[డా. నెల్లుట్ల నవీన చంద్ర రచించిన ‘ఆర్యులు ఒక జాతియా? ద్రవిడులు ఒక జాతియా?’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]
చారిత్రక నేపథ్యం
- రోమన్ సామ్రాజ్యము భారతదేశంతో వాణిజ్య వ్యాపారాలు చేసింది అంటే సందేహించవలసిన అవసరం లేదు. రోమన్ సెనేటులో భారతదేశానికి తమ బంగారం రిజర్వులు తరలిపోతున్నాయని చర్చ జరిగింది కూడా నిజము.
- చంద్రగుప్తుడు 1800 ఏళ్ళ కిందట నిర్మించిన ఒక లోహ స్తంభము – 21 మీటర్ల ఎత్తు, 41 సెంటిమీటర్ల వ్యాసము, ఆరు టన్నుల బరువూ కలది, – ఇప్పుడు కుతుబ్ కాంప్లెక్సులో ఉన్నది. తుప్పుపట్టని లోహాలతో నిర్మింపబడినది. ఆ లోహాలు ఏవో ఇంతవరకు పాశ్చాత్యులు కనిపెట్టలేక పోయారు.
- చరక సంహిత, శుశ్రుత సంహితా భారతదేశంలో వైద్య శాస్త్రము అత్యున్నత స్థాయిలో ఉండిందని తెలియ పరుస్తాయి.
- నగర నిర్మాణమూ, దేవాలయాల నిర్మాణమూ పరిశీలిస్తే అవి ఏ ఇతర దేశాల వాస్తుశిల్ప శాస్త్రానికీ తలవంచవు అని తేటతెల్లం చేస్తాయి.
- నౌకల నిర్మాణమూ, వస్త్రాల నేత కూడా యూరోపియనుల కన్నా ఎత్తుస్థాయిలో ఉన్నవంటే ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు.
ఐదు పారిశ్రామిక రంగాలలో భారతదేశం ఇతరదేశాల కన్న ముందు స్థానంలో ఉన్నదని చరిత్ర నిరూపిస్తుంది.
వాస్తు శిల్ప శాస్త్రము, వైద్య శాస్త్రము, వస్త్ర పరిశ్రమ, లోహ శాస్త్రము, నౌకల కట్టడంలో ఏ ఇతర దేశమూ మన కన్న ఉత్తమ స్థాయిలో లేదని యూరోపియనులకు, ఇంగ్లీషు వారికి తెలుసు. అది కాదని ఇప్పుడు వారి అభిప్రాయము. దీనికి తోడు సాహిత్యంలో,తత్త్వ శాస్త్రంలో, గణిత శాస్త్రంలో, సంగీతంలో, నాట్యశాస్త్రంలో భారతీయులది అందెవేసిన చేయి.
ఈ నేపధ్యంలో ఇంగ్లీషు వాళ్ళు చేసిన నిర్వాకం చూద్దాం. ఇంత గొప్ప సంస్కృతి పూర్తిగా కూలిపోవడానికి కారణం ముసల్మానుల, క్రైస్తవుల సామ్రాజ్యాలు దోపిడి చేయడం. 45 ట్రిలియన్ల డాలర్ల సంపదను బ్రిటను భారతదేశం నుంచి తమ దేశానికి తీసుకు పోయిందని పట్నాయిక్ గారు కొలంబియా విశ్వద్యాలయం పరిశోధనలో కనుక్కొన్న సత్యము. అరబ్బులు, టర్కులు, మధ్య ఆసియా వారు ఎంత కొల్లగొట్టారో లెక్కలేదు.
1608లో విలియం హాకిన్సు అనే ఆంగ్ల అన్వేషకుడు జహంగీరు సంస్థానంలో వాణిజ్య సంబంధాలు నెలకొల్పాడు. కాని అవి అంత సులువుగా ముందుకు సాగలేదు. కాని 1765లో ఇంగ్లీషు కంపనీ భారత దేశాన్ని ఆక్రమించి రాజ్య పాలన చేయడం మొదలుపెట్టింది. ఇంగ్లీషు ప్రభుత్వం కంపెనీనుంచి అధికారాన్ని హస్తగతం చేసుకున్నది.
1811లో భారత దేశంలో 732000 గురుకులాలు ఉండినవని కొత్త పరిశోధనల ద్వారా తెలుస్తున్నది. The fortunes of English Public schools are said to have fallen strikingly during the eighteenth century. In January 1797, the famous school at Shrewsbury, for instance, did not have ‘above three or four boys.(The Beautiful Tree, Dharampal)
1835 ఫిబ్రవరి 2 నాడు థామస్ బాబింగ్టన్ మెకాలే రాసాడు, “మనం ఈ ప్రజలను తమ భాష కాని ఇతర భాషలో విద్యావంతుల చేయాలి. అది మన భాష. ఇంగ్లీషు యూరపు భాషలలోనే అసామాన్యమయినది.”
పర దేశస్తులు పరిపాలిస్తున్న మన దేశంలో ఇంకొక విదేశీయుడు పరిపాలన మొదలు పెట్టాడు. ఈ రెండవ వాడు దేశాన్ని కొల్లగొట్టడానికి వచ్చిన వాడు.
మెకాలే ఇంకా అన్నాడు: “ఒక చిన్న యూరోపియను పుస్తకాల ఆలమారీ మొత్తం భారతదేశపు పుస్తకాల కన్న విలువయినది.”
ఇంత గొప్ప యూరోపియను దేశం చేసిందేమిటి? 45 ట్రిలియన్ల సంపదను కొల్లగొట్టడమేకాక 165 మిల్లియన్ల భారతీయులను హత్య చేసింది. వారి ప్రభుత్వం కింద భారత దేశంలో నిరక్షరాస్యత 1911లో 94% కు పెరిగింది. దేశపు పారిశ్రామిక, వ్యవసాయిక రంగాలు దెబ్బతిని దేశం నిరుపేద ప్రాంతంగా మారింది. ఇంకా మన గురుకుల విద్యావిధానాన్ని 1840 లో నాశనం చేసింది. మన సంస్కృత భాషను, ఇతర భాషలను నిర్లక్ష్యం చేసింది. 2015లో కొలంబియా విశ్వవిద్యాలయ ఆచార్యులు షెల్డన్ పోలాక్ గారు, “సంస్కృతం చచ్చిపోయింది” అని పత్రాలు, పుస్తకాలు రాస్తే భారతదేశంలో సంస్కృత ఆచార్యులు నిస్సందేహంగా ఖండించవలసి వచ్చింది. ఇదీ పాశ్చాత్యులు మన సంస్కృతి మీద చేసిన, చేస్తున్న దాడులు. ఇంకా ఈ దేశాలను పొగడ్డం భావ దాస్యమే కాదు, దాస్య భావం కూడా.
జేంస్ మిల్ మూడు సంపుటుల లావాటి పుస్తకం ‘A History of British India’ రాసాడు. ఎప్పుడూ ఇక్కడికి రాకుండా, ఏ భాషా నేర్చుకోకుండా “హిందువులు అవినీతి పరులు. వారు ఎప్పుడూ నాగరికత లేనివారు. వారు ఆటవికులు. బ్రిటిష్ రాజ్యము హిందువులను నాగరీకులు చేస్తుంది”, అని విశదం చేసాడు ఆ పుస్తకంలో. మిల్ తాను భారతదేశానికి ఎప్పుడూపోలేదు అని, అది అతన్ని నిష్పక్షపాతిగా చేసింది అని అన్నాడు.
అతని కొడుకు జాన్ స్తూఅర్ట్ మిల్ తండ్రితో అంగీకరించాడు.
తర్వాత వచ్చింది మాక్స్ ముల్లర్. అతను ఆర్య ఆక్రమణ సిద్ధాంతం ప్రతిపాదించాడు. ఆర్యులు యురోపు నుంచి వచ్చి భారతదేశం ఆక్రమించి ఇక్కడి ద్రావిడులను అణగదొక్కారు అని చరిత్ర రాసాడు. ఉత్తర భారతీయులు ఆర్యులనీ, దక్షిణ భారతీయులు ద్రవిడులనీ చరిత్ర రాసాడు.
ఆగస్టు 25, 1866 నాడు మాక్స్ ముల్లర్ షెవాలియే బున్సెన్కు ఇలా రాసాడు: “ఇండియా ఒక మురిగిపోయిన చెట్టు. రోము, గ్రీసు కన్నా సులభంగా క్రిస్తియానిటీ ఒప్పుకోడానికి తయారుగా ఉన్నది.” మాక్స్ ముల్లరు ఒక క్రైస్తవ మత ప్రచారకుడు అనిపించడంలేదా? The Life and Letters of the Right Honourable Friedrich Max Müller, Vol. 2.
మాక్స్ ముల్లర్ తర్వాత మార్క్సు కూడా యూరోపీయ అగ్ర నాగరీకతను ఒప్పుకున్నాడు.
తర్వాత మిషనరీలు వచ్చి హిందువులను మార్చడానికి ఎన్ని వక్ర మార్గాలు అవలంబించాలో అన్నీ అవలంబించారు.
ముల్లాలు అంతకు ముందే ఉన్నారు.
ఈ విధంగా ఏడు ‘మ’కారాలు ఒక్క ‘హ’కారాన్ని కొల్లగొట్టాయి, హడల గొట్టాయి.
ఈ చారిత్రక నేపథ్యంలో ఆర్యులు ఒక జాతి కాదనీ, ద్రవిడులు కూడా ఒక జాతి కాదనీ మన పుస్తకాల ఆధారంగా నిరూపిస్తా. అటువంటప్పుడు ఆర్య భాషలు కాని, ద్రవిడ భాషలు కాని లేవు అని స్పష్టం ఔతుంది.
ఆర్య ద్రావిడ ప్రశ్న:
1. ఆర్యులు ఒక జాతియా?
1.1 సీత రామునితో అయోధ్యా కాండం 27 సర్గ, 4 శ్లోకం
ఆర్య పుత్ర! పితామాతాభ్రాతా పుత్రస్తధాస్నుషా! స్వాని పుణ్యా
విభుంజానా: స్వంస్వంభాగ్యముపాసతే|
తార వాలితో:
కిష్కింధా కాండం 19 సర్గ 27 శ్లోకం
సుప్త్వేవ పునరుత్థాయ ఆర్య పుత్రేతి క్రోషతీ|రురోద సాపతిం దృష్ట్వా
సందితం మృత్యుదామభిః||
రావణుని శవం చూచి అతని భార్యలు:
యుద్ధకాండం 113 సర్గ శ్లోకం 4
ఆర్యపుత్రేతి హా నాధేతి చ సర్వశః| పరిపేతుః కబంధాకాం మహీం శోణితకర్దమాం||
రాముడు, వాలి, రావణుడు ముగ్గురూ ఆర్యపుత్రులని రామాయణం చెబుతున్నది.
(వాల్మీకి రామాయణం గోరఖ్ పూర్ ప్రెస్, గోరఖ్ పూర్, 2017)
ఇది ఎలా సాధ్యం? నరుడూ, వానరుడూ, రాక్షసుడూ – మూడు విభిన్న జాతులకు చెందిన వారు-
ఆర్యులు ఎట్లా అయ్యారు, ఆర్యులు కూడా ఒక జాతి అయితే? ఆర్యులు అనే పదంలో అర్థము ముగ్గురికీ అనువర్తించాలి.
ఆ అర్థం ఏమిటి? ఆర్యుడు అన్న పదానికి అర్థం ‘మంచివాడు’ అని. ఏ దేశపు పౌరుడయినా ఆర్యపుత్రుడే, ఆర్య పుత్రియే. ఆర్య అంటే విశ్వసౌజన్యం. ఎందుకంటే మంచిదనం ఎక్కడయినా వుంటుంది. అటువంటి మహత్తర పదాన్ని కేవలం యూరోపియన్లకే అంటబెట్టిన మాక్స్ ముల్లర్ ఒక రేసిస్టా అని అడగవలసి వస్తుంది.
అంతేకాదు. ఆర్యులు అన్నది ఒక జాతి కాదు అని కూడా తెలుస్తున్నది. అలంకార శాస్త్రమును బట్టి భార్య భర్తను ‘ఆర్య పుత్ర’ అని పిలిస్తే అర్థం ఏమిటి? “మీ తండ్రి ఆర్యుడు” అంటే ఏమిటి? మీ తండ్రి ఆర్యుడే, మరి మీరు ఆర్యులు అన్నది సందేహాసాస్పదం అన్న అర్థం వస్తుందా? లేదా? ఈ సందర్భంలో వాల్మీకి గారు ‘ఆర్యపుత్ర’ అని భార్యల చేత అనిపించడం శ్లేషాలంకారం. అలంకార శాస్త్రం నేర్చుకోకుండా మన కావ్యాలపై వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి. వేదాంగాలపై పట్టులేకుండా వేదాలను నిర్వచించేవారు బుద్ధిహీనులు.
1.2 మహాభరతము Vol. 12, TTD, శాంతి పర్వం, ద్వితీయాశ్వాసము,
భీష్ముడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు:
“తనకడకు వచ్చి మొగమోడని వాడగు దూత వల్కుటకు గోపింపం
జనదు జననాథునకు;దూతుని జంపిన నరక మగుట ధ్రువమనిరార్యుల్.” పద్యం 378
“కులము, శీలంబు, హితవాక్యములును, నేర్పు, గార్యవాదిత్వ సద్వచోవైభవంబు,
దలపు గలుగుట,దక్షత,యలఘు గూములండ్రు దూతకు నియ్యేడు నార్యజనులు.” పద్యం 379
ఈ రెండు పద్యాలలోనూ ఆర్యుల్, ఆర్యజనులు అను పదాలకు పెద్దలు అని అనువదించారు పండితులు. దీనివల్ల ఆర్యులు ఒక జాతి కాదని తెలిసిపోతున్నది కదా!
2. ద్రవిడులు ఒక జాతియా?
2.1 రాజతరంగిణి, కళ్హణుడు: 12 వ శతాబ్దంలో రాయబడ్డ రాజతరంగిణిలో భారతదేశపు బ్రాహ్మలు పంచ ద్రావిడులూ, పంచగౌడులూ అని విభజించబడ్డారు. పంచ ద్రావిడులలో గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్ర, తమిళ, కన్నడ భాషలు మాట్లాడేవారు అని వివరించబడ్డది. ఇంగ్లీషు ప్రభుత్వం గుజరాతు, మహారాష్ట్రులను ఆర్యులుగా, మిగిలిన వారిని ద్రవిడులుగా దుష్ప్రచారం చేసింది.
ఈ దుష్ప్రచారానికి పండితులు ఒగ్గిపోయారు. ప్రభుత్వం వైపు మాట్లాడితే లాభాలు ఉంటవి కదా!
2.2 ఆదిశంకరుడు ‘ద్రవిడ శిశువు’ గా వర్ణించుకున్నాడు
పాల కడలి సారస్వతము నీ చనుబాలు
నీ ఎద నుండి పొంగి పొరలి వచ్చునని తలచెద
ఓ పర్వత రాజ తనయా! అది త్రావికదా ఈ ద్రవిడ
శిశువు కమనీయ కవిత చెప్ప గలిగె! (సౌందర్య లహరి శ్లోకం75)
2.3 తెలంగాణాలో వేములవాడ అనే గ్రామంలో ఉన్న బ్రాహ్మలందరూ తాము ద్రవిడులమని చెప్పుకుంటున్నారు శతాబ్దాలుగా.
2.4 రామస్వామి నాయికరు సిద్ధాంతం ప్రకారం బ్రాహ్మలు కేవలం ఆర్యులే కాని ద్రవిడులు కారని. మరి పైన చెప్పిన దృష్టాంతాలు బ్రాహ్మలు ద్రావిడులని తేలుతున్నది. రామస్వామి నాయికరు ఒక సాహితీపరుడు కాదు. ఒక ఆంత్రొపాలజిస్టు కాడు. ఒక ఆర్కియాలజిస్టు కాడు. ఒక చరిత్రకారుడు కాడు. అతని అభిప్రాయాలు ఏ నిజాల మీదా ఆధారపడి లేవు. వాటికి అంత ప్రాముఖ్యత ఎలా వచ్చింది? ఇది ద్వేషం వలననే కాని శాస్త్రప్రకారము కాదు. కానేకాదు.
2.5 దేశాన్ని ఆర్య, ద్రవిడ భాగాలుగా విభజించి, లేని కలతలు పుట్టించి బ్రిటిషు ప్రభుత్వం “Divide and rule” అనే సూత్రాన్ని అమలుపరిచింది. భారతీయులు ఇది గ్రహించడం ఎంతయినా మంచిది.
ఇంగ్లీషు దుష్ప్రచారం
తెలుగు సంస్కృతి – భాషా సారస్వతములు
ప్రధాన సంపాదకులు: శారదా పూర్ణ శొంఠి సంపాదకులు: సూర్య నారాయణ కోరాడ
పేజీ vi – పరిశోధన తెలుగు భాషని విశిష్టమయిన మలుపు తిప్పింది. దక్షిణ దేశ భాషలు తమిళం, కన్నడం, మళయాలం, తులు, తెలుగులు ద్రవిడభాషలని పిలిచింది ఈయనే (రాబర్ట్ కాల్డ్వెల్-ఒక క్రైస్తవ మిషనరీ) కాల్డ్వెల్ బైబిల్ని తెలుగులోకి బ్రాహ్మలచేత అనువదింపచేసాడు. వారిని క్రైస్తవులుగా మార్చాడు. ఇంగ్లీషు తల కన్నా తెలుగు తల చిన్నది కనుక వారు అంత తెలివికల వాళ్ళు కాదని ప్రకటించాడు.
“Caldwell’s mission lasted more than fifty years. The publication of his propaganda into both the languages and the history of the region, coupled with his position in both Indian and English society, gave stimulus to the revival of the Non-Brahmin movement.”
(Wikipedia – Robert Caldwell)
ఉపసంహారం
అర్హత ఉన్నవాడిది అదికారం. హిందువుల చరిత్ర రాసింది అనర్హులు కొన్ని మినహాయింపులతో. ఈ అనర్హులలో అగ్రగణ్యుడు కాల్డ్వెల్. కాల్ద్వెల్ మానవ శాస్త్రవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, భాషా శాస్త్రవేత్త కాడు. కేవలం మిషనరీ- హిందూ ద్వేషి. ఇంగ్లీషు ప్రభుత్వం క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయించింది. హిందూ మతాన్ని ఎంత నిరసిస్తే అంత మంచిది. హిందువులలో చీలికలు పుట్టించి బలహీనులను చేసి తమ రాజ్యాంగాన్ని నడిపారు.
ఈ అనర్హులలో మెకాలే, జేంస్ మిల్, జాన్ మిల్, మాక్స్ ముల్లర్, మార్క్స్, మిషనరీలు, ముల్లాలు అనే ఏడు మక్కార్లూ, రోమిలా థాపరు, ఇర్ఫాన్ హబీబ్ లాంటి చరిత్రకారులు కూడా అగ్రతాంబూలం తీసుకుంటారు. ప్రస్తుతం దేశంలో మన పుస్తకాలను వక్రీకరించే రచయితలూ, రచయిత్రులూ కూడా ఈ కోవకే చెందిన వారు.
దక్షిణ భారతం ద్రవిడ దేశమని ఇంగ్లీషు ప్రభుత్వం నిర్దేశించింది. మిషనరీలు అమలుపరచారు.
1947 తర్వాత జేఎన్యూ లో రోమిలా థాపరును నెహ్రూ గారు ప్రొఫెసరుగా నియమించడంతో ఈ ఆర్య-ద్రావిడ విభజన సిద్ధాంతం వేళ్ళు పాతుకుని కొరకరాని కొయ్యగా వృద్ధి చెందింది. ఇర్ఫాన్ హబీబ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరు అయినాడు. వీరిద్దరూ హిందూ మతాన్ని గూర్చి మార్క్సిస్ట్ అభిప్రాయాలతో ఏకీభవించి భారతదేశ చరిత్రను తప్పుల తడకగా రాసారు.
కాంగ్రెసు హయాంలో భారతదేశ విద్యా మంత్రులందరూ ముస్లింలు. వారి రాజుల ప్రాముఖ్యత ఎక్కువ చేసి మన చరిత్రను చులకన చేసారు. ఉదాహరణకు మొగలు రాజులకు ఒక్కొక్కడికి ఒక అధ్యాయం ఇచ్చి శ్రీ కృష్ణదేవరాయలు లాంటి వారిని మరుగు పరిచారు ఒకటీ రెండు లైన్లలో చెప్పి. దీనికి మన పండితులు సహకారం ఇవ్వడం విశ్వాసఘాతుకము.