అమ్మ ప్రేమ

0
8

[box type=’note’ fontsize=’16’] కావలి సాహిత్య సంస్థ నిర్వహించిన పోటీలో బహుమతి గెలుచుకున్న స్థానిక రెడ్‌ఫీల్డ్స్ హైస్కూల్ విద్యార్థిని జి. మణి యశ్విత వ్రాసిన కథ “అమ్మ ప్రేమ“. కథకి తగ్గట్టుగా బొమ్మలు కూడా ఈ విద్యార్థినే గీసింది. బాల/యువ రచయితలను ప్రోత్సహించే పథకంలో భాగంగా ఈ కథను అందిస్తున్నాము. [/box]

[dropcap]అ[/dropcap]మ్మ ప్రేమ కోసం ఆరాటపడే ఈ ఐదు పక్షుల గురించి చెప్పే ముందు, ఈ ప్రేమ ఒక నేరేడు పండు చెట్టుపై ప్రారంభం అయినది.

ఒకానొక అడవిలో ఒక రామచిలుక ఉండేది. ఆ చిలకకి అందంగా ఉండే ప్రదేశం అంటే చాలా ఇష్టం. మంచి అందమైన ప్రదేశాలంటే ఎంతో ఇష్టం. మంచి ప్రదేశాలు వెతుకుతుండగా ఒక నేరేడు చెట్టు దొరికింది. ఆ ప్రదేశం ఎంతో ఆహ్లదకరంగా ఉంది. చుట్టు ప్రక్కల పచ్చదనం ఆ చిలుకను ఎంతో ఆకర్షించింది. పక్కగా పారుతున్న సెలయేరు, ఆ చుట్టుపక్కల చిలుకలు, ఎంతో అందమయిన పూవులు, ఎంతో చక్కనైన అందమయిన పక్షులతో ఆ ప్రదేశం దేవతలు తిరిగే ప్రదేశంలా ఉంది.

అప్పుడు ఆ నేరేడు చెట్టును చూసి ఒక మంచి కొమ్మను చూసి ఆ కొమ్మ మీద తన గూడును కట్టుకొవాలని నిర్ణయించుకున్నది. అప్పుడు చెట్టుకి పైనగా ఉంటే కొమ్మపై కట్టుకోవడానికి పుల్లలు తెస్తూ ఇంక ఆ కొమ్మ పై మంచిగా గూడు కట్టుకుంది.

ఇంక ఆ చిలుక తన గుడ్లను ఆ గూడులో పెట్టి ఎంతో ఆనందంతో తన జీవితాన్ని గడుపుతుంది. కాలం గడుస్తూ ఉండగా, తన పిల్లలు ఇలా బయటకు రాగా ఎంతో అందమైన పక్షి పిల్లలు బయటకు వస్తుంటే చాలా అందంగా ఉంది.

అలా చిన్న చిన్నగా నడుస్తుండగా ఆ ఐదు పక్షులు కాలం గడుస్తుండగా, ఒక రాత్రి అంతా ఎంతో ప్రశాంతంగా ఉండి నిద్రిస్తున్నాయి. అప్పుడు ఎంతో పెద్దగా గాలి, వానా వచ్చాయి. ఆ గాలీ, వానకి ఆ పక్షులు హఠాత్తుగా కింద పడిపోయి గాలికి ఎక్కడెక్కడో పడ్డాయి.

ఆ పిల్ల పక్షులు ఎంతో బాధగా ఉంది. ఒక దాని నుండి ఒకటి విడిపోయాయి. అపుడు ఆ ప్రాంతం అంతా చెల్లాచెదురుగా మారిపోయింది.

వాళ్ల అమ్మ లేచి చూసే సరికి దాని పిల్లలు కనిపించలేదు. ఆ తల్లి తపనని ఎవరికి చెప్పుకోలేక, అది మతిస్థిమితం కోల్పోయింది. అప్పుడు చాలా సమయం తరువాత ఏం చేయాలో అర్థంకాక తన చెట్టు దగ్గరికి, అది వెళ్ళిపోయింది.

ఈ తప్పిపోయిన పక్షులు ఐదు ఒక దానికి ఒకటి కనిపించకుండా ఒక్కోటి సెలయేరులోకి వెళ్ళిపోయాయి. ఒక చోట బయటపడ్డాకా, అక్కడ చాలా మంది పక్షులు ఈ ఐదు పక్షుల లాగే తప్పిపోయి, వేదనలో ఉన్నాయి.

అప్పుడు అక్కడ పక్షులను “మా అమ్మని చూశారా, చూశారా?” అని అడిగి అడిగి ఎండలో తిరుగుతూ ఆకలితో తల్లడిల్లుతూ ఒక్కొక్క పక్షి ఆరాటంలో ప్రాణాలు కోల్పోయేటట్టుగా ఉన్నాయి.

కాసేపయ్యాక, అవి ధైర్యం తెచ్చుకుని, తాము ఆడుకునేటప్పుడు చూసిన గుర్తులను బట్టి ఒక్కొ పక్షి చాలా తెలివిగా తమ పెద్ద నేరేడు చెట్టుదగ్గరికి వెళ్ళాయి. ఒకదాన్నొకటి చూసుకుని చాలా ఆనందపడ్డాయి.

ఆ ఆనందం కొంత సేపుకూడా మిగలలేదు…

ఎందుకంటే వాళ్ళమ్మ ఆ బాధతో ఎంతో ఆనారోగ్యంతో ఉంది. అప్పుడు ఆ ఐదు పక్షులు వాటి తెలివితేటలతో వాళ్ళ అమ్మని బతికించుకున్నాయి. ఎలాగంటే అవి తప్పిపోయినపుడు, అక్కడ దారిలో గాలికీ, వానకీ బాధపడుతున్న పక్షులకు వైద్యం అందిస్తుంటే చూసాయి. అవి ఆ పద్ధతిని గమనించి, వాళ్ళ అమ్మకి వైద్యం చేసి బతికించుకున్నాయి.

ఇలా ఆ తల్లి ప్రేమ నుండి విడదీయకుండా దేవుడు వాళ్ళను కలిపాడు.

నీతి ఏంటటే:

మన ప్రేమ స్వచ్ఛమైనది ఐతే మనకి ఈ ప్రకృతి కూడా సహకరిస్తుంది. అందుకే ప్రేమను మనుషుల మధ్య పెంచాలి. ఈ రోజుల్లో డిజిటల్ సొసైటీల్లో మనుషుల మధ్య చిన్న చిన్న ఆనందాలు కోల్పోతున్నాం. కానీ, ప్రేమను పంచి, అందరినీ మంచి చేసుకుంటేనే మనం, మన జీవితాన్ని గెలిచినట్లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here