అంతరిక్షంలో మృత్యునౌక-3

0
8

[శ్రీ బంకా పార్దు సంపత్ ‘Redemption of the Century’ అనే పేరుతో రాసిన సైన్స్ ఫిక్షన్ నవలను ‘అంతరిక్షంలో మృత్యునౌక’ పేరిట అనువదించి అందిస్తున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

[అంతరిక్షంలో అణువ్యర్థాలను మోసుకుపోతున్న నౌకని గుర్తించాకా, ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేగుతుంది. ట్యాన్‌జావీ రిపబ్లిక్ అనే ధూర్త దేశం ఈ పనికి పాల్పడిందని తెలుస్తుంది. దీనివల్ల భూమికే కాకుండా కుజ గ్రహానికి కూడా ప్రమాదం ఉందని తెలుస్తుంది. ఈ సంగతి మీడియాకి తెలిసి, అంతటా గందరగోళం ఏర్పడుతుంది. ఒక టివి స్టూడియోలో దీని గురించి చర్చ జరుగుతుంది. వివిధ దేశాల ప్రజలు కూడా ఈ ప్రాజెక్టు కయ్యే వ్యయం దృష్ట్యా, లేదా కుజ గ్రహం భూమికి చాలా దూరంలో ఉండడం వల్ల ప్రమాదం లేదని భావించడం వల్లా – కుజగ్రహాన్ని రక్షించాలా వద్దా అనే అంశంలొ రెండు వర్గాలుగా చీలిపోతారు. చివరికి అత్యధిక దేశాల అభిప్రాయం ప్రకారం కుజుగ్రహాన్ని రక్షించే మిషన్ ఏర్పాటవుతుంది. ప్రొఫెసర్ ఫ్రాన్సిస్ ఈ మిషన్‍కు డైరక్టర్‍గా, సమన్వయకర్తగా ఉంటారు. నీల్, యూరీ, మిస్టర్ బ్రియాన్, ప్రొఫెసర్ ఫ్రాన్సిస్, ఎలాషా ఇంకా అలెక్సిస్ తదితరులు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశానికి హాజరవుతారు. అక్కడ్నించి ఒక సమావేశానికి వెళ్తారు. ప్రొఫెసర్ ఫ్రాన్సిస్ మార్స్‌ని రక్షించే మిషన్‍కి ఎంపికైన వారి పేర్లను చదివి, వారి గురించి మిగతావారికి వివరిస్తాడు. నీల్‍ని టీమ్ లీడర్‍గా, యూరీ ఇవానోవ్‍ను సెకండ్ లీడ్‍గా ఎంపికచేస్తారు. వ్లాదిమిర్ నోవిక్, టోరీమోటో శాటో, రాకేష్ కృష్ణ, ఒలివర్ స్పెన్సర్ లను సభ్యులుగా ఎంచుకుంటారు. – ఇక చదవండి.]

ప్రకరణం-3: మార్స్‌ను రక్షించే సాహస యాత్రకు సన్నాహాలు!

[dropcap]స[/dropcap]మావేశం అద్భుతంగా ముగిసింది. ప్రొఫెసర్ ఫ్రాన్సిస్ బృందంలోని సభ్యుల పేర్లను వెల్లడించడానికి సంశయించ లేదు. మిషన్‌ను నడిపే వారిలో, స్పేస్ షిప్ సిబ్బంది (crew)కి నాయకత్వం వహించే మొదటి పేరు వ్లాదిమిర్ నోవిక్. అందరి కంటే వయసులో పెద్దవాడతడు. ఫ్రొఫెసర్, ఇతర వర్గాలు చెప్పినట్లు, ఆయన అగ్రరాజ్యలు రెండింటికీ విశ్వసనీయుడు. అతడు టీములోని అందర్నీ ఆయన కలుపుకుని పోగలడనీ, ఎందుకంటే టీములోని భిన్నమైన నేపధ్యాలకు చెందిన వారనీ, ఒకరు ప్రముఖ అమెరికన్ నీల్ బ్యారీ, ఒక న్యూక్లియర్ ఎక్స్‌పర్ట్, మరొక రష్యన్ గుండెలు తీసిన బంటు, వ్యోమగామి యూరీ ఇవానోవ్, కాబట్టి! అనీ అందరూ భావించారు.

ఈ నమ్మశక్యం గాని త్రిమూర్తులకు మద్దతు, టోరీమోటో శాటో, స్క్వాడ్ లోని తొలి మహిళ. తర్వాత భారతదేశం నుండి రాకేష్ కృష్ణ, చివరదే కాని, చిన్నది కాని ఒలీవియా. ఆ ఆరుగురిలో ఒకరు యూరోపియన్ యూనియన్ వ్యోమగామి.

వ్యోమగాముల బృందాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, ప్రపంచ దేశాల నాయకులు ఏం చేస్తున్నరో మనకు అవగతం అవుతుంది. వారిని ఖచ్చితంగా వారి వారి జాతీయత, వారి అనుభవం, వారి విశ్వసనీయతలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే, వ్యూహత్మకంగా ఎన్నిక చేసి ఉంటారు. దీన్ని ప్రొఫెసర్ కూడ ధ్రువీకరించారు.

ఈ మీటింగులోనే కాక, చాలా దేశాలు ఈ విశ్వకార్యానికి నిధులు అందిస్తామనీ, తమ దేశాలకు ఎంత ఖర్చుయినా పరవాలేదని, బహిరంగంగా ప్రకటించాయి. మిషన్ కవసరమైన సాంకేతిక, ఆర్థిక, మానవ వనరులను, అవసరం వచ్చినప్పుడల్లా సరఫరా చేస్తామని, అందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించాయి. మానవ వనరుల విషయాని కొస్తే, జపాన్, ఇండియా లాంటి దేశాలు తమ తమ అత్యుత్తమ గణిత శాస్త్రవేత్తలను, ప్రోగ్రామర్లను మెక్సికోలోని కార్యక్రమానికి పంపడం ద్వారా, తమ వాగ్దానాలను నెరవేరుస్తున్నాయి.

మిషన్ జరిగే చోటు

వార్తలు చెబుతున్న వ్యక్తి, కొనసాగిస్తూనే ఉంది. కాని ‘కజూయా’కు ఆ ఉదయం కావలసినంత వార్త దొరికినట్లే. అతని ఇరవై రెండేళ్ల కూతురు పేరు మిషన్ లోని సిబ్బందిలో ఉందని రెండు రోజుల కిందట ప్రకటించనప్పటి నుండి, ఆ వార్త అతన్ని నిలనివ్వడం లేదు.

కజుయా ఒక అత్యంత ధనవంతుడైన పారిశ్రామికవేత్త అని ముందే చెప్పుకున్నాం. అతనికి ఇరవై రెండేళ్ల వయసులో ఆమె పుట్టింది. కాబట్టి అతడు ‘యంగ్’ అని చెప్పవచ్చు. అతడు సమకూర్చుకున్న అపారమైన సంపదను బట్టి, అందరూ అతని పెద్ద వయసు వాడని అనుకుంటారు గాని, అతడు యవకుడే. చాలా మంది ఇతర జపనీయులలాగా, అతని శరీరం ధృడంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. పెద్ద బొజ్జ అసలుండదు.

అతడు ఒక మామూలు దుస్తుల్లో ఉన్నాడు. కప్పులోని టీ తాగుతున్నాడు, ప్రపంచంలోని ఏ ఇబ్బందులూ అతన్ని అంటనట్లుగా. ఈలోగా, రహస్యంగా చాలా జరుగుతుందని అతనికి తెలుసు. అమెరికన్ మీడియా, ఈ విపత్తుకు కారణమైన దేశం మీదనే నిందనంతా వేస్తున్నదని, ఎన్నో ఆంక్షలు ఆ దేశం మీద విధించబోతున్నదని అతనికి తెలుసు.

“నీవు ఖచ్చితంగా వెళ్లాలనే అనుకుంటున్నావా?” కజుయా కూతుర్ని అడిగాడు.

“నా ఉద్దేశం, ప్రతి ఒక్కరూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఆ వ్యర్థాలను అంతరిక్షంలోకి పంపినందుకు ఒక దేశం మీద నిందనంతా వేస్తున్నారు. మొత్తం ప్రపంచాన్నంతా మన పొరుగు గ్రహం మీద కలుగబోయే భయోత్పాతాన్ని గురించి ప్రభావితం చేస్తున్నారు” అతని కూతురు పై నించి దిగి వచ్చింది.

ఆయన సోఫాలో పూర్తిగా కూరుకుపోయి ఉన్నాడు.

శాటో మీడియం ఎతతులో ఉంటుంది. బక్కపలుచగా పెళుసుగా ఉన్న శరీరం ఆమెది. ఆమె ఎంత వరకు ఈ మహాత్కార్యాన్ని నిర్వహించగలదనేది ఆశ్చర్యమే. ఆమె జుట్టును పొట్టిగా కత్తిరించుకుంది. కనుబొమ్మలు దట్టంగా ఉన్నాయి. గుండ్రటి ఆమె ముఖానికి ఇవన్నీ చక్కగా అతికాయి. ఆమెను జపాన్ లోని అత్యంత చక్కటి అమ్మాయిగా చెప్పుకోవచ్చు.

“ఆపండి నాన్నా” అన్నదా అమ్మాయి. “మీరు నన్ను వెళ్లనివ్వాల్సిందే! వాళ్లకు అక్కడ నా అవసరం చాలా ఉంది.”

“నిజంగానా?” అన్నాడు తండ్రి. ఆమె ఒక ట్రావెలింగ్ బ్యాగ్‌ను తీసుకొని వెళుతూ ఉంది. ఆమెను డోర్ వరకూ సాగనంపడానికి ఆయన లేచాడు.

“డాడ్!” అంటూ ప్రారంభించింది శాటో. ఏదైనా సీరియస్ విషయాన్ని చెప్పాలనుకుంటున్నపుడు ఆమె ఇంగ్లీషు పదాలు వాడుతుంది. “మీడియా గొడవ వదిలెయ్యండి. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనేది మనకనవసరం. మనకు అవరోధంగా ఉన్న దాన్నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి. ఎవరు గెలుస్తారనేది మనకెందుకు? మనందరం కలిసి, ఇంత వరకు చేయని విధంగా, దానిని డీల్ చేయాలి. సమయం తక్కువగా ఉంది. చాలా! ఇప్పుడొక సాహసోపేత నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ తీసుకోలేం. పరిస్థితి అలాంటిది నాన్నా! నేనక్కడికి వెళ్లడమే పరమార్థం. అక్కడ ఉండి తీరాలి నేను.”

“ఆందోళన చెందకండి నాన్నా. క్షేమంగా తిరిగి వస్తా. ఆగండి ఇక!” శాటో తండ్రికి హామీ ఇచ్చింది. ఆయనేమీ అనక ముందే అతని దగ్గరికి వచ్చి ఆయన బుగ్గల పై ముద్దులు పెట్టింది. నాలుగు మెట్లు గబగబా దిగి, వెయిట్ చేస్తున్న కారులోకి దూకింది. వెంటనే కారు సూర్యోదయం వైపు పరుగులు తీసింది.

యూరీ కాన్ఫరెన్స్ రూములో ఉన్నాడు. మిగతా వాళ్లందరూ వచ్చే వరకు అతన్ని అక్కడ వెయిట్ చేయమని చెప్పారు.

వాళ్లు అప్పటికే దారిలో ఉన్నారు. మార్స్ రక్షణ మిషన్‌ను రూపొందించే అంతరిక్ష పరిశోధనా భవనం అదే! అతడు ఎక్కువ సేపు ఎదురు చూడక పోయినా, ఇద్దరు సహచరుల కోసం అలా కూర్చుని ఉండటం అతనికి విసుగ్గా ఉంది. అతడు లేచి, సమావేశం జరిగే టేబుల్ దగ్గరికి వెళ్లడానికి సమాయత్తమై, తలుపు తెరవబోయాడు. అప్పుడే ముగ్గురు వ్యక్తులు లోపలికి వచ్చారు

ఆ బృందానికి నాయకుడు ప్రొఫెసర్ ఫ్రాన్సిస్. నీల్ అతన్ని అనుసరిస్తున్నాడు. ఒక వ్యక్తి అక్కడ తారసపడ్డాడు. అతనెవరో నీల్‌కు తగినంతగా తెలుసు. ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి, త్వరగా ముందుకు వచ్చి, షేక్ హ్యాండ్ కోసం చేయి చాపాడు. సిబ్బందిని సెలెక్ట్ చేసిన రోజు ఆ వ్యక్తి ప్రొఫైల్స్ ను ప్రదర్శించి ఉండడం వల్ల గుర్తించడం సులువైంది.

“మీ ఇద్దర్నీ సిద్ధంగా చూడడం గ్రేట్!” అన్నాడు ప్రొఫెసర్, వెనక్కు తిరిగి చిరునవ్వు నవ్వుతూ. “యూరీ, ఈయన వ్లాదిమరి నోవిక్. వ్లాదిమిర్, ఈయన యూరీ ఇవానోవ్.”

ఇద్దరూ చూపులు కలుపుకుని, కరచాలనం కోసం కొనసాగారు ముందుకు. యూరీ నీల్ వయసు అంత ఉండదని అనుకున్నాడు. బహుశా ఇంకా చిన్నవాడని భావించాడు. అతడు యూరీ అంత ఎత్తే ఉన్నాడు. యూరీ కంటె ధృడంగా ఉన్నాడు. వ్లాదిమిర్ కరచాలనం స్థిరంగా ఉంది. అది అతని గురించి చెప్పింది.

వ్లాదిమిర్‌ది పూర్తిగా బట్టతల. మాటి మాటికీ అరచేతితో దాన్ని రుద్దుకుంటున్నాడు. అప్పుడు ఏదో మార్పును ఊహిస్తునట్లుగా ఉంది.

“సిబ్బంది యొక్క తొలి టీమ్, వారి నాయకులు ఇక్కడ ఉండడం సంతోషం. టీములో మిగతా వాళ్లు మీ గురించి కనీసం కొన్ని విషయాలనైనా తెలుసుకుంటారు” అన్నాడు ఫ్రాన్సిస్.

“వాళ్లు సకాలానికే వస్తారు ప్రొఫెసర్. మేమంతా విభిన్న ప్రాంతాల నుంచి వచ్చామని మీరు ఒప్పుకోవాలి” అన్నాడు వ్లాదిమిర్.

“అతడు చెప్పింది నిజం” అన్నాడు యూరీ. నీల్ కూడ ఏకీభవించాడు. వారి మాటలు ప్రొఫెసర్ అవగాహనను మార్చలేదు. ఆయన ఏదైనా నమ్మాడంటే, అంత సులభంగా మారడు.

కాసేపు నిశ్శబ్దం. తలుపు తోసిన శబ్దమయింది. తెరుచుకుంది. ఎలాషాను, మరో ఇద్దర్ని ఆ గది లోని వారు ఆహ్వానించారు. వారిద్దరు బాతు పిల్లల తమ తల్లిని అనుసరిస్తున్నట్లుగా వస్తున్నారు. టోరిమోటో శాటో, రాకేష్ కృష్ణ రూములోకి నడిచి, సాధ్యమైనంత వేగంగా దాన్ని పరిశీలించారు.

కృష్ణ ఒక కార్పొరేట్ తెలుపు రంగు చొక్కా, నల్లని ట్రౌజర్స్, వైన్ టై ధరించాడు. అతని జుట్టు బాగా ఒత్తుగా ఉంది. దాన్నతడు అంతగా పట్టించుకోనట్లున్నా, చక్కగా దువ్వి ఉంది. చేతి వేళ్లు ముడి వేసుకుని, రూములో ఉన్న వారి వైపు చూశాడు. మామూలు ఎత్తరే, కాని శాటో కంటే ఎత్తు.

శాటో, రాకేష్ అంత నెర్వస్‌గా లేడు. ఆమె నేరుగా వెళ్లి మొదట కూర్చున్న వ్యక్తి వైపు చేయి చాచింది. ఆ చేయి సున్నితంగా ఉంది.

“మిస్టర్ యూరీ, నా పేరు టోరిమోటో శాటో. జపాన్ నుంచి వచ్చాను. మీ గురించి చాలా విన్నాను” అన్నది. యూరీతో బాటు మిగతా వాళ్లు కూడ ఆశ్చర్యపోయారామె మాటలకు.

“అలాగా, మిమ్మల్ని కలుసుకోవడం సంతోషంగా ఉంది” అన్నాడు యూరీ చిరునవ్వుతో.

ఆమె బదులుగా చిరునవ్వు నవ్వింది. తర్వాత నీల్ దగ్గరకు వెళ్లింది. తర్వాత వ్లాదిమిర్‌ను, ఫ్రొఫెసర్‌ల్‌ను పలకరించి. నీల్ పక్కన కూర్చుంది. కృష్ణ కొంచెం మితభాషి. గౌరవంగా తల వంచి అందరికీ ‘శుభోదయం’ చెప్పాడు. అటు తిరిగి వెళ్లి శాటో పక్కన కూర్చున్నాడు.

ఆమె పక్కన కూర్చోవడమే అతనికి ఎక్కువ సౌకర్యంగా ఉన్నట్లు కనిపించింది.

ఎలాషా వెళ్లి బృదంలోని చివరి సభ్యురాలు. ఒలీవియా స్పెన్సర్‌తో తిరిగి వచ్చింది. ఒలీవియా అక్కడున్న వారి కంటే ఏమి పెద్దది కాదు. పొడుగ్గా లేదు. ఆమెది సాధారణ శరీరం. కృష్ణ ఎత్తు ఉంది. లేత ఆకుపచ్చ రంగు గౌను ధరించింది. ఆమె జుట్టు భుజాల మీదుగా పరుచుకుంది. ఆమె ముక్కు కోటేరు వేసినట్లు, పొడుగ్గా ఉంది, ఆమె కళ్లజోడు నిలబడడానికి అనువుగా ఉంది.

“మిమ్మల్నందర్నీ ఇక్కడ చూడడం గొప్పగా ఉంది!” అంటూ ప్రారంభించాడు ప్రొఫెసర్. “ఇప్పటికే చాలా వెయిట్ చేశాం. మరెందుకు సమయాన్ని వృథా చేయడం? ఇక ప్రారంభిద్దాం.”

కాసేపాగి, ఆయన కొనసాగించాడు.”మనం ఇక్కడ ఎందుకు ఉన్నామో మీకందరికీ తెలుసు కదా!”

కాసేపు ఆగాడు మళ్లీ. ఎవరైనా తెలియని వాళ్లున్నారో, చూద్దామని. లేదా, తన ఛాయిస్ కరెక్టా కాదా నేది గ్రహించడానికి. అతనూహించినట్లే, ఎవరూ చేతులెత్త లేదు. అందరూ ఒకరి వైపు ఒకరు దీర్ఘంగా చూసుకున్నారు.

“వెరీ గుడ్! ఈ మిషన్‌కు డైరెక్టరుగా, నేను దీన్ని ముందుకు తీసుకెళతానయితే..”

అప్పుడే ఒక చేయి పైకి లేచింది. తాను అనుకున్నది కాకూడదని ఫ్రాన్సిస్ లోలోపల ప్రార్థించాడు.

“ఏమిటి కృష్ణా?”

“సర్. మనం మిషన్‌కు పేరు పెట్టలేదు సర్!” అన్నాడు కృష్ణ.

అందరూ నవ్వారు. ప్రొఫెసర్ కూడ కొద్దిగా నవ్వినా, ఆ ప్రశ్న ఆయనను గంభీరం చేసింది.

“ఎందుకు అందరూ నవ్వుతున్నారు?” అడిగాడాయన. కొంచెం స్వరాన్ని హెచ్చిస్తూ “నేనొక సీరియస్ ప్రశ్నను అడిగాను. మీరేమో నవ్వుతున్నారు! పేరనేది మిషన్‌కు పరమార్థం కాదని మీరు అనుకుంటున్నారా, లేదా మిగతా వారితో కలవని వాడిని నేను ఒకడినేనా?”

“కావచ్చు” అన్నది శాటో అతని భుజం మీద తడుతూ. నవ్వులు కొనసాగాయి.

కృష్ణ చిరునవ్వు నవ్వాడు. తన ప్రశ్న వాతావరణంలో టెన్షన్‌ను ఏమైనా తగ్గంచి ఉంటుందా అని ఆశ్చర్యపోసాగాడు. నిజంగా అతనికి మిషన్ పేరేమిటో తెలుసుకోవాలని ఉంది.

“జోకులు పక్కన పెడితే, ప్రొఫెసర్, మన మిషన్‌ను ఏమని పిలుస్తున్నాం మరి? MSM కు కట్టుబడదామా?” అనడిగాడు నీల్.

“అదే అనుకుంటున్నా. మీ మనసులో మరేదైనా ఉందా?” ప్రొఫెసర్ అడిగాడు.

“నిజం చెప్పాలంటే, లేదు” అన్నాడు నీల్.

“దీన్ని మనం MSM6 అని ఎందుకు పిలవకూడదు? ఎందుకుంతే మనం ఆరుగురం కద!” అని అడిగాడు వ్లాదిమిర్.

“అద్భుతం! సరే, అది బాగుంది!” అన్నాడు ప్రొఫెసర్ “కృష్ణా అది నీకు ఓ.కె.నా?” అడిగాడు.

“అవును. చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది.”

“గ్రేట్! అయితే మన మిషన్ పేరు MSM6. ఎలాషా, దీన్ని నోట్ చేయడం మరిచిపోకు.”

***

మాస్కోలోని అంతరిక్ష ప్రయోగశాల. ప్రొఫెసర్ ఫ్రాన్సిస్ అందులోని కాన్ఫరెన్స్ రూంలోని ఒక టేబుల్ వద్ద ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. ఆ రూములోని కుర్చీలు, తను, ఇతర ప్రపంచం దేశాల నాయకులు ఎన్నిక చేసిన ఆరు మంది బృంద సభ్యుల కోసం ఉద్దేశించబడ్డాయి. కాని వారు కొద్దిగా ఆలస్యంగా వస్తామన్నారు. వారు కాకుండా, అలెక్సిస్ కూడ అక్కడ ఉండాలి. కాని అతడు కంట్రోలు రూమ్‌లో ఉండక తప్పదు.

మోచేతులు టేబుల్ మీద ఆనించి, నీలి చారల తెల్లని షర్టు చేతులు పైకి మడిచి కుర్చుని ఉన్నాడాయన. గడ్డాన్ని అరచేతుల్లో ఇముడ్చుకొని, తాము సరిగ్గానే ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారా లేదా అని ఆలోచింపసాగాడు. మొదట ఒక పరిచితమైన ముఖం రూములోకి వచ్చింది.

“వాళ్లంతా ఎక్కడ? ఎలాషా?” అని అడిగాడు ప్రొఫెసర్, వేచి చూడకుండా.

ఎలాషా బదులివ్వ లేదు. గోడకు వీపు ఆనించి తలుపు తెరిచిందంతే. ఒకరి తర్వాత ఒకరు, బృందం సభ్యులు రూములో ప్రవేశించారు. మెల్లగా నడుస్తూ. చిరునవ్వులు చిందిస్తూ. మగవారు మమూలు ట్రౌజర్స్, పొడుగు చేతుల చొక్కలు వేసుకుని ఉన్నారు. మహిళల్లో ఒకరు రంగు రంగుల స్కర్ట్, మిగిలిన వారు తమ తమ షర్ట్ స్కర్ట్‌లో ఉన్నారు.

ప్రొఫెసర్ ఫ్రాన్సిస్ తన తొలి ప్రణాళికకే కట్టుబడి ఉన్నాడు. అది కఠిన నియమాలతో కూడినది. అందుకే ఆయన వారి చిరునవ్వులకు స్పందించలేదు. అందరూ తమ తమ స్థానాల్లో కూర్చుని మాట్లాడుకోసాగారు. ఆయనకు వారి మాటలతో విసుగు వచ్చింది.

“మనందరం దయ చేసి నిశ్శబ్దంగా ఉందామా?” అన్నాడు అతని గొంతులో కొంత కాఠిన్యం! అంతా నిశ్శబ్దం!

“మనందరం పెద్దవాళ్లం. కాని చిన్న పిల్లల్లా ప్రవర్తింస్తున్నాం. మనం మనలా ప్రవర్తిద్దాం. అర్థమయిందనుకుంటాను!” అన్నాడాయన వారిని సున్నితంగా మందరిస్తూ.

కాసేపు ఎవ్వరూ ఏమి అనలేదు. వారి ముఖాల పై నవ్వు మాయమైంది. కొంత నిశ్శబ్దం తర్వాత, మొత్తం బృందం తరపున వ్లాదిమిర్ మాట్లాడాలని నిశ్చయించుకున్నాడు. అతన్ని అందరూ టీమ్ లీడర్ అని పొగిడినా, అతడు మాత్రం తాను ప్రాజెక్టులో ఒక భాగాన్ని అని మాత్రమే భావిస్తాడు. అతడు ప్రశాంతంగా ఉన్నాడు. ఏమి అనకుడదనుకున్నాడు. కాని అందరి చూపూ తన వైపే ఉండడంతో, అతను నోరు విప్పాడు.

“ప్రొఫెసర్, మీరు చెప్పిందంతా విన్నాం సర్. మా క్షమాపణలు చెబుతున్నాం మీకు. ముఖ్యంగా, ఒక టీముగా, ఆలస్యంగా వచ్చినందుకు క్షమాపణలు. మాలో ఒకరు, అందరూ వచ్చిన తర్వాత బయలుదేరదామన్నారు. అందుకే లేటయ్యింది” అన్నాడు వ్లాదిమిర్ సాధ్యమైనంత మర్యాదగా.

“సరే! కృతజ్ఞతలు! మీరు..”

“మాకూ క్షమాపణలు కావాలి సర్!” అన్నాడు వ్లాదిమిర్, మధ్యలో ఆయనకు అడ్డు తగిలి. దాంతో ప్రొఫెసరే కాదు అక్కడున్న వారంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు. వ్లాదిమిర్ అలా అని ఉండవలసింది కాదని అనుకున్నారు. “మేమేం చంటి పిల్లలం కాదు అని ఉంటే సరిపోయేది. మేం చేసిన నేరమల్లా ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడమే. దానికే మీరు మమ్మల్ని చంటి పిల్లలతో పోల్చారు. మాకూ పరిపూర్ణమైన మేధస్సు ఉంది, మేము..”

“ఐ యామ్ సారీ!” అన్నాడు ప్రొఫెసర్ వెంటనే. మిగతా సిబ్బంది అంతా ఇబ్బందిగా కదిలారు. కాన వాళ్లను అలా ట్రీట్ చేయడం వారికి నచ్చలేదు.

రూములో నిశ్శబ్దం వ్యాపించింది. రూంలో టెన్షన్ ఎంత దట్టంగా ఉందంటే దాన్ని కత్తితో కోయవచ్చు! అప్పుడే, అలెక్సిస్, వచ్చి కొంత ఉత్సాహంగా, కనీసం ఆ నిశ్శబ్దాన్ని గమనించకుండా, మాట్లాడసాగాడు. అతడు కంట్రోలు రూం నుంచి ఇంచుమించు పరుగెత్తుకొని వచ్చాడు. బలంగా శ్వాస తీస్తున్నాడు.

“లేటుగా వచ్చినందుకు క్షమించండి సర్!” అన్నాడా అమాయకుడు. కుర్చీలో కూర్చుంటూ. “మీరు మళ్లీ మొదటి నుండి చెప్పనక్కర లేదు. ఎక్కడ ఆపారో అక్కడి నుంచి కొనసాగించండి చాలు, నేను అర్థం చేసుకోగలను.”

“అందరికీ స్వాగతం!” అన్నాడు ప్రొఫెసర్ చివరికి, మీటింగ్‌ను ప్రాంభించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.

అందరూ విభిన్నంగా స్పందించారు. ప్రొపెసర్ ఫ్రాన్సిస్ తల విదిలించాడు. వాళ్లంతా ‘బిగినర్స్’ అని అతనికి తెలుసు. వారి నుండి పరిపూర్ణతను ఆయన ఆశించడం లేదు.

“ముందుకు వెళితే, మనం కొంత పరిచయాలు చేసుకుంటే బాగుండేది. కాని మన ఆలస్యమే మన అవరోధం. కాబట్టి దాన్ని దాటవేద్దాం. మీరందరూ ఒకరితో ఒకరు సర్దుకుపోయి సిద్ధంగా ఉండటం గొప్పది. విశ్వంలోకి సాహస యాత్రకు సన్నాహాల గురించి ఈ సమావేశం ఏర్పాటు అయింది. దీనిని ఐక్యరాజ్యసమితి ఇతర దేశాలు ఆమోదించాయి. కాబట్టి కొనసాగిద్దాం..”

“మనం ఈ సన్నాహాల్లో, ఎంత వరకు వెళ్లాం?” అడిగాడు నీల్. “మన కోసం ఇప్పటికే పని చేస్తున్నారు. వారు చంద్రగ్రహం పై కాలు మోపిన సామర్థ్యాలను కొంత మనం ఉపయోగించుకుంటాం. ఈ టార్గెట్ నిరంతరం కదులుతూ ఉండడం వల్ల, మన పని మరింత కష్టతరం కాబోతుంది. మనం ఇక్కడ మాట్లాడుతూ ఉండగానే, ఒక అంతరిక్ష నౌక, ఒక కంట్రోల్ స్టేషన్, నిర్మాణంలో ఉన్నాయి.”

“ఒక కొత్త స్పేస్ స్టేషనా? కేవలం ఈ మిషన్ కోసమేనా?” అనడిగాడు యూరి.

“అవును.”

“దేవుడా! ఈ ప్రాజెక్ట్ మీద ఎంత ఖర్చు పెడుతున్నారో?” అన్నాడు రాకేష్, తన భారతీయ సహజమైన పొదుపు గొంతుతో.

“సరే, అది మనకు సంబంధించిన విషయం కాదు, ప్రస్తుతానికి “ అని స్పందించాడు ప్రొఫెసర్.

“ప్రొఫెసర్ ఫ్రాన్సిస్, చంద్రుడి మీదికి నిర్వహించిన మిషన్ సమయంలో చేసిన క్యాలుక్యూలేషన్లు నాకివ్వగలరా? నా పని అక్కడ్నించి ప్రారంభిద్దామని నా భావన” శాటో కోరింది.

“దాన్ని ఏర్పాటు చేయగలం” అన్నాడు ప్రొఫెసర్. ఎలాషాకు సైగ చేసి అక్కడున్న అపోలో ప్రాజెక్టు నిర్మాతల నుండి ఆ లెక్కలు తెచ్చివ్వమని చెప్పాడు.

“సరే, మనం కొనసాగిద్దాం. యు.ఎస్.ఎస్.ఆర్. అంతరిక్షంలోకి ఆ వ్యామనౌక రవాణా చేయడానికి ఒక పెద్ద రాకెట్, ఒక ప్రధాన నౌక, ఒక సబ్ మాడ్యూల్ అవసరం. ఈ సబ్ మాడ్యూల్‌ను యూరోపియన్ యూనియన్ ఇస్తుంది. ఇది ప్లాన్ ‘బి’ లో ఏవైనా అవసరాలకు పని కొస్తుంది. మెయిన్ రాకెట్‌ను రష్యా కాంట్రిబ్యూట్ చేస్తుంది. అది భారీ బరువులను ఎత్తగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.” ప్రొఫెసర్ కాసేపాగి, మరీ కొనసాగించాడు.

“భారతీయులు ఇంత వరకు ఏమైనా ఈ ప్రాజెక్ట్‌కు దోహదం చేశారో ఎవరికైనా తెలుసా?” అని రాకేష్ వైపు చూసి అడిగాడు ప్రొఫెసర్.

రాకేష్ ఏం చేశాడంటే, లేచి నిలబడి, తన వైపు తానే చూపించుకుంటూ, భారతదేశం నుంచి కీలకమైన వర్క్ ఫోర్స్‌గా తానే ఇండియన్ కాంట్రిబ్యూషన్ అంటూ తెలిపాడు.

“నేను కాక, మా దేశం రెండు వారాల క్రిందట కొందరిని పంపింది. వారు మన టీముకు డేటా విశ్లేషణ, ప్రోగ్రామింగ్‌లో సాయపడుతున్నారు. నన్ను నమ్మండి మీరు, మా మానవ వనరులు, ఇప్పుడున్న అత్యుత్తమ ప్రోగ్రామర్లు.”

“ఓ.కె. మంచిది” అన్నాడు ఫ్రాన్సిస్.

“మరి జపాన్?”

“వాళ్లు మీకు సమకాలీన అత్యుత్తమ గణిత శాస్త్రవేత్తలనిచ్చారు ప్రొఫెసర్. వ్యోమనౌక సక్రమంగా పని చెయ్యడానికి కావలసిన ఫార్మలాలపై మేము ఇప్పటికే పని చేస్తున్నాం. JAXA (జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజన్సీ) సైట్ బిల్డింగ్‌కు అంటే నిర్మాణానికి అవసరమయ్యే కొంత సామగ్రిని కూడ పంపింది.”

“సరే.” అన్నాడు ప్రొఫెసర్. కాని..

“నేనింకా పూర్తి చేయలేదు సర్,” అన్నది శాటో. ప్రొఫెసర్ మాటల మధ్యలో జోక్యం చేసుకుంటూ.

“మనందరికీ తెలిసిన విషయమే, స్పేస్ క్రాఫ్ట్ నుండి భూమికి వచ్చే డేటా, టెరిమెట్రీ, ఇంకా ఇతర కమ్యూనికేషన్లు అంటే భూమికి వ్యోమనౌకకి మధ్య జరిగేవి అన్నీ సక్రమంగా చూసుకోవాలి, నమోదు చేయాలి. డేటా లేదా సమాచారం ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోకూడదు. అదంతా మేము చూసుకుంటాం.”

“చాలా బాగుందంటాను. అతి ముఖ్యమైన విషయం ఇది” అని మెచ్చుకున్నాడు ప్రొఫెసర్. సోవియట్ యూనియన్ వర్గాల ప్రకారం వారు వ్యోమగాముల శిక్షణకు కూడ సాయపడుతారు. సోయుజ్ మిషన్‌ను నిర్వహించిన వారి నుండి ఈ సాహస యాత్ర సామర్థ్యాన్ని పెంచుతారు. ఆ కార్యక్రమం మరో ఒకటి రెండు రోజుల్లో ప్రారంభం అవుతుంది. కాబట్టి, ‘సిమ్యులేషన్’ కోసం అంటే వారి సిస్టమ్ లోని డైనమిక్ రెస్పాన్సెస్‌ను మన సిస్టమ్ బిహేవియర్‌తో అనుసంధానించడం కోసం సిద్ధం కండి.”

ఆయన మాటలకు అందరూ అంగీకరించారు.

“మరి యూరోపియన్ యూనియన్ వారి స్పేస్ ఏజెన్సీ సంగీతేమిటి? వారి నుంచి దోహదం ఏమయినా ఉందా?” అనడిగింది ఒలివియా స్పెన్సర్.

“ఉంది, నిజంగా!” అంది ఎలాషా తన నోట్ ప్యాడ్‌ను నిశితంగా పరిశీలిస్తూ, EU వారి కాంట్రిబ్యూషన్ ఏమిటో చూసింది.

“EU స్పేస్ ఏజన్సీ స్పేస్ పేలోడ్ సమన్వయం చేయడానికి, దాని ప్రమాణానికి (సైజు) దోహదం చేసింది. అంతరిక్ష ప్రయాణాలలో నిపుణులైన మానవ వనరులను కూడ పంపింది. ప్రధాన మాడ్యూల్‌కు ప్రత్యామ్నాయంగా ఉపయోగించే ఉపమాడ్యూల్ (కొలప్రమాణం)ను కూడ ఇచ్చింది. ఇవన్నీ కాక, అగ్ర రాజ్యాల్లో ఒకటిగా నిధులను కూడా సమకూర్చిందనుకోండి!”

“అద్భుతం! అంతా బాగానే సమకూరుతుంది. మరి గ్రౌండ్ ట్రాకింగ్ సంగీతేమిటి?” అని అడిగాడు వ్లాదిమిర్.

“ఇంకా నాకు దాని గురించిన సమాచారం వస్తూ ఉంది. చైనా, ఆస్ట్రేలియాతో బాటు, ఇంకా చాలా దేశాలు, మన మిషన్ గ్రౌండ్ ట్రాకింగ్‌లో సాయం చేస్తున్నాయి. ప్రపంచంలోని వివిధ వ్యోమనౌకల నుండి చైనాలోని అతి పెద్ద రేడియో యాంటీనా, గ్రౌండ్ కమ్యూనికేషన్‌ను ట్రాక్ చేయడం, నిర్వహించడం, షేర్ చేయడంలో సహాయపడుతూ ఉన్నది. ఇది నిజంగా ఒక విశ్వకార్యమే” అన్నది ఎలాషా కొద్దిగా నవ్వుతూ.

“అస్ట్రేలియా దేశం అంటార్కిటికాకు కొన్ని నౌకలు పంపింది. గ్రౌండ్ రిలే స్టేషన్ కోసం. అది మన ప్రాజెక్ట్ ప్రోగ్రెస్‌ను పర్యవేక్షిస్తుంది”

“సరే. ఈ రోజుకు ఇక చాలిద్దాం. మీరందరు ఇక్కడ కలవడం బాగుంది. మీటింగ్ ప్రారంభంలో జరిగిన దానికి నా హృదయపూర్వక క్షమాపణలు. మీరు మీటింగ్‍కు ఆలస్యంగా రావడం నాకు కొంత అసౌకర్యాన్ని కలిగించింది.”

“మమ్మల్ని నడపాల్సిన వారు మీరే సార్. అట్లాంటివి మళ్లీ జరగవులెండి” అన్నాడు వ్లాదిమిర్.

***

సూర్యూడు పశ్చిమాద్రిన అస్తమిస్తున్నాడు. నీల్ బ్యారీ ఇంటికి డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్నాడు. అతని ఇల్లు ఔరే, కొలరాడోల స్నేహ పూర్వపు పొరుగున ఉంది. విమానాశ్రయం నుంచి పెద్ద దూరం లేదు.

అతడు తన కుటుంబ సభ్యుల చక్కని ముఖాలు చూసి దాదాపు నెలైంది. గత నెలంతా అతడు స్పేస్ స్టేషన్ లోనే గడిపాడు. అక్కడే మార్స్ పరిరక్షణ మిషన్‌కు కావలసిన వ్యోమనౌక నిర్మాణంలో ఉంది.

ఇంచుమించు ప్రతి రోజూ అతనికి తన కుటుంబం నుంచి కాల్స్ వస్తూనే ఉన్నాయి. వారిని బాగా ‘మిస్’ అవుతున్నాడు. కారును కుడివైపుకు తిప్పాడు. టౌన్‌కు వెళ్లే రోడ్‌లో ఉన్నాడు. తన పరిసరాలను ప్రశంసించే మూడ్‌లో లేడతను. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళదామా, ఎప్పుడెప్పుడు తన కుటుంబ సభ్యులను తన బాహువుల్లో ఇముడ్చుకుందామా అని అతనికి ఆతృతగా ఉంది. రెండు కిలోమీటర్లు వెళ్లింతరవాత, అతడొక కాంపౌండ్ లోకి ప్రవేశించాడు.

ఆ ఇల్లు చిన్న డూప్లెక్స్. దాని ముందు చిన్నలాన్ చక్కగా నిర్వహించబడి ఉంది. అతడు కారు దిగీ దిగక ముందే, పిల్లలు అతని దగ్గరకు పరిగెత్తుకొని వచ్చారు. ఉత్సాహంతో వాళ్లు వెస్తున్న కేకలు మిన్నుముట్టాయి. వాళ్లు కారు చుట్టూ గంతులు వేస్తూ, కారు డోర్ హ్యాండిల్‌ను అసహనంగా లాగుతూ, హడావిడి చేయసాగారు.

అతడు కారు దిగి, పిల్లలిద్దర్నీ కౌగిలించుకున్నాడు. రేచల్, జస్టిన్ ఇద్దరూ కవలలు. ఇద్దరూ తండ్రిని చూసిన ఉద్వేగంలో ఉన్నారు.

“వెల్కమ్ డాడీ!” అంది రేచల్, నీల్ కుడి చేతిని పట్టుకొని వేలాడుతూ.

“డాడీని మిస్సయ్యావా నాన్నా, బాగా?”

“అవును.. కాని.. నువ్వు ప్రపంచాన్ని రక్షించడంలో సహాయం చేస్తున్నావు కదా!” అన్నది జస్టిన్, మాటలను జాగ్రత్తగా పేర్చుకుంటూ.

“అది నిజం. నేను ప్రపంచాన్ని రక్షిస్తున్నాను.” అన్నాడు నీల్. అలా అని గట్టిగా అనేంత వరకు అతనికి తాను చేస్తున్న పనిలోని తీవ్రత తెలియలేదు.

“అమ్మేదిరా పిల్లలూ!”

“వంటింట్లో ఉంది నాన్నా!” రేచల్ వెంటనే చెప్పింది.

“ఓ.కె. పదండి. ఆమెకు హాయ్ చెబుదాం!”

ఇంట్లోకి వెళుతూంటే, ఘుమఘుమ వంటల వాసనలు వస్తూన్నాయి. అతని కిష్టమైనవి చేస్తూ ఉందని అతని కర్థమైంది.

“బేబీ” అని ఆమెను పిలుస్తూ, కాలితో తలుపును మూశాడు. టెస్సా, అతని భార్య కిచెన్ లోంచి బయటకు వచ్చి, డైనింగ్ రూమ్ దాటి, లివింగ్ రూం వైపుగా వచ్చింది.

నీల్ కవలలను దించి తన చేతులన చాచాడు. ఆమె వెచ్చని అతని కౌగిలిలో ఒదిగిపోయింది. ఎంతో ఇష్టంగా అతన్ని హత్తుకుంది.

కాసేపు ఇద్దరూ ఆ గాఢ పరిష్వంగంలో ఉండిపోయారు.

విడిపోయి, నీల్ ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఏమీ మాట్లాడకుండా, ఆమె కళ్లల్లోకి చూస్తూ, ప్రేమగా ఆమె నల్లని కేశాలను సర్దాడు. వాటి మెత్తదనాన్ని అనుభవిస్తూ, మెల్లిగా ఆమె ముందుకు వంగి, అతనికి ముద్దిచ్చి, వైదొలగింది.

కుటుంబమంతా కలుసుకున్న సమయం. నీల్ మిగిలిన వంటలో ఆమెకు సాయపడ్డాడు. డైనింగ్ టేబుల్ మీద వంటకాలన్నీ సర్దాడు. వాళ్లు చాలా విషయాలు మాట్లాడుకున్నారు. ఎక్కువగా తాము నివసిస్తున్న కమ్యూనిటీ గురించి. తను పాల్గొంటున్న మిషన్ గురించ నీల్ సాధ్యమైనంత వరకు చెప్పకుండా ఉండడానికే ప్రయత్నించాడు. అతని భార్య ఏ విషయంలోనైనా అతనిని సపోర్టు చేస్తుంది. అది నిజం. కాని అతడు చాలా కాలం రిస్కీ పనుల మీద దూరం వెళ్లాల్సి వస్తే, ఆమె ముఖంలో కదలాడే విషాద వీచికలు అతనిని కలవరపరుస్తాయి.

“జ్యూస్ ఎక్కడ?” అనడిగాడు నీల్ ఫ్రిజ్ తెరుస్తూ.

“కుడి వైపు మూలలో చూడు” అన్నది నవ్వుతూ టెస్సా. “అయినా అది నీకు దొరకదులే!” అంది.

“అది నా తప్పు కాదు” అన్నాడు నీల్ టేబుల్ దగ్గరకు వస్తూ.

అందరూ టేబిల్ చుట్టూ కూర్చున్నారు. నాలుగు ప్లేట్లలో మెక్సికన్ ఆహరం ఐన ఎంచిలా డాస్ వడ్డించి ఉంది. అది ఆకుపచ్చగా ఉంది. దానిలో ఛీజ్, వీట్, కార్న్ టార్టిలాను ఒక ఫిల్లింగ్ చుట్టూ రోల్ చేసి దాని మీద రుచికరమైన సాస్ పోస్తారు. దాంట్లో మాంసం, బీన్స్, బంగాళదుంపలు ఇంకా ఇష్టమైన కూరగాయలు కలుపుతారు. నీల్‍కు అదంటే చాలా ఇష్టం. తినాలని ఆత్రంగా ఉన్నాడతడు. వారందరూ కూర్చుని భోజనాన్ని ఇచ్చినందుకు భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. తర్వాత తినడం ప్రారంభించారు. ఎలా చదువుకుంటున్నారని పిల్లలను అడిగాడు.

“మీరు చేస్తున్న పని గురించి చెప్పండి నాన్నా, అంతరిక్షం గురించి మాకు చెప్పండి.” అన్నాడు జేమ్స్, చెంచాతో ఆహారాన్ని నోట్లో పెట్టుకుంటూ.

నీల్ భార్య వైపు చూశాడు. ఆమె కూడా తింటూ ఉంది. కొడుకు ప్రశ్నను తాను వినవట్టే నటిస్తూ, ఏం చెప్పాలో నీల్ ఆలోచించుకునే ఉన్నాడు. కాని వార్తను చెప్పాడానికి అతను అనుకున్న విధానం అది కాదని అతనికి బాగా తెలుసు.

“పని బ్రహ్మండంగా ఉందిరా, జేమ్స్! ముందు తిను. అమ్మను అప్‌సెట్ చేయాలని లేదు కదా, నీకు!” అన్నాడు నీల్, ఆ టాపిక్ ను అంతటితో ఆపేయడానికి ప్రయత్నిస్తూ.

“సరే డాడీ!” అన్నాడు వాడు, నాన్న వలలో పడిపోయి.

నీల్ అప్పడే భార్య వైపు చూశాడు. ఆమె కూడా అతని వైపు చూసింది. కాని వెంటనే చూపు తిప్పుకుంది. అలా ఆ రాత్రి దోబుచులాటగా సాగింది.

పడుకునే టైమయ్యింది. నీల్ తన పిల్లలను పొదువుకొని పడుకున్నాడు. పడుకోబెట్టే ముందు వారికి ఒక కథ చెప్పాడు. లేకుంటే వాళ్లు అతన్ని వదలరు.

“సో, అది రా పిల్లలూ, కథ అయిపోయింది” అన్నాడు వారి ముక్క కొనలను స్పృశిస్తూ.

“గుడ్ నైట్ డాడీ!” అన్నారు ఇద్దరూ. ఇద్దరి నుదుట ముద్దులు పెట్టాడు వాళ్ల నాన్న.

వారితో గడిపే చివరి క్షణాలు అవే అని అతనికి బానే బాగా తెలుసు. ‘మిషన్ టు మార్స్’ కు వెళ్లే ముందు వారిని చూసిపోదామనే వచ్చాడు. దాన్ని మార్చాలని అతనికి ఉంది. కాన అది జరిగే మార్గం లేదు.

“స్వీట్ డ్రీమ్స్” అని చెప్ప, బెడ్ పక్కన ఉన్న దీపాన్ని ఆర్పివేశాడు.

తలుపు వేసే ముందు పిల్లల్నిద్దర్నీ మరోసారి చూసుకుని, అతడు గదిలోంచి బయటకు వచ్చాడు. తమ గదికి వెళుతూ ఉండగా, ఆ వార్త భార్యకు ఎలా చెప్పాలా అని ఆలోచించ సాగాడు. వారి సాహసయాత్రను గురించి ఇంకా ప్రజలకు చెప్పలేదు. బృందంలోని సిబ్బంది తమ కుటుంబ సభ్యులకు మాత్రం చెప్పడానికి అనుమతి కోరి ఉన్నారు. డోర్ హ్యాండిల్ తిప్పాడు నీల్. భార్య నైట్ గౌన్‍లో పక్క మీద కూర్చుని ఉండటం చూసి అతడేమీ ఆశ్చర్యపోలేదు. ఆమె తన కోసం ఎదురు చూస్తూ ఉంటుందని అతనికి తెలుసు.

రూములో వెలుతురు మంద్రంగా ఉంది. బెడ్ సైడ్ ల్యాంప్‌దే ఆ వెలుగు. ఆ రూముకు వేసిన పెయింట్ కూడా డల్ గా ఉంది. అందువల్ల కాంతి పెరగలేదు.

“హాయ్ హనీ!” అంటూ తన వెనక తలుపు మూశాడు. దుస్తులు విప్పాడు. అతని ఆర్మీ ట్యాగ్ అతని మెడపై అటూ ఇటూ కదులుతూంది.

“ఎప్పుడు అది?” అనడిగింది టెస్సా. అతని వైపు సూటిగా చూస్తూ ఆమె కళ్ల నిండా నీళ్లు! వాటిని భర్త గమనించాడు. కాని ఆమె గుండె నిబ్బరం గల స్త్రీ. కన్నీటిని జయించి, మామూలుగా ఉండడానికి ప్రయత్నించింది.

తాను ఒక మిషన్ మీద వెళ్లిన ప్రతిసారీ, ఆమెను ఇలా బాధకు గురి చేస్తున్నందుకు అతడు గిల్టీగా ఫీలయ్యాడు. అతడు కాలేజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు వాళ్లిద్దరూ తొలిసారి కలుసుకున్నారు. కాలేజీ తొలి రోజుల్లోనే వారిద్దరూ ప్రేమలో పడ్డారు. తర్వాత తమ బంధాన్ని దృఢం చేసుకున్నారు.

నీల్ తన రంగంలో ఆనర్స్‌లో గ్రాడ్యుయేషన్ చేశాడు. అతనికి వెంటనే ఉద్యోగం దొరికింది. కాని వాళ్ల నాన్నగారు మరణించడంతో, పరిస్థితులు తారుమారయినాయి. ఆయన కూడా సైన్యంలో పని చేసేవారు. దేశసేవకే అంకితమయ్యాడాయన. ఆయన మరణించే ముందు కొడుకు దగ్గర మాట తీసుకున్నాడు. తమ దేశం అమెరికాకు సేవలందిస్తానని నీల్ ఆయనకు వాగ్దానం చేశాడు.

కాని తన భార్య తను సపోర్డు చేయదేమో అనే అతడు ఇంటికి వెళ్లాడు. ఆమె భయపడింది. భయపడుతూనే ఉంది కూడా. ఏ మిషన్ లోనూ అతని కోల్పోవడానికి తాను సిద్ధంగా లేనని, ఇంటి పట్టున ఉండి పిల్లల బాగోగులు చూసుకోమ్మని ఆమె అతనికి స్పష్టం చేసింది. దురదృష్టం, అతడు మనసు మార్చుకోకముందే వాళ్ల నాన్నగారు చనిపోవడం, ఆర్మీకి అతడు పంపిన దరఖాస్తు ఆమెదింపబడటం జరిగిపోయాయి.

మరణించిన తండ్రికి చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడం తప్ప అతనికి మరో దారి లేదు. ఇరవై ఐదు సంవత్సరాల వయసులో అతడు సైన్యంలో చేరాడు. అప్పటి నుండి, అతని జీవితానికి, ప్రేమకు, పరీక్షలు ఎదురవుతూనే ఉన్నాయి.

“బ్యారీ, నేనడిగిన ప్రశ్నకు జవాబు కోరుతున్నా” అని పట్టుబట్టింది టెస్సా, గొంతు పెంచి. నీల్ పక్క మీద ఆమె దగ్గర కూర్చుని తన చేతిని ఆమె చుట్టూ వేశాడు. ఆమె విదిలించుకోవాలని చూసింది. కాని తనను ఎంత గట్టిగా పట్టుకున్నాడో అర్థమైన తర్వాత, రిలాక్స్ అయింది.

“ఇదే చివరి మిషన్ కాబోతుంది. ప్రామిస్” అంటూ ఆమెకు హామీ యిచ్చాడు నీల్, పరుషంగా ధ్వనించకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ. భార్య తన మీద గొంతు పెంచి మాట్లాడితే ఇష్టడే రకం కాదతడు. అందుకే ఆమెను శాంతపరచడానికి తన చేతనైనంతగా ప్రయత్నిస్తున్నాడు. ఆమె అతని వైపు చూచింది. అతనికి అర్థమైంది. తాను వినదల్చుకున్నది వింటేనే తప్ప ఆమె తనను వెళ్లనివ్వదని నీల్ బరువుగా నిట్టూర్చి అన్నాడు “మరో వారం రోజుల్లో”

“ఎన్ని రోజులు పడుతుంది.”

“మాకు ఇంకా తెలియదు.”

అలా జవాబిచ్చి, బోర్లా పడుకున్నాడు. బాగా అలిసిపోయాడు రోజంతా ప్రయాణం చేసి. మనసుకు శరీరానికి విశ్రాంతి కావాలని అనుకుంటున్నాడు, తన భార్యను సముదాయించాలని ఎంత ఉన్నా.

పక్కన నెమ్మదిగా వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దం వినసాగాడు. ఆమె ఎంత వేదన పడుతూందో అర్థమైంది. లేచి భార్యను దగ్గరకు లాక్కున్నాడు. ఆమె తలను తన రొమ్మపై ఆనించుకున్నడు.

“దయచేసి మళ్లీ నా వద్దకు రండి” అన్నది టెస్సా, వెక్కిళ్ల మధ్య.

“తప్పక వస్తాను” అన్నాడు వెంటనే “ప్రామిస్!”

ఆమె మృదువైన జుట్టును నెమ్మదిగా సవరించాడు.

ఆమె భుజం మీద తట్టసాగాడు. ఆర్మీలో అతడు చాలా ఉన్నతమైన ర్యాంక్‌లో ఉన్నాడు. ఏ మిషన్‌కు వెళ్లే ముందైనా, ఆమె రాత్రంతా ఏడుస్తుంది.

మెల్లిగా వాళ్లు పక్క మీద వాలారు. దుప్పటి కింద ఆమెను రాత్రంతా పెనవేసుకునే ఉన్నాడు. ఆమె మెల్లగా ములుగుతూ నిద్రాదేవి చల్లని ఒడిలో సేదతీరింది..

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here