బాల్యం – బంగారం

0
10

[డా. కందేపి రాణీప్రసాద్ రచించిన ‘బాల్యం – బంగారం’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]బా[/dropcap]లల ఆరోగ్యమే మన సౌభాగ్యం. వారు ఆరోగ్యంగా ఉంటేనే బాగా చదివి విద్యలో రాణించ గలుగుతారు. పిల్లలు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని తల్లిదండ్రులూ, ఉపద్యాయులూ కోరుకుంటారు. అది సహజమే. దాని వాళ్ళ మంచి ఉద్యోగాలోస్తాయి మంచి భవిష్యత్తు ఉంటుంది అనే ఆశ. ఆశ ఆశలానే ఉండాలి. దురాశ కాకూడదు పిల్లలు బాగా చదవాలని చెప్పి ఇంట్లో తల్లిదండ్రులు వారికీ ఒక్క పని కూడా చెప్పకుండా బాగా ఆహారాన్ని అందించడం ద్వారా ప్రస్తుతం పిల్లల్లో స్థూలకాయం సమస్య ఎదురౌతున్నది. పూర్వ కాలంలా ఇప్పటి కుటుంబాల్లో ఎక్కువ సంతానం లేకుండా ఒకరిద్దరు మాత్రమే ఉండటం వలన తల్లిదండ్రులు తమ సమయాన్ని ధనాన్ని ఉన్న ఆ ఒకరిద్దరు పిల్లలపై వెచ్చించటం వాళ్ళ లాభాలతో పాటు నష్టాలూ సంభవిస్తున్నాయి. ఈ విషయాన్ని గమనించి పిల్లలతో తమ కనీస అవసరాను వారే తీర్చుకునే విధంగా శిక్షణ ఇస్తే బాగుంటుంది.

అలాగే పాఠశాలలో ఎక్కువ ర్యాంకులు తమ స్కూలుకు వస్తేనే ప్రస్తుత ప్రపంచంలో గుర్తింపు ఉంటున్నందువాళ్ళ పిల్లలను ఎక్కువ సేపు చదివించడానికే ఇష్టపడుతున్నారు. ఫలితంగా ఆటల పీరియడ్లు మాయమైపోయి స్టడీ అవర్స్‌గా రూపాంతరం చెందుతున్నాయి. దీని వలన పాఠశాలల్లోనూ బాలలకు ఆడుకునే సమయం దొరకక శారీరక వ్యాయాయం కరువై పోతున్నది. చదివి చదివి బాలలకు మానసిక వత్తిడి ఎక్కువవుతున్నదే తప్ప సరైన ఆరోగ్యమే కరువవుతున్నది. శారీరకంగా బలం తక్కువగా అయిపోతున్నారు. ఈ కారణాల వాళ్ళే మనం పత్రికలలో చూస్తున్న విధంగా పోలీసు డిపార్టుమెంటు ఉద్యోగ పరీక్షల పరుగు పందేలలో చాలా మరణాలు సంభవించటం ఇలాంటి శారీరక అనారోగ్యం వల్లే. అంటే ప్రతిరోజూ క్రమబద్ధమైన వ్యాయాయం  లేకపోవటం, ఒకేసారి విపరీత వ్యాయాయం కారణంగా ఇలాంటి చిన్న వయసు మరణాలు మనం చూస్తున్నాం. ఇటీవల జిమ్‌లో ఎక్సర్ సైజు చేస్తూ మరణించిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కథనం చూశాం. క్రమబద్ధత లేని ఆహార, పని వేళల వలననే ఇలాంటి విపరీతాలకు కారణం.

క్రమశిక్షణ పేరుతో తల్లిదండ్రుల కఠిన వైఖరి వలన పిల్లల్లో స్థూలకాయం వస్తున్నట్లు తాజా పరిశీలన వాళ్ళ వెల్లడౌతున్నది. ఇలా ఉండాలి అలా చేయాలి అంటూ పసి వారిని పసివారిగా కాక పెద్దవారిలా ప్రవర్తింపజేస్తూ వారిలో రావాల్సిన మానసిక వికాసం సక్రమంగా జరగకుండా అడ్డుకట్ట వేస్తున్నారు. పిల్లలకు లక్షల రూపాయలు కత్తి బోర్డింగ్ స్కూళ్ళలో వేయడం గొప్పకాదు. తల్లిదండ్రులు ప్రేమగా దగ్గర కూర్చొని మంచి చెడు వారికీ వివరిస్తూ అందుబాటులో ఉన్న చిన్న స్కూలు లోనైనా చదివినప్పటికీ సరియైన వికాసం పొందగలుగుతారు. ఇలా కఠిన వైఖరి పిల్లల్లో నిరాశావాదాన్ని నింపుతుందని ఎన్నో పరిశోధనలు తెల్పుతున్నారు.

జీవితంలో కష్టం, సుఖం, మంచి, చెడు, గెలుపు, ఓటమి అనేవి ఉంటాయి. ప్రతిసారి మనమే విజయ పథంలో ఉండాలను కోవడం పొరపాటు. గెలుపు లభించినపుడు ఎంత సంతోషించామో ఓడిపోయినపుడు అదే విధంగా ఉండాలి. లేకపోతే జీవితం నిస్సారమవుతుంది. దీనికి హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య ఒక ఉదాహరణ. కుటుంబ సభ్యులు, స్నేహితులు పిల్లల్ని సౌమ్యంగా పలకరిస్తూ మీ వెంట మేమున్నాం అంటూ భరోసా ఇచ్చే విధంగా ఉండాలి. కానీ వారిని సూటిపోటి మాటలతో మనసు గాయపరిచేలా ఉండకూడదు. ప్రస్తుతం సమాజంలో ప్రతిదీ వ్యాపారాత్మకమై కూర్చుంది. ఎదుటి వ్యక్తిని పలకరించాలన్నా నాకేం లాభమోస్తుంది అనే ఆలోచిస్తున్నారు గానీ దానివల్ల మనసులో ఎంత సంతోషం కలుగుతుంది అని అలోచించ లేకపోతున్నారు. సంతోషాన్ని ఆనందాన్ని, సుఖాన్ని అనుభూతిని ప్రేమని అన్నింటిని డబ్బుతో కొలవలేము. అందుకే మనుష్యుల మధ్య ప్రేమ భావన కొరవడుతోంది.

పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సుహృద్భావ వాతావరణం ఉంటే భావి సమాజం ఆనందమయమవుతుంది. జాతికి పిల్లలు పెట్టుబడి లేకుండా పెరిగే జాతీయ సంపద. పిల్లల ఆరోగ్య ఆనందాలే మన లక్షల కోట్ల సంపదలు.

ఇరుగు పొరుగు వారి ఉన్నతిని సహించలేకపోవడం, సహా విద్యార్థులకు ఎక్కువ మార్కులు సాధిస్తే వారిపై కసి పెంచుకోవడం దాంతో వారి మనసంతా విద్వేషంతో నిండి విషపూరిత ఆలోచనలు వస్తాయి. కేవలం ఎక్కువ మార్కులు సాధించినతా మాత్రాన వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటం వాళ్ళ ప్రతివారూ ఆ స్థానాన్ని సంపాదించటానికి సరియైన మార్గంలో వెళ్ళలేనపుడు మన సామార్థ్యం ఇంతే అని ఊరుకోవడం లేదు. ఎలాంటి అక్రమ మార్గాన్నైనా సరే అనుసరించి ఆ స్థానాన్ని పొందాలనే దుగ్ధ మొదలౌతున్నది. ఎందువలన ఇదంతా. పిల్లలు పసితనంలో ఉండగానే ‘అదిగో ఆ ఎదురింటాబ్బాయికి అంత ర్యాంకొచ్చింది, ఈ పక్కింటాబ్బాయికి ఆ పెద్ద స్కూల్లో సీటొచ్చింది’ అంటూ తల్లిదండ్రులు ఎద్దేవా చేయడం, సమాజం కూడా వారికే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం మూలంగా ఇవన్నీ జరుగుతున్నాయి. స్కూళ్ళలో కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళనే మనుష్యులుగా, తక్కువ మార్కులు వచ్చిన వారిని హీనంగా చూస్తారు. తక్కువ మార్కులు వచ్చిన వారు స్కూలులో ఏదైనా డౌట్ అడిగినా ‘అబ్బో వీడి చదువుకు డౌటోకటి’ అంటూ టేచర్లు అపహాస్యం చేసి వారిలో ఆత్మన్యూనతను నింపుతారు. ఆ తర్వాత వాళ్ళు మంచి మార్కులు సాధించినా ఆత్మన్యూనతా భావం మాత్రం వారిని విడిపోదు.

బాల్యంలో పడే ప్రభావం జీవితాంతం వారిపై చెరగని ముద్ర వేస్తుంది. పది పనులలో ఒక్క దాంట్లో వైఫల్యం చెందినా అది తమ పొరపాటు అని బాధపడి అతిగా ఆలోచించి మనసు చెడగోట్టుకుoటున్నారు. మనం కోరుకున్న ప్రతిదీ వెన్వెంటనే మన చెంతకు చేరాలనే రూలేమీ లేదు. పిల్లవాడిలోని మంచితనాన్నీ, మానవత్వాన్నీ గుర్తించాలి. దానికి ఎక్కువ విలువివ్వాలి. అప్పుడే భవిష్య జాతి విద్వేష పూరితమైన పోటీతత్వానికి దూరంగా ఉంటుంది. అలాంటి సామాజం వల్లనే ప్రపంచం సంతోషంగా ఉండగలుగుతుంది.

పక్క పిల్లవాడి కన్నా ఎక్కువ మార్కులు రావాలి, ఎక్కువ మార్కులు రావాలి అని ఎక్కువ సార్లు పిల్లలకు నూరిపోయడం వల్ల ఒకవేళ పరీక్షలో తనకు తనకు తక్కువ మార్కులు వచ్చి పక్క పిల్లవాడికి ఎక్కువ మార్కులు వచ్చినట్లయితే, ఆ సమయంలో ఆ పిలాడిపై ద్వేషం అసూయ మొదలవుతుంది. ఆ కారణంగా మొదలయే అసూయా ద్వేషాలు పెరిగి పెద్దై నేరపూరిత చర్యలకు పాల్పడే అవకాశముంది. పిల్లల మధ్య అసూయా పూరిత పోటీతత్వం వద్దు. పిల్లల మధ్య ప్రేమానురాగాలు మొలకెత్తాలి. తప్ప అసూయా ద్వేషాలు కాదు. స్కూళ్ళలోని టీచర్ల ప్రవర్తన ఇలాంటి వాటికి కారణమౌతుంది. మార్కులు అసలు సక్రమంగా లబిస్తున్నాయా టీచర్ల పక్షపాత ధోరణి వలన సరిగ్గా రాసిన వారికి కూడా మంచి మార్కులు ఇవ్వకుండా తమను కాకా పడుతూ తమకు పనులు చేసిపెట్టే విద్యార్థులకు ఎక్కువ మార్కులు ఇచ్చే వారున్నారు.ఇలాంటి ధోరణుల వలన పిల్లలకు పెద్ద వాళ్ళపై నమ్మకం పోతుంది. అన్యాయానికే ఎక్కువ విలువ లభిస్తుందని తెలిసినప్పుడు పిల్లలు ఆ దారిన నడవటానికే ప్రయత్నం చేస్తారు. అలా చేయలేనివాడు కొన్ని సంవత్సరాలకు డార్విన్ పరిణామ సిద్ధాంతం ప్రకారం తెలివిగా నేరాన్ని తప్పించుకునేవాడు తెలివిమంతుడిగా పేరు పొందుతూ, మంచి వాళ్ళు పరిస్థితులకు అనుగుణంగా మార్పు చెందలేక పోయిన పురాతన జీవులుగా గుర్తింపబడి బతకలేక కొన్నేళ్ళకి విలుప్తమౌతాయి. మంచితనం మచ్చుక కూడా కానరాకుండా పోతుంది. మంచివాళ్ళు శిధిల జీవులుగా మారిపోకుండా చూడాలి. మానవత్వం మంట గలిసి పోకుడదంటే బాల్యంలో నుంచే వారి మధ్య అనురాగం ఉదయింప జేయాలి. సమాజం అప్పుడే బాగుపడుతుంది. బాలల మధ్య శాంత వాతావరణాన్ని నెలకొల్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here