిన ఉష్ణమండల ప్రాంతాలతో పోలిస్తే ఈ ప్రాతాలలో వేడిగాలులు ప్రభావం మరింత స్పష్టంగా, ఎక్కువగా తెలుస్తుంది. అక్కడ వచ్చిన మార్పులు భూమండలంపై మిగిలిన ప్రాంతాలను చాలా వేగంగా, త్వరగా ప్రభావితం చేస్తాయి. సముద్ర మట్టిలో పెరిగి కొన్ని లోతట్టు దేశాలు, ద్వీపాలు సైతం కనుమరుగైపోయే ప్రమాదం ఉందని శాస్త్రజ్ఞులు గతశతాభ్దిలోనే హెచ్చరించిన సంగతి తెలియనిది కాదు. ఇప్పుడు ఆ ప్రమాదం అంచున ఉండటం చూస్తున్నాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here