అపనమ్మకం

0
6

[dropcap]మి[/dropcap]త్రమా!
అగాధాల అంచున నిలబడి చూడకు –
భయాందోళనలు నిన్ను ఆవహిస్తాయి!
నిరాశా నిస్పృహలు చుట్టుముడతాయి!
మైదానంలో నిలబడి మింటి వంక చూడు –
అప్పుడు అవగతం అవుతుంది నీకు
అన్వేషించాల్సిన అంశాలెన్నో
ఆవిష్కరించాల్సిన సత్యాలెన్నో
అధిరోహించాల్సిన శిఖరాలెన్నో!
స్నేహితుడా –
ఆత్మ విశ్వాశాన్ని అహంభావంగా
అభివర్ణించడం అవాంఛనీయం!
మహానదిని పిల్లకాల్వగా
చూడటం, చూపడం అవివేకం!
అందుకే-
అపనమ్మకంతో మిత్రునిగా కొనసాగలేను
విరోధిగా మారడానికే సిద్ధం నేను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here