అనుకోవాలి..!!

13
11

[dropcap]అ[/dropcap]నుకుంటే…
అసాధ్య మేమీ కాదు,
అనుకోకపోవటంలోనే,
అంతరార్థం దాగిఉంది!

సమస్యలు
నీకూ ఉంటాయ్,
నాకూ ఉంటాయ్,
ఈ జీవన గమనంలో,
సమస్యలు
లేకుండా ఎలా వుంటాయ్!

సమస్యల వలయంలో,
దుఃఖం ఒకటే …
ప్రధానపాత్ర కారాదు,
వ్యథల భారంతో,
మనిషి మనుగడ,
చెదలు పట్టిన మెదడుగా
మిగిలిపోరాదు…!

అందుకే
వ్యథల వలయం నుండి
బయటికి రావాలి!

అయినవారితో…
ఆనందమైనా ,
దుఃఖమైనా,
పంచుకునే మార్గం
అలోచించాలి…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here