భారతీయులకు హెచ్చరిక-2

0
13

[box type=’note’ fontsize=’16’] భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినం గా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష అనువాద రచన ఇది. 1939లో ప్రచురితమైన సావిత్రి దేవి రచించిన ‘ఎ వార్నింగ్ టు ది హిందూస్’ అన్న పుస్తకాన్ని అనువదించి అందిస్తున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ. సావిత్రి దేవి గ్రీకు మహిళ. ఆమె భారత్ వచ్చి, భారతీయుడిని వివాహం చేసుకుని ఇక్కడే హిందువుగా స్థిరపడింది. దేశంలో జరుగుతున్న పరిణామాలను అవగాహన చేసుకుని భవిష్యద్దర్శనం చేసినట్టు 1939లో ఆమె రచించిన గ్రంథం ఇది. ఈ పుస్తకానికి వీర్ సావర్కర్ ముందుమాట రాశారు. ఈ పుస్తకంలో ఆమె ఏదయితే జరిగే ప్రమాదం వుందని హెచ్చరించిందో అదే నిజమవటం ఈ పుస్తకం ప్రాధాన్యాన్నీ విలువను పెంచుతుంది. ప్రస్తుతం దేశంలో మళ్ళీ అనుమానాలు, ఆవేశాలు, ద్వేషాలు అధికమై సామరస్య వాతావరణాన్ని రాజకీయ లబ్ధి కోసం కలుషితంచేసి వికృత విషపుటాలోచనలను విస్తృతంగా వెదజల్లుతున్న తరుణంలో గతంలోని పొరపాట్లను స్మరించటం ద్వారా చరిత్ర పునరావృతం కాకుండా జాగ్రత్తపడేవీలుంటుందని, చరిత్రలో మరుగున పడ్డ అనేక సత్యాలను తెలుగు పాఠకులకు పరిచయం చేయాలన్న వుద్దేశంతో ఈ అనువాదాన్ని అందిస్తున్నాము. [/box]

పరిచయం

[dropcap]‘మ[/dropcap]తాన్ని’ గురించిన చర్చ ఎప్పుడూ అయోమయానికి దారి తీస్తుంది. ఎందుకంటే  దాన్ని గురించి మాట్లాడుతూన్న ఇద్దరు వ్యక్తులు ‘మతం’ అనే విషయాన్ని పూర్తిగా విభిన్నమైన దృక్పథాలతో చూడవచ్చు . బహుశా వారికి తెలియకుండానే పరస్పర విరుద్ధమైన రెండు విషయాల గురించి మాట్లాడుతూండ వచ్చు. కాబట్టి, మత మంటే ఏమిటి? మొదటగా జవాబు చెప్పాల్సిన ప్రశ్న ఇది.

ఎవరయినా సరే, మొదట ‘మతాన్ని’ కేవలం కొన్ని నైతిక బోధనలుగా పరిగణిస్తారు. దాదాపు ప్రతి మత గ్రంథంలో మానవుని నైతిక ప్రవర్తనకు సంబంధించిన ఉపదేశాలుంటాయి. ఉదా: ‘దొంగతనము చేయరాదు.’ ‘ఇతరులను చంపకూడదు’ లేదా ‘ఏ జీవిని చంపడమైనా నేరమే’, లేదా ‘మద్యపానం హానికరం. దాన్ని వర్జించు’ అలాగ. వివిధ మతాల్లో ఈ నైతిక విలువల ప్రమాణాల్లో తేడాలు ఉన్నాయి. ఉదాహరణకు జైనమతాన్ని బట్టి, ఒక జంతువును చంపడం పాపం. కాని క్రైస్తవమతంలో అది పాపం కాదు. ఏ నైతిక బోధ ఐనా ఒక విధమైన సమాజాన్ని ప్రతిపాదిస్తుంది. కాబట్టి ప్రతి మతంలోని నైతిక సూత్రాల్లో, కొన్ని కనీస మిహాయింపులు ఉన్నాయి. ఎప్పుడూ, ఎక్కడా ఐనా ‘పాపపూరిత’ చర్యలు అవి నిషేధింపబడిన అయాకాలాల్లో, ఆయా స్థలాల్లో తప్పకుండా సంఘ వ్యతిరేక చర్యలే, . కాని కొన్ని చర్యలు, తప్పకుండా సంఘ వ్యతిరేక మవుతాయి. ఉదాహరణకు వ్యక్తిగత కారణాలతో ఒక వ్యక్తిని హత్య చేయడం వంటివి. అలాంటి వాటిని ఏ నైతిక సూత్రమూ సమర్థించలేదు. సహించలేదు కూడా. అలాంటివి అన్ని మతాల్లో కనీసంగా , నైతిక దృక్పథంలో సమానంగా,  నిషేధింప బడి ఉంటాయి.

మతాలను ఆధిభౌతిక వ్యవస్థలుగా పరిగణించినప్పుడు, అవి మరింత లోతైన విభేదాలతో కనిపిస్తాయి. ఇక్కడ ప్రాథమిక సూత్రాల్లోనే తేడా వస్తుంది. అన్ని మతాలకు సమానంగా ఒక ఉమ్మడి ఆధ్యాత్మిక దృక్పథం, అందరూ ఆమోదించే సిద్ధాంతాలు సాధ్యం కావు. భగవంతుడు, సృష్టి, ఆత్మ లాంటి లోతైన విషయాలు మతానికీ మతానికీ మారుతూంటాయి. భగవంతుడు అసలు కనబడడనే భావనతో కూడ మతం మనగలదు,  దాన్ని అనుసరించేవారి ఆధ్యాత్మిక ఆదిభౌతిక దృక్పథంలో. ఇది బౌద్ధ, జైన మతాల్లో, ఇంకా కొన్ని అప్రసిద్ధ మతాల్లో కనబడతుంది. ‘ముక్తి’ అనే భావన కూడ అంత అవసరమైనది కాని మతాలున్నాయి. షింటోయజమ్ అలాగే ఏర్పడింది. అలాగే గ్రీసు, రోమన్ దేశాల జాతీయ మతాలు కూడా .  ఉదాహరణకు ఒక క్రైస్తవుడు లేదా హిందువు, ‘ముక్తి’ అన్న సిద్ధాంతం మీద దృష్టి నిలిపినప్పుడు, అది పూర్తి విభిన్నంగా దర్శనమిస్తుంది. అది అసాధ్యమైనదిగాను. ఆధ్యాత్మికంగా చూస్తే ఆ రెండు మతాలకూ సమానం కాని దాని గాను గోచరింస్తుంది.

కాని, వివిధ మతాలను నైతిక లేదా మేధాపర దృక్పథాలతో చూడటాన్ని పట్టించుకోకుండా, వాటిని కేవలం ఆధ్యత్మిక దృక్పథంతో వీక్షిస్తే, అంటే ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి వివిధ మార్గాలుగా భావిస్తే, కొంత ఐక్యత కనబడుతుంది. కాని దాన్నిమనం విభిన్న మతాల ఐక్యత అనలేము. అది కేవలం మానవుని గురించిన అన్ని మత ప్రభోధాల చివరి ఫలితాల గుర్తింపు మాత్రమే. అన్ని మార్గాలూ దారి తీసేది ఒక్కచోటుకే. వివేక, విచక్షణార్థులకు అదే ముఖ్యమయినది కావొచ్చు. కాని ‘ఆ మార్గాలు భిన్నమైనవి’ ఈ ప్రపంచంలో మతాలు ఎప్పుడూ కలవవు. వాస్తవిక ప్రపంచాన్ని చేరుకునే దారుల్లాగే.

కాని, ఉమ్మడి ఆధ్యాత్మిక భావజాలాన్ని బట్టిగానీ, ఉమ్మడి ఆది భౌతిక సిద్ధాంతాన్ని బట్టిగానీ మతాల మధ్య ఐక్యతలేనప్పుడు, కనీసం మానసిక పునాదిపై అయినా ఒక విస్తృతమైన, ద్విముఖమైన వర్గీకరణ చేయవచ్చు.

కొన్ని మతాలున్నాయి. క్రైస్తవం, ఇస్లాం వంటివి. వాటిలోని బోధనలను,  ఆ మతానుసరణ చేసేవారు ‘పరిపూర్ణ సత్యం’గా భావిస్తారు. ఈ బోధలు మానవులకందరికీ మంచివి, వాటిని బోధించడం ఆ మతాలను అనుసరించే వారందరి విధి, వాచ్యంగా, ఆచరణలో సైతం, వాటిని ప్రతి మానవుడు అంగీకరించాలి, రక్షింపబడాలి. అలాంటి మతాలు తమను తాము విశ్వమతాలుగా పరిగణించుకుంటాయి. వాటిని అనుసరించే వారి పరమార్థం ఏమిటంటే, ఆయా నైతిక ఆధ్యాత్మిక బోధనల ఆధారంగా ఆయా ఆధిభౌతిక విశ్వాసాల మూలంగా, వాటిని సంపూర్ణ సత్యాలుగా గౌరవించి, మానవజాతిని ఏకం చేస్తాయని. ఆ బోధనలు ఒకేసారి, శాశ్వతంగా, ఒక చోట, ఒక వ్యక్తి చేత, ఒక పవిత్ర గ్రంథంలో నమోదు చేయబడి ఉంటాయి. వాటిని మార్చడం గాని, కొత్తవి చేర్చడం గాని జరగనే జరగదు.

భౌగోళిక, రాజకీయ, ఇతర పరిస్థితుల దృష్ట్యా ఆచార్య వ్యవహారాలు ఒక చోటకీ ఇంకో చోటికీ మారతాయి. ఎప్పటి వరకంటే, ఆ మత వ్యవస్థలోని మౌలిక విశ్వాసాలు వాటి వల్ల భంగం కానంత వరకు. ఈ మౌలిక విశ్వాసాలు ఉన్నంత వరకు, సంస్కృతి కూడాదేశానికీ దేశానికీ మధ్య విభిన్నంగా ఉంటుంది. ఒక ప్రిస్‌బెటిరియన్ స్కాచ్‌మన్‌కు, ఒక క్యాథలిక్ స్పానియార్డ్‌కు, ఒక సిరియన్ క్రిస్టియన్‌కు, ఒక అబిసినియన్‌కు గల తేడాల కంటే గొప్ప భేదలేముంటాయి. కాని వారందరిలో ఒక ఉమ్మడి విశ్వాసం ఉంది. అదే వారందరినీ క్రిస్టియన్స్‌గా తమను తాము ప్రకటించుకోవడానికి, సమర్థించుకోవడానికి సరిపోతుంది. ఇదే  విషయం అరేబీయా లేదా ఇరాక్ లోని మహమ్మదీయునికి, జావాలోని ముస్లింకు కూడా వర్తిస్తుంది.

వీటినే ‘విశ్వాసాధారితమతాలు’ అనవచ్చు. క్రైస్తవం, ఇస్లాం వంటివి.   వాటిని అనుసరించే వారి మధ్యగల సంబంధం వారి ఉమ్మడి నాగరికత లేదా సంస్కృతి మీద అధారపడకుండా, వారి ఉమ్మడి విశ్వాసములపైనే ముఖ్యంగా ఆధారపడి ఉంటుంది.

కాని కొన్ని మతాలున్నాయి. అవి ఏవిధమైన నైతిక లేదా ఆదిభౌతిక ‘సత్యాన్ని’, పరిపూర్ణమైన దానిగా అంగీకరించవు. వాటిని అనుసరించేవారు కొన్ని ఉమ్మడి విశ్వాసాలను అంగీకరించవచ్చు లేదా అంగీకరించకపోవచ్చు. ఒక వేళ అంగీకరించకపోయినా, వారు ఇతర విశ్వాశాలను,   ఇతర మతాలను తప్పు అని నిందించరు. వాటిని ‘మూఢనమ్మకాలతో నిండిన విలువైన బోధలు’ గా పరిహసించి, తక్కువ చేయరు. నిజానికి అలాంటి మతావలంబులు ఒకరితో ఒకరు మత సిద్ధాంత, నైతిక ఆదిభౌతిక పరంగా విభేదిస్తారు కూడా. ఉదాహరణకు పురాతన గ్రీకు సంస్కృతిలో, ఒకే జాతీయ మతాన్ని అనుసరించేవారు, విభిన్న, పరస్పర విరుద్ధమైన సిద్ధాంతాలను కలిగి ఉంటారు. వారి జాతీయ మతంలో, హెలెనైజ్‌డ్ క్రైస్తవ మతంతో పోల్చిచూస్తే కనబడే ఉమ్మడి ఆధ్యాత్మిక వ్యవస్థ ఉండదు. ఆధునిక భారతీయ సంస్కృతిని తీసుకుందాం. అందులో రకరకాల పద్ధతులు, తెగలు ఉన్నాయి. వారి మత పరదృక్పధంలో సమానత్వం ఉండదు. ఒకరు వ్యక్తిగతంగా ఒక దేవుడిని పూజిస్తారు. ఇంకొకడు దేవుడిని నిరాకారుడిగా ధ్యానిస్తాడు. మూడోవాడు దేవుడినే నమ్మడు! ఒకడు హఠయోగాన్ని అభ్యసిస్తాడు. మరొకడు కేవలం భక్తినే నమ్ముకుంటాడు. అయినా, వారంతా భారతీయ ధర్మానుయాయులే. పురాతన గ్రీకుల్లాగా, వారి వారి విభిన్న ఆధ్యాత్మిక భావాలకతీతంగా, విభిన్న దేవతల పట్ల వారికున్న వ్యక్తిగత భక్తి కతీతంగా, వారంతా ‘ధర్మాన్ని’ అనుసరించేవారే.

కాబట్టి, విషయంలో ‘మతం’ అనేది పైన చెప్పన ‘విశ్వాసాధారిత’ క్రైస్తవ, ఇస్లాం లాంటి మతాలకు వర్తింపజేసి పోలిస్తే,  పూర్తిగా విభిన్నమైన అర్థాన్ని కలిగి ఉంటుంది.

ఇక్కడ సత్యం అనేది ఉండదు. అది భగవంతుడు, ఆత్మ, ముక్తి, సృష్టి, లేదా దేని గురించైనా కావొచ్చు అందరూ పరిగణించగలిగే, పరిపూర్ణ సత్యం లాంటిది ఉండదు. ప్రతి సత్యమూ సాపేక్షమే. అది మానవుని అనుభవాల నుంచి పుట్టిందే. అది త్పపకుండా పరిమితమై ఉండవలసి ఉంది. కాబట్టి విశ్వాసాధారిత మతాల్లోని భావజాలానికి మూలమైన ఆధ్యాత్మికత అనేది ఒక వ్యక్తిగత దృక్పథానికి సంబంధించిన విషయం మాత్రమే. ఆధ్యాత్మిక వికాసం, జ్ఞానం కూడ వ్యక్తిగతమే. దానిని ఒక సమూహానికి ఇవ్వలేము. పంచలేము. ఆత్మ జ్ఞానాన్ని కూడ ఎవరికి చూపించగలమంటే, తమ గత అనుభవాల ద్వారా, తగినంత క్రమానుగత అవగాహన కలిగిన వారికి మాత్రమే.

ఇంకో రకంగా చెప్పాలంటే, విశ్వాసాధారిత మతాలు కాని మతాల్లో, మతానికీ, వేదాంతానికీ మధ్య ఘర్షణ ఉండదు. మతానికి నిజ్ఞాన శాస్త్రానికీ మధ్యన కూడా ఉండదు. ఆధునిక భాషలో చెప్పాలంటే, ఒక విస్తృత పరిశోధనా స్పూర్తికి శాస్త్రీయ దృక్పథం, ఎటువంటి ఆంక్షలు లేకుండా, వర్తిస్తుంది. పరిణామ క్రమంలోని వివిధ దశలలో మానవులకు సూచించబడే ఉమ్మడి విశ్వాసాలు ఉండవు. దేవుడు, ఆత్మలాంటి విషయాల మీద ఏకపక్షమైన దృక్పధం ఉండదు. ‘మానవ జాతికంతా మంచి జరగాలి’ అనేదే బోధింపబడుతుంది.

విశ్వాసాధారిత మతం కాని  పరిపూర్ణమైన ధర్మం  భారతీయధర్మమని మనం చెప్పవచ్చు. దాన్ని మరింత సకారాత్మకంగా వివరించే విశ్లేషణ  ముందు చేద్దాం. మనం ముందుగానే అనుకున్నట్లు, ‘మతం’ అంటేనే నైతిక విలువలు, ఆధ్యాత్మికత ఎదుటనిలుస్తాయి. ఒక సమాజాన్ని, దాని లక్షణాలను చప్పాలంటే దాని సంస్కృతి, నాగరికతలను గురించి చెప్పాల్సి ఉంటుంది.

ఈ విశ్వాసాధారిత మతాలు కూడ నాగరికత సమాజం వంటి చారిత్రక విషయాల నుండి దూరం పోలేవు. విశ్వాసం ఒక విషయమైతే, సమాజం మరొకటి. అది నిజం. వ్యవస్థాగతమైన సమాజం లేకుండా, విశ్వాసం ఒక మతంగా నిలువలేదు. కానీ ఎటువంటి విశ్వాసపరమైన ఐక్యత లేకుండా ఒక సమాజంలోని వ్యక్తులు ఒక ఉమ్మడి నాగరికతను, సంస్కృతిని పంచుకుంటే, ఆ సమాజం అద్భుతంగా నిలబడగలదు. ఈ రెండు రకాల మతాల మధ్య తేడా ఏమిటంటే, విశ్వాసాధారిత మతాల్లో ఐక్యతా సిద్ధాంతం, సౌభ్రాతృత్వం అనేవి ఉమ్మడి విశ్వాసం మీద ఆధారపడి ఉంటాయి. సంస్కృతి నాగరికతల మీద ఆధారపడి ఉండవు. అదే భారతీయ ధర్మంలో ఐక్యత, సర్వమానవ సౌభ్రాతృత్వం ఉమ్మడి సంస్కృతి నాగరికతల మీద ఆధారపడి ఉంటాయి. ఉమ్మడి విశ్వాసం మీద కాదు.

ఇద్దరు భారతీయులున్నారు. ఒకడు దేవున్ని నమ్ముతాడు. ఇంకొకడు నమ్మడు. ఇద్దరూ భారతీయ ధర్మానుయాయులే! వారిద్దరూ ఒకే సంస్కృతిలో, నాగరికతలో పాలు పంచుకున్నపుడు, భారతీయ ధర్మానుయాయులందరికీ ఉమ్మడిగా ఉండవలసిన ఐక్యత వారిలో ఉన్నపుడు అదే ‘భారతీయ ధర్మం’. ఒక ఆమెరికన్ లేదా ఫ్రెంచి జాతీయుడు, ‘భారతీయతత్త్వం’ లోని బహుళసిద్ధాంతాలను, వేదాంతాన్ని, భక్తిని అంగీకరించినా, వాటిని ఆలోచనల్లో, జీవిత విధానంలో, స్వీకరించి, ఆచరించకపోతే, దాని ద్వారా భారతీయ సమాజంలో భాగం కాలేకపోతే, అతడు భారతీయుడు కాలేడు! సమాజ పరంగా చెప్పాలంటే, భారతీయ  సమాజం అతన్ని తన సభ్యులలో ఒకరిగా అంగకరించేంత వరకు అతడు భారతీయ ధర్మానుయాయి  కాలేడు. ఒక క్రైస్తవడు కావాలంటే మన చేతుల్లో ఉంది. కాని ఒక నిర్దిష్టమైన భారతీయ ధర్మానుయాయి కావడం ముఖ్యం. విశ్వాసాధారిత మతం కాని మతానుయాయి కావడం మాత్రం మన చేతుల్లో లేదు!

నాగరికత, సంస్కృతి అనేవి భౌగోళిక, చారిత్రక పరిస్థితులకు అతీతంగా ఉండవు. విశ్వాసాధారిత మతాన్ని అనుసరించని మతాలవారు, సహనం, సాపేక్షత అనే రెండు రకాల స్ఫూర్తితో బాటు, వారి మత పరమైన సిద్ధాంతానికి సంబంధించిన వరకు దానిని భౌగోళికంగానే భావిస్తారు. వారికి మతమంటే సమాజమే. కొన్ని విశ్వాసాల ద్వారా మానవ జాతిని ఏకీకృతం చేయాలనే కల, అది భ్రాంతి తప్ప మరేమీ కాదు. ఎందుకంటే ప్రపంచ మంతా ఒకేవిధమైన జీవిత విధానం, సమాజస్వరూపం ఉండవు కదా! కాబట్టి, విశ్వాసేతర మతంలో  చేపట్టే ఏ చర్యలు కూడ కొన్ని భౌగోళిక పరిమితులను దాటి వెళ్లలేవు.

ఈ చర్చ తరువాత, మనం ఆశ్చర్యపోవచ్చు. నైతికత కాని, ఆధ్యాత్మికత కోసం బంధంలేని, సమాజంతో ముడిపడని, ‘నిజమైన మతం’ ఏదైనా అసలు ఉందా? అని. ఉంటే అది ఏమిటి? దాన్ని నకారాత్మకంగా తప్ప నిర్వచించడానికి వీలుపడదా? అలాంటి నిజమైన మతం ఆధ్యాత్మిక అనుభవం తప్ప వేరొకటి కాదు.

మతాలు ఎంత విభిన్నంగా ఉన్నా, ‘మతం’ ఒక్కటే అనేది స్పష్టం,  మౌలిక కోణంలో పరిశీలిస్తే సత్యాన్ని తెలుసు కావడమే పరమావధిగా అభ్యసించే ఆధ్యాత్మిక అనుభవజాలమే నిజమైన మతం. శ్రీ రామకృష్ణ పరమహంస వంటి బోధకులు చెప్పినట్లుగా, అన్ని మతాల లక్ష్యం ఒక్కటే. ఆత్మసాక్షాత్కారం!

ఆధ్యాత్మిక అనుభవం తప్పకుండా కొన్ని ఆధిభౌతిక విషయాలు, సమస్యల గురించిన అవగాహన కలిగిస్తుంది. కాని అది ఆధిభౌతికత కాదు. భిన్నమైనదని జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే దానిని మేధస్సు ద్వారా చర్చించలేము. దాని లోతుల్లోకి వెళ్లాలి (నిజానికి, ఆధ్యాత్మిక అనుభవానికి అతీతంగా ఉంటే ఆధిభౌతికత, మనిషి బలహినతకు గుర్తు. అలాంటి వాడు, తనకో తెలియని అర్థం కాని భావాలు ఉన్నాయని భావిస్తాడు. గొప్ప ఆధిభౌతిక వ్యవస్థలన్నీ, మానవుని ఆలోచనా క్రమపరిమామాన్ని బట్టే తమ ప్రభావాన్ని చూపాయి. వాటి వెనక తప్పక ఒక ఆధ్యాత్మిక అనుభవం ఉంది ఉంటుంది). క్రైస్తవం లాంటి విశ్వాసాధారిత మతాలు, తమ  విశ్వాసాలు మేధస్సు ద్వారా అర్థం కావంటాయి. అది నిజమే. నిజమైన మతం (ఆధ్యాత్మిక అనుభవం) అనీ దృక్పథం దృష్ట్యా, ఇలాంటి మతాలు అన్నీ అసంపూర్ణాలే. ఎందుకంటే అవి తమ   విశ్వాసాలను అందర్నీ నమ్మమని కోరతాయి. సత్యాన్వేషణకు మార్గాలను సూచించవు. పైగా ఆ విశ్వాసాలను అనుసరించకపోతే,  అంగీకరించకపోతే ‘ముక్తి’ ఉండదని కూడా నిర్ధారిస్తాయి.

కాని, ఆధ్యాత్మిక అనుభవం వ్యక్తిగతమైనది. దాన్ని ఇంకోకరికి పంపలేము. దాన్ని పొందాలనే కాంక్షను కూడ అందరిలో కలిగించలేము. కేవలం ఒక జ్ఞాని చెప్పిన పదాలతోని సత్యాన్ని మేధాపరంగా అంగీకరించడం, లేదా ఒక ప్రేరిత గ్రంథం లోని వ్రాతలపట్ల గుడ్డినమ్మకాన్ని కలిగి ఉండడం అనేవి ఆధ్యాత్మిక అనుభవానికి, ఆత్మసాక్షాత్కారానికి తార్కాణాలు కావు. అందుకే అటువంటి మతాల్లో, ఒక నైతికత, ఒక సిద్ధాంతం ఉంటాయేమోగాని, నిజమైన మతం అంటే వ్యక్తిగతంగా ఆత్మసాక్షాత్కారాన్ని పొందడం, అనేది ఉండదు. ఉండాలని ఆశించలేం కూడా.

ఆధ్యాత్మికతను నేరుగా బోధించడం కాదు చేయవలసింది. జీవితపు అలవాట్ల ద్వారా, అచార వ్యవహారాల ద్వారా; కళ, సంస్కృతుల ద్వారా, దైనందిన కార్యకలాపాల ద్వారా ఆధ్యాత్మిక అనుభవాన్నిమానవుడు పొందదగిన అంతిమ అనుభవంగా చేయగల ఒక వాతావరణాన్ని సృష్టించడమే చేయవలసింది. దానికి ఏ ఉమ్మడి విశ్వాసమూ అవసరము లేదు. కొన్ని శాశ్వత ప్రభావాలు, కొన్ని ప్రత్యేక సామాజిక పరిసరాల్లో కల్పిస్తే చాలు. దానినే తరతరాలుగా, ఇప్పటి వరకు భారతీయులు చక్కగా అర్థం చేసుకున్నరు. భారతీయ ధర్మం  యొక్క గొప్ప   విశిష్టత ఎందులో ఉందంటే దాని అనేకమైన నైతిక విలువల పునాదిలో, మరియు విశ్వాసాల్లో లేదు. దాని సంస్కృతి చేత, సృజనాత్మకంగా చెప్పాలంటే, దాని క్రమానుగత జీవనవిధానంలో ఉంది.

కాని భారతీయ నాగరికతను పరిరక్షించడానికి, భారతదేశమంతటా భారతీయ వ్యవస్థను ఏర్పరచడానికి ఇదే కారణం కాదు, ముఖ్యకారణం కూడా కాదు.

ఉమ్మడి విశ్వాసము, అనే ఎరుక చేత బలంగా ఐక్యంగా మన పోటీదారు మతాలకు, వాటి పెరుగుతున్న ఒత్తిడికి విరుద్ధంగా మనం భారతీయ నాగరికతను, సమాజాన్ని సమర్థించాలనుకుంటున్నాం. ఎలా అంటే,   వేదాలు, ఉపనిషత్తులలో ఉన్న ఉన్నత వేదాంతాల ద్వారా కాకుండా, భారతీయ జ్ఞానులు, యోగులు, దార్శనికులు సాక్షాత్కరింప జేసుకున్న మహోన్నత ఆధ్యాత్మిక ఆదర్శాల ద్వారా కాకుండా, మనం భారతీయ ధర్మాన్ని  సమర్థించుకోవాలని ప్రయత్నిస్తున్నాం. అది సరికాదు. ఈ క్షణంలో భారతదేశం ఉనికిలో లేకుండాపోయినా, భారతీయుల వేదాంత ఆధ్యాత్మిక వారసత్వం మాత్రం చెక్కుచెదరదు. మానవ జాతే దానిని పరిరక్షిస్తుంది. ఎందుకంటే అది పరిరక్షించడానికి అన్ని విధాలా తగినది కాబట్టి. దానికి మరణం లేదు. దాన్ని ఎవరూ సమర్థించనవసరం లేదు కూడా. మనం సమర్థించవలసింది, ముమ్మాటికీ, భారతీయ సమాజాన్ని, భారత ప్రజానీకాన్నీ, భారతీయ నాగరికతను భుజాల మీద మోస్తున్న వారిని.  ఎందుకంటే వారి సంఖ్య నానాటికీ తగ్గిపోతూ ఉన్నది. భారతీయ ధర్మానికి  రూపం వారే. ఆ రూపం సంపదలే మహోన్నత వేదాంతాలు, ఆధ్యాత్మిక సాక్షాత్కారాలు, చిరకాలం మన్నే భారతీయ  ఆత్మ.

మన లక్ష్యం, భారతీయ సమాజం నశించకుండా చూడడం. ప్రస్తుత బలహీన స్థితి వల్ల జడత్వాన్ని పొందకుండా చూడటం. అది సజీవంగా ఉండడమే మనకు కావాలి. ఎందుకంటే అది పరమోత్కృష్టమైనది, పరమ సుందరమైనది. ఎందుకంటే అది భారతీయం. కాదు కాదు.. అదే భారతదేశం. కాబట్టి దాన్ని సమర్థించడానికి మనకు వేరే కారణం అవసరం లేదు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here