అమ్మ కడుపు చల్లగా-46

0
10

[ప్రకృతిని, పర్యావరణాన్ని, వనరులను కాపాడుకోవలసిన అవసరాన్ని వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో.]

[dropcap]అ[/dropcap]మెరికా అతి పెద్ద పెట్రో స్టేట్. ప్రపంచంలోనే అతి పెద్ద ఆయిల్ అండ్ గ్యాస్ ఉత్పత్తిదారు. యూరోపియన్ యూనియన్‍కు ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ సప్లయి చెయిన్స్ ఉన్నాయి. యు.కె. నార్త్ సీ లో కొత్త శిలాజ ఇంధనాల వెలికితీత కార్యక్రమాన్ని చేపట్టింది. చిత్రం ఏమిటంటే వీరంతా పర్యావరణ పరిరక్షణకు కంకణం కట్టుకున్నట్లు వ్యవహరిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఒప్పందాలకు సృష్టమైన భాష ఉండాలి. ఇంధన మార్పు నియమాలు, కాలపరిమితులు న్యాయబద్ధంగా ఉండాలి. ఫేజ్ అవుట్ కాలపరిమితులు పేద, ధనిక దేశాలకు తగినట్లుగా వేరు వేరుగా ఉండాలి. COP-28లో వివిధ తెగలు, జాతులకు చెందిన సమూహాలు, వారి నాయకులు హాజరు అదీ పెద్ద సంఖ్యలో కావడం విశేషం. వారు తమ డిమాండ్లను సృష్టంగా వినిపించారు. మునుపటి వలె వారు ఏది చెపితే అది నమ్మే అమాయకత్వంతో లేరు.

బయోడైవర్సిటీ/జీవవైవిధ్యంతో కూడుకున్న అరణ్యాలు, కొండకోనల వంటి ప్రాంతాలలో ప్రకృతి వైవిధ్యంతో సహజీవనం చేస్తున్న వివిధ సమాహాలు/తెగలు, జాతులు రమారమి 370 మిలియన్లు. ఇటువంటి ప్రాంతాలు భూమండలంపైని నేలలో 20% వరకు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రజలు ప్రకృతి వ్యవస్థ లోని 80% జీవవైవిధ్యానికి రక్షకులు. వీరు ప్రకృతిని తల్లిగా, చెట్టు చేమలను తోబుట్టువులుగా భావిస్తూ మనుగడ సాగిస్తూ ఉంటారు. చిత్రంగా ప్రకృతి వైపరీత్యాలన్నిటికీ మొట్టమొదటిగా నష్టపోయేది వీరే.

ఆమెజాన్ బేసిన్‌లో నదులు అడగంటిపోయినా, ఉష్ణోగ్రతలు పెరిగిపోయి అటవీ వ్యవస్థలకు ముప్పు వాటిల్లనా ముందుగా బాధితులయ్యేది వీరే. 270 మిలియన్ డాలర్ల వాతావరణ పరిరక్షణ నిధిలో వీరికి కేటాయింపబడినది 17% మాత్రమే. నగరాలకు దూరంగా సహజసిద్ధమైన ప్రకృతి వ్యవస్థలలో మనుగడ సాగిస్తున్న వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా గణనీయమైనది. అయితే వీరి వ్యవస్థలకు సంబంధించిన ప్రాంతాలలో చేపడుతున్న ప్రాజెక్టులలో వారి అనుమతులతో గానీ, అభిప్రాయాలతో గానీ ప్రమేయం ఉండటం లేదు. ఆలస్యంగానైనా ఆ విషయం వరికి అర్థం అయ్యింది.

R.E.E.D+ సిస్టమ్ -2009

అభివృద్ధి చెందుతున్న దేశాలలో ‘అరణ్యాల నిర్వహణ’తో ఉద్గారాలను ఉపశమింపచేసే విధానాలను ప్రోత్సహిస్తోంది. అడవులపై ఆధారపడిన సమూహాలకు కాలవ్యవధితో కూడిన హక్కులను కల్పించటం ద్వారా ఈ కార్యక్రమాన్ని మరింత ప్రయోజకరంగా మార్చవచ్చని, ‘రీడ్’ ప్రాజెక్ట్ మేనేజర్ మేరీ మోలోక్వో-ఒడొజి (Mary Molokwu-Odozi) అభిప్రాయం వెలిబుచ్చారు. పశ్చిమ ఆఫ్రికాలో రక్షిత వనాలను వేరుగా పెట్టి స్థానిక తెగలను కష్టమర్-లా-లేండ్ ఓనర్స్‌గా పరిగణించేలా చట్టాలలో మార్పులు చేశారు.

బ్రెజిల్ లోని అమెజాన్‍లో ‘Veera’ అంగీకరించిన, ‘అడవుల సంరక్షణ’ కోసం అంటూ గ్లోబల్ కంపెనీలకు అప్పచెప్పిన ప్రాజెక్టులు ‘స్కామ్స్’ అన్న అభిప్రాయాలూ ఉన్నాయి. ఇవన్నీ ఆయా ప్రాంతాలలో నివసించే ప్రజల హక్కులను కాలరాసి వారి ఆధీనంలో ఉన్న వనరులను దోచుకోవటానికి మాత్రమేనన్న వాదనలూ వినబడుతున్నాయి.

ప్రాజెక్టులను చేపడుతున్నపుడు ప్లానింగ్ దశ నుండి అమలుపరచడంతో సహా తమను భాగస్వాములను చేయాలని ప్రతి దశ లోన పారదర్శకంగా వ్యవహరించి తమకు భరోసా కల్పించాలని వారు కోరుతున్నారు. వారి భయాలను నిరాధారాలని కొట్టిపారవేసేందుకు ఆస్కారం లేదు.

గ్వాటెమాలా- ‘కమ్యానిటీ ఫారెస్ట్ నెట్‌వర్క్’ అధ్యక్షుడు “మేము చర్చలు, సంప్రదింపులు గురించి ఇక్కడకు రాలేదు. మేము మా డిమాండ్లను తెలియ చేయడానికి వచ్చాం” అని నిష్కర్షగా చెప్పారు. “మా గొంతును విని తీరాలి.” అని నిక్కచ్చిగా చెప్పారు.

“మాకు ‘కార్బన్’ను గురించిన స్పష్టమైన నిర్వచనం తెలియాలి. కర్బనంపై హక్కులు ఎవరివి? కార్బన్ క్రెడిట్లను, వాటిపై ఆదాయాన్ని పంచుకోవడంలో మాకు స్పష్టమైన హామీలు ఏవి? కార్బన్ క్రెడిట్స్‌కు సంబంధించి మాకు స్పష్టమైన సమాచారం కావాలి” అన్నది ఇండిజినస్ గ్రూపుల డిమాండ్.

గ్లోబల్ సౌత్ దేశాలను క్లయిమేట్ ఏక్షన్ గురించి ఒత్తిడి చేయడం కూడనిదని తానియా పెరెజ్ అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా టెర్రస్ట్రియల్ కార్బన్ శోషణలో ఈ దేశాలలోని వర్షారణ్యాలదేకాక, సహజ భూములదీ కీలకమైన పాత్ర అనీ, ఆ కారణంగా ఈ దేశాలు పర్యావరణానికి, తద్వారా ప్రపంచానికి ఏమాత్రం హాని చేయటం లేదు సరికదా మేలే చేస్తున్నాయి. క్లయిమేట్ ఏక్షన్ పేరుతో వాటి అభివృద్ధికి గండి కొట్టడం ఏ మాత్రం సరైన వాదన కాదని పెరెజ్ సవివరంగా చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here