అమ్మ!

0
5

[dropcap][న[/dropcap]వ మాసాలు వహించి, నీ జీవనదాత యైన అమ్మకు, ఓ నవకం, (9)]

1
నీ రాకకై కలల కని, నిను మోయు ప్రేమ కలశి!
నీ రాకతో మాత్రృత్వ సిధ్ధి యనెడి లౌకిక తాపసి!!

2
దోగాడు నిను చూసి చూసి,తా పొంగేటి కడలగును!
కాపాడు కనుపాపయై, తా కాచేటి కవచమగును!

3
ఎత్తుగ, ఇప్పట్టున ఎదిగిన, ఎంచక్కను ఆశగ!
పొత్తిళ్ళ నుండిపోయిన,అదియె సుఖమను,వింతగ!

4
బుడిబుడి అడుగుల సవ్వడుల నిట్టె పోల్చికొను
తడబడి పడిన, తా పరువిడి నిను హత్తుకొను!

5
గోరు ముద్దల కొసరి,కథల కలిపి తినిపించు,
పారు చందమామను చూపి,పకపక నిను నవ్వించు!

6
చీరెతో నూయల కట్టి,పాటల,అల్లనల్లన ఊపు,!
అరెరె ,మా చిట్టి యోపడని, మెతమెత్తల నమర్చు!

7
తననె మరచి,నీలో ప్రవహించు నమ్రృతము అమ్మ!
తననె త్యజియించి,కరుగు, దైవీయ గుణము అమ్మ!!

8
అయ్య కోపించిన వేళల, అమ్మె నీకు శాంతారామము!
నెయ్యమున సర్ది చెప్పు,చలువ పలుకుల,అద్భుతము!

9
నీవు తండ్రివైనను,అమ్మ కంటికింక చిన్న పొన్నవె!
ఆవు, అమ్మ,రెండును ఒక్కటే, ప్రేమంపు వితరణలై!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here