అమ్మ కడుపు చల్లగా-50

0
8

[ప్రకృతిని, పర్యావరణాన్ని, వనరులను కాపాడుకోవలసిన అవసరాన్ని వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో.]

అభివృద్ధి Vs పర్యావరణం:

[dropcap]ప[/dropcap]ర్యావరణ సంక్షోభాల కారణంగా సాలీనా 38 ట్రిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోంది. మితిమీరిన అభివృద్ధి కార్యకలాపాల విపరిణామాలే దీనికి కారణం. ఆలస్యంగానైనా కళ్లు తెరిచి ప్రపంచ ఆర్థికం 19% తగ్గింపునకు కమిట్ అయింది. కానీ ఫలితాలకు మాత్రం వేచి చూడాల్సిందే.

జీవజాతుల మనుగడకే ముప్పు:

చైనాలో మూడోవంతు జనాభా నివసించే నగరాలు ముంపునకు గురి కాగల ప్రమాదం ఉందని ఉపగ్రహ ఛాయాచిత్రాలు వెలువరించిన డేటా చెప్తోంది.

డార్విన్ సిద్ధాంతం ‘థియరీ ఆఫ్ ఎవల్యూషన్’కు సాధారణంగా వందల వేల సంవత్సరాల కాలం పడుతుంది. కానీ ఆ పరిణామాలు ఇప్పుడు చాలా వేగంగా సంభవిస్తున్నాయి. ఒక జాతి కప్పలు కేవలం 25 సంవత్సరాల కాల పరిమితి/Span లోనే ఎవల్యూషన్‍కి గురికావడం జరిగినట్లు పరిశోధనలలో తేలింది. అలాగే మనిషి మెదడు సైజు పర్యావరణ ప్రభావాల కారణంగా కుంచుకుకొనిపోతున్నట్లు కొన్ని పరిశోధనలు చెప్తుంటే, వస్తున్న తరాల మొదడు సైజు గతంలో పోలిస్తే పెద్దగా ఉంటునట్లు కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి. వీటన్నిటికి గత కొన్ని శతాబ్దాలుగా మనిషి జీవన విధానంలో వచ్చిన మార్పులే కారణం. అభివృద్ధి పేరుతో చేపట్టబడిన కార్యక్రమాలన్నీ అనేక విపరిణామాలకూ కారణం అయ్యాయి.

ఇప్పుడు సర్వసాధారణం అయిపోయిన వాయు కాలుష్యం కలగజేస్తున్న నష్టం కూడా తక్కువ కాదు. గర్భధారణ సమయంలో, శైశవదశలో, బాల్యంలో ఇలా ఏ రకంగానైనా మొదటి రెండు సంవత్సరాలు వాయు కాలుష్యానికి గురైతే అది పిల్లల మెదడు వికాసంపై దుష్ప్రభావం చూపుతున్నట్లు తేలింది. వారిలో సతర్కత, అప్రమత్తత మంచి శక్తులు చాలా తక్కువ స్థాయిలో ఉంటున్నాయని తేలింది.

హానికారకాలు – పరిష్కారాలు:

రంగులు:

వస్త్రపరిశ్రమలో వినియోగించబడే రంగుల కారణంగా పర్యావరణ సమస్యలు పెరిగిపోతున్నాయి. ఈ రంగులు చాలా మెల్లిగా కానీ జీర్ణం కావు. దీర్ఘకాలం నీటిలో నిలచిపోయే వీటి కారణంగా ప్రకృతికి హాని జరుగుతోంది. అటువంటి ప్రమాదకరమైన రంగులను నీటి నుంచి తొలగించడానికి శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేకమైన నానోస్ట్రక్చర్‍ను రూపొందించారు. వ్యర్థంగా వెలువడే సెల్యులోజ్‍ను నానో రూపంలో ప్లాస్టిక్ పాలీఎక్రిలోనైట్రేల్‍తో (Polyacrylonitrile) కలిపి ప్రత్యేకమైన అల్లిక/స్పిన్నింగ్ ద్వారా ఫిల్టర్స్‌ను రూపొందించారు. ఈ సెల్యులోజ్‌ను అతి సన్నని నానో ఫాబ్రిక్స్‌ను కోట్ చేయడానికి వినియోగించడం ద్వారా కలుషిత జలాలను – సమర్థవంతంగా వడబోయగల పిల్టర్స్‌ను రూపొందించారు.

చమురు:

చమురు అతి ముఖ్యమైన పారిశ్రామిక వనరు. అయితే చమురు తెట్టు నీటిలో ఎక్కువ కాలం ఉంటే ప్రమాదకరం. ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ చమురు ప్రమాదం అతి పెద్ద చమురు ప్రమాదం. సుమారం 100 మిలియన్ గాలన్ల చమురు ఆ ప్రమాదం కారణంగా సముద్ర జలాలను కలుషితం చేసింది. మెరైన్ చమురు వెలికితీత కార్యక్రమాలలో అతి పెద్ద ప్రమాదంగా ఇది చరిత్రలో నిలిచిపోయింది. 2010లో జరిగిన ఈ ప్రమాదం కారణంగా జారిగి నష్టాన్ని ఎదురు కాగల పరిణామాలను అంచనా వేయడానికి జరపబడిన అధ్యయానాలలో 14 సంవత్సరాల తరువాత కూడా ఏవో క్రొత్త విషయాలు బయటపడుతూనే ఉన్నాయి. ఒక కొన్ని జాతుల చేపల ఉనికి ఈ చమురు తెట్టు కారణంగా ప్రమాదంలో పడిందన్నది వాటిలో ఒకటి. అధ్యయనాలకు అందని విపరిణామాలు మరిన్నో! అయితే – లేజర్‌తో ట్రీట్ చేయబడిన కార్క్ చమురు తెట్టుకు సమర్థవంతమైన విరుగుడుగా పనిచేస్తున్నట్లు కొన్ని పరిశోదనలు వెల్లడిస్తున్నాయి.

ప్లాస్టిక్ విడుదల చేసే ఉద్గారాల అంచనాకు శాస్త్రవేత్తలు ఒక ప్రణాళికను రూపొందించారు. ఇది కాలుష్య నివారణకు/నియంత్రణకు U. N. చేస్తున్న ప్రయత్నాలకు కొంత సహాయకారి కాగలదని ఆశిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here