భారతీయ సాంప్రదాయాలు – విద్వాంసులు – రాగాలు-28

0
16

[వివిధ భారతీయ సాంప్రదాయాల గురించి, విద్వాంసుల గురించి, రాగాల గురించి ఈ రచనలో విశ్లేషిస్తున్నారు డా. సి. ఉమా ప్రసాద్.]

అధ్యాయం-19: కొన్ని రాగాలు – లక్షణాలు – కీర్తనల ఉదాహరణలు – 11వ భాగం

23. జనరంజని:

29 ధీరశంకరాభరణంలో జన్యం.

ఆరోహణ: స రి గ మ ప ద ని స

అవరోహణ: స దా ప మ రి స

వక్ర, సంపూర్ణ, షాడవరాగం. ఉపాంగ రాగం. దీర్ఘ స్వరము బాగా యుండు గ, ద, ని, రాగచ్ఛాయ స్వరములు.

జనరంజని రాగము రాకమునుపు ‘పూర్ణచంద్ర’ రాగం వ్యాప్తిలో యున్నది. 1935 సంవత్సములో రచించబడిన ‘సంగీత సారామృత’ గ్రంథమున మొట్టమొదటిసారిగా ‘ ‘జనరంజని’ కన్పించినది.

దీక్షితుల వారి ‘శంఖ చక్ర గదాపాణి’ అను పూర్ణచంద్రిక కృతి ఒక అపూర్వ సృష్టి. దానిలో ముఖ్యాంశములు ‘జనరంజని’లో కన్పించును. గ, ద, దీర్ఘ ప్రయాగములు. త్యాగయ్య ‘విడజాలదురా’ కృతి దీనికి ఉదాహరణ. దీర్ఘ నిషాదము త్యాగయ్య కృతిలో కన్పించును. పూర్ణచంద్రికలో నిషాదము దుర్బల స్వరము. దీర్ఘముగా వాడుటకు వీలు లేదు.

కానీ త్యాగయ్య దీర్ఘ గాం॥ ని ‘స్మరణే సుఖము రామ’ అను కృతిలో జొప్పించెను. గ, ని ప్రయోగములు కూడా వేసెను.

జనరంజని మధ్యమ కాల రాగం. గాన రస ప్రధాన రాగం. నిండు పాండిత్యము గల రాగం. వర్ణములు, కృతులు రచించుటకు వీలు గల రాగం. జంట స్వర, ఏక స్వర సంచారము కలదు. మంద్ర స్థాయి పంచమము నుండి తారస్థాయి పంచమము వరకు రాగమును గానం చేయవచ్చు.

త్యాగరాజు పూర్ణచంద్రిక, జనరంజని రాగములలో కీర్తనలు రచించి యుండగా, దీక్షితులు ప్రాచీన రాగమైన పూర్ణచంద్రికలో మాత్రమే రచించెను.

రామస్వామి శివన్ యొక్క సాహిత్యమునకు, వీరి సోదరులైన మహా వైద్యనాద శివన్ రచన గావించిన ‘పాహిమాం శ్రీరాజరాజేశ్వరి’ జనరంజని రాగములో గల మరొక ముఖ్య రచన.

~

శ్యామశాస్త్రి కృతి – నన్ను బ్రోవరాదా – త్రిపుట తాళం

పల్లవి:

నన్ను బ్రోవరాదా ఓ జగదంబా నీ దయచేయవే॥

అనుపల్లవి:

కన్నతల్లి నీవే అంబా నా మొఱలను వినరాదా॥

చరణము(లు):

ఆదిశక్తి మహేశ్వరీ కౌమారీ ఆదరింపవే వే వేగమే నీలాయతాక్షీ భవానీ॥

కోమలమృదువాణీ కల్యాణీ సోమశేఖరుని రాణీ లలితాంబికే వరదే॥

శ్యామకృష్ణసహోదరీ ఓంకారీ శాంభవీ ఓ జననీ నాదరూపిణీ నళినాక్షీ॥

24. చింతామణి:

శ్యామశాస్త్రుల వారి ‘దేవి బ్రోవ సమయమిదే’ అను కృతి ఒకటి తప్ప మరి వేరే కృతి, ఈ రాగంలో లేదు. వారి మూలంగానే ఈ రాగము తెలియవచ్చింది. వీరి సమకాలికులైన త్యాగయ్య, దీక్షితార్‍లు ఈ రాగంలో కృతులు రచించలేదు.

శ్యామశాస్త్రులు భూలోక చాప చుట్టి బొబ్బిలి కేశవయ్యను సంగీత పోటీలో ఎదుర్కునుటకు తంజావూరు సంస్థానమునకు బయలుదేరిగ సందర్భములో తన యొక్క ఇష్టదైవమైన కామాక్షీ దేవిని మనస్ఫూర్తిగా భక్తితీ ఈ ‘చింతామణి’ రాగములోనే ‘దేవి బ్రోవ సమయమిదే’ అనే కృతిలో కీర్తించి దేవి యొక్క అనుగ్రహం సంపాదించి కేశవయ్య గారిని ఓడించినట్లుగా చెప్పబడుతున్నది.

చింతామణి ఛాయా ప్రధాన రాగము. షణ్ముఖప్రియ జన్యం.

ఆరోహణ: స రి పా మ ప ద ని స

అవరోహణ: స ని ద ప మ గ రి స (లేక) స ప మ గ రి గ స

పాదనీ – దాది స ని సా ప్రయోగములు చ॥ధై॥

సని దప ప్రయోగము కన్నా సాపా జారు ప్రయోగము

గరిస ప్రయోగము కన్నా గ రి గ స రంజకముగా యుండును.

చింతామణి మిక్కిలి రక్తి రాగం. ఈ రాగం చిరకాలము జీవింపవలెననగా, శ్యామశాస్త్రుల వారి కృతి రాగలక్షణమునకు భంగము కలుగకుండా, పోషించి పాడుట సంగీత విద్వాంసుల కర్తవ్యము.

~

దేవి బ్రోవ సమయమిదే – శ్యామశాస్త్రుల కృతి

పల్లవి:

దేవీ బ్రోవ సమయమిదే అతివేగమేవచ్చి

నా వెతలు దీర్చి కరుణించవే శంకరీ కామాక్షి॥

చరణము(లు):

లోకజననీ నాపై దయలేదా మాయమ్మా నీ దాసుడుగదా

స్రీ కాంచివిహారిణీ కల్యాణీ ఏకామ్రేశ్వరుని ప్రియభామయైయున్న నీ

కేమమ్మా ఎంతో భారమా వినుమా

రేపు మాపని చెప్పితే నే వినను దేవి

ఇక తాళను నేను ఈ ప్రొద్దు దయచేయవే కృపజూడవే

నీ పదాబ్జములే మదిలో సదా యెంచి నీ

ప్రాపు కోరియున్నానమ్మా ముదముతో

శ్యామకృష్ణుని సోదరి కౌమారి శంకరి బింబాదరి గౌరి

హేమాచలజే లలితే పరదేవతే కామాక్షి నిన్నువినా

భూమిలో ప్రేమతో కాపాడే వారెవరున్నారమ్మా

25. ధర్మవతి:

ప్రథమ కనకాంబరి పట్టికలో ‘ధౌమ్య’ రాగం.

ద్వితీయ కనకాంబరి పట్టికలో ‘ధామవతి’ రాగం.

దీక్షితుల సంగీత సంప్రదాయ ప్రదర్శినిలో దీక్షితుల కృతి ఈ రాగంలో కన్పించుచున్నది. ఇటీవలెననే ‘పరం ధామవతి’ అనే కృతి దీక్షితుల కృతిగా వ్యాప్తి లోకి వచ్చినది. దీని జన్యరాగమైన రంజనిలో త్యాగయ్య కృతులు చేసెను.

59వ మే॥ ధర్మవతి. 10వ చక్రంలో 5వ మేళం

ది సి – మ సంకేతము.

గౌరి మనోహరి యొక్క ప్రతిమద్యమము. స, రి, గి, పి, ప, ది, ను – స్వర సంకేతము. స్వర ప్రసారం విస్తరించు రాగం. గాన రస ప్రధాన రాగం. గమ కంపితములు చ॥రి॥, చ॥ధై॥, ప్ర॥మధ్య॥, కా॥ని॥ ములచే ఈ రాగములో కొంత వరకు రక్తి కల్గును. రి, ధ లకు కంపితములు లేవు. అతి చక్కని న్యాసములు.

సింహేంద్ర మధ్యమ రాగములో వలె రిమగరిస – ప్రయోగములో శం॥ మ॥ పల్కును. మైసూరు వాసుదేవాచార్యుల వారి కృతి ‘భజన చేయరాదా’ ఈ రాగమునకు చక్కని ఉదాహరణ. కోటిశ్వరయ్యర్ గారి కృతి కూడా కలదు.

‘ధర్మవతి’, మూర్ఛనాకారక మేళము. రిషబ మూర్చన చక్రవాక రాగమే కానీ ధర్మవతిలో నిషాదమునకు యివ్వబడుచున్న గమకము, చక్రవాక ధైవతమునకు అంతగా సరిపోదు. కేవలం స్వరస్థానం వరకు గ్రహభేదం చేయవచ్చు. పంచమ మూర్ఛన ‘సరసాంగి’ రాగము.

గౌరి మనోహరి రాగంలో – ప్రతిమధ్యమం వేస్తే – ధర్మవతి రాగం వస్తుంది.

రిషబ మూర్ఛన – చక్రవాకం

పంచమ మూర్ఛన – సరసాంగి.

~

దీక్షితార్ కృతి – పరం ధామవతీ – రూపక తాళం

పల్లవి:

పరంధామవతీ జయతి పార్వతీ పరమేశ యువతీ

సమష్టి చరణం:

పరంజ్యోతిర్వికాసినీ పరమాత్మ-ప్రకాశినీ

(మధ్యమ కాల సాహిత్యం)

నిరంతరం గురు గుహ జననీ బృహదీశ రంజనీ

వ్యాఖ్యానం:

సంబోధన ప్రథమా విభక్తి.

పార్వతి, పరంజ్యోతి లలితా సహస్రనామంలోని పేర్లు. పరంధామ కూడా లలితా సహస్రనామంలోన వుంది.

పరంధామవతీ – The one dwelling in the supreme abode,

పార్వతి – Goddess Parvati, పార్వతీ దేవి

పరమ ఈశ యువతీ – యవ్వనవతి యైన పార్వతి

జయతి – జయము!

సమష్టి చరణం:

పరం-జ్యోతిర్-వికాసినీ -the one who manifests as great effulgence,

పరమ-ఆత్మ-ప్రకాశినీ – the one who illumines or expounds (the principle of) the supreme person,

నిరంతరము – constantly,

గురు గుహ జనని – the mother of Guruguha,

బృహత్-ఈశ-రంజనీ – the one who delights Shiva.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here