అందాల దీవులలో ఆహ్లాద యాత్రలు – ఐర్లాండ్

0
10

[box type=’note’ fontsize=’16’] ఐర్లాండ్‌లో జరిపిన తమ పర్యటన అనుభవాలు, అనుభూతులు వివరిస్తున్నారు నర్మద రెడ్డి. [/box]

[dropcap]ఎ[/dropcap]ప్పటి నుండో మేము ఐర్లాండ్ వెళ్ళాలి, అక్కడి అందమైన ప్రదేశాలు చూడాలి అనుకుంటున్నాము‌. అయితే విమానం ధర ఎప్పుడూ 80,000, 75,000 రూపాయలు అలాగా ఉండేది. ఆరు నెలల ముందు నుంచి నేను ప్రతిరోజు టికెట్టు రేటు చూడటం మొదలు మొదలు పెట్టాను. ఒక రోజు రాత్రి పదకొండు గంటలకి సడన్‌గా నెట్లో 18000 రూపాయలకే ఐర్లాండ్ 12:4 ఫ్లైట్ ఉంది అని ఇచ్చారు. వెంటనే ఒక రెండు సీట్లు బుక్ చేయాలి అనుకున్నాను. కానీ మాకు అప్పటికే అవి ఎలా బుక్ చేయాలో తెలియదు. మా బాబుని లేపి “బాబూ ఇది బుక్ చెయ్‌రా” అని నేను అడిగాను. తను అన్నాడు “మమ్మీ ఇవి ఏవేవో పిచ్చి డాట్ కామ్స్ ఒక్కొక్కసారి డబ్బులు పోతాయి” అన్నాడు. “పర్వాలేదు ఒకసారి బుక్ చెయ్యి, బుక్ చెయ్యి” బతిమిలాడితే బుక్ చేశాడు. రెండు టికెట్స్ దొరికాయి. మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఐర్లాండ్‌లో జాబ్ చేస్తున్నాడు. మేము ఆ టికెట్ బుక్ చేసుకుని అదే రోజు బయల్దేరాము. మధ్యలో మేము దుబాయిలో ఆగాము. అక్కడ మేము దిగి వెళుతున్నప్పుడు ఒక ఆఫీసర్ అడిగారు “ఎక్కడికి వెళ్తున్నారు” అని. “ఐర్లాండ్” అన్నాము. “అయితే మీరు దుబాయ్‌లో చాలా సేపు ఆగాల్సి వస్తుంది. ట్రాన్సిట్ వీసా ఉందా?” అని అడిగారు. “లేదు” అన్నాము. అయితే ఆయన “వెంటనే ఐర్లాండ్ వెళ్ళే ఫ్లైట్ పోతుంది, మిమ్మల్ని అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాను” అని చెప్పి అప్పటికప్పుడు ఐర్లాండ్ విమానంలోకి ట్రాన్స్ఫర్ చేశారు. మా సామాను కూడా ఎక్కించారు‌.

***

ఆఖరి సమయానికి ఎలా పరిగెత్తమె మాకే తెలియదు. పరిగెత్తి పరిగెత్తి ఫ్లైట్ పట్టుకొని ఐర్లాండ్‌లో డైరెక్టుగా దిగాము. ఇట్ వాజ్ అమేజింగ్! అంటే ఆఫీసర్ చూడటము, ఐర్లాండ్ ఫ్లైట్ వుంది అని చెప్పి ఎక్కించడంతో నెక్స్ట్ డే మధ్యాహ్నానికి చేరవలసిన ఫ్లైట్ మేము తొందరగా ఐర్లాండ్‌కి వెళ్ళిపోయాము. చాలా సంతోషం! ఎంతో టైం సేవ్ అయింది. తర్వాత ఏ అడ్డంకులూ లేకుండా ప్రయాణం చేశాము అని చాలా సంతోషం పడిపోయాము. అక్కడికి వెళ్లగానే మేము హోటల్ బుక్ చేసుకున్నాము. చేసుకొని ఆ రోజు అంతా ఐర్లాండ్‌లో తిరిగాము. అక్కడ టెంపుల్ స్ట్రీట్ అని ఉంది అది ఆ స్ట్రీట్ లో మంచి రెస్టారెంట్ ఉన్నాయి. మేము అక్కడికి వెళ్లి ఆ రోజు ఆ Belfast-C వెళ్ళాము. Belfast లో ఒక ఆఫ్ ది డే తీసుకొని ఒక బస్సులో ఊరంతా తిరిగాము. అయితే తిరిగిన తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసాము. తరువాత రోజు వాళ్ళ ఇంటికి రమ్మని పిలిచారు. మేము అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళాక ఐటినరీ అంత తనే ఫిక్స్ చేశారు. ప్రతిరోజు ఒక ప్లేస్ చెప్పేవాడు. ఆ ప్లేస్‌కి బస్సులో వెళ్ళేవాళ్లం. ట్రాన్స్‌పోర్ట్ అంతా పబ్లిక్ బస్సు లోనే. అలా ఐర్లాండ్ అంతా మేము ఎక్స్‌ప్లోర్ చేసాము. Carrick-a-Rede Rope Bridge వెళ్ళాలనుకున్నాం. అద్బుతమైన నాలుగు గంటల ప్రయాణం అది.

***

పొద్దున్నే ఉదయం ఐదు గంటలకి బయలుదేరాము. ఆ అబ్బాయి మాకు టికెట్ బుక్ చేశారు. మేము ఉదయం 8, 9 గంటల కల్లా అక్కడ ఉన్నాము. ఇది మరొక దీవి. ఇది చిన్న దీవి అన్నమాట. ఈ దీవిలో అడుగు పెట్టినప్పుడు మాకు ఎంత సంతోషం అనిపించింది. ఈ దీవి చివరకు చాలా దూరం నడిచి వెళ్ళాము. నడిచి వెళ్ళాక అందులో ఒక కొండపై వెళ్లి కొద్దిగా కొండ పై నుంచి కిందకి దిగాలి దిగిన తర్వాత బ్రిడ్జికి టికెట్ కూడా కొనాలి. అక్కడికి వెళ్ళిన చూస్తే అది ఏంటంటే తాడు తోటి ఒక కొండ మీద నుంచి ఇక్కొక్క కొండ కి మీదకి బ్రిడ్జి కట్టారు. తాడు కట్టిన బ్రిడ్జి మంచిగా ఉయ్యాల ఊగుతూంది. కిందంతా నీళ్లు. మా వారు “వెళ్దాం వెళ్దాం” అంటూ డబ్బులు కట్టి వచ్చారు కానీ నాకు చాలా భయం వేసింది. తర్వాత చాలామంది వచ్చి వెళ్లే వాళ్లను చూసి కొద్దిగా ధైర్యం తెచ్చుకొని ఒక్కొక్క అడుగు వేసి చేయి పట్టుకొని మా వారి తోటి ఆ బ్రిడ్జి దాటాను. నిజంగా రోజు చాలా భయపడ్డాం. అంత మంచి ప్రదేశమైనా, కాలు జారితే నీళ్ళలో పడేటట్టు ఉన్నాము. అతి జాగ్రత్తగా ఒక్కొక్క అడుగు వేసి ఎంతో భయపడుతూ ఈ బ్రిడ్జి దాటి అటు వెళ్లి ఇటు వచ్చిన తర్వాత ఎవరెస్ట్ ఎక్కిన అంతా సంతోషం.

***

హురే హురే హుప్ హుప్ హురే అని పెద్ద పెద్ద కేకలు వేసాము. అంటే చాలా సంతోషం అనిపించింది. అంటే రెండు కొండల మధ్యలో తాడు తోటి బ్రిడ్జ్ చాలా డిఫరెంట్. ఆ తర్వాత నేను అక్కడ మధ్యలో కొన్ని అంటే చాలా కొన్ని స్టోన్స్ ఏర్పడ్డ స్థలానికి వెళ్ళాము. అవి కూడా ఎవరో పేర్చినట్టుగా చక్కటి ఆకారంతో ఒక్కొక్క రాయి పేర్చినట్టుగా ఉన్నాయి. ఎంతో సంతోషం అనిపించింది అంటే ఆ రాళ్లను చూస్తే. అది కూడా నేషనల్ పార్క్ లాగానే ఉంది. ఆ స్టోన్స్ పొడుగ్గా చాలా చక్కగా ఒక కొండలాగా ఏర్పడి ఉంది. ఆ ఫోటో చూపిస్తే అర్థమవుతుంది. అంత చక్కగా ఎలా ఏర్పడింది అనేది ఒక దేవుని సృష్టి, నిజంగా అభినందించాలి. తర్వాత రెండవ రోజు ఒక పెద్ద గార్డెన్ ‌లొ వెళ్లాము. ఈ గార్డెన్ గురించి ఎంతలా చెప్పుకుంటారు అంటే ప్రపంచంలో ఉన్న ఒక పది ఉత్తమమైన గార్డెన్‌లలో ఇదొకటి అన్నమాట. ప్రపంచంలోని బెస్ట్ గార్డెన్ ఉంది ఇక్కడ. ఇక్కడ చాలా సినిమాలు తీశారు. ఇక 1944 నుంచి 25 మూవీస్ తీశారట. ఇక్కడ ప్రతి స్థలంలో మూవీకి సంబంధించిన వివరాలు చాలా కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. సినిమా సిండ్రిల్లా తర్వాత బ్లాక్ బ్యూటీస్, కింగ్ ఆక్టర్ ఇవన్నీ కూడా ఇక్కడ షూటింగ్ అయ్యాయి అంట.

***

ఆ గార్డెన్ చాలా అందమైన స్థలం. దాదాపు మేము కూడా పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసుకొని తొందరగా 8 గంటలకు చేరితే ఉదయం 9 గంటలకి గేటు ఓపెన్ చేశారు. తొమ్మిది గంటలకి మీ మేము ఎన్టర్ అయితే దాదాపు నాలుగు గంటల వరకు గార్డెన్ అంతా తిరిగి చూశాము. మొక్కలు, వృక్షాలు, భవనాలు ఎంతో అందంగా ఉన్నాయి‌. అసలు ఎంత పెద్ద పెద్ద చెట్లు! ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్న చెట్లు! ఇవన్నీ చూసి మేము బయటకు వచ్చిన తర్వాత లోకల్ బస్టాండ్ వరకు చేరి సిటీ బస్సు ఎక్కి మేము మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఇంటికి వెళ్లిపోయాము. తర్వాత అబ్బాయి మాకు నాలుగోవ రోజు Cliffs of Moher అనే స్థలానికి వెళ్లడానికి బస్సు బుక్ చేశాడు. అక్కడ నిజంగా సముద్రపు అలలకి ఆ పెద్ద కొండ కొట్టుకుని పోతుందా అనిపించింది, 11 గంటలకి అక్కడ ఉన్నాము. అక్కడ నుంచి కదల లేదు అస్సలు. సాయంత్రం నాలుగు వరకు ఉన్నాం. ఇంకా మొత్తం Cliffs of Moher చూస్తూ గడిపాం. హారీపోటర్ సినిమా కూడా ఇక్కడే తీశారంట. ఆ తర్వాత ప్రైస్ బ్రాండెడ్ అనే సినిమా తీశారు. రాయన్ డేటా ఇనట్టిడా వెస్ట్ అని ఇట్లాంటివి ఎన్నో సినిమాలు తీసిన ప్లేస్. ఇంకో విషయం ఏంటి అంటే ఇక్కడ ఒక రాజసౌధం ఉంది. రాజసౌధం అంతా తిరిగి మేము చూసి చూసి సాయంత్రం నాలుగు గంటలకి బయటకి వచ్చేసరికి బాగా వర్షం. వాన ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది అని ముందే మా ఫ్రెండ్ చెప్పారు కాబట్టి మా దగ్గర రైన్ కోట్స్ ఉన్నాయి.

***

ఆ రైన్ కోట్స్ వేసుకొని సగం తడుస్తూండగా, సగం చలికి చేతులు వణుకుతున్నాయి. అలాంటి పరిస్థితిలో మేము బస్సు ఎక్కడానికి బయలుదేరాము. పరిగెత్తుకుంటూ బస్టాండ్ కి వెళ్ళాము. అక్కడ బస్ తీసుకొని డైరెక్టుగా ఇంటికి వచ్చేసాము. ప్రతి రోజు మేము ఇలాగా దాదాపు పొద్దున్న ఆరు గంటలకు లేవటం మా వంట మేము వండుకోవడం, అవి డబ్బాలలో సర్దుకోవటం. పర్యాటక స్థలాలు చూడటము. తర్వాత Cliffs of Moher కూడా అద్భుతం. నేను చూసిన వాటిలో ఇంత అద్భుతమైన ప్లేస్ నేను కలలో కూడా ఊహించలేదు‌‌. వన్ అఫ్ ద బెస్ట్ నాచురల్ వండర్స్ ఇది. నిజంగా చాలా సంతోషం అనిపించింది.‌ ఇక్కడే జేమ్స్ బాండ్ పిక్చర్, తర్వాత హరిపోర్టర్ పిక్చర్ ఎన్నో సినిమాలు తీశారట. ఆ అబ్బాయి మమ్మల్ని ఒక్కొక్క రోజు ఒక్క ప్లేస్‌కి పంపిస్తున్నాడు. మేము 15 రోజులు ఉన్నాము ఆ అబ్బాయి దగ్గర. ఆ 15 రోజులలో అసలు చూడని ప్లేస్ లేదు. తిని బయలుదేరడం మళ్ళీ ఇంటికి వచ్చేయడం. మాకు మా ట్రిప్ చాలా ఫ్రీగా పద్ధతిగా అనిపించింది. ఎందుకు అని అంటే లంచ్ అంతా వండుకుంటున్నాము. అబ్బాయి వాళ్ళ ఇంట్లో పడుకుంటున్నాము. మాకు హోటల్ ఖర్చు లేదు, తిండి ఖర్చు లేదు. అని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకున్నాం. కాబట్టి ఎక్కువ ఖర్చు లేదు. అలాగే మేము ఇక్కడ చాలా ఎక్స్‌ప్లోర్ చేసాము‌. టైటానిక్ సినిమా ఏది అయితే తీశారో, ఆ షిప్ ఐర్లాండ్‌లో మ్యానుఫ్యాక్చర్ అయింది.

***

ఆ ప్లేస్‌కి మాత్రం ఒకరోజు ఆ అబ్బాయి తన కారు తీసుకుని మాతోపాటు వచ్చాడు. ఆ అబ్బాయితో పాటు పొద్దున్నే ఉదయం ఐదు గంటలకి లేసి భోజనం అంతా పెట్టుకొని బయలుదేరాము. డైరెక్ట్ గా మేము అక్కడికి వెళ్ళిన తర్వాత దగ్గర దగ్గర ఒక 500 ఏకర్స్. ఆ స్థలం ఎన్నో ఎకరాలలో విస్తరించి ఉంది. ఇక్కడ టైటానిక్ ఎగ్జిబిషన్ పెట్టారు. ఆరోజు ఎలా తయారు అయింది, ఎలా ముగిసింది, ఎవరు ఎవరు సెండ్ ఆఫ్ చేశారు, సెండ్ ఆఫ్ చేసిన తర్వాత ఎవరికి ఏమైంది? అందులో ఒక్కొక్క అంతస్తు లో ఏమేమి వస్తువులు దొరుకుతాయి. ఇవన్నీ ప్రదర్శనకి పెట్టారు. అది కూడా మూడు నాలుగు అంతస్తులలో. మనమే అసలు టైటానిక్ షిప్‌లో ప్రయాణం చేస్తున్నంత ఆశ్చర్యంగా అన్ని వాళ్ళు సమకుర్చి పెట్టారు. మనకు సినిమాలో చూపినట్టుగా అక్కడ వాళ్ళు ఒక అమ్మాయి బ్లూ డైమండ్ దాన్ని అక్కడ ఒక చక్కటి అవి తయారు చేసి మనకు ఒక మెమెంటోగా అమ్మకానికి పెట్టారు. అంటే మనము అది ఒక గుర్తుగా కొనుక్కోవచ్చు. ఒక లావా స్టోన్ ఉంగరానికి పెట్టి అమ్ముతున్నారు. మేము అవి కొన్నాము. తర్వాత టైటానిక్ షిప్‌లో మేము నాలుగైదు ఫోటోలు తీసుకొన్నాం. తర్వాత ఒకరోజు ఒక విస్కీ తయారు చేసే ఒక బ్రీవరీస్ ఐర్లాండ్ లోనే ఉంది. దానికి వెళ్ళాము. ఆ ఫ్యాక్టరీ అంతా ఒక రోజు చూసాము.

***

ఒకరోజు మేము సాయంత్రం ఒక రెస్టారెంట్‌కి వెళ్ళాము. ఒక పబ్ అన్నమాట. అయితే మేము ఫుడ్ అంతా ఆర్డర్ ఇచ్చుకొని తినేసిన తర్వాత అన్నీ అయిపోయినాక సడన్‌గా ఒక ఆయన వచ్చి “ఈ రోజు నా బర్త్ డే. ఈరోజు ఇక్కడ వచ్చి ఉన్న వాళ్ళ ఫుడ్ బ్రీవరీస్ తాగారో తిన్నారో అని నేను డబ్బు కడతాను” అని అనౌన్స్ చేసి మా దగ్గరికి వచ్చి “మీ డబ్బు కట్టేశాను” అని చెప్పేసారు. చాలా ఆశ్చర్య పోయాము. ఇప్పటివరకు ఎన్ని దేశాలలో చూస్తే ఎక్కడ ఏ దేశాల్లో కూడా ఇలా ఫ్రీ ఫుడ్ కూడా దొరకలేదు‌, ఇక్కడ దొరికింది. మాకు ఇది చాలా ఆశ్చర్యం కలిగించింది. ఫుడ్ తినేసి మేము బయల్దేరాము. అయితే ఐర్లాండ్ వాళ్ళని ఒకటి మెచ్చుకోవాలి ఏంటి అంటే చాలా ఫ్రెండ్లీ పీపుల్. మరో రోజున జేమ్స్ బాండ్ పిక్చర్ తీసిన పాంప్లెట్స్ ఉన్న చోటు కూడా చూడడానికి వెళ్ళాము. పేరున్న ప్రతి సందర్శక స్థలాన్ని చూసి వచ్చాము. ఒక ప్లేస్‌కి వెళ్తే ఒక పెద్ద రాజభవనం లాగా ఉంది. ఆ రాజభవనంలో castle లో ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళు చక్కగా ఆ పెళ్లిని వీడియో షూటింగ్ చేసుకున్నారు. అక్కడ పెళ్లి ఎందుకు చేసుకుంటారంటే – ఆ castle లో… రాజసౌధంలో పెళ్లి చేసుకున్న అనే గొప్ప ఫీలింగ్‌తో ఉంటారు. ఇలాగ ఎన్నో ఎన్నో వింతలు విశేషాలు చూసి మేము అక్కడి నుండి బయలుదేరాము‌, కానీ ఈ అబ్బాయి మాత్రం చాలా హెల్ప్ చేశాడు మాకు. అలా ఐర్లాండ్ మొత్తం మేము చాలా ఎక్స్‌ప్లోర్ చేసాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here