అమ్మ కడుపు చల్లగా-16

0
10

[box type=’note’ fontsize=’16’] పెరటి చెట్లు సైతం హానికారక రసాయనాలకు విరుగుడుగా పని చేస్తాయన్న వాల్వర్‌టన్ పరిశోధనల సారాన్ని నిత్యజీవితానికి అన్వయించుకోవాలని ఈ వ్యాసంలో వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి. [/box]

పచ్చదనం అన్ని విషాలకు విరుగుడు:

[dropcap]తు[/dropcap]లిప్స్, రబ్బర్ ప్లాంట్, బాంబూ పామ్ వంటి మొక్కలు పరిసరాలోని ఫార్మల్‌డీహైడ్స్‌ని నిర్మూలించగలవు. అరికా పామ్ అనే మొక్కలు టొల్యూన్, లేడీ పామ్ – అమ్మోనియాలను సమర్థవంతంగా అరికట్టగలవు. పెరటి మొక్కలు హానికారక రసాయనాలను శోషించుకోగలవని 1980లలోనే తెలిసింది. పరిసరాలకు తగిన మొక్కలను పెంచడం ద్వారా గాలి నాణ్యతను నియంత్రించవచ్చని శాస్త్రీయంగా నిరూపించబడింది.

అంతరిక్ష పరిశోధనశాలలలో ప్రయోగాలకు సంబంధించిన అంతరిక్ష నౌకలలోని గాలిలో 300 వరకు వివిధ రకాల రసాయనాలు వెలువడుతుండటాన్ని గుర్తించడం జరిగింది. ‘నాసా’ శాస్త్రవేత్త బిల్ వాల్వర్‌టన్ ఈ రసాయనాలకు సంబంధించి అధ్యయనం చేసినపుడు మొక్కలు వీటిని శోషించుకోగలవని నిరూపణ అయ్యింది. వివిధ దశలలో వెలువడే ఈ రసాయనాలు స్వయంచాలిత అంతరిక్ష వ్యవస్థలలో సమస్యలు తలెత్తడానికి కారణం కాగల అవకాశం ఉంటుంది. వీటి కారణంగా కంప్యూటర్లు క్రాష్ కాగల అవకాశాలూ ఏర్పడతాయి.

నాసా సైంటిస్ట్ వాల్వర్‌టన్ 1989లో ‘నాసా’లో ‘బయోహోమ్’లో గాలి లోని రసాయనాలను ఫిలోడెండ్రాన్స్, గోల్డెన్ పేథోస్ రకాల మొక్కలు వడబోయగలవని ప్రయోగాత్మకంగా నిరూపించాడు. ఈ జిజ్ఞాసువు అధ్యయనాలు, ప్రయోగాలు చేస్తున్న సమయంలోనే మేరీలాండ్‍లో ‘పాంట్ల్స్ ఫర్ ది క్లీన్ ఎయిర్’ కౌన్సిల్ ఏర్పడింది. ఈ కౌన్సిల్ ఆశయం వాల్వర్‌టన్ వంటి మరికొందరిని ప్రోత్సహించడం.

వాల్వర్‌టన్ దాదాపు 20 సంవత్సరాలు శ్రమించి 50 రకాల మొక్కలు హానికారక రసాయనాలను శోషించుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని శాస్త్రీయంగా నిరూపించాడు. పీస్ లిల్లీ మెధనాల్, ఇధనాల్, బెంజిన్ ట్రైక్లోరో ఎథిలిన్, ఎథిల్ ఎసిటేట్, ఎసిటోన్ వంటి రసాయనాలతో బాటు ఫార్మల్‌డీహైడ్స్‌నూ తొలగిస్తుంది.

ఈ రసాయలన్నీ ఎలక్ట్రానిక్ పరికరాలు, కంప్యూటర్లు క్రాష్ కావడానికి దోహదం చేయడమే కాకుండా వ్యోమగాములలో శ్వాసలో ఇబ్బంది, ముక్కు దిబ్బడ, నోరు పూత, కంటి వెంట నీరు వంటి సమస్యలకు కారణం అవుతూ ఉంటాయి. ఈ ఇబ్బందులను ‘సిక్ బిల్డింగ్ సిండ్రోమ్’ గా వ్యవహరిస్తారు. పెరటి చెట్లు ఈ సమస్యకు చక్కని పరిష్కారమని వాల్వర్‌టన్ తన వాదనను, అధ్యయనాన్ని శాస్త్రీయంగా ఋజువు చేశాడు. అంతే కాక –

పరిశుభ్రమైన గాలిని ఎట్లా పెంపొందించుకోవలన్న అంశంపై ‘హౌ టు గ్రో ఫ్రెష్ ఎయిర్’ అనే పుస్తకాన్ని వ్రాసి ప్రచురించాడు కూడా. తన ఇంటిని చాలా వరకు సహజసిద్ధంగానే పరిశుభ్రం కాగల ప్రకృతి సిద్ధమైన వ్యవస్థగా మలచుకొని అద్భుతాన్నీ సృష్టించాడు.

పరిసర ప్రాంతాలలో హానికారక రసాయనాలు సర్వసాధారణమైపోయిన ఈనాటి జీవన విధానాలు. పని వాతావరణాలు మనిషి ఆరోగ్య వ్యవస్థపై దుష్ప్రభావం చూపిస్తున్నాయన్న విషయం తెలిసిందే. పని ప్రదేశాలో పచ్చని మొక్కలని పెంచడం ద్వారా, పచ్చని ప్రకృతిలో కొంత సమయం గడపడం ద్వారా ఈ ప్రతికూల ప్రభావాల బారిన పడకుండా మనను మనం కాపాడుకోగల అవకాశం ఉంది. అటువంటి జీవనశైలి క్రమేపి మంచి ఫలితాలనిస్తుంది. పెరటి చెట్లు సైతం హానికారక రసాయనాలకు విరుగుడుగా పని చేస్తాయన్న వాల్వర్‌టన్ పరిశోధనల సారాన్ని నిత్యజీవితానికి అన్వయించుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here