అపురూప నేస్తాలు

1
2

[box type=’note’ fontsize=’16’] కోరికలు, కవితలు, కలలన్నీ కమనీయ కావ్యాలై.. రమణీయ రూపాన్ని సంతరించుకుని.. అందమైన దృశ్యకావ్యంలా భాసిల్లాలంటే అక్షరాలు ‘అపురూప నేస్తాలు‘గా మారాలంటున్నారు గొర్రెపాటి శ్రీను. [/box]

[dropcap]మ[/dropcap]ది అంతరంగంలో మెదిలే
కోరికలు కొన్ని
అక్షరాలుగా మారి
లక్ష్యాలై కళ్ళముందు కదులుతుంటే
కవితలై సాక్ష్యాత్కరిస్తుంటే
కలలన్నీ నిజమవ్వాలని కోరుకుంటాను !
కోరికలు, కవితలు, కలలన్నీ కమనీయ కావ్యాలై ..
రమణీయ రూపాన్ని సంతరించుకుని..
అందమైన దృశ్యకావ్యంలా.. భావాల వర్ణాలెన్నో మేలుకలయికలతో..
నయనానందకరమై.. ముగ్ధమనోహరమై ..
ఆహ్లాదాన్ని పంచాలనుకుంటూ పరితపిస్తుంటాను !
కలం కదలికలు ..
కమనీయం.. రమణీయం ..
అక్షరాల చిత్రాలు.. కవితా కుసుమాలైన.. అపురూపనేస్తాలు !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here