బాలల హక్కుల అవగాహన

1
12

[డా. కందేపి రాణీప్రసాద్ రచించిన ‘బాలల హక్కుల అవగాహన’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]బా[/dropcap]లలకు సైతం పెద్దవారికి మాదిరిగా హక్కులున్నాయని తెలుసా? హక్కులు, బాధ్యతలు అనేవి చిన్నా, పెద్దా అని వయసుతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి రాజ్యాంగం కొన్నిటిని కల్పించింది. వాటిని అతిక్రమించే హక్కు ఎవరికీ లేదు. బాలల రక్షణకు సంబంధించి కొన్ని చట్టాలు కుండా ఉన్నాయి. వారి హక్కుల్ని పరిరక్షించడానికి చట్టాలను ఏర్పాటు చేశారు. చట్టాలను అతిక్రమించిన వారికి శిక్షలు తప్పవు. కానీ సాధారణ సమాజంలో బాలల చట్టల గురించి ఎవరికీ అవగాహన లేదు. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఈ హక్కులు, చట్టాల గురించి అవగాహన కలగజేస్తే బాగుంటుంది.

మనం తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులకే అత్యంత ఉన్నత స్థానాన్ని ఇచ్చాము. ఈనాడు ఏ ఉపాధ్యాయుడికీ పిల్లల సమస్యల గురించి పట్టదు. కనీసం పసివాడు ఎంత చదవగలడు? ఎంత రాయగలడు? అన్న వివేచన కూడా ఉండదు. పిల్లవాడు అల్లరి చేయుకుoడా చూడటమే వారి పని. అుదుకే పిల్లలు కదలకుండా, మాట్లాడకుండా కాపలా కాస్తుంటారు. శృతిమించిన క్రమశిక్షణ పిల్లల్లోని సృజనాత్మకతను, సహజ సిద్ధతనూ కోల్పోయేలా చేస్తుంది. ఉత్సాహం, చలనం లోపించిన బాలలు ప్రాణంలేని బొమ్మలతో సమానం. పిల్లల్లోని సహజత్వానికి భంగం కలగకుండా పాఠాలు బోధించాలి. సున్నితత్వాన్ని అమాయకత్వాన్ని కోల్పోయిన పిల్లల్ని బాలలు అనలేము. ఏ వయసు పిల్లలకు ఎంత హోంవర్కు అవసరమో అంతే ఇవ్వాలి. వారి ఆటపాటల సమయాన్ని హరించేసే హోంవర్కులు పిల్లల ప్రగతికి గొడ్డలి వేట్లు.

తల్లిదండ్రులు సైతం పిల్లల పెంపకాన్ని భారంగానే చూస్తున్నారు. తమ్మ చదువులు, ఉద్యోగాలు, కెరీర్ పైనే శ్రద్ధ పెడుతూ పిల్లల్ని అనవసర భారంగా భావిస్తున్నారు. లక్షల ఫీజులైనా కట్టేసి పెద్ద పెద్ద సూళ్ళలో చేర్పించేసి చేతులు దులుపు కుంటున్నారు. హాస్టళ్ళలో వారి అవస్థలు చెప్పనలవి గాదు. కొంతమంది గడుసు పిల్లలకు సమస్యలేం రాకపోవచ్చు. కొంత మంది సున్నిత మనస్కులుగా ఉంటారు. అటువంటి పిల్లలు తమ సమస్యలను అందరికీ చెప్పుకోలేరు ఇటువంటి పిల్లలు కొన్నిసార్లు తల్లిదండ్రుల వద్ద కూడా నోరు విప్పి చెప్పరు. పెద్ద క్లాసు పిల్లలు, రౌడీ పిల్లలు తమ హోంవర్కుల్నీ, మిగతా పనుల్నీ నెమ్మదస్తుల చేత చేయిస్తుంటారు. ఇవి టీచర్ల దాకా వెళ్ళవు. ఒక వేళ వెళ్ళినా గడుసు పిల్లల్నే తెలివిగల పిల్లలుగా టీచర్లు మెచ్చుకుంటుంటారు. నిదానస్థులకు, నిజాయితీ పరులకు ఎక్కువ పేరు ప్రతిష్ఠలు రావు.

ప్రపంచ వ్యాప్తంగా బాలల హక్కుల దినోత్సవం జరుపుకుంటారని తెలుసా? బాలల హక్కుల గురించి ప్రజల్లో చైతన్యం, అవగాహన కల్పించటం కోసం ఈ దినోత్సవాన్ని ప్రతి ఏటా నవంబరు 20వ తేదీన జరుపుకుంటారు. ఐక్యరాజ్యసమితి 1954వ సంవత్సరంలో డిశంబరు 14వ తేదిన ఒక తీర్మానం చేసింది. ప్రతి సంవత్సరం ప్రపంచ బాలల దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించింది. 1959వ సంవత్సరం నవంబరు 20వ తేదీని ప్రపంచ బాలల హక్కుల దినోత్సవంగా నిర్వహించడానికి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. బాలల సంక్షేమం, బాలల హక్కులు కాపాడబడటం కోసం విద్యా సంస్థల అధ్వర్యంలో వేడుకగా నిర్వహిస్తారు. ఇంకా స్వచ్ఛంద సంస్థల నుంచి అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాలు నిర్వహిస్తారు.

బాలల సంరక్షణ దేశానికి చాలా ముఖ్యం. బాలల హక్కులను పరిరక్షించడం అందరి బాధ్యత. సమాజంలో ప్రతి ఒక్కరు ఈ హక్కుల పరిరక్షణ కోసం పాటుపడాలి. విద్య అనేది ప్రతి భారతీయ పౌరుడి యొక్క ప్రాథమిక హక్కు. విద్య ప్రతి ఒక్కరికీ మౌలికస్థాయిలో ఉచితంగా లభించాలి. నిర్భంధంగా నైనా బాలలందరికీ విద్యా హక్కు అమలు కావాలి. అప్పుడే నవ భారతంలో కాబోయే నూతన పౌరులు దేశాన్ని రక్షించుకోగలగుతారు.

బాలలు అత్యధికంగా హింసకు గురి అవుతున్నారని అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి. స్త్రీ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో బాలల గురించి సర్వేలు చేయబడ్డాలు. ఐదు నుంచి పన్నెండు సంవత్సరాల బాలలు ఎక్కువగా హింసతో పాటు అత్యాచారాలు కూడా జరుగుతున్నట్లుగా సర్వేలు చెబుతున్నాయి. భౌతిక, లైంగిక, మానసిక దాడులకు పిల్లలు బలవుతున్నారు. బాల కార్మికుల సమస్య కొంతవరకూ తగ్గినప్పటికీ పూర్తిగా మాసిపోలేదు. బాల కార్మికులు ఇంతకు పూర్వం ఇటుక బట్టీలలో, కొండల తవ్వకాలలో, గ్రానైట్ క్వారీలలో పనిచేసేవారు. ప్రమాద పరిస్థితుల్లో పనిజేసే బాలల్ని బాలకార్మికులు అనేవారు. ఇప్పుడు బాలకార్మిక వ్యవస్థ రూపం మార్చుకుని స్కూళ్ళలో చేరింది. బస్తాల బస్తాల పుస్తకాలు మోయటం, రాత్రనక పగలనక రాసినవే రాయటం, స్లిప్ టెస్ట్‌లు, వీక్లీ టెస్ట్‌లు, మంత్లీ టెస్ట్‌లు అoటూ రకరకాల టెస్ట్ లతో పిల్లలను మనశ్శాంతికి దూరం చేయడం వంటివన్నీ నేటి స్కూళ్ళలో నిత్యకృత్యమై పోయాయి. పెద్ద పేరున్న స్కూళ్ళ ఒత్తిడి తట్టుకోలేక ఎంతో మంది బాలలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనికి తల్లిదండ్రుల నిర్లక్ష్య ధోరణి, పట్టించుకోకపోవడం కూడా కారణమవుతున్నాయి.

బాలల సంక్షేమం కొరకు పార్లమెంటు కొన్ని చట్టాలు చేసింది. జువైనల్ జస్టిస్ చట్టం, బాల కార్మికుల నిషేధ చట్టం, న్యానసేవల చట్టం, నిర్భంద ప్రాధమిక విద్య హక్కు, బాలల అక్రమ రవాణా నిషేధ చట్టం, శిశు నిర్ధారణ పరిక్షల నిషేధ చట్టం, శిశు పౌష్టికాహార ఉత్పత్తి, సప్లై చట్టం వంటి ఎన్నో చట్టాలను చేసింది. ఆర్టికల్ 15 ద్వారా పిల్లల సంక్షేమానికి ప్రత్యేకమైన నిభందనలు రూపొందించవచ్చు సమానత్వ హక్కు ఆర్టికల్ 14 ద్వారా, వివక్షకు వ్యతిరేకంగా హక్కు ఆర్టికల్ 15 ద్వారా వ్యక్తిగత స్వేచ్ఛ మరియు న్యాయ ప్రక్రియ యొక్క హక్కు ఆర్టికల్ 21 ద్వరా అక్రమ రవాణా నుంచి రక్షించబడే హక్కు ఆర్టికల్ 23 ద్వారా బాలలకు హక్కులు ఏర్పరచబడ్డాయి. ఈ విధంగా పిల్లలకు కూడా పెద్ద వారితో సమానంగా పన్నెండు బాలల హక్కులు ఇవ్వబడ్డాయి. పిల్లల హక్కుల పరిరక్షణకు తల్లిదండ్రులు లేదా సంరక్షకాలు బాధ్యత వహించాలి. నేడు ప్రపంచ వ్యాప్తంగా బాలల హక్కుల పట్ల పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. కాని ఆచరణలో సాధ్యం కావటం లేదు. బాలల హక్కుల గురించి భారత రాజ్యాంగంలో ఎన్నో అంశాలు పొందుపరచబడినవి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here