బల్లి

0
6

[box type=’note’ fontsize=’16’] ప్రకృతి కథలలో భాగంగా బల్లుల గురించి, వాటిలోని రకాల గురించి విజ్ఞానం కలబోసి బాలలకు కథగా అందిస్తున్నారు డి. చాముండేశ్వరి. [/box]

అమెరికా నుండి నానమ్మ ఇంటికి కొద్ది రోజుల సెలవుకు వచ్చిన వన్య, సామర్థ్‌లు నానమ్మ తాతలతో కబుర్లు చెప్తూ, ఇల్లు, పెరటి తోట చూసి ఆడుకుంటున్నారు.

దీపావళి పండగ దగ్గర్లో ఉండటంతో నానమ్మ, పనివాళ్ళతో ఇంటికి రంగులు వేయిస్తూ, గదులు సర్దుతున్నారు. అందువల్ల దగ్గర్లో ఉన్న అమ్మమ్మ ఇంటికి వెళ్లిన పిల్లలు, రంగుల పని ఎంతవరకూ అయిందో చూద్దామని నాన్నతో కలసి వచ్చారు.

ఘాటైన రంగుల వాసనకు ముక్కు మూసుకుని ఇంటి రంగులు బావున్నాయని సైగలతో చెప్పారు. ఇంతలో స్టోర్ రూమ్‌లో ఉన్న పెట్టెలు జరిపితే వాటి క్రిందనుండి బైటకి వచ్చిన బల్లుల్ని చూసిన వన్య కెవ్వున కేకలు వేసింది.

ఆ అరుపులకు భయపడిన సామర్థ్ కూడా కెవ్వుమన్నాడు. పిల్లల కేకలకు ఇంటిలోని అందరు పరిగెత్తుకు వచ్చారు – “ఏమయ్యింది?” అంటూ.

నాన్నను పట్టుకుని అతుక్కుపోయిన పిల్లలు అటు అంటూ వేలు చూపిన వైపుచూస్తే గోడమీద ఉన్న బల్లులు కనిపించి ‘హమ్మయ్య!’ అని ఊపిరి పీల్చుకున్నారు.

అమెరికాలో ఎన్నడూ బల్లుల్ని చూడని పిల్లలు ఒక్కసారి చూసి భయపడ్డారు. “మరేం భయం లేదు” అని నాన్న, నానమ్మ చెప్పిన చాలాసేపటి వరకు తేరుకోలేకపోయారు.

హాల్లోకి పిల్లల్ని తీసుకువచ్చి కూర్చోబెట్టి, మంచినీళ్లు తాగించిన నానమ్మ భయం వద్దని నచ్చచెప్పారు. నెమ్మదిగా సర్దుకున్నాక పిల్లలకు బల్లుల గురించిన కథ చెప్పటం మొదలుపెట్టారు నానమ్మ. మనమూ విందామా?

“పిల్లలూ. squarmate reptiles 6000 రకాలలో బల్లులు ఒకటి. ఒక్క మంచు అంటార్కిటికా ఖండం తప్ప మిగతా అన్ని ఖండాలలో… continents లో కనిపిస్తాయి. బల్లులలో అనేక సైజెస్‍వి ఉన్నాయి. సెంటీమీటర్ల chameleons, geckos నుండి 3 mts పొడవున్న komodo dragon వరకు ఉన్నాయి. చాలా బల్లులు quadrupedal. అంటే కాళ్ళతో సైడ్ టు సైడ్ కదలికతో వేగంగా పరుగెత్తగలవు. కొన్ని బల్లులకు కాళ్ళు ఉండవు. కొన్నిటికి పాములాంటి శరీరం ఉంటాయి. draco బల్లులు అడవుల్లో ఎగరగలవు.”

పిల్లలు వింతగా ఆశ్చర్యంగా వింటున్నారు.

నానమ్మ చెప్పటం ఆపడంలేదు.

“కొన్ని సార్లు మగ బల్లులు శత్రువులను, ఆడ బల్లులను ఆకర్షించటానికి, కొట్లాడటానికి ముదురు రంగులలోకి మారుతుంటాయి. వాటికీ కూడా చెవులుంటాయి. అవి ప్రమాదంలో పడినప్పుడు వాటి తోక తెగిపడుతుంది. కొద్దిసేపు కొట్టుకుంటుంది. అంతేకాదు తిరిగి పెరుగుతుంది. వాటికి ఇష్టమైన వాతావరణం వేడి వాతావరణం. చలిలో కూడా బ్రతకగలవు. వాటి ఆహరం చెదలు, కీటకాలు, సాలీడులు, చీమలు మొదలైనవి. కీటకాలను తింటాయి కాబట్టి వాటిని insectivores అని కూడా పిలుస్తారు. బల్లులు కోల్డ్ బ్లడెడ్ reptiles. నార్త్ అమెరికా ఎడారుల్లో ఉండే రెండు రకాల బల్లులు మాత్రమే విషపూరితం. బల్లుల రంగులు కూడా అవి ఉండే చోటును బట్టి మారుతాయిట. సాధారణంగా నేలమీద తిరిగేవి డార్క్/ముదురు రంగులో ఉంటాయి.”

“నానమ్మా! లిజార్డ్స్ అర్ యాక్!” అని వికారంగా మొహం పెట్టింది వన్య.

“ఎస్. అవి బాడ్. లుక్ అస్సలు బాగోదు” అన్నాడు సామర్థ్.

“అందంగా లేనివి మంచివి కావని ఎవరు చెప్పారు? బల్లుల వల్ల మనకి మంచే.”

“మంచి? how?”

“అవి మనకి రోగాలు తెచ్చే క్రిములుని కూడా తింటాయి తెలుసా? నేచర్‌లో ప్రతి దానికి ఒక పని /వర్క్ ఉంటుంది. బల్లులు గుడ్లుపెడతాయి. బల్లులు దాదాపు 100 years బ్రతుకుతాయిట.

“what ? 100 years? no way!” అన్నారు పిల్లలు.

నానమ్మ నవ్వి బుగ్గలు నిమిరారు.

“అవును. నిజమే. 120 yrs బ్రతికిన బల్లులూ ఉండేవిట. మీకో ఫన్నీ సంగతి తెలుసా?” అన్నారు.

తెలీదన్నట్లు తల ఊపారు.

“మా అవ్వ చెప్పింది గ్రాండ్ మామ్… నెమలి పింఛం అదే పీకాక్ ఫెదర్ ఇంట్లో పెడితే లిజార్డ్స్ రావట.”

“రియల్లీ!”

“బల్లులు మాటిమాటికి నాలుక బైటకి తెస్తాయి. ఎందుకో తెలుసా? ఎయిర్… గాలిని వాసన చూడటానికి. వాటి కళ్ళని అన్ని వైపులా తిప్పగలవుట. చరిత్రలో/హిస్టరీలో బల్లుల గురించిన వివరాలున్నాయి.  గ్రీక్స్, ఇజిప్టియన్స్ బల్లులు knowledge, అదృష్టం కి గుర్తుగా చెప్పేవారట. కొన్ని చోట్ల బల్లులను మంచికి, చెడుకు గుర్తుగా ఫీల్ అయ్యేవారట. మీకు తెలుసా మనదేశంలో కిర్ కిర్ అనే బల్లి అరుపు శుభసూచన అంటారు. బల్లి మీద పడిన బాడీ పార్ట్ ను బట్టి శకునం అంటే ప్రిడిక్షన్ చెప్పేవారు. అంతే కాదు తమిళనాడు లోని కాంచీపురంలో ఒక గుడిలో సీలింగ్‌లో వెండి, బంగారు… గోల్డ్ రంగులో బల్లులని ముట్టుకుంటే గుడ్ లక్ ప్లస్ ఎప్పుడైనా తెలిసి తేలిక బల్లిని ట్రబుల్ చేస్తే ఆ పాపం /సిన్ పోతుందని నమ్మకం. నేను ముట్టుకున్నా.”

“నానమ్మా! డిడ్ యు హర్ట్ ఎ లిజర్డ్ ఎనీటైం?”

“నో. జస్ట్ ఫర్ గుడ్ లక్. ప్రపంచంలో చాల దేశాల్లో బల్లి/gecko ని ఇంటికి కాపలాదారుగా అంటారట. పురాతన రోమ్ తవ్వకాలలో సమాధులమీద బల్లి బొమ్మలు కనిపించాయట, గుడ్ లైఫ్ ఆఫ్టర్ డెత్ కి గుర్తుగా.  స్పానిష్ ప్రజలు చిన్ని బల్లి బొమ్మని ఇంటి అలంకరణలో పెట్టి గుడ్ లక్ ని పిలుస్తారట. పూర్వం యూరోపులో పెంపుడు జంతువుల stables లో వాటిని పాముల నుండి సేవ్ చేసేవాని నమ్మకం. క్లైమేట్ చేంజ్/పర్యావరణంలో పెను మార్పుల గురించి విన్నారా?”

“విన్నాం. మా నాన్న, అంకుల్స్ క్లయిమేట్ చేంజ్ గురించి మాట్లాడుతారు వాళ్ళ స్టూడెంట్స్‌తో.”

“గ్రేట్! మనం చేస్తున్న స్టుపిడ్, సెల్ఫిష్ పనులవల్ల మన చుట్టూ వున్న క్లయిమేట్‌ని, పరిసరాలను పాడు చేస్తున్నాము. అందువల్ల క్లైమేట్ చాల వేగంగా మారుతూ మనతో పాటు, ఎర్త్ మీద సమాన హక్కులున్న జంతువులూ, ప్రాణులు, చెట్లు అన్నింటిని చాల ఇబ్బంది పెట్టి చాల రకాల ప్రాణులని పూర్తిగా చంపేసాము. వేడి రోజు రోజుకి పెరిగి అన్నిటికి లైఫ్ ఇబ్బంది అవుతున్నది. అందులో బల్లి ఒకటి. పాపం వేడికి చనిపోతున్నాయిట. క్లయిమేట్ చేంజ్ కి అనుగుణంగా మారలేకపోతున్నాయి. మనం వాడే AC, Fridge, రసాయన ఎరువులు, pesticides, అడవులు నరకటం లాంటివి వాతావరణం వేడెక్కి ఎర్త్ మీద ఉండే ప్రాణుల లైఫ్ స్పాన్ /జీవిత కాలం తగ్గిపోయి చనిపోతున్నాయి. చెన్నైలో వచ్చిన భయంకర వరదలు, వారాలపాటు తగలబడిన అమెరికాలోని అడవులు, వందల సంఖ్యలో ఒడ్డుకి/షోర్‌కి కొట్టుకువచ్చిన చేపలు, oil spills వల్ల చనిపోయే పక్షులు tv news లో చూసుంటారు. మన అత్యాశ వల్లే” అన్నారు బాధగా నానమ్మ.

పిల్లలు ఆలోచనలో మునిగిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here