యువభారతి వారి ‘అయ్యలరాజు కవితా వైభవం’ – పరిచయం

0
11

[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారాఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే విజయదశమి వరకూ సాగుతుంది.]

అయ్యలరాజు కవితా వైభవం

[dropcap]రా[/dropcap]మాయణం ఆదికావ్యం. ఇతిహాసం ఏకనాయకమే అయినా, ఎన్నో కథలకు ఆటపట్టు. ప్రబంధ యుగంలో ప్రసిద్ధి చెందిన అయ్యలరాజు రామభద్రుడు రామాయణాన్ని ప్రబంధంగా రూపొందించి ఒక కొత్త ప్రయోగమే చేసినాడు. ధారాశుద్ధికి, పదసౌష్టవానికి, నన్నయ లాగా నిగ్రహం ఉన్న శృంగార రస పోషణకు, చెవులకు, మనసుకు ఇంపైన శబ్దాలంకారాలకు లక్ష్యప్రాయమైన ప్రబంధంగా రామకథను రామాభ్యుదయ ప్రబంధంగా రూపొందించినాడు.

శ్రీకృష్ణదేవరాయల ప్రేరణచే ‘సకల కథా సార సంగ్రహము’ అన్న కావ్యాన్ని రచించితినని చెప్పుకొన్న రామభద్రుడు, యితడు ఇద్దరూ ఒక్కరే అని భావించి, చాలామంది పండితులు అయ్యలరాజు రామభద్రుడు కృష్ణదేవరాయల కొలువులో ఉన్నట్లు భ్రాంతి పడినారు. కాని ఈ ఇద్దరు రామభద్రులును వేర్వేరు వ్యక్తులు.

నిజానికి, శ్రీకృష్ణదేవరాయల అనంతర కాలంలో అళియ రామరాయని మేనల్లుడు గొబ్బూరి నరసరాజు ఆస్థానమున అయ్యలరాజు రామభద్రుడు కవిగా వెలుగొందినాడు. నరసరాజునకు క్రీ.శ. 1550 ప్రాంతమున రామభద్రుడు తన రామాభ్యుదయ ప్రబంధమును అంకితము ఇచ్చాడు. ఈ విషయాన్ని అయ్యలరాజు కవితారీతులపై పరిశోధన చేసి 1974 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి Ph.D పొందిన డా. కొత్తపల్లి విశ్వేశ్వర శాస్త్రి గారు నిరూపించారు.

ఈ పుస్తకంలో, రామభద్ర కవి రామాభ్యుదయం లోని కొన్ని మంచి పద్యాలను ఏరి, వాటిలోని సొగసులను పరిచయం చేశారు శ్రీ విశ్వేశ్వర శాస్త్రి గారు. ఈ పుస్తకాన్ని చదవదలచిన వారు క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఉచితంగానే చదువుకోవచ్చు.

https://archive.org/details/YuvaBharathi/%E0%B0%85%E0%B0%AF%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B2%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B1%81%20%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE%20%E0%B0%B5%E0%B1%88%E0%B0%AD%E0%B0%B5%E0%B0%82/page/n5/mode/2up

లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here