భారతీయ సాంప్రదాయాలు – విద్వాంసులు – రాగాలు-13

0
10

[వివిధ భారతీయ సాంప్రదాయాల గురించి, విద్వాంసుల గురించి, రాగాల గురించి ఈ రచనలో విశ్లేషిస్తున్నారు డా. సి. ఉమా ప్రసాద్.]

అధ్యాయం-13: వివిధ రాగాలలో ‘గణపతి దేవ కృతులు’ – వాటి రాగ లక్షణాలు – రెండవ భాగం

4. నటనారాయణి – రాగ లక్షణాలు

ఆరోహణ: స రి గ మ ద ని ద స

అవరోహణ: స ని ద ప మ గ మ రి స

  • ఉభయ, వక్ర, షాడవ, సంపూర్ణ రాగం
  • 28 హరి కాంభోజి mela లో జన్యం
  • ‘నట నారాయణ’ అని కూడా అంటారు.
  • ఆరోహణలో ‘ప’ వర్జ్యం
  • స్వరస్థానాలు: షడ్జం, చతుశ్రుతి రిషభము, అంగరగాంధారం, శుద్ద మద్యమం, పంచమం, చతుశ్రుతి దైవతము, కైశికి నిషాదము
  • హిందుస్థానీ సంగీతంలో 29 ధీరశంకరాభరణంలో జన్యంగా చెబుతారు(Bilawal Thaat)
  • ‘ని’ వర్జ్యం, ఆరోహణ, అవరోహణలలో కూడా
  • నటనారాయణ (Telugu work. Raga Tala- Chinthamani – రాగతాళ చింతామణి)
  • రచన – మహాగణపతి – ఆది – ముత్తుస్వామి దీక్షితార్ రచన

***

5. జుంఝాతి – రాగ లక్షణాలు

ఆరోహణ: ద స రి గ మ ప ద ని

అవరోహణ: ద ప మ గ రి స ని ద ప ద స

  • దైత్యాంత భాషాంగ రాగం
  • 28 mela హరికాంభోజిలో జన్యం
  • షడ్జం, చతుశ్రుతి దైవతము, షడ్జం చతుశ్రుతి రిషభము, అంతరగాంధారం, శుద్ధ మద్యమము, పంచమము, కైశికి నిషాదము, సాధారణ గాంధారం.
  • భాషాంగ స్వర – సాధారణ గాంధారం – మ గ రి స రి గ రి- అన్న ప్రయోగాలలో
  • Chenchurutti Same ఆరోహణ, అవరోహణ
  • ద, ని – రాగాచ్ఛాయ స్వరాలు
  • మధ్యమ శ్రుతిలో పాడతారు
  • పరిమిత సంచారము ఉన్న రాగము
  • మంద్రస్థాయిలో వినిపించు నిషాదము మంతయూ కాకలి నిషాదముగా వుంటుంది
  • కానీ – స ని ద ప గ రి ని సా – నిషాదమునకు తరువాత షడ్జము లేని అవరోహణ ప్రయోగములో పలికేది కైశికి నిషాదమే.
  • సనిస – మ౦ద్ర నిషాదము – కాకలి నిషాదం. దీక్షితుల ‘అనంత బాలకృష్ణం’ మరొక కృతి ఉంది.
  • త్యాగరాజస్వామి వారు 28 mela janya అని ‘మనసా శ్రీరామచంద్రుని’ కృతి వ్రాశారు
  • సంపూర్ణ వక్ర రాగం, త్యాగయ్య ప్రకారం- ఉపాంగం
  • గమక ప్రాధాన్యత తక్కువ
  • నిషాదం మృదు కంపితం – పంచమము – న్యాసం
  • చిన్న రాగంలో కూడా మంద్రం నుంచి తారము వరకు వ్యాపకత్వం అవకాశం చూపించారు త్యాగయ్య రచనలో.
  • ఏకస్వర ప్రయోగం, జంట, ఆహుత ప్రత్యాహుత అవకాశం లేదు.
  • గాన రస ప్రధానం

***

6. ఈశామనోహరి – రాగ లక్షణాలు

  • 1735 సంవత్సరంలో ‘సంగీత సారామృత’ గ్రంథంలో తులజేంద్రులు ఈ రాగం కాంభోజీ మేళ జన్యం అని చెప్పారు. కాని వివరణ లేదు.
  • చతుర్దండి ప్రకాశిక అనుబంధంగా రచించి వుండవచ్చు అని పొరపాటుగా అర్థం చేసుకొన బడుచున్న ‘రాగలక్షణ అనుబంధము’ లో ఈ రాగం 29 ధీరశంకరాభరణం జన్యంగా చెప్పారు.
  • వేంకటమఖి ‘చతుర్దండి ప్రకాశిక’లో ఈ రాగ ప్రస్తావన చేయలేదు. అలాగే మరొక రాగము. ఉదాహరణ ఛాయ తరంగిణి
  • సుబ్బరాయ దీక్షితులు – ఈ రాగం చెప్పారు అని (వేంకటమఖి పేరున)
  • సుబ్బరాయ దీక్షితులు – ఈ రాగాన్నే 28 mela కేదారగౌళ జన్యంగా చెప్పారు
  • కాకలి నిషాదం కనిపించుట వలన, భాషాంగ రాగంగా చెప్పారు. మంద్ర నిషాదంలో కాకాలి నిషాదము
  • దీక్షితుల కృతి ‘శ్రీ గణనాథం భజరే’ అనే రూపక తాళకృతిలో ఉదహరించారు

***

7. కళ్యాణి – రాగ లక్షణాలు

ఆరోహణ: స రి గ మ ప ద ని స

అవరోహణ: స ని ద ప మ గ రి స

  • 65 mela కర్త – ‘మేచ’ కటపయాది సూత్రం ప్రకారం చేర్చబడి ‘మేచకళ్యాణి’ రాగం అయింది
  • 5th raga in the 9th chakra రుద్ర. రుద్ర -మ ప్రతిమధ్యమం రాగం. అనేక జన్య రాగాలున్నాయి.
  • అసంపూర్ణ mela పద్ధతిలో శాంతకళ్యాణి
  • స్వరస్థానాలు: షడ్జం, చతుశ్రుతి రిషభము, అంతర గాంధారము, ప్రతి మద్యమము, చతుశ్రుతి దైవతము, కాకలి నిషాదము.
  • శుద్ద మద్యమం వేస్తే – శంకరాభరణం వస్తుంది
  • తీవ్ర స్వరాలు, గమక, రాగచ్ఛాయ స్వరాలు ప్రయోగాలు ఈ రాగంలో బాగుంటాయి.
  • గ, ప – అంశ స్వరాలు: రి, గ, ద, ని- న్యాస స్వరాలు.
  • జంట, దాటు ప్రయోగాలు –
  • స, ప వ్యర్జ స్వర ప్రయోగాలు; కంపిత స్ఫురిత త్రిపుచ్ఛ గమకాలు బాగుంటాయి ఈ రాగంలో
  • సర్వకాలిక రాగం (Yaman thaat) హిందుస్థానీ సంగీతంలో
  • హంగేరియన్ సంగీతం ఈ రాగం ఉంది
  • ప్రాచీన రాగం; గాంధార మూర్ఛన షడ్జ గ్రామం
  • మూర్ఛనా కారక mela
  • రి, గ, ప, ద, ని – ఆధారషడ్జం చేస్తే (model shift of tonic) గ్రహభేదంలో వరుసగా హరికాంభోజి, నఠభైరవి, శంకరాభరణం, ఖరహరప్రియ, తోడి రాగాలు వస్తాయి.

***

8. తోడి – రాగ లక్షణాలు

  • ప్రాచీన రాగం. షడ్జ గ్రామ రిషభ మూర్ఛనందు ‘తోడి’ రాగ స్వరూపం కన్పిస్తుంది. ఈ రాగానికే ‘అభిరుద్గత’ అను పేరు కూడా వుంది.
  • షడ్జ గ్రామము యొక్క దైవత మూర్ఛనలో కూడా తోడి రాగ స్వరూపం వుంది.
  • పంచమము మాత్రము ఒక ప్రమాణ శ్రుతి తగ్గును అని ఆ కాలపు చ్యుత పంచమము, చతుశ్రుతి, త్రి, ద్విశ్రుతి అని 3 అంతరాలు ఆధారంగా షడ్జ, మధ్యమ, పంచమములకు పై స్థానమును, క్రింది స్థానము ప్రయోగిస్తే ఒక విధంగా షడ్జ గ్రామము, మరొక విధంగా 22 mela దగ్గరగా వుంటుంది అని ఇంకొక రాగం కనిపెట్టేదానికి ఎలా అవకాశం వుంటుందో, ఆదే విధంగా చత్రుశ్రుతి, త్రిశ్రుతి మరియు ద్విశృతి అంతరములను షడ్జ, మధ్యమ, పంచ పై స్థానమును, దిగువనను ప్రయోగిస్తే, తోడి రాగ శ్రుతులు కన్పించును.
  • షడ్జ, రిషభ, పంచమ, దైవతములకు మధ్య ద్విశ్రుత్యంతరము, రిషభ, గాంధారములకు, మధ్యమ పంచమములకు, దైవత నిషాదములకు – మధ్య చతుశ్రుతి అంతరము, గాంధార మధ్యమములకు, నిషాద షడ్జమునకు మధ్య గల అంతరము త్రిశ్రుతి.
  • తోడిలో పూర్వాంగ ఉత్తరాంగములు ఒకదానికొకతి అనురూపము (symmetry) గా ఉండును.
  • పూర్వాంగము నందు – శుద్ధ రిషభము, సాధారణ గాంధారము, శుద్ధ మధ్యమము కును ఉత్తరాంగంలో శుద్ధ దైవతము, కైశికి నిషాదము మరియు ఫైషడ్జము సంవాదులుగా ఉన్నాయి
  • మధ్యయుగంలో, ఆధునిక యుగంలో రచించబడిన గ్రంథాలలో ఈ రాగ ప్రస్తావన జరిగింది
  • ప్రస్తుతం హనుమతోడి 2వ చక్రంలో 2వ మేళం – నేత్ర – శ్రీ – Mela సంకేతాలు. స రి గ మ ప ద ని స్వర సంకేతాలు.
  • హిందుస్తానీ ‘మియాంకి తోడి’ కాని ఇది 45 mela శుభపంతువరాళి రాగమును పోలి వుంటుంది.
  • సర్వ స్వర గమకం కి రక్తి రాగం. ముక్తాంగ, కంపిత రాగం (నారదుని విభజన ప్రకారం). స, ప, వర్జ్య ప్రయోగాలు (రి గ మ ద ని). గమకం లేకుండా బాగుటుంది (శుద్ధ స్వరాలుగా)
  • పంచమము వర్జించబడి షాడవ తోడిలో ఒక గీతం ఉంది (శుద్ధ తోడి అంటారు). త్రిస్థాయి రాగం. స, ప, మ – వర్జ్య న్యాసం. పంచ స్వర మూర్ఛన కారక రాగం.
  • Model Swift of Tonic ప్రకారం కళ్యాణి/హరికాంభోజీ/నఠభైరవి/శంకరాభరణం/ఖరహరప్రియ రాగాలు వచ్చును.

***

9. మోహన – రాగ లక్షణాలు

ఆరోహణ: స రి గ ప ద స

అవరోహణ: స ద ప గ రి స

  • 28 Mela లో జన్యం. ఔడవ రాగం
  • ‘భూప్’ – హిందుస్థానీ సంగీతంలో రేవగుప్తి (లేదా) రేగుప్తి – అని పిలిచేవారు. కాని శుద్ద పొరపాటు. రేవగుప్తి మాళవగౌళ జన్యం.
  • అన్నీ రాగచ్ఛాయ స్వరాలే. గ్రహ, అంశ, న్యాసములే.
  • భావపూరిత రాగం: జంట, దాటు, ఆహుత, ప్రాత్యాహుత ప్రయోగాలకు అవకాశం ఎక్కువ.
  • త్రిసాయి రాగం. బహు రస ప్రధాన రాగం
  • నృత్య, గేయ నాటకాలకి, అనేక దరువులు కూడా ఈ రాగంలో కలవు.
  • సర్వ స్వర మూర్ఛనా కారక జన్యరాగం. రిషభము చేత – మధ్యమావతి, గాంధారంతో హిందోళ, పంచమముతో – శుద్ధ సావేరి, దైవతంతో- శుద్ధ ధన్యాసి రాగాలు వస్తాయి.
  • సంగీత సారామృత గ్రంథమునకు పూర్వం రచించిబడిన ఏ గ్రంథములోనూ ఈ రాగం లేదు.
  • దైవత మూర్చన అయిన శుద్ధ ధన్యాసి, దనాసి అనే ఔడవంగా (రామామాత్యుల స్వర మేళ కళానిధి, సంగీత సారామృతం, సంగీత సార సంగ్రహం, సంగ్రహ చూడామణి మొదలగు గ్రంథాలలో) చెప్పబడినది.

***

10. ఆరభి – రాగ లక్షణాలు

ఆరోహణ: స రి గ మ ప ద ని స

అవరోహణ: స ని ద ప మ గ రి స

  • 29 Mela ధీరశంకరాభరణంలో జన్యం. ఔడవ సంపూర్ణ.
  • మధ్యమ కాల ప్రధాన రాగం. గాన రస ప్రధాన రాగం.
  • రిషభ మూర్ఛన చతుశ్రుతి దైవతంతో ‘అభేరి’ అగును. ఆరభిలో గ్రహభేదం చేయనవసరం లేదు.
  • దీర్ఘ గాంధారానికి అవకాశం లేదు.
  • ఆరోహణలో గ, ని ఉపాంగ – రి, మ, ద – రాగచ్ఛాయ స్వరాలు. గ, ని – లంఘనము. కానీ, అనభ్యాసం కాదు. త్రయోదశ లక్షణముతో అల్పత్వం ఆరభి రాగములోని – గ, ని, – కన్పిస్తుంది.
  • రి, ప – న్యాసములు. ‘మ’ నిన్యాసంగా ప్రాముఖ్యత ఇచ్చినట్లైతే గాంధార సంబంధంతో ‘దేవ గాంధారి’ రాగం తప్పదు.
  • గ,ని గ్రహ, అంశ, న్యాసలుగా వాడరాదు.
  • జంట ప్రయోగాలు వాడరాదు.
  • కొన్ని సందర్భాలలో నిషాదము నిరాకరించి దసనప సపదర – పసమగరి – ప్రయోగించవచ్చు.
  • తురగరాజ – సరిమగారి అని; కాని చమత్కారంగా సరిమమగరి అని పాడవచ్చు (త్యాగయ్య – ‘సాధించెనే ఓ మనసా’ కృతిలో)

***

11. వరాళి – రాగ లక్షణాలు

ఆరోహణ: స రి గ మ ప ద ని స

అవరోహణ: స ని ద ప మ గ రి స

  • 39 mela ఝాలవరాళి. 3rd mela 7th చక్ర రి, షి గో
  • స ర గ ప (శు. సా. ప్ర) ద ను (శు.కా) – స్వరస్థానాలు
  • వివాది వివాది దోషం వక్ర పద్ధతిలో పాడితే పోతుంది – సగరిగ అని.
  • వక్ర సంపూర్ణ ఆరోహణ. ఘన రాగాలలో 4వది.
  • గమక ప్రధాన రాగం. గ, మ – రాగచ్ఛాయ స్వరాలు. గమకంతో పాడుతారు. గ – శుద్ధ – గ – వరాళి ‘మ’ – higher frequency- ప్రతిమధ్యమం కన్నా.
  • ప్రాచీనంలో వరాటి అనేవారు.
  • స్వయంగా విని నేర్చుకోవాలని అనే చెప్పేవారు
  • త్రిస్థాయి.

***

12. మధ్యమావతి – రాగ లక్షణాలు

ఆరోహణ: స రి మ ప ని స (చ శు, కై)

అవరోహణ: స ని ప మ రి స

  • ఔడవ, 22 Mela. ఖరహర ప్రియ జన్యం
  • ‘మ’ మూర్ఛన రాగం –
  • ఉపాంగ రాగం (అన్యస్వరం లేనిది); గ-ని- వర్జ్య స్వరాలు; రి – ని జీవ స్వరాలు, మంగళకర రాగం
  • సర్వ దోష నివారిణి ఈ రాగం అని చెప్పచ్చు
  • దీక్షితార్ కృతుల మూలంగా ఈ రాగం పేరు వచ్చిందని చెప్పచ్చు. ధర్మసంవర్ధిని – అనే కీర్తనలో రాగముద్ర మధ్యమావతి; పూర్వాశ్రమం పేరు ‘మధ్యమాది’ – మధ్యమాన్ని గ్రహ స్వరంగా పెట్టుకున్న రాగం.
  • మధ్యమ గ్రామము యొక్క మధ్యమ మూర్ఛన. హరికాంభోజి – గ, ద వర్జించిన ‘మధ్యమావతి’ రాగం (మధ్యమ + ఆది).
  • షడ్జ పంచమ, షడ్జ మధ్యమ భావంలో మొదటి ఘట్టములో కనిపించు స్వరములచే ‘మద్యమావతి’ అనే ఔడవ రాగం కన్పిస్తుంది. స-ప-రి- స-మ-ని రాగాంగ రాగం.
  • లాక్షణికులు శ్రీరాగ జన్యంగా, కాని 28 హరికాంభోజి జన్యం అని చెప్పటం ఉత్తమం. రి, ప – గ్రహ స్వరాలు. ధర్మ సంవర్ధిని అనే కృతి, ‘రి’తో మొదలవుతుంది. ‘పాలించు కామాక్షి’ – షడ్జ స్వరంతో, వినాయకుని వలె రిషభ గ్రహంతో, అలకలల్ల – పంచమంతో ప్రారంభం.
  • రి, మ, ని జీవస్వరాలు. త్రిస్థాయి బహు రస రాగం. నిషాదాన్ని మృదు కంపితంగా పాడాలి.
  • శుద్ధ, స్పష్టమైన కైశికి నిషాదముగా చాలా అరుదుగా వాడాలి. జంట, దాటు, ఆహుత, ప్రత్యాహుత ప్రయోగాలకి అనువైన రాగం.
  • ‘రాగలక్షణ సంగ్రహం’లో ‘బృందావని’ అని ఒక రాగం ఉంది. ఇది మధ్యమాది. ఆరోహణ, అవరోహణములు తీసుకుంటుంది. బృందావనిలో అల్పగాంధార ప్రయోగం లేదు. దీక్షితుల వారి ‘శ్రీ సౌందర రాజమ్’ కృతి అల్ప గాంధార ప్రారంభం. బృందావనిలో కొంచెం దేశ్యత్వం కలిగి వుంటుంది. కానీ మధ్యమాదిలో లేదు.
  • పార్శ్వదేవులు ‘సంగీత సమయసారం’ లో 12 రాగాంగ రాగంలో మధ్యమాది ఒక్కటి.
  • శార్ఙ్గదేవులు ప్రాక్పసిద్ధ రాగంగా చెప్పారు.
  • వేంకటమఖి ‘చతుర్దండి ప్రకాశిక’ గ్రంథంలోను మధ్యమాది గాను రాగాంగ రాగం గా చెప్పబడింది.
  • తులజేంద్రులు ‘మధ్యమాదిని’ గురించి చెప్తూ వేణువులతో దీనిని వాయించటం వల్ల ప్రత్యేకమైన ప్రకాశము పొందిన రాగంగా చెబుతారు.

***

13. నాట – రాగ లక్షణాలు

  • ప్రాచీనరాగం. శార్ఙ్గదేవులు, నారదులు, పార్శ్వదేవుల – గ్రంథాలలో వుంది. కానీ నాట రాగంలో షట్‌శ్రుతి రిషభం, షట్‌శ్రుతి దైవతంతో కూడిన నాట రాగమేనా అని అనుమానం వస్తుంది.
  • రామామాత్యులే – షట్‌శ్రుతి రిషభం, షట్‌శ్రుతి దైవం వాడారు. పూర్వం గంభీరనాలతో దేవాలయాలలో వాయించేవారు.
  • 36 చలనాట లో జన్యం.
  • ప్రథమ ఘనపంచకం.
  • రి, గ, ని – రాగాచ్ఛాయ స్వరాలు. ‘మ’ రాగాచ్ఛాయ స్వరం.
  • దీర్ఘ గాంధారం – అపురూపమైన అంశం (‘నిన్నే భజన సేయు వాడను’ త్యాగయ్య).
  • స, ప – గ్రహ స్వరము కాని ‘గ’ ని గ్రహ స్వరంగా త్యాగయ్య వాడారు.
  • త్రిస్థాయి, జంట, దాటు, ఆహుత, ప్రత్యాహుత – చక్కటి అవకాశం.
  • రి, మ, ని – ప్రధాన జీవ స్వరాలు
  • తానము, మద్యమకాలం – బాగుంటుంది.
  • ఉత్తమ, శుభకర రాగం. సార్వకాలిక రాగం
  • “ఆది ‘నాట’ అంత్య సురటి” అనేది ప్రసిద్ధ వాక్యం.
  • నృత్య, గేయ, నాటక, దేవాలయాలలో, హరికథా కాలక్షేపాలలో, వివిధ సంగీత కార్యక్రమాలలో ఈ రాగానికి అగ్రస్థానం వుంది అని చెప్పవచ్చు.

***

14. కనకాంగి – రాగ లక్షణాలు

ఆరోహణ: స రి గ మ ప ద ని స

అవరోహణ: స ని ద ప మ గ రి స

  • త్యాగయ్య రచన ‘శ్రీ గణనాథం భజామ్యహం’
  • కనకాంగి (అంటే బంగారు శరీరం కలిగినది) అనేది కర్ణాటక సంగీతంలో ఒక రాగం. 72 మేళకర్త రాగంలో 1వ మేళకర్త రాగం.
  • దీక్షితార్ పాఠశాలలో దీనిని ‘కనకాంబరి’ అంటారు.
  • జ్ఞాపిక పేరు. ఇందు- పా – స ర గ మ ప ద న- అనే స్మృతి వాక్యం. అన్నీ శుద్ధ స్వరాలు. శుద్ధ రిషభం, గాంధారం, పంచమం, దైవతం, నిషాదం – అన్ని శుద్ధ స్వరాలే.
  • సంపూర్ణ రాగం – 37 మేళకర్త అయిన సాలగంతో సమానమైన శుద్ధ మధ్యమ- అసంపూర్ణ mela [వేంకటమఖి ప్రకారం- ఔడవ-సంపూర్ణ- ఉదాహరణ: ఆరోహణ -స రి మ ప ద స; అవరోహణ: స ని ద ప మ గ రి స] గా చెప్తారు.
  • జన్యరాగాలు- కర్నాటక శుద్ధ సావేరి మరియు లవంగి
  • బాలమురళి రచన – లవంగి రాగంలో చేశారు.
  • కోటీశ్వర అయ్యర్ రచన కూడా వుంది.
  • కనకాంగి, స్వరాలు గ్రహభేదం చేస్తే – కామవర్ధని – వస్తుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here