అర్జునుడి తీర్థయాత్ర

0
11

[box type=’note’ fontsize=’16’] బాల పాఠకుల కోసం అర్జునుడి తీర్థయాత్ర కథను సరళమైన రీతిలో అందిస్తున్నారు బెల్లంకొండ నాగేశ్వరరావు. [/box]

[dropcap]పాం[/dropcap]డవులు సంవత్సరానికి ఒకరివద్ద ద్రౌపది గడపాలని నారదుడు నిర్ణయించగా అందరు అంగీకరించారు. నియమభంగం చేస్తూ ఎవరైనా ద్రౌపది మరొకరితో ఉండగా ఆ యింటి లోనికి వెళ్ళినవారు ఒక సంవత్సరం తీర్థయాత్రలు చేయాలి. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు వచ్చి అర్జునా నా పశువులను దొంగలు బలవంతంగా తోలుకు వెళుతున్నారని రక్షించమని కోరుకున్నాడు. ఆశ్రితుని కోరికమేరకు ఆయుధాగారం ఉన్నఇంటిలో ప్రవేశించి ఆయుధాలు ధరించి దొంగలను శిక్షించి ఆయుధ విసర్జన చేసి ధర్మరాజు ద్రౌపది ఉన్నఇంటిలో ప్రవేశించిన కారణంగా సంవత్సరం తీర్థయాత్రలకు బయలుదేరాడు.

అర్జునుని వెంట పాండవుల పురోహితుడు ‘ధౌమ్యుడు’, అతని తమ్ముని కుమారుడు ‘విశారదుడు’ బయలుదేరారు. అలా బయలుదేరి ‘భోగవతి’ రాజ్యంలో ఉంటూ ప్రతిదినం గంగా నదికి స్నానం చేయడానికి వచ్చే అర్జునుని చూసిన ‘ఉలూపి’ అనే నాగకన్య తనను వివాహం ఆడవలసిందిగా కోరడంతో ఆమె పెద్దల అనుమతి పొంది  వివాహం చేసుకున్నాడు. వారికి ‘ఇలావంతుడు’ అనే కుమారుడు జన్మించాడు. తను మరిన్ని ప్రదేశాలు చూడవలసి ఉన్నదని  ఉలూపి వద్ద శెలవు తీసుకుని, ఉత్తర, దక్షిణ దేశాలలోగల సందర్శన ప్రాంతాలను దర్శిస్తూ, తన విషయాలు ఎప్పటికి అప్పుడు శ్రీకృష్ణునికి, ధర్మరాజుకు తెలియబరుస్తు, పలు తీర్థయాత్రల సందర్శనం చేసుకుని, పదమూడవ మాసంలో పాండ్యరాజైన ‘మలయద్వజుడు’ పరిపాలించే ‘మణిపురం’ చేరుకున్నాడు.

ఆ దేశపు రాజకుమార్తె ‘చిత్రాంగద’ వనవిహారం సమయంలో అర్జుని చూసి మోహపరవశురాలు అయింది. అర్జునుడు ఆమెను కోరుకున్నాడు. తోటలో విశ్రాంతి పొందుతున్న అర్జునుని విషయాలు విశారదుని ద్వారా తెలుసుకున్న మలయద్వజుడు అర్జునుని విందుకు ఆహ్వానించి అనంతరం వసంతమండపంలో విడిది ఏర్పాటు చేయించాడు. ఇంతటి మహావీరుడు తన అల్లుడు అయితే అని భావించి విశారదుని ద్వారా విషయం విన్నవించాడు. సమ్మతించిన అర్జునుడు  చిత్రాంగదను వివాహం చేసుకున్నాడు. కొంత కాలానికి వారికి ‘బబ్రువాహానుడు’ జన్మించాడు. అక్కడి పెద్దలు, చిత్రాంగద వద్ద శెలువు తీసుకుని పలు తీర్థయాత్రలు చేస్తూ, పంచతీర్ధంలోని ‘ఐదుగురు’ నందా”లలిత” పద్మ’ సౌరబీయి, సమీచి’ అనే అప్సరసలు కొలనులో మొసలి రూపంలో ఉన్నవారికి శాపవిమోచనం కావించి, విశారదుని ధర్మరాజు వద్దకు పంపించాడు.

తను  ద్వారకకు దగ్గరలోని ‘రైవతవనం’లో యతిరూపంలో కృష్ణుని సలహా మేరకు ఉండసాగాడు. బలరాముడు యతిరూపంలోని అర్జునునకు సేవలు చేసేందుకు ‘సుభద్ర’ను వినియోగించాడు. అప్పటికే అర్జునిపై మనసుపడిన సుభద్రని శ్రీకృష్ణుని సలహా మేరకు ఘటోత్కచుని సహాయంతో వివాహం చేసుకున్నాడు. వీరు హస్తినాపురానికి వెళ్ళడానికి ఆయుధాలు, రధం రహస్యంగా ఏర్పాటు చేసి ‘పసుపతి దినోత్సవం’ పేరున బలరాముని దూరంగా పంపాడు కృష్ణుడు. సుభద్రతో హస్తినకు వెళ్ళాడు. వీరి వివాహం గురించి తెలిసి మండిపడిన బలరాముని శాంతపరిచాడు శ్రీకృష్ణుడు. అలా సుభద్ర అర్జునులకు ‘అభిమన్యుడు’ జన్మించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here