అమ్మ కడుపు చల్లగా-20

0
10

[box type=’note’ fontsize=’16’] భౌతికశాస్త్ర ధర్మాలకు, వాతావరణానికి స్థూలమైన ఖచ్చితమైన లంకె ఉన్నదన్న విషయాన్ని నిరూపించడానికి శాస్త్రజ్ఞులు ఏనాటి నుండో ప్రయత్నిస్తున్నారని ఈ వ్యాసంలో వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి. [/box]

భూతాపం:

[dropcap]సూ[/dropcap]ర్యుడి నుండి నిర్ణీత తరంగధైర్ఘ్యంతో వెలువడే రేడియో కార్మిక కిరణాలు భూమిపైకి చేరాక భూమిచే శోషించబడి మరింత తరంగధైర్ఘ్యంతో వెలువరించబడతాయి. అలా వెలువడే కిరణాల నుండి కొంత రేడియో ధార్మికతను వాతావరణం శోషించుకుంటుంది. అలా శోషించుకుని వేడెక్కుతుంది. జీవకోటి మనుగడ నిమిత్తం శీతోష్ణ స్థితిగతుల క్రమబద్ధీకరణకి ప్రకృతి వ్యవస్థలో ఉన్న ఒక అద్భుతమైన నియతి అది. అదే ‘గ్రీన్ హౌస్ ఎఫెక్ట్’.

సుమారు 200 సంవత్సరాల క్రిందట జోసెఫ్ ఫోరియర్ అనే ఫ్రెంచి గణిత శాస్త్రజ్ఞుడు మన చుట్టూ ఉన్న వాతావరణంలో మిథేన్, బొగ్గుపులుసు వాయువు (Co2) నీటి ఆవిరి వంటివి ఇమిడి ఉన్నయని గుర్తించడం జరిగింది. వీటిని ‘ట్రేస్ గెసెస్’గా వ్యవహరిస్తారు. ఈ ట్రేస్ గెసెస్ వాతావరణంలోని ఉద్గారతను బంధించి ఉంచుతాయి. ఆ విధంగా వాతావరణంలోని సమతౌల్యాన్ని కాపాడతాయి ట్రేస్ గాసెస్ వలన జరిగే ఈ మహోపకారాన్నే ‘గ్రీన్ హౌస్ ఎఫెక్ట్’గా వ్యవహరిస్తారు. భూగోళానికి అవసరం అయిన 59% ఉష్ణోగ్రతను గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ క్రమబద్ధీకరిస్తూ ఉంటుంది. ఆ క్రమబద్ధీకరణే లేకపోతే ఉష్ణోగ్రత 0 డిగ్రీలకు పడిపోయి భూమి పై మంచు తప్ప ఏమీ మిగలదు. కాగా మితిమీరిన పారిశ్రామికీకరణ కారణంగా ట్రేస్ గేసెస్ కృత్రిమంగానూ వెలువడుతున్నాయి. ప్రకృతి సిద్ధంగా ఏర్పడే వాయువుల్లాగే ఇవీ ఉద్గారతను పట్టి ఉంచుతున్నాయి. నిరంతరమైన ఈ ప్రక్రియలో వాతావరణంలోని వేడిమి మోతాదుకు మించి బంధింపడుతున్న కారణంగా భూమి పరిమితులకు మించి వేడెక్కిపోతున్నది. అదే ‘గ్లోబల్ వార్మింగ్!’.

తీరు మార్చుకోక తప్పదు:

భౌతికశాస్త్ర ధర్మాలకు, వాతావరణానికి స్థూలమైన ఖచ్చితమైన లంకె ఉన్నదన్న విషయాన్ని నిరూపించడానికి శాస్త్రజ్ఞులు ఏనాటి నుండో ప్రయత్నిస్తున్నారు. స్వీడిష్ శాస్త్రజ్ఞుడు స్వాంటే అర్వేనియస్ వాతావరణంలో బొగ్గు పులుసు వాయువు పెరిగినపుడు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ఖచ్చితమైన అంచనా వేసేశాడు.

1950 నుండి సుయికురో మనాబే అతని బృందం కార్జన్ డయాక్సైడ్ పెరిగినపుడు వాతావరణం వేడెక్కుతోందన్న విషయాని నిరూపించే దిశగా విపరీతమైన కృషి చేశారు. Co2 పరిమాణం రెట్టింపు అయినప్పుడు వాతావరణంలో వేడిమి 2 డిగ్రీలు పెరుగుతుందన్న మనాబే అంచనా కరక్టేనని వారి ప్రయోగాలు ఎట్టకేలకు నిరూపించాయి. దానికే తార్కాణం Co2 పరిమాణం పెరిగినపుడు భూఉపరితల వాతావరణం మాత్రమే వేడెక్కుతోంది. ఆవలిపొరలు యథాస్థితిలోనే ఉన్నాయి.

భూవాతావరణానికి సంబంధించిన అంచనాలను లెక్కలను శాస్త్రీయంగా ఋజువు చేసే భౌతికమైన నమూనాను ఆవిష్కరించినందుకు, సంక్లిష్టమైన భౌతికవ్యవస్థల తీరు తెన్నులను విశదం చేసి అద్యయనానికి దారిని సుగమం చేసినందుకుగాను – ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ, U.S కు చెందిన సుయికురో మానాబే; మాక్స్‌ప్లాంక్ ఇన్స్టిట్యూట్, హంబర్గ్ జర్మనీకు చెందిన మెటిరియోలజిస్టు క్లాస్ హసల్‌మన్ లకు సంయుక్తంగా నోబుల్ పురస్కారం లభించింది. గ్లోబల్ వార్మింగ్ వంటి విపరిణామాలతో తల్లిడిల్లుతున్న నేటి ప్రపంచానికి – భూవాతావరణానికి సంబంధించి ముందస్తు అంచనాలతో ఈ నమూనా విశేషంగా తోడ్పడుతోంది.

సకల కాలుష్యాలను తనలో కలుపుకొని తిరిగి మానవుడికి స్వచ్ఛమైన నీరు, గాలి, చక్కటి ప్రకృతిని అందించి అపకారికి సైతం ఉపకారాన్ని చేస్తుంది భూమాత. కొండలు, నదులు, అరణ్యాలు, సముద్రాలు, సెలయేళ్లు వంటి అపార సంపదకు నెలవైన నేల తల్లి ఓర్పు అంతులేనిది. మానవుని పొరపాట్లను, అజ్ఞానాన్ని శతాబ్దాలుగా క్షమిస్తూ, భరిస్తూ వచ్చింది నేల తల్లి. తన అకృత్యాలకు ప్రకృతి సమతౌల్యం దెబ్బతినగా ఆ ఫలితాలను తానే అనుభవించ వలసిన పరిస్థితి మానవునికి ఇప్పుడు ఏర్పడింది. అయినా మనిషి తన అత్యాశను వీడటం లేదు. అకాల వర్షాలు, తుఫానులు, సముద్రమట్టాలు పెరిగి లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడం సర్వసాధారణం అయిపోతాయని శాస్త్రజ్ఞులు దశాబ్ధాలు క్రిందటే హెచ్చరించారు. అవన్నీ ఈనాడు అనుభవిస్తున్నవే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here