ఆథర్స్ అండ్ స్టోరీస్ కథల సంకలనం 2018 – పుస్తక పరిచయం

0
9

[dropcap]ఆ[/dropcap]థర్స్‌ అండ్‌ స్టోరీస్‌ అనే పేరుతో కొందరు రచయితలు వాట్సప్‌లో ఒక గ్రూప్‌గా ఏర్పడి ప్రచురించిన పుస్తకం ఈ కథల సంకలనం. ఇందులో 27 కథలున్నాయి.

***

“తెలుగు సాహిత్యంలో కథకు ఉన్న స్థానం విశిష్టమైనది. కథ పాఠకుడి  మనసును వశపరుచుకొని అతణ్ణి రమ్యమైన లోకంలోకి తీసుకెళ్ళి ఆహ్లాదపరచగలదు. ఇలాంటి కథలు రాసే రచయితలలో కొందరం 2017 మార్చి 29న  ‘ఆథర్స్‌ అండ్‌ స్టోరీస్‌’ అనే పేరుతో అనే ఒక వాట్సాప్‌ సమూహంగా ఏర్పడ్డాం. ఈ సమూహంలోని సభ్యుల ముఖ్య ఉద్దేశం కథలను గురించి చర్చించడం, మరింత మెరుగైన ఉత్తమ కథలను చేసే క్రమంలో ఇంకా ఉన్నత స్థితికి  చేరడం. కథలు రాయడంలో రచయిత, రచయిత్రులకు ఎంతో స్ఫూర్తివంతంగా ఈ ‘ఆథర్స్‌ అండ్‌ స్టోరీస్‌’ గ్రూప్ కార్యక్రమాలు ఉంటున్నాయి. 2018లో ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా సమూహ సభ్యుల కథలలో కొన్ని ఆణిముత్యాల లాంటి కథలను ఎంపిక చేసి వాటిని ఒక పుస్తక రూపంలో తేవాలని శ్రీమాతి తటవర్తి నాగేశ్వరి గారు ఇచ్చిన సలహా ప్రకారం శ్రీ యం. ఆర్. వి. సత్యనారాయణమూర్తిగారు ఎంతో చక్కటి పుస్తకాన్ని సకాలంలో సర్వాంగ సుందరంగా ముద్రించి ఆవిష్కరణకు సమాయత్తపరిచారు. ఈ పుస్తకంలోని కథలు వేటికవే అద్భుతమైన ఆనందాన్ని అనుభూతిని కలిగిస్తాయి. ఆలోజింపజేస్తాయి” అని తన ఆప్తవాక్యంలో పేర్కొన్నారు గొర్లి శ్రీనివాసరావు.

***

తెలుగునాట కథకు పట్టాభిషేకం జరుగుతున్న తరుణంలో ‘ఆథర్స్‌ అండ్‌ స్టోరీస్‌’ వాట్సప్ బృందం వారు ఒక కథా సంకలనం వెలువరించడం ఆనందదాయకం.సమాజం మొత్తాన్ని మన కళ్ళముందు సాక్షాత్కరింపజేశారు రచయిత(త్రు)లు. కథా పఠనం పూర్తయ్యాక చాలాకాలం ఇందులోని కథలు, పాత్రలు మిమ్మల్ని పలకరిస్తూనే ఉంటాయి” అన్నారు కాత్యాయని తమ ముందుమాట ‘గుండె తలుపు తట్టే కథలు…’లో.

***

AUTHORS & STORIES కథల సంకలనం 2018

సంపాదకులు: ఎం.ఆర్‌.వి.సత్యనారాయణమూర్తి

పేజీలు: 232, ధర: ₹150/-

ప్రతులకు: ఎం.రాజేశ్వరి, కార్యదర్శి, రమ్యసాహితి సమితి, జె.వి.ఎల్‌.రావు నగర్‌, పెనుగొండ. ప.గో.జిల్లా, 534320, మొబైల్‌ 9848663735 మరియు ప్రముఖ పుస్తక దుకాణాలు

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here