అమ్మ కడుపు చల్లగా-23

0
9

[box type=’note’ fontsize=’16’] ప్రకృతి వైపరీత్యాలకు కారణం అవుతున్న భూతాపాన్ని నియంత్రించవలసిన అవసరం గురించి ఈ వ్యాసంలో వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి. [/box]

భూతాపాన్ని నియంత్రించాలంటే ఉద్గారాల కట్టడి తప్పదా?

[dropcap]ఇ[/dropcap]ది ప్రకృతి వైపరీత్యాల ఎమర్జెన్సీ. ఆహారం కొరత, కార్చిచ్చులు, వరదలు – వాటి ప్రభావాన్ని I.P.C.C. నమోదు చేసింది. ఈ వైపరీత్యాలకు కారణం అవుతున్న భూతాపం పెరుగుదలలో 80% వరకు కారణం పారిశ్రామిక దేశాలదే. గతంలో అవి చేపట్టిన అనాలోచిత చర్యల ఫలితాన్ని ఇప్పుడు ప్రపంచం మొదత్తం అనుభవిస్తోంది. గతంలో అమెరికా వ్యవహార శైలి ఎలా ఉన్నప్పటికీ, వాతావరణ మార్పులకు సంబంధించిన సమితి ప్రణాళికలో చేరడం ద్వారా బైడెన్ బాధ్యతగా వ్యవహరించారు. పురోగామి దేశాల హరిత సాంకేతికతను మేధో హక్కుల బాదరబందీలకు అతీతంగా దేశాల నడుమ మార్పిడి చేసుకోగలగాలన్న ఆలోచనకూ సానుకూల స్పందన లభించింది.

అభివృద్ధి చెందుతున్న దేశాలకు 2020 నుండి ఏటా 100 బిలియన్ డాలర్లను హరితనిధికి జమ చేయాలన్న సూచనకూ మన్నన దక్కింది. ఉద్గారాల తగ్గింపుకై చేపట్టవలసిన చర్యలలో, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోగల వ్యవస్థలను రూపొందించుకోగలగటంలో ఆయా దేశాలకు ఈ నిధి ఉపయోగపడుతుంది.

కార్బన్ కేప్చరింగ్ వంటి సాంకేతికలను పంచుకోవటం ద్వారా వాతావరణంలోని విషవాయువులను పూర్తిగా తొలగించగలగడానికి గాని, తటస్థీకరించగలగడానికి గాని వీలు పడుతుంది. ఒక వంక హానికారక వాయువుల ఉద్గారాలను తగ్గిస్తూ మరొక వంక ఉన్న వాయువులను తొలగించే ప్రయత్నాలు చేస్తే లక్ష్యాలను చేరడం సులువు అవుతుంది.

ప్రమాదకర వాయువులు

కార్బన్ డైయాక్సైడ్

బొగ్గు సహజవాయువుకు రెట్టింపు, చమురు కంటే 60% ఎక్కువ కార్బన్ డైయాక్సైడ్‍ను విడుదల చేస్తుంది. బొగ్గు తోనే పారిశ్రామిక విప్లవం పరిఢవిల్లిన వాస్తవాన్ని కాదనలేం. మొట్టమొదటిగా బ్రిటన్ పారిశ్రామిక విప్లవానికి నాంది పలికినప్పుడు ప్రాథమిక వనరు బొగ్గే! అటువంటి బ్రిటన్‍లో ప్రస్తుతం బొగ్గు ఆధారిత విద్యుత్కేంద్రాలు 3 మాత్రమే ఉన్నాయి. అంతేకాక, 2024 నాటికి బొగ్గు ఆధారిత విద్యుత్తు తయారీ ప్రక్రియను నిలిపివేయాలని బ్రిటన్ లక్ష్యం నిర్దేశించుకుంది.

బొగ్గును వినియోగించి విద్యుత్తును ఉత్పత్తి చేయడంలో చైనా అగ్రస్థానంలో ఉంది. అక్కడ థర్మల్ విద్యుత్కేంద్రాల సంఖ్య 1000కి పై మాటే. భారతదేశం 280 బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్కేంద్రాలతో రెండవ స్థానంలో ఉండగా; 252 కేంద్రాలతో అమెరికా, 87 కేంద్రాలతో జపాన్, 85 కేంద్రాలతో రష్యా, 70 కేంద్రాలతో జర్మనీ 3,4,5,6 స్థానాలలో ఉన్నాయి.

విద్యుదుత్పత్తి ప్రక్రియలో:

  • బొగ్గు వినియోగం – అమెరికాలో 20% మాత్రమే. భారతదేశంలో అది 70% కాగా, చైనాలో 60%.
  • సహజ వాయువు వినియోగంలో – అమెరికా 30%, ఇండియా 10% కంటే తక్కువ, చైనా 10%.
  • చమురు వాడకం అమెరికాలో 40%, ఇండియాలో 30% కాగా, చైనాలో 19% మాత్రమే.

మీథేన్

మీథేన్ వాయువు ప్రపంచ హరిత వాయు ఉద్గారాలలో 5వ వంతు ఉంటోంది. గత రెండు దశాబ్దాలుగా వాతావరణంలో మీథేన్ వాయు ఉద్గారాలు రెట్టింపుకు మించి పెరిగిపోయాయి. అయితే మీథేన్ వాయువు జీవితకాలం (కార్బన్ డైయాక్సైడ్ కంటే) తక్కువ కాబట్టి ఆ వాయువు ఉద్గారాలను తగ్గించడం వలన వాతావరణంపై గణనీయమైన ప్రభావం ఉంటుంది.

వివిధ రకాల మానవ చర్యల కారణంగా వాతావరణంలో మీథేన్ వాయువు వెలువడుతూ ఉంటుంది. గనుల తవ్వకాలు, కలుషిత జలాల శుద్ధీకరణ, బొగ్గు వెలికితీత వంటివి కొన్ని ఉదాహరణలు.

ఇటీవలి ‘గ్లాస్గో’ సదస్సులో యూ.ఎస్, యూరోపియన్ యూనియన్ కలిసి 2020 నాటికి ఉన్న మీథేన్ ఉద్గారాల స్థాయిని 2030 నాటికి 30% తగ్గించాలని… అంటే 100% ఉద్గారాల స్థాయిని 70 శాతానికి తీసుకొనిరావాలని తీర్మానించాయి. రమారమి 90 దేశాలు ఆ తీర్మానంపై సంతకం చేశాయి. భారతదేశం మీథేన్ ఉద్గారాల తగ్గింపు దిశగా ఎటువంటి వాగ్దానమూ చేయలేదు. కారణం మీథేన్ ఉద్గారాలకు కారణం అయ్యే వ్యవసాయం, పశు సంపద వంటివన్నీ మన దేశంలో ఎక్కువ. తొందరపడి హామీ ఇస్తే ఈ వృత్తులపై ఆధారపడి జీవించేవారి మనుగడ దెబ్బ తినే అవకాశం ఉంది. మన ప్రభుత్వంలోని క్రొత్త, పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ మీథేన్ ఉద్గారాల తగ్గింపు/వినియోగంకు సంబంధించి ‘బయోగ్యాస్ స్ట్రాటజీ’ని వెలువరించింది. పారిశుధ్యం మెరుగు చేయడం, సుస్థిరాభివృద్ధి వంటి పలు అంశాలు ఇందులో ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here