ప్రముఖ రచయిత్రి శ్రీమతి యలమర్తి అనూరాధ గారికి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం సత్కారం

0
8

[dropcap]ప్ర[/dropcap]ముఖ రచయిత్రి శ్రీమతి యలమర్తి అనూరాధ గారిని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, తెలుగు శాఖ 14.3.2023 న సన్మానించింది.

శ్రీమతి యలమర్తి అనురాధ సాహిత్యంలో చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ తెలుగు శాఖ అధ్యక్షులు, ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం శ్రీ ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు గారు ఆమెను వారి కార్యాలయంలోనే శాలువాతో సత్కరించారు.

డా. గట్ల ప్రవీణ్, సహాయ ఆచార్యులు, భాషాశాస్త్ర విభాగం, డా.టి.జగదీశన్, సహాయ ఆచార్యులు, భారతీయ భాషల విభాగం, ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం,వారణాసి గార్లు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు.

పవిత్ర పుణ్యస్థలమైన కాశీలో తను ఇలా సత్కరింపబడటం మరపురాని అనుభూతిని మిగిల్చిందని అనూరాధ తమ ఆనందాన్ని వ్యక్తీకరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here