KGF: భారతీయ కథన కౌశలానికి ఉదాహరణమ్

4
10

[dropcap]వీ[/dropcap]డియో గేమ్‌లా ఉంది. ఇదీ ఒక సినిమాయేనా?

టిక్ టాక్ ఎలివేయన్లేసుకుంటూ లాగేశాడు.

సోషల్ మీడియా మేధావి వర్గం చేసిన, చేస్తున్న వ్యాఖ్యలు.

ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని రకాలుగా వెక్కిరించినా, తిట్టిపోసినా, తీసి పడేసినా, కేజీఎఫ్ అనే సినిమా ఒక అద్భుతం. భారతీయ కథా కథన కౌశలానికి అదొక గొప్ప నిదర్శనం.

హీరో ఎలివేషన్లు, loud background score, పంచ్ డైలాగులు, విపరీతమైన వైలెన్స్ అన్నారు. అయినా సినిమా ఆడింది. సామాన్య ప్రజ దాన్ని అక్కున చేర్చుకుంది. రాకీ భాయ్‌కు ప్రేమను పంచింది. సినిమా చరిత్రలో ఒక స్థానాన్ని ఇచ్చింది.

కారణం లేకుండానే ఈ సినిమా ఇంత సక్సెస్ అవుతుందా?

ఉన్నాయి. విమర్శలు ఎదుర్కుని, నెగటివ్ రివ్యూలు దాటి ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. కాదనటం లేదు. కానీ వాటిలో చాలా సినిమాలు కేఎల్ రాహుల్ క్రీజులో కెళ్ళి, పెవిలియన్ లోకి తిరిగొచ్చినంత త్వరగా జనం మర్చిపోతారు. ఆ రోజులలో సొమ్ము చేసుకుని ఉండవచ్చు. కానీ, కాల పరీక్షకు నిలబడలేవు.

కానీ, కేజీఎఫ్ అలా కాదు.

మొదటి భాగం వచ్చి ఐదేళ్ళయింది. ఇప్పుడు చూసినా అదే త్రిల్. ఏ ఏ సన్నివేశాలలో మనకు రోమాలు నిక్కబొడుచుకున్నాయో అవే సన్నివేశాలలో మరలా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఎక్కడ కళ్ళు చెమరుస్తాయో అక్కడ మళ్ళా కళ్ళు చెమరుస్తాయి.

కారణం?

ఎవరో ఇచ్చిన మ్యూజిక్‌కు లిప్ సింగ్ చేస్తూ, హొయలు వగలు ఎరగా వేస్తూ, లేదా కుళ్ళు హాస్యంతో జనాలను టెంప్ట్ చేస్తూ ఎక్కువగా నడిచే టిక్ టాక్, రీల్స్ తరహా సినిమా కాదు. బండారం బయట పడగానే విసుగొచ్చేయటానికి. లేదా మన vices ను normalise చేసుకోవటానికి ఆ వీడియోలు చూడటానికి.

కేజీఎఫ్ జనం మెదళ్ళలో కాదు. హృదయాలలో కాదు. వారి subconscious మీద పని చేసింది. అక్కడ తిష్ట వేసుకుని కూర్చుంది.

బాపు సంపూర్ణ రామాయణం చూడండి.

ఎత్తుకుంటూ, శాంతాకారం భుజగశయనం అంటూ ఏడు వైకుంఠ ద్వారాలను దాటుకుంటూ శ్రీమహావిష్ణువును చూపుతారు. అక్కడ దేవతలు ఒక సమస్యను స్వామికి వివరించి తమను కాపాడమని వేడుకుంటారు. స్వామి అభయం ఇస్తాడు.

ఇది ఎలివేషనే కదా.

ఒక సమస్యను స్థాపించారు. దాన్ని తీర్చగలిగే వారిని పరిచయం చేశారు. అభయం ఇప్పించారు.

మన పురాణ, ఇతిహాస వాఙ్మయంలో ఉన్నతమైన వ్యక్తిత్వాలను కలిగిన నాయకులను అదే ఉన్నత స్థితిలో చూపుతూ, ఒకరకమైన ప్లాట్ఫామ్ నిర్మిస్తారు. ఆ విలువలు మనందరికీ పాటించదగినవి. అలాంటి సన్నివేశాన్ని అనుభూతిస్తే, మనకొక high feeling వస్తుంది. Secretly or subconsciously we start to behave like that hero. Reason? The hero is now injected into our subconscious.

రాముడైనా, కృష్ణుడైనా, అర్జునుడైనా, భీముడైనా, మరింకెవరైనా. ఆ రకమైన ఎలివేషన్ ఆ యా పాత్రలను, లేదా నిజజీవిత ప్రతిబింబాలను మన సబ్ కాన్షస్‌లో నిలుపుతుంది.

కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్।

ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో ధృఢవ్రతః॥

సకల సద్గుణసంపన్నుడును, ఎలాంటి విపత్కర పరిస్థితులలో అయినా తొణకని వాడు, సామాన్య విశేష (లౌకికాలౌకిక) ధర్మములను ఎఱిగినవాడు, శరణాగతవత్సలుడు, ఎట్టి క్లిష్టపరిస్థితులలో అయినా ఆడితప్పనివాడు, నిశ్చలమైన సంకల్పము గలవాడు అయిన పురుషుడు ఇప్పుడు ఈ భూమండలమున ఎవడు?

చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః।

విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చ ఏక ప్రియదర్శనః॥

సదాచార సంపన్నుడు, సకలప్రాణులకు (తనయెడ విముఖులైన వారికిని) హితమును చేకూర్చువాడు, సకలశాస్త్ర కోవిదుడు, సర్వకార్యధురంధరుడు, తన దర్శనముచే ఎల్లరకును సంతోషమును గూర్చువాడును ఐన మహాపురుషుడెవడు?

ఆత్మవాన్ కో జిత క్రోధో ద్యుతిమాన్ కః అనసూయకః।

కస్య బిభ్యతి దేవాః చ జాత రోషస్య సంయుగే॥

ధైర్యశాలి, క్రోధమును (అరిషడ్వర్గమును) జయించినవాడు, శోభాయమానంగా విలసిల్లువాడు, ఎవ్వరిపైనా అసూయ లేనివాడు, రణరంగమున కుపితుడైనచో, దేవాసురులను సైతము భయకంపితులను జేయువాడు.. అలాంటి మహాపురుషుడు ఎవడు?

రామాయణంలో రెండవ శ్లోకం నుంచీ 16 గుణాలను గొప్పవి చేసి చెప్తూ, అలాంటి సుగుణాలున్న వ్యక్తి ఎవరు అన్న ప్రశ్న వేస్తాడు వాల్మీకి ముని. అంతటితో ఆగుతాడా? లేదు.

ఏతత్ ఇచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే।

మహర్షే త్వం సమర్థోఽసి జ్ఞాతుం ఏవం విధం నరం॥ |1-1-5|

ఈ విషయములనుగూర్చి తెలిసికొనుటకు నేను మిక్కిలి కుతూహలపడుచున్నాను. ఓ మహర్షీ! మీరు సర్వజ్ఞులు, ఇట్టి మహాపురుషుని గుఱించి తెలుపగల సమర్థులు మీరే.

అని నారద మహామునిని సంబోధించాడు.

ఇదంతా గుణ వర్ణన. ఒకరి ఔన్నత్యాన్ని చెప్పటం. చాటటం. ఒప్పటం. ఇలాంటివి.. the best of qualities చాలా తేలికగా మన మనసులోతుల్లోకి ఇంకి మనల్ని కూడా అలా ఉండమని ప్రోత్సహిస్తాయి.

That’s called Cerebral Rendezvous.

ఉత్సాహాన్ని కలిగించేది, ఊపును తెప్పించేది ఏదైనా కచ్చితంగా జనాలకు నచ్చుతుంది.

హీరో ఎలివేషన్ అని ఈమధ్య ప్రతి సినిమా హీరోకూ ఏదో swagger అంటూ వాడేయటం అలవాటు అయిపోయింది కానీ, people forget it’s a great time tested technique to inject great characters or values into the minds of people.

మన ఇతహాసాలలో హీరోలకు వీలైనంత ప్రతి చోటా ఎలివేషన్ ఇస్తారు.

ధర్మాత్మా సత్యసంధశ్చ అన్నా, అలుగుటయే ఎరుంగని అని చెప్పినా, వచ్చిన వాడు ఫల్గుణుడు అని రాగం తీసినా అవన్నీ ఎలివేషన్లే.

రావణుడి తేజస్సు చూసి హనుమ ఆశ్చర్య పోయినా, హనుమ జ్ఞాన సంపదను రాముడు లక్ష్మణుడికి ఎత్తి చూపినా, రాముడికి ఎదురు పడ్డాక ఆహా! ఇతను కదా నాకు తగిన శత్రువు అని రావణుడు అనుకున్నా అవన్నీ ఎలివేషన్లే.

మన ఇతహాసాలలో ఒక సమస్యను స్థాపిస్తారు. దాన్ని చక్కదిద్దే నాయకుడి కోసం అన్వేషణ జరుగుతుంది. నాయకుడిని ఆ వాతావరణంలో ప్రవేశ పెడతారు. ఆ నాయకుడు పరిస్థితిని చక్కదిద్దుతాడు. Then order prevails.

కేజీఎఫ్‌లో జరిగింది సరిగ్గా అదే.

ముందు కేజీఎఫ్ అనే లోకాన్ని పరిచయం చేస్తారు. అక్కడి రాక్షసుల లాంటి మనుషులను చూపిస్తారు. వారికి అడ్డుకట్ట వేసేవారు లేరా అన్న ప్రశ్నకు బదులుగా రామకృష్ణ Raja Krishnappa Bairya బైర్యా పుడతాడు.

అంతే కాదు. తన తల్లి పడే కష్టాలకు సమాధానమిచ్చే శక్తిగా వస్తాడు. తల్లికి అతనే లోకం అవుతాడు.

ఒక gangster అన్న మాట పక్కన పెడితే అతను సామాన్యులను ఏమీ చేయడు. దాదాపు నికార్సయిన పోలీసుల జోలికి కూడా వెళ్ళలేదు. విలన్లు, వారి అనుచరులను మాత్రమే శిక్షస్తాడు. వ్యక్తులకు కాకుండా వ్యవస్థకు కట్టుబడే వానరం లాంటి వాడిని చంపక పోవటమే అతను నికార్సయిన హీరో అని చెప్పే సందర్భం. పైకి కనబడని మంచితనం అతనిలో ఉంటుంది.

అదే అందరినీ అతన్ని అభిమానించేలా చేస్తుంది. అది కేజీఎఫ్ కార్మికులైనా, అతనికి అండగా నిలిచే ఖాసిమ్ అయినా. ఆఖరుకు వానరం కూడా రాకీ మంచితనాన్నో గుండెల్లో ఉన్న మానవత్వపు తడినో అర్థం చేసుకుని అతనికి కష్టం వచ్చినప్పుడు తెలియకుండానే బాధ పడతాడు. You can observe it during the climactic showdown between Rocky and Adheera.

రాకీ నిజానికి చేసింది అక్రమ మైనింగ్. తనదైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. కానీ, తన కోసం పని చేసేవారిని సాటి మనుషుల్లా చూశాడు. అందుకే వారి లాయల్టీ పొందాడు. పిల్లలకు చదువులు, జనాలకు పని ఇచ్చాడు. బేసిక్ లక్జరీలకు లోటు లేకుండా చేశాడు. ప్రభుత్వాలకు అతను చేసే పని అక్రమం. జనాలకది సక్రమం. సామాన్యులకు ఎక్కడా హాని జరుగలేదు రాకీ వల్ల.

మనది ప్రజాస్వామ్యమని మర్చిపోండి. కాసేపు అది పాత కాలం అనుకోండి. రాజులు రాజ్యేలేలే రోజులు అనుకోండి. రాకీ చేసిన పని ఒక రాజ్యానికి రాజు చేయాల్సిన పనే కదా.

పైకి ఎలా మాట్లాడినా, తను రీనా దేసాయి మీద చూపింది నిజమైన ప్రేమే. హృదయంతో హృదయానికి కమ్యూనికేట్ చేయగలిగాడు. అందుకే రీనా లాంటి అమ్మాయి అతనికి అంకితమయింది. అంతే తప్ప Stockholm Syndrome కాదు.

సామాన్య జనాలకు ఎలాంటి నాయకుడు నచ్చుతాడో అలాంటి నాయకుడిని తీసుకున్నాడు ప్రశాంత్ నీల్. వారికి ఎలా పని చేస్తే నచ్చుతాడో అలాంటి పనులు చేయించాడు.

కాస్త రక్షణ కావాలి. ఇచ్చాడు.

కాసిని సౌకర్యాలు కావాలి. ఇచ్చాడు.

They need empathy. He gave it to them without spelling things out loudly.

దారి చూపే దీపమయ్యాడు.

Gangster, చట్ట వ్యతిరేకం అన్న మాటలు పక్కన పెట్టండి. Rocky is as much a mythological hero everyone craves for as it is possible in a modern day cinematic setting.

మన పురాణేతిహాసాల్లో లాగానే narrator ఉన్నాడు. సినిమాలో. తన perspective లో వ్యాఖ్యానిస్తూ ఆ నాయకుడి కథ చెప్తాడు. భారతాన్ని వైశంపాయనుడు, భాగవతాన్ని సూతుడు, రామాయణాన్ని లవకుశులు చెప్పినట్లు, రాకీ కథను Anand Ingalagi చెప్తాడు. చెప్తూ తనను తాను తెలుసుకుంటాడు.

ఇక్కడో చిన్న విశేషం చెప్పుకుని ముగిద్దాం.

అనంత్ నాగ్‌కు ఈ క్రిమినల్ హీరోకు ఎలివేయన్లీయటం నచ్చక సినిమా నుంచి తప్పుకుంటే, దర్శకుడు తెలివిగా అతని కొడుకు పాత్రను ప్రవేశ పెట్టాడు. ఉత్తినే actor ను మార్చకుండా.

మన పురాణేతిహాసాలలో ఉండే కథాకథన టెక్నిక్‌ను వాడుకుని, నిజమైన దుర్మార్గుడు కాని ఒక క్రిమినల్ హీరోను జనాల subconscious లోకి దర్శకుడు ఎక్కించాడు.

విచిత్రమేమిటంటే.. రావణుడిని, దుర్యోధనుడిని హీరోలుగా చూపాలనుకునే వ్యక్తులే కొన్ని సరైన విలువలకు కట్టుబడిన రాకీని అసహ్యించుకున్నారు. Hypocrisy at its best.

The best thing about KGF is the director never subverted anything that’s held preciously.

Subversion may work sometimes to shock people. But ultimately it leads to depressive feeling when experiencing such things.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here