భారతీయులకు హెచ్చరిక-11

0
11

[box type=’note’ fontsize=’16’] భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినం గా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష అనువాద రచన ఇది. 1939లో ప్రచురితమైన సావిత్రి దేవి రచించిన ‘ఎ వార్నింగ్ టు ది హిందూస్’ అన్న పుస్తకాన్ని అనువదించి అందిస్తున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ. సావిత్రి దేవి గ్రీకు మహిళ. ఆమె భారత్ వచ్చి, భారతీయుడిని వివాహం చేసుకుని ఇక్కడే హిందువుగా స్థిరపడింది. దేశంలో జరుగుతున్న పరిణామాలను అవగాహన చేసుకుని భవిష్యద్దర్శనం చేసినట్టు 1939లో ఆమె రచించిన గ్రంథం ఇది. ఈ పుస్తకానికి వీర్ సావర్కర్ ముందుమాట రాశారు. ఈ పుస్తకంలో ఆమె ఏదయితే జరిగే ప్రమాదం వుందని హెచ్చరించిందో అదే నిజమవటం ఈ పుస్తకం ప్రాధాన్యాన్నీ విలువను పెంచుతుంది. ప్రస్తుతం దేశంలో మళ్ళీ అనుమానాలు, ఆవేశాలు, ద్వేషాలు అధికమై సామరస్య వాతావరణాన్ని రాజకీయ లబ్ధి కోసం కలుషితంచేసి వికృత విషపుటాలోచనలను విస్తృతంగా వెదజల్లుతున్న తరుణంలో గతంలోని పొరపాట్లను స్మరించటం ద్వారా చరిత్ర పునరావృతం కాకుండా జాగ్రత్తపడే వీలుంటుందని, చరిత్రలో మరుగున పడ్డ అనేక సత్యాలను తెలుగు పాఠకులకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఈ అనువాదాన్ని అందిస్తున్నాము. [/box]

భారత జాతీయతావాదం, చైతన్యం

మొదటి ప్రకరణము – ఆరవ అధ్యాయము-3

[dropcap]మ[/dropcap]నం ఇప్పుడే అనుకున్న కులతత్వం, అతి ఎక్కువైన ప్రాంతీయ తత్వానికి కూడా వర్తిస్తుంది. హైందవ సమాజంలోని ఈ లోటు కూడా, చాలా వరకు ఆచారాల అధికారం మీద, కుల విభేదాల మీద ఆధారపడి ఉంది. ఒక వేళ భావితరపు సైనిక శక్తి యొక్క ఐక్యత, స్వేచ్ఛా భారతంలో గనుక పాదుకొనాలంటే, అది నిరంతర వర్ధమానమైన ఐక్యహిందూ చైతన్యం ద్వారానే సాధ్యం. ఆ చైతన్యాన్ని రగుల్కొల్పకుండా నిరోధించే దేనినైనా, మనం వ్యతిరేకించి తీరాలి.

ప్రాంతీయభావాలు, కుల తత్వాలు, చాలా సార్లు ఒకదానితో ఒకటి కలిసిపోయినట్లనిపిస్తాయి. కాని అవి అచ్చంగా ఒకే స్వబావాన్ని కలిగి ఉండవు. ప్రాంతీయతత్వం వెనుక, భాష అనే అంశం ఉంటుంది. అది నిజానికి దగ్గరగా ఉంటుంది. చాలా మటుకు భారతదేశ సంస్థానాలు, అవే దేశాలుగా అనుకొవచ్చు. కాని ఈ రోజూల్లో మనం ఒక నిజాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాం. చిన్న చిన్న సంస్థానాలు, తాము పంచుకుంటున్న, బలమైన పెద్ద ప్రాంతాల సంస్కృతిని, నాగరికతను కాదని, దూరంగా మనలేవు. ఐరోపాలో, మధ్యప్రాచ్యంలో ప్రస్తుతం ఏది నిజంగా జరుగుతూందో, ప్రస్తుత భారతదేశంలోని ప్రాచ్యభారతదేశంలో కూడా నిజంగా జరుగుతూంది (ఒక మరింత విస్తృత హైందవత్వ స్పృహ కలిగిన మహోన్నత భారతాన్ని గురించి మాట్లాడేటప్పుడు, సరైన సమయం కోసం ఎదురు చూడడంలో). కాబట్టి హిందూ జాతీయవాదం మొదట ఒక అఖిలభారత హైందవ చైతన్యాన్ని ఉద్భవింపచేయాలి. అప్పుడు న్యాయబద్ధమైన, గర్వించే సంస్థానాలు(న్యాయబద్ధంగా గర్వించే కులాలు కూడా) లాభపడతాయి, చివరగా ఈ రోజు, ఉత్తర మరియు తూర్పు బెంగాల్‌లో ఉన్న హిందువులు, నశించబోయే విపత్తులో ఉన్నారు. వారికి పశ్చిమ బెంగాల్ లోని హిందువుల మద్దతు ఏ మాత్రం లేదు. ఆ విపత్తు తమకు కూడా వ్యక్తిగతంగా సంబంధించినదని, పశ్చిమ బెంగాల్ హిందువులు అనుకోవడం లేదు. మద్రాసులోని హిందువులు, మహారాష్ట్రలోని హిందువులు, మలబార్  లోని హిందువులు, పంజాబు, సర్వభారతావనిలోని హిందువులంతా వారికి దన్నుగా ఉంటే, వారు ఎంత పరమాద్భుతమైన బలాన్ని సంతరించుకుంటారో ఒక్కసారి ఊహించండి.

ఒక నిజమైన జాతీయవాద దృక్పథం ఉంటే, హందువులు ‘వాసి’ కంటె తక్కువగా రాశి(సంఖ్యను) చూడలేరు. ప్రతి ఒక్కరికీ ఇప్పుడు అర్థమైంది, గతంలోకంటె, ఇప్పుడు, సంఖ్య అంటే, రాజకీయాధికారమని. భారతదేశం బయట, బలమైన ఆధునిక దేశాల ఉదాహరణలు మనకు తెలుసు. అక్కడ బహుళ సంఖ్యాకుల మీద అల్పసంఖ్యాకుల అధికారం ఉంది. కాని అధిక సంఖ్యాకులకు చైతన్యం ఉంది. వారిని పాలించే అల్పసంఖ్యాకులు వారి మనఃపూర్వక అంగీకారం లేకుండా ఎలా పాలించగలరు? ఎప్పుడైనా, ఎక్కడైనా వ్యవస్థాగతులైతే అధిక సంఖ్యాకులదే బలం, అన్నది నిజం. హిందూ మతపర దృక్పథానికి, ఈ ప్రపంచంలో బలం యొక్క ప్రాముఖ్యత పట్టదు. అందుకే అధిక సంఖ్యాకులను వారు నిర్లక్ష్యం చేస్తారు, వారిని హైందవత్వానికి శత్రువులుగా తయారుచేస్తారు. కాని, హిందూ జాతీయవాద దృక్పథం, దీనికి విరుద్ధం. ఈ ప్రపంచంలో, బలాన్నిచ్చేది రాజకీయాధికారమే అని దానికి తెలుసు. ఒక ఉన్నతమైన భారతదేశాన్ని నిర్మించడానికి అది తప్పనిసరి అని దానికి తెలుసు. అందుకే అది మతపర దృక్పథం కలవారి బాటలో పయనించదు.

ఒక జాతీయవాది ఐన హిందువు, అందరు భారతీయులను, వారెవరైనా సరే, హైందవత్వంలోకి ఆహ్వానిస్తాడు. నిజమైన హైందవ భారతాన్ని బలపరచడానికి వారంతా అవసరమని అతనికి తెలుసు. మతపర, ఆధ్యాత్మిక వాదరక్తులైన హిందువులు కేవలం, ఎక్కువకాలం, కబుర్లతో కాలక్షేపం చేస్తారు. కాని హైందవత్వంలోకి తిరిగి వచ్చిన వారు విలువైన భారతీయ సంస్కృతిని కాపాడటంలో, పోరాడగలరు. మాటలు కాకుండా చేతలు చూపగలరు.

వాళ్లందర్నీ హైందవత్వంలోకి మళ్లీ తీసుకురావడం అంటే, వారికి, అన్ని సిద్ధాంతాల్లోకీ, హిందూమతమే మంచి ఎన్నిక అని బోధించడం కాదు, వారికి, అన్నింటికంటె మిన్నఐనది భారతదేశం మాత్రమే అని బోధించడం. అదే సమయంలో (అది నిజం కాబట్టి), హైందవత్వం లేకుండా భారతదేశానికి మనుగడ లేదు అనే గ్రహింపునివ్వడం.

విస్తృతమైన భారతీయ సంస్కృతిలో, ఎటువంటి విదేశీయ ప్రభావాలు సహించబడవు అని మనం అనం. ఎల్లప్పుడూ, అన్ని సంస్కృతులలో విదేశీ విధానాలు ఉంటాయి. ప్రతి భారతీయుడు, ఒక భావావేశంతో, భారతీయేతర దేవతలను ప్రవక్తలను గౌరవించడాన్ని నిరాకరించాలని కూడా మనం అనం. అలాంటి సంకుచిత దృక్పథమే భారతీయ సంస్కృతికి విరుద్ధం. కాని మనం అనేది ఏమంటే, లక్షలాది సంవత్సరాలుగా, సజీవమైన మన చరిత్ర, ఇతిహాసాలకు, శిల్పకళకు, గానానికి, భావజాలానికి, మనం మొదట మోకరిల్లాలి. దానికే మనం సంపూర్ణంగా లోబడి, విధేయంగా ఉంటాలి. అదే కదా భారతదేశానికి చిహ్నం!

హిందువులు, ఎవర్నీ తమ విశ్వాసాన్ని త్యజించమని, ఎప్పుడూ చెప్పలేదు. కేవలం వేర్పాటుధోరణినే విడనాడాలని చేప్పారు. వ్యక్తిగత విశ్వాసాల్లో అనుభవాల్లో ఒక ఉన్మాదధోరణిని విడనాడాలన్నారు. భారదేశంలోని క్రైస్తవులు, ఐరోపాలోని క్రిస్టియన్ల దారిలో, క్రైస్తవం కంటె భారతదేశమే ముఖ్యం అని వ్యవహరిస్తే, అట్లే భారతీయ ముస్లిములు, పర్షియా, టర్కీలలోని ఆధునిక మహమ్మదీయ నాయకులలాగా, మన ఉమ్మడి భారతాన్ని, ఇస్లాంకన్న మిన్నగా గౌరవిస్తే, వారు భారతదేశంలో మనుగడ సాగించడానికి మనకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. అప్పుడు వారు తమ మతావలంబులుగా, తమ వ్యక్తిగత మోక్ష సాధన చేసుకుంటారు. కాని, భారతీయులుగా వారు విశ్వాసపాత్రులైన హిందువులుగా ఉంటారు. వారు మొదట భారతీయులు, తర్వాతే ఆయా మతాల వాళ్లు, వారి వ్యక్తిగత ముక్తి సాధన కంటె వారికి భారత సాంస్కృతిక, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం ఉంటాయి. అప్పుడు వారు హైందవత్వంలోని ఒక విడదీయరాని భాగం అవుతారు. ఇక వారిని, తిరిగి హిందూమతంలోకి మార్చడం వల్ల ఉపయోగం లేదు.

కాని ఇలాంటి, విస్తృత వ్యాప్తి చెందిన జాతీయ దృక్పథం ఇంకా ఒక కలలాగానే ఉండిపోయింది. హిందూ మతంలోకి వారిని తిరిగి మార్చడమనే ఉద్యమం యొక్క లక్ష్యం, కేవలం అప్పుడప్పుడు ఒక అరడజను మంది ముస్లింలనో, క్రిస్టియన్లనో మళ్లీ మార్చడం కాదు. లేదా తెలిసీ తెలియని కొంతమంది కొండ జాతి వారికి హిందూమతం ఇవ్వడం కాదు, ఒక అచ్చమైన జాతీయ భారతస్పృహను, హైందవత్వ స్ఫూర్తిని, అందరు భారత హైందవవేతరులలో కలిగించడం, ఆదివాసి గిరిజనులలో సైతం ఆ భావాన్ని రగిలించడం. అంతే కాని, కొద్దిమంది చేసే ఒకానొక మత బోధను వ్యక్తిగతంగా స్వీకరించడం కాదు. మొత్తం దేశాన్నే, తన జాతీయ సంస్కృతి, చైతన్యం, గర్వంలోకి తిరిగి తీసుకరావడం.

కాని ప్రజలను, దేశం, జాతీయ విలువల గురించి ఆలోచించి, అనుభూతించేలాగా జాగృతం చేయడం ఎలా? అదంత సులభమైన విషయం కాదు.

‘ఆధ్యాత్మిక’ విలువలు వ్యక్తికి మాత్రమే సంబంధించినవి కావాలి. ‘నైతిక’ విలువలు, వ్యక్తులు సౌకర్యవంతంగా సహజీవనం చేయడానికి తరతరాలుగా ఏర్పడిన నియమాల ప్రభావం నుంచి పుట్టినవి. అవి భారతీయుల ప్రజాభిప్రాయానికి ఒక రూపు ఇవ్వడంలో ఒక దైనిక పాత్ర పోషిస్తాయి. కాని జాతీయ విలువలు పోషించవు. ‘సిద్ధాంతాలు’ ఒకానొక రాజకీయ తత్వాని వైనపుడు, అది రాజకీయము కంటె ‘నైతికం’ అవుతుంది. అంతర్జాతీయ ‘ధర్మం’, ‘అధర్మం’, అనే ఒకానొక అమాయక దృక్పథం కలుగుతుంది. మరింత అమాయకమైన ఆశ, ధర్మం గెలుస్తుందని, కలుగుతుంది. ఇవన్నీ ఒక సగటు భారతీయుడి తీర్పుకు మార్గదర్శనం చేస్తాయి. జాతీయ అంతర్జాతీయ రోజువారి రాజకీయాల్లో, సగటు భారతీయుడు, శతాబ్దాల రాజకీయ వినాశంతో బాటు, అతని మహోన్నత సిద్ధాంతాల వారసత్వం వల్ల, ప్రపంచంలోని అత్యంత అణగారిన దేశాల పట్ల సానుభూతి  చూపిస్తాడు. అవి నిజంగా కనిపించినంత అణగారిన దేశాలా, కాదా అని  తెలుసుకోవడానికి ప్రయత్నించడు. అవి కాకపోవడం వల్ల హైందవత్వం గాని, భారతదేశం గాని ఏ ప్రయోజనం పొందుతుందనే విషయాన్ని అర్థం చేసుకోడానికి కూడ శ్రమ తీసుకోడు. ఒకటి  రెండు సంవత్సరాలుగా, హిందువులతో రాజకీయాలు మాట్లాడటమంటే, ‘పేద’ అబిస్సినియన్, ‘పేద’ చైనీయుల, ‘పేద’ యూదుల (బహుశా, ఇటీవల ‘పేద’  జెకొస్లోవేకియన్స్, ఇంకా ‘పేద’ అల్బేనియన్స్, ఇంకా ఈ జాబితాకు  ఇంకా ఎన్ని పేద దేశాలు చేరతాయో, దేవుడికెరుక) పట్ల విచారాన్ని వ్యక్తం చేయడమే. కాని ‘పేద’ భారతదేశం మాటేమిటి?

బహుశా, ప్రతి రోజూ, అతి వేగంగా జరుగుతున్న అంతర్జాతీయ మార్పులు ఆమెకు ఒక వరంగా పరిణమించవచ్చు, బహుశా కాకపోవచ్చు. కాని విషయం అది కాదు. హిందువులు ఈ సమస్యను శోధించడాన్ని అసలు పట్టింటుకోరు అనేదే అసలు విషయం. వారి తొలి ఆలోచన ‘ధర్మం’ ‘అధర్మం’ అంతే గాని “హైందవత్వానికి లాభం”  “దానికి నష్టం”. వారు ఒక స్వేచ్ఛాయుత, శక్తివంతమైన భారతదేశాన్ని పరిపాలిస్తూ, జీవిస్తారు. అదే వారి ప్రథమ ప్రాముఖ్యత. అప్పుడు మాత్రమే వారు తమకు నచ్చిన, ధర్మ అధర్మములకు సంబంధించిన నిర్వచనాలను కనుగొంటారు. వారికి, హిందువులకు అప్పుడు కొంత ఆశ ఉంటుంది.

జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఆలోచన చేయాలంటే రాజకీయ శిక్షణ అవసరం.

కాని, రాజకీయ శిక్షణ మాత్రమే చాలదు. లేదా రాజకీయ శిక్షణ ఎప్పుడు ప్రారంభమవ్వాలి? భావిపౌరులు, వార్తా పత్రికలలో తాము చదివిన దానిని చర్చించడానికి సమర్థులైనపుడైయితే బాగుంటుంది. అన్ని సక్రమ విద్యావిధానాలలాగే, అది ఇంట్లోనే, బాల్యం నుంచి ప్రారంభమవుతుంది. ఆ దేశపు తల్లుల మీద అది బలంగా ఆధారపడుతుంది.

ప్రతి గొప్ప దేశంలో, స్త్రీలకు వారి దేశం గొప్పదనే ఒక స్పృహ ఉంటుంది. జపాన్ లేదా జర్మనీని తీసుకోండి, ఈ రోజు భారతదేశ చరిత్రలో, రాజపుత్రుల ఉదాహరణనే తీసుకోండి, లేదా కార్నేలియా రోజుల్లో రోమన్లనే తీసుకోండి. గొప్ప గొప్ప వ్యక్తిత్వాలు కలవాళ్లు, తమ తల్లులిచ్చిన ఉత్తేజంతోనే గొప్ప వాళ్లవుతారు. ఉదా- శివాజీ మహారాజు. హిందూ స్త్రీలు చాలా కాలంగా అలాంటి ప్రేరణలకు దూరంగా ఉండడం వల్లే, అది కొంత వరకు రాజకీయ శిక్షణ లేమికి, జాతీయవాద స్ఫూర్తి లోపించడానికి కారణమైంది.

హిందూ స్త్రీలు, స్త్రీత్త్వమునకు ప్రతిరూపాలైన కొన్ని చక్కని సుగుణాలను కలిగి ఉంటారు. వారు అంకితభావం కలిగిన భార్యలు, తల్లులు. వారు లోలోపల ఎన్ని బాధలను అనుభవిస్తున్నప్పటికీ వారి  జీవితాల్లో, వారిలో, ఒక ప్రశాంతత ఉంటుంది. హిందూ మత సంప్రదాయాన్ని అవసరమైన దానికంటె కూడా, వారు ఎన్నో తరాలుగా, తమ పిల్లలకు సంక్రమింప చేస్తున్నారు. వారు మౌనంగా, లాలింపుతో, తమకు తెలియకుండానే, తమ వ్యక్తిత్వం ద్వారా, హిందువులను, లోలోన శాంతి కాముకులుగా చేస్తున్నారు. హైందవత్వం ఇంకా మనగలుగుతూ ఉందంటే, హైందవ స్త్రీల సాంప్రదాయిక దృఢత్వమే కారణమని చెప్పవచ్చు.

కాని హైందవత్వం మనగలుగుతూంది కాని, సజీవంగా లేదు. ఒక దేశంగా అది జీవించాలంటే, ప్రస్తుతం, చైతన్యం లేని సంప్రదాయ దృఢత్వం కాదు కావలసింది. ఎంత విలువైనదైనా, అంతర్గత శాంతి మాత్రమే చాలదు. ఎందుకంటే అది వ్యక్తిగతం. హిందువుల్లో ఒక కొత్త, బలమైన జాతీయవాద దృక్పథం పెరగాలంటే, ప్రతి హిందువు ఇంట్లో, ఒక కొత్త జాతీయవాద వాతావరణం ఏర్పడాలి. అదీ తక్షణావసరం.

ఉన్నత కులాల హిందు స్త్రీలలో, పట్టణ వాసుల్లో, కనీసం బెంగాల్‌లో, పాఠశాల మరియు కళాశాల విద్య అనేది మరింత అవసరమైనదిగా పరిగణించబడుతుంది. హిందూ సమాజంలోని ఒక వర్గంలోకి పాశ్చాత్య అనుకరణ అనబడే ఒక ఉత్తేజం మెల్లగా ప్రాకుతుంది. కాని, వ్వవస్థాగత విద్య వేరు, సంస్కృతి వేరు. అటువంటి విద్య అంటే జాతీయవాదం అని అర్థం కాదు. ఎందుకంటే అసలు జాతీయ విద్య అనేదే లేదు భారతదేశంలో. ‘పాశ్చాత్య అనుకరణ’ అనబడేది స్వేచ్ఛాజీవులతో ఏర్పడిన ఒకానొక తెగ తాలూకు అల్పమైన విషయాలకు ఒక చెడ్డ నకలుగా ఉండటమే. ఒక బానిసల సమూహం యొక్క మనస్సు, ప్రాచ్యంలో పాశ్చాత్యంలో దేశాలను బలపడేటట్లు చేసిన కనీస సుగుణాలను పరిగణించటానికి చేతకాని దానిగా ఉంది. ఒక జాతీయ క్రమశిక్షణ కావాలి. ప్రతి పురుషుడు, స్త్రీ, ఒక జాతీయ ప్రతిష్ఠను కలిగి ఉండాలి. వీటన్నింటినీ మించి, ప్రతి వ్యక్తిలో ఒక వ్యక్తిగత బాధ్యతాభావం ఉండాలి. అప్పుడే దేశం యొక్క సంక్షేమం సాద్యమవుతుంది.

తన వ్యక్తిత్వం, శీలంతో బాటు, తమ జాతీయ చైతన్యానికి కూడ దోహదం చేసేటట్లయితే, స్త్రీలకు పుస్తక పరిజ్ఞానం ఉపయోగకరమే. అలా కానప్పుడు, అది ఒక మానసిక ఆభరణం మాత్రమే అవుతుంది. అసందర్భ, చెడు అభిరుచి కలిగిన వారి నగ అవుతుంది. హిందూ స్త్రీలలో మనం కావాలంటున్నది శీలం యొక్క శక్తి (వారు లొంగి ఉండే దృక్పథం వల్ల మరింత బలహీనులైనారు).

పాశ్చాత్య దేశాల్లో (అంటే ఐరోపాలో) చిన్న పిల్లలకు కూడా, తమ దేశపు గొప్పతనం పట్ల ఆసక్తి చూపడాన్ని నేర్పుతారు. చిన్నారి ఫ్రెంచి, జర్మను, గ్రీకు పిల్లలు తమ బొమ్మ సైనికులను ఒక వరుసలో ఉంచి. యుద్ధం చేయిస్తారు. ఒక చిరిగిపోయిన తివాచీలోని ఒక చదరపు గజం స్థలంలో, రెండు దేశాలు తమ ఆధిక్యత కోసం తలపడే ఒక యుద్ధ భూమి ఏర్పడుతుంది. బొమ్మ సైనికుల నాయకుడు, నాలుగేళ్ల ఫ్రెంచి బుడతడు ఐతే, తప్పకుండా ఫ్రెంచి సైన్యమే గెలుస్తుంది. అదే, ఆ బుజ్జిగాడు జర్మన్ అయితే, గెలుపు జర్మన్ సైన్యానిదే. వాడు గ్రీకు అయితే, గ్రీకులకు టర్కీ వారికి యుద్ధం ఏర్పాటు చేస్తాడు. గ్రీకులను గెలిపిస్తాడు.

ఐరోపాలో, విదేశీ ఆధిపత్యంలోని దేశాలుండేవి. ఉదాహరణకు బాల్కన్‌లు. వారు చాలా శతాబ్దాలు టర్కీ జాతీయుల ఏలుబడిలో ఉన్నారు. టర్కిష్ పాలనలో, బాల్కనుల పిల్లలు, తమ తల్లి ఒడిలోనే దేశభక్తిని నేర్చుకునేవారు. తల్లులంతా, చాలా మటుకు నిరక్షరాస్యులే (భారతదేశంలోని ఇప్పటి లక్షలాది స్త్రీలలాగా), కాని వారికి తమ దేశం బానిసత్వంలో ఉందని, దానికి విముక్తి కల్పించాల్సి ఉందని, తమ పిల్లలకు బోధించేంత జ్ఞానం ఉండేది. బానిసత్వం దుస్సహం అని వారు పిల్లలకు చెప్పేవారు. “స్వేచ్ఛాకాంక్ష”ను గట్టిగా, నిరంతరంగా వారు మనస్సుల్లో నెలకొల్పేవారు. వారికి ‘జాతి’, ‘దేశం’ అనే భావం, జాతీయగర్వం ఉండేవి.

అదే స్ఫూర్తిని మనం హిందూ స్త్రీలలో కూడా చూడాలని అనుకుంటున్నాము. మన చిట్టిపొట్టి భారతీయ పిల్లలు కూడా,  మన భారతీయులు, మ్లేచ్ఛుల బొమ్మ సైనికులతో యుద్ధం ఆట ఆడుకోవడం మనం చూడాలి (అది ఒక వేళ సాధ్యానికి దగ్గరగా లేకపోయినా పట్టించుకోకండి). ఏదో ఒకరోజు, స్కూలు పిల్లలు, సమున్నత, సంపూర్ణ భారతదేశాన్ని ప్రపంచపటంలో, ఒకరికొకరు చూపించుకుంటారని భావిస్తాం (ఎప్పుడనేది వదిలెయ్యండి). ప్రతి హిందువు, బానిసత్వమనేది దుస్సహమని ఎప్పుడు భావిస్తాడో, భారతదేశపు స్వేచ్ఛ మరి ఎంతో దూరం లేదని తెలుస్తుంది. ఇది మొదట హిందూ తల్లికి అర్థం కావాలి. ప్రతి హిందూ గృహంలో, తల్లులు పిల్లలు, ప్రస్తుత సామాజిక ప్రమాణాల ప్రకారం, ఎలా ‘మంచి’ గా ఉండాలో చర్చించడం కాక, ఎలా ఒక దేశంగా మనం బలపడాలో, ఒక గొప్పదేశంగా పునస్సంభవించాలో చర్చించినప్పుడు, ఒక  గొప్ప ప్రపంచ శక్తిగా ఎదుగుతుంది. ‘పరిపాలించడానికి’, కేవలం ‘మంచి’ గా ఉంటే చాలదు.

హిందూ స్త్రీలు, తమకు తెలిసినంత వరకు, తమ కుటుంబ పరిధిలో, నిజాయితీగా, తమ దేశాన్ని గురించిన ఏ విషయాన్నయినా చర్చించగలిగే అలవాటును అలవర్చుకోవాలి. అది మనం చూడాలి. అది కేవలం రాజకీయాలు మాత్రమే కాదు, సామాజిక సమస్యలు కూడా కావచ్చు. వాటిని వ్యక్తిగత కోణంలో వారు చర్చించాలి. ఎందుకంటే, అవి ప్రతిరోజూ జరిగే విషాద సత్యాలు కాబట్టి.

ఉదాహరణకు, హిందువుల బహిరంగ సమావేశాల్లో, మహమ్మదీయుల చేత ఎంత మంది హిందు బాలికలు, స్త్రీలు, తమ సమాజం నుండి తరిమి వేయబడుతున్నారో, తరచుగా గుర్తు చేసుకుంటారు. ఈ దైనందిన ఘోరాలకు విరుద్ధంగా నిరసనలు కూడా జరుగుతుంటాయి. “మహమ్మదీయుల అన్యాయాలు”, “వారి దుర్మార్గం” లాంటి వాటికి విరుద్ధంగా, ఈ నిరసనలు, హిందూ బహిరంగ సమావేశాల్లో జరుగుతాయి. అదే సమయంలో, ముస్లింలు అధికారంలో ఉన్న ప్రాంతాల్లో, వారికనుకూలంగా జరిగే చట్టాలు, న్యాయసంస్కరణలను గురించి, పక్కన పెట్టేస్తారు. ఈ నిరసనలన్నీ నిరుపయోగమైనవి. ఈ కొత్త చట్టాలను, హిందువులు ఏమన్నా సరే, అమలు చేస్తారు. ఎందుకంటే, హిందువులవి ఉట్టి మాటలే తప్ప, చర్యలు శూన్యమని వారికి తెలుసు. హిందువులు బలహీనంగా ఉన్నంత వరకు ఇలాగే జరుగుతుంది. మహమ్మదీయుల దుర్మార్గం, అప్రతిహతంగా కొనసాగుతంది. ఎందుకంటే వారి ‘దుర్మార్గం’ అంటే వీరి ‘బలహీనతే’ కదా! హిందూ స్త్రీలకు జరిగే అవమానం అంటే వారి బలహీనతే. బలహీనులకు స్వేచ్ఛ, న్యాయం, గౌరవం, మతం లాంటి వేవీ ఉండవు మరి.

హిందువులు ఈ విషయాన్ని గుర్తించి, ప్రతిస్పందించాలి!

హిందువులు, అవమానం ఎవరికి జరిగినా, తమకు వ్యక్తిగతంగా జరిగినట్లే భావించాలి. సిగ్గుపడాలి. కోపం తెచ్చుకోవాలి. వారి భర్తలను, అన్నదమ్ములను, కుమారులను, ప్రతి చర్యకు పురికొల్పాలి. వారిని కనీసం అడగాలి  “ఏం చెయ్యాలి?” “ఏదో ఒకటి చెయ్యాలని” వారితో పునరుద్ఘాటించాలి.

తమ సొంత ప్రాంతంలో, హైందవత్వానికి అవమానం జరిగిందని వారికి తెలిసినపుడు, వారు తమ విచారాన్ని ఒక ‘గట్టిదైన’ రీతిలో వ్యక్తం చేయాలి (ఉదా- పొద్దున నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండటం ద్వారా). ఒక హిందువు కావడానికి, కేవలం కొన్ని ఆచారాలను, తిండి, పెళ్లి లాంటి విషయాలలో పాటించడం మాత్రమే కాదు, లేదా కొన్ని క్రతువులు నిర్వహించడం మాత్రమే కాదు, తాము ఏ దేశానికి చెందుతామో, దానితో మమేకం కావడమని వారు తెలుసుకోడానికి ఇది ఉపకరిస్తుంది. ఆ భావన, ప్రతి హిందువు గృహంలో, నిజాయితీగా, లోతుగా బలపడితే (బహరంగ సభల్లో కాదు) హిందువులందర్నీ అది సమూలంగా మార్చివేస్తుంది. ఏ హానీ చేయని గొర్రెలు, తమ గత వారసత్వం సింహాల జాతిదని చెప్పకోవడం కాదు, అది నిజంగా వారిని సింహాలుగా మారుస్తుంది.

చివరిదేగాని, చిన్న విషయం కాదు, మనం ఇంత వరకు చెప్పుకున్న క్రతుపరమైన, భక్తిపరమైన జాతీయతా వాదము, ప్రతి హిందూ గృహములో, ప్రతి స్త్రీలో, పిల్లల్లో విలసిల్లాలని మనం ఆశిస్తాం. మహారాష్ట్రలో, ప్రతి యింట్లోని నిత్య పూజలో, ఇతర దేవతలతో బాటు జాతీయ నాయకుడైన శివాజీ మహారాజ్ విగ్రహాన్ని కూడా ఉంచి, పూజిస్తారు, ఆయనను ఒక భగవంతుడిగా, మహారాష్ట్రకు, హైందవత్వానికి ప్రతినిధిగా, మొత్తం భారతజాతికే స్ఫూర్తిగా. ఇలాంటి స్ఫూర్తి, మహారాష్ట్రలోనే కాకుండా, ప్రతి ప్రాంతంలో, రగలాలి. భారత చరిత్రలోని వీరనాయకుల ఆరాధన కొనసాగాలి. హిందూ స్త్రీలు (ముఖ్యంగా అక్షరాస్యతా ప్రయోజనాన్ని పొందిన వారు), భారతదేశ చరిత్ర పట్ల మరింత ఆసక్తిని పెంచుకోవాలి. పురాతన ఇతిహాసాలను తెలుసుకోవాలి. వాటిని తమ సొంత చరిత్రగా పరిగణించాలి. అప్పడప్పుడు, తమ పిల్లలను చేరదీసి, వారికి, దేవతలు రాక్షసుల కథలే కాకుండా, చరిత్రలోని నిజమైన కథలను వినిపించాలి. చంద్రగుప్తుడు, పృథ్వీరాజు, ప్రతాపాదిత్యుడు, రాణాప్రతాప్, శివాజీ, రాణి పద్మిని, రాణి దుర్గావతి, ఝాన్సీలక్ష్మీబాయి వంటి ధీరపురుషుల, ధీరవనితల కథలు పిల్లలకు వినిపించాలి. భారతదేశపటం, దాన్ని దాటి సమున్నత భారత సరిహద్దులు, గత హిందూ శక్తి, హిందువుల ఆశలు నిరంతరం గుర్తు చేసుకోవడం, ఇవన్నీ ఆరాధించ తగినవి కావాలి. ప్రతి హిందూ గృహంలో, జాతీయ దేవతలు, నాయకుల విగ్రహాలతో బాటు, ప్రతి హిందూ బాలుడు, ఎవరో ఒక భారతీయ యోధుడిని, తన వ్యక్తిగత ఆదర్య వ్యక్తిగా గౌరవించాలి. ప్రతి హిందూ బాలిక తన తల్లితో ఇలా చెప్పాలి “అమ్మా, నేను పెద్దదాన్ని అయిన తర్వాత, ఝాన్సీ లక్ష్మీబాయి లాగా అవుతాను”.

అప్పుడే, హైందవ భారతం ఒక బలమైన శక్తిగా, ఒక వాస్తవంగా రూపుదిద్దుకుంటుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here