అనప పువ్వులు – పుస్తక పరిచయం

    0
    2

    [dropcap style=”circle”]వి[/dropcap]ళంబి నామ సంవత్సర (2018) ఉగాది కవితల కూర్పు ఈ పుస్తకం.  తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూరుకి చెందిన బస్తి యువక బృందం 53 కవితల ఈ కవితా సంకలనాన్ని ప్రచురించారు.

    ***

    “బస్తీ యువక బృందం హోసూరు తరఫున వస్తున్న పన్నెండవ కవితల పొత్తం ఇది. 2007 నుండి ఇప్పటి వరకు ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ఉగాది వేడుకలు జరపడం, కవితా కూర్పులు విడుదల చేయడం, తెలుగు భాషా సంస్కృతులను ప్రోత్సహించే కార్యక్రమాలు విజయవంతంగా జరపడం జరుగుతున్నది. ఇందులో భాగంగా ఈ ఏడాది వివిధ కవుల కవితల పువ్వుల్ని ఏరికూర్చి ‘అనప పువ్వులు’ కవితా కూర్పుగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది” అని ‘మా మాట’లో అగరం వసంత్ వివరించారు.

    ***

    “పన్నెండేళ్ళు – పన్నెండు కవితా సంకలనాలు. కాల ప్రవాహంలో కొత్త గొంతుకలను వినిపిస్తూ, కొత్త స్వరాలను పరిచయం చేస్తూ, కొత్త హృదయాలను ఆలింగనం చేసుకుంటూ నేడు మీ చేతుల్లో ఓ అందమైన పుష్పగుచ్చంగా నిలిచింది ‘అనప పువ్వులు’.

    గతంలో లాగే ఈ ఏడు కూడా బస్తీ యువక బృందం ద్వారా వెలువడిన ఈ కవితా సంకలనం కొత్త భావాలు సువాసనలతో కొత్త స్వరాల కలవాలతో ఉగాదికి ఆత్మీయంగా స్వాగతం పలికింది. దీనిలో అనుభవజ్ఞులైన కవులతో పాటు, కొత్త కవులూ ఉన్నారు. వస్తు వైవిధ్యంతో పాటు, వస్తువును, కవితా నిర్మాణం సమన్వయాన్ని సాధించడంలో వర్ధమాన కవులు పరిణతి ప్రదర్శించారు. కాని తెలంగాణ మాండలికం కవితలు, జానపద సాహిత్యం తొలిసారిగా చోటు చేసుకోవడం గమనార్హం” అన్నారు టి.ఆర్. శ్రీనివాస ప్రసాద్ తమ  ముందుమాట “కాంతి జలపాతంలా కవిత్వం”లో.

    ***

    128 పేజీల ఈ పుస్తకం వెల రూ. 100/-

    ప్రతులు – డా. ఎన్. వసంత్, బస్తి యువక బృందం, 2/1097, బస్తి, ఆవులపల్లి రోడ్డు, హోసూరు, కృష్ణగిరి జిల్లా, తమిళనాడు -635109 – వద్ద లభ్యం.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here