భారతీయులకు హెచ్చరిక-7

0
10

[box type=’note’ fontsize=’16’] భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినం గా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష అనువాద రచన ఇది. 1939లో ప్రచురితమైన సావిత్రి దేవి రచించిన ‘ఎ వార్నింగ్ టు ది హిందూస్’ అన్న పుస్తకాన్ని అనువదించి అందిస్తున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ. సావిత్రి దేవి గ్రీకు మహిళ. ఆమె భారత్ వచ్చి, భారతీయుడిని వివాహం చేసుకుని ఇక్కడే హిందువుగా స్థిరపడింది. దేశంలో జరుగుతున్న పరిణామాలను అవగాహన చేసుకుని భవిష్యద్దర్శనం చేసినట్టు 1939లో ఆమె రచించిన గ్రంథం ఇది. ఈ పుస్తకానికి వీర్ సావర్కర్ ముందుమాట రాశారు. ఈ పుస్తకంలో ఆమె ఏదయితే జరిగే ప్రమాదం వుందని హెచ్చరించిందో అదే నిజమవటం ఈ పుస్తకం ప్రాధాన్యాన్నీ విలువను పెంచుతుంది. ప్రస్తుతం దేశంలో మళ్ళీ అనుమానాలు, ఆవేశాలు, ద్వేషాలు అధికమై సామరస్య వాతావరణాన్ని రాజకీయ లబ్ధి కోసం కలుషితంచేసి వికృత విషపుటాలోచనలను విస్తృతంగా వెదజల్లుతున్న తరుణంలో గతంలోని పొరపాట్లను స్మరించటం ద్వారా చరిత్ర పునరావృతం కాకుండా జాగ్రత్తపడే వీలుంటుందని, చరిత్రలో మరుగున పడ్డ అనేక సత్యాలను తెలుగు పాఠకులకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఈ అనువాదాన్ని అందిస్తున్నాము. [/box]

భారత జాతీయతావాదం, చైతన్యం

మొదటి ప్రకరణము – ఐదవ అధ్యాయము-1

సాంఘిక సంస్కరణలు

[dropcap]మ[/dropcap]నం చెప్పుకొన్నట్లు, భారతీయతత్వం  యొక్క సౌందర్యంగాని, దానిలో  ఉన్న   వేదాంతంగాని, దానిలో పరిఢవిల్లిన కళగాని, దాన్ని రక్షించలేవు, గ్రీకుల సనాతనత్వం, దాని స్వేచ్ఛాయుత ఆలోచనా సరళి, పురాతన గ్రీసుదేశపు నాగరికతను సమాజాన్ని పరిరక్షించలేకపోయినట్లే.

మానవజాతికి భారతీయ ధర్మం ఇచ్చిన గొప్ప కానుక – స్వేచ్ఛాపూరిత ఆలోచనలకు మతపరమైన సమ్మతినివ్వడం కావొచ్చు. ఇది, అన్ని విషయాల్లో అనుభవం మీద మాత్రమే మంజూరవుతుంది. కాని, భారతీయుడు  కాకుండా కూడా, ఒక వ్యక్తి స్వేచ్ఛగా ఆలోచించేవాడు కావచ్చు, తత్త్వం బోధపడిన వాడు కూడా కావచ్చు. ప్రస్తుత భారతావనికి భారతీయ ధర్మం ఇచ్చిన వరం, ఒక విస్తార జాతీయ ఆరాధన ద్వారా, తన పునరుద్భవమైన జాతీయతా భావాన్ని ఆవిష్కరించుకునే వెసులు బాటును కల్గించడం. కాని, భవిష్యత్‌లో ఒక భారతీయుడు, ఒక హిందువుగా  ఉండకపోతే మటుకు, ఒక జాతీయవాది కాలేడు. అతని భారతదేశం మన భారతదేశం కాదు. కాని ఆమెను అతడు బహుశా తన మతంకన్న మిన్నగా ప్రేమిస్తాడు (క్రైస్తవ మతానికి అతీతంగా తమ జాతిని గౌవించే రోమనులు లేరా? ఊహజనితమైన ఒక మహామ్మదీయ భారతంలోని వ్యక్తులు కూడా, దేశాన్ని ఇస్లాంకు అతీతంగా భావిస్తారు. ముందే ఎవరూ దీనిని చెప్పలేరు).

కాబట్టి, భారతీయ ధర్మాన్ని భారతదేశపు అరాధనా ప్రక్రియ, ఆమె మత భావాల సమ్మేళనంగా, చూపిస్తే చాలదు. తమ పట్టును, పరిధిని అసలు కోల్పోతామని కలలో కూడా ఊహించని భారతీయులకు, ఈ చర్చ అంతా మంచిదే. కాని అది నిరుపయోగం కూడా. దాని ఫలితం, ఆ భారతీయులను, తమ పట్ల తాము కొంచెం గర్వపడేలా చేస్తుంది – అంతే!

క్రైస్తవులుగా,  ముసల్మానులుగా మారిన భారతీయులకు ఈ విషయాలు చెప్పామనుకోండి,  వారి మీద ఏ ప్రభావమూ ఉండదు. ఎందుకంటే, ఒక వ్యక్తి యొక్క మత మార్పిడికి కేవలం హేతుబద్ధతే కారణం కాదు. భారత జాతీయవాదానికి సైతం స్పందన ఉండదు. తన పరిధిని కోల్పోయిన భారతీయుడికి, భారతదేశం కంటే ప్రియతమమైన విషయాలుంటాయి.

వాదనల ద్వారా భారతీయ ధర్మాన్ని సమర్థించడానికి ప్రయత్నించే ముందు, అసలు భారతీయులు తమ పట్టును, పరిథిని  ఎందుకు  వదిలేసి పోతారు అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. మతపరమైన కారణాలతో, తమ మతాన్ని వదిలి పెడుతూన్న భారతీయులు మూర్ఖులు అని చెప్పవచ్చు. వారు ఇతర మతాల్లో చూచిందంతా, విస్తృతమైన, సంక్లిష్టమైన, బైటికి స్వయంవిరుద్ధంగా కనబడే మతపరమైన అనుభవాల సమాహారమైన భారతీయ ధర్మంలోనే ఉన్నాయని తెలియకనే ఇతర మతాలపట్ల ఆకర్షితులౌతున్నారు. కేవలం ఏకేశ్వరోపాసన అనే ప్రయోజనం కోసం ఒక భారతీయుడు మహామ్మదీయునిగా మారడు. భారతీయుడిగా ఉంటూ కూడా, అతడా పని చేయవచ్చు. భగవంతుని నిరాకారునిగా పరిగణించే ప్రయోజనానికి కూడా అతడు మతం మారడు. చాలా మంది భారతీయులు భగవంతుని, నిరాకారునిగానే, విగ్రహాల సహాయం లేకుండానే పూజిస్తారు.

అట్లే అతడు ఒక వ్యక్తిగత రక్షకుడిని అనుసరిస్తున్నానే తృప్తి కోసం కూడా క్రైస్తవంలోకి మారడు. భారతీయుడిగా ఉంటూ కూడా అతడా పని చేయవచ్చు. భారతీయ ధర్మాన్ని విడిచి పెట్టకుండానే, తనను ఆకర్షించిన రక్షకుడైన ఏసు ప్రభువును ఆ భారతీయుడు ఆరాధించగలడు, గౌరవించగలడు. చాలా భారతీయుల ఇళ్ళల్లో జీసస్‌కు స్థానముంది. అతని మూర్తికి పూలదండ వేసి, అగరొత్తులు వెలిగించి, ఇతర దేవుళ్ల పటాలతో బాటు పూజిస్తారు. అయినా, ఏ భారతీయుడు కూడా, జీసస్‌ను పూజించే వారిని, భారతీయ సమాజం నుంచి దూరం పెట్టాలని అనుకోడు, వాళ్లంతట వాళ్లే, తాము దూరంగా ఉండాలనే భావన వ్యక్తం చేసే వరకు. భారతీయుల ఔదార్యం, వారి ఈ విశాల దృక్పథంలో ఉంది. క్రీస్తుకు అంజలి ఘటించే భారతీయుడు కూడా, ఇంకా హిందువే. కాని కృష్ణ భగవానుడిని, క్రీస్తుతో బాటు కొలిచే క్రైస్తవుడు, ఏనాటికీ ఒక క్రైస్తవుడు కాలేడు. క్రిస్టియన్ల దేవుడు, యూదుల మాత్సర్యపు దేవుడుగానే ఉంటాడు. క్రిస్టియన్ల మత సిద్ధాంతాన్ని ప్రభావితం చేసిన గ్రీకుల ఆధ్యాత్మిక తత్వం ఎంత ఉన్నా  సరే!

మత పరమైన కారణాల వల్ల, చాలా మంది అజ్ఞానులైన భారతీయులు తమ మతాన్ని విడిచి పెడుతున్నారని ఎవరైనా అనుకోవచ్చు. అజ్ఞానమనేది అన్ని సమస్యలకు మూల కారణం అనేది నిజం. భారతీయులు ఇతర మతాల్లోకి వెళ్లే ప్రభావాన్ని ఏదీ అపలేదనేది కూడా నిజమే. భారతీయులందరికీ, తీవ్రమైన  నిరాశకులోనైన వారితో సహా, అసలు భారతీయ ధర్మమంటే ఏమిటి అనే తెలివైన బోధన కూడా తెలియని  అజ్ఞానులై, ఈమధ్యనే క్రైస్తవంలోకి మారిన భారతీయులు, మానవజాతికి ప్రేమతత్వాన్ని బోధించిన మొదటి మానవుడు క్రీస్తు ఒక్కడే అని చెబుతారు. గౌతమ బుద్ధుని ప్రేమ గురించి, శ్రీకృష్ణ పరమాత్మ ప్రవచించిన ప్రేమ అద్భుత భావన గురించి వారికి తెలియదు.. క్రీస్తుకు శతాబ్దాల ముందే భారతదేశం ప్రపంచానికిచ్చిన దేని గురించీ వారికి తెలియదు.

అది నిజం. కాని, వారికి ఈ విషయం తెలిసి ఉంటే, వారు భారతీయ ధర్మాన్ని వదలి ఉండేవారు కాదని మనం నమ్మకూడాదు. ఇది ప్రతి మార్పిడిలో గాని, చాలా మార్పిడులలో గాని జరగలేదు. అజ్జానులైన భారతీయులు కూడా కేవలం మత పరమైన కారణాల కోసం, వారి మతాన్ని మారరు. ‘మొట్టమొదటసారిగా’ అరేబియా దేశపు ప్రవక్త సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని బోధించాడని వారు మహమ్మదీయులుగా మారరు. లేదా, మొట్ట మొదటి సారిగా ప్రేమను బోధించిన వాడు జీసస్ కాబట్టి, వారు క్రైస్తవులవరు. మరి ఎందుకంటే, ఒక ముసల్మాను అవడమంటే, వారికి సామాజికమైన సౌభ్రాతృత్వపు ప్రయోజనాలను అనుభవించడమే. అట్లే, ఒక క్రైస్తవడుగా మారడమంటే, వారికి కొన్ని ధర్మ బుద్ధిగల మత పీఠాల నుండి ప్రేమ అనే ప్రయోజనాన్ని పొందడం. కాబట్టి, వేలకొద్దీ భారతీయులు, తమ మత పరిథిని వదిలేయడానికి, సామాజిక కారణాలు మాత్రమే ముఖ్యమైనవి.

భారతీయతకి, పెద్ద సంఖ్యలో నష్టం వాటిల్లడానికి, ఈ గత శతాబ్దాలలో, మూడు కారణాలు కనబడుతూ ఉన్నాయి.

  1. అధిక సంఖ్యకులైన హిందువులకు, ప్రాథమికమైన సామాజిక హక్కులను నిరాకరించడం.
  2. హిందూ ధర్మ  పరిధిలోని సామాజిక నియమాల కాఠిన్యం (దాని వల్ల సులభంగా మతాంతరీకరణ జరిగింది.)
  3. మళ్లీ హిందూధర్మ  పరిధిలోకి తిరిగి రావడానికి వారిని అనుమతించకపోవడం, వారు తిరిగి రావాలనుకున్నా కూడా. ఇక వారి పూర్వీకులుగాని, వారే గాని, హిందూమతంలోకి రావాలనుకునే వారిని గురించి మాట్లాడే పనే లేదు.

పతనానికి కారణమైన, ఈ మూడు పరిస్థితులను తొలగించేంత వరకు, తొలగిస్తే తప్ప, భారతీయత, రోజు రోజుకూ తాను గురవుతున్న ప్రమాదాలను   ఎదుర్కోలేదు. ఈ బలహీనతకు మూలాలను   తొలగించుకోలేకపోతే, భారతీయతకి ఎంత విలువ ఉన్నా, అది అణిగిపోక తప్పదు. ఈ చేదు నిజాన్ని, వెంటనే ఇప్పుడే అర్థం చేసుకోక తప్పుదు. రేపటికి ఆలస్యం అవుతుంది మరి!

మనం ఇప్పటికే చాలా సార్లు, ఒక నశిస్తూన్న జాతిగా భారతీయత యొక్క ప్రస్తుత పరిస్థితికి, గ్రీకు, రోమన్ సనాతన ధర్మాలు అవి నశిస్తూ ఉండిన పరిస్థితికి గల సామ్యాలను గురించి చెప్పకున్నాం. వాటి వినాశనానికి గల కారణాలు కూడా ఒక్కటే.

భారతీయులు ఒక విషయం మాత్రం మరవకూడదు. కేవలం సామాజిక కారణాల వల్ల మాత్రమే, నిజానికి క్రైస్తవ మతం పాశ్చాత్య  ఆర్య ప్రపంచంలో వ్యాపించగలిగంది. మానవజాతి సాకారం చేసిన అతి చక్కని నాగరికతల శిధిలాల మీద అది వేళ్లూనుకోగలగింది.

తొలి క్రైస్తవ పీఠాల ప్రచారం సాగుతూ ఉన్న సమయం అది. ఆ పురాతన ప్రపంచంలో చెప్పుగోదగ్గ మహానుభావులుండేవారు. అత్యంత ప్రభావవంతమైన ఆలోచనా సిద్ధాంతాలుండేవి. పోర్‌ఫైరాస్ (porphyros), ఇయాంబ్లికస్(Iamblikos) లేదా ప్లాటినాస్ (plotinos) వంటి లోతైన జ్ఞానంగల, దైవ ప్రేరితులైన మేధావులు ఉండేవారు. అటువంటి వారితో, ఈ చదువురాని మత దూతలు, దైవ ప్రేరితులమని చెప్పుకునేవారు, పోటీ పడలేకపోయారు, నిజంగా దైవ ప్రేరణ అనేది గనుక ఉంటే, గింటే Hypotia (ఇపత్తియా) కంటె పవిత్రురాలైన క్రైస్తవ మహిళ ఉండదు. ఒక స్త్రీ రూపుదాల్చిన, వివేకానికి సౌందర్యానికి, అతి సనాతన సుగుణాలకో నెలవైన స్త్రీ ఆమె.

ఐనా, గెలీలియన్లే గెలిచారు. హెలెనెస్ గెలవ లేదు.

ఎందుకు?

దీన్ని గురించి ఆలోచించండి. భారతీయత యొక్క వైభవాన్ని పునర్నర్మించండి. వారు తెలివైన వారు కాబట్టి, గెలీలియన్లు గెలవలేదు. వాళ్లు సుగుణశీలురు కాబట్టి, వాళ్లు ఒక గొప్ప ప్రేరణను తమతో బాటు తీసుకొచ్చారు కాబట్టి, వాళ్లు గెలవలేదు. ఈ విషయంలో వాళ్లు హెలెనిక్ సనాతన వాదులకంటే గొప్పవాళ్లేమీ కాదు. మరెందుకుకు గెలిచారు? వాళ్లు మనుషులందర్నీ, అనాగరికులు, బానిసలతో సహ తమ సౌభ్రాతృత్వాన్ని పంచుకోమ్మని పిలిచారు. హెలెనెస్ అలా పిలవలేదు.

భారతీయత లాగా, పురాతన గ్రీకు రోమన్ సామ్రాజ్యం ఒక సంక్లిష్టమైన, కుల ప్రాతిపదిక గల సామ్రాజ్యం కాదు. కాని, దానిలో, ఒక స్వేచ్ఛాజీవికి, బానిసకు మధ్య ఒక భయంకరమైన ఎడం ఉండేది. రోమన్‌కు, ఒక అనాగరిక జాతి వాడికి మధ్య కూడా అలాంటి తేడాయే ఉండేది. తర్వాత కొన్ని చాలా తక్కువ మినహాయింపులు వచ్చాయి (బహుశా పెరుగుతున్న క్రైస్తవ మత ప్రభావం వల్లనమో!). పుట్టుకతో ఆటవిక జాతివాడికి హెలెనెస్ సామాజిక జీవితంలో  స్థానమే ఉండేది కాదు. అతడొక విదేశీయుడు. విదేశీయుడిని సమానంగా చూడకూడదని నియమం. ఒలింపియా క్రీడల్లో పాల్గొనడానికి, గ్రీకు సంస్కృతి మాత్రమే చాలదు. పాల్గొనేవారు తాము హెలినిక్ వంశానికి చెందినవారమని నిరూపించుకోవలసి ఉంటుంది. తర్వాత రోజుల్లో ఈ నియమానికి కొంత భంగం వాటిల్లింది. కాని ఆ సిద్ధాంతం చివరి వరకు ఉండింది. అది బయటి వారిని తమలో కలుపుకోకుండా నిరోధించడానికి సరిపోయింది.

అదే విధంగా, ఒక బానిస కొడుక్కు, హెలెనిజం యొక్క వైభవంలో భాగస్వామ్యం ఉండదు. ఏథెన్స్‌లో, కనీసం, అతన్నిఅవమానించరు. అతడు కూడా బాగుపడి, పెరగడానికి అవకాశం ఉంటుంది. నిజం ఏమిటంటే, ఆ నగరపు స్వర్ణయుగంలో, (క్రీ.పూ ఐదవ శతాబ్దం) స్వేచ్ఛగా సంచరించే పౌరులు పదిహేను వేలమంది ఉండగా, బానిసలు నూట ఇరవై వేల మంది ఉండేవారట. కాలం గడిచే కొద్ది, ఈ సంఖ్యా పరమైన ‘వినిష్పత్తి’ పెరుగుతూపోయింది. స్వేచ్ఛా పౌరులు చక్కని వాక్చాతుర్యాన్ని, కళను సాధన  చేసేవారు. ఆ కళ మొదటిది. శారీరకంగా, ఆత్మపరంగా, అందంగా ఉండడం. వారు జ్ఞానులతో మాట్లాడేవారు, దేవతలను గౌరించేవారు, నగరాన్ని ఏలేవారు. వేదాంత విధానాలను, పాలరాతి మందిరాలను గ్రీసు చరిత్రను, భావితరాల ప్రశంసలకు వదిలేసేవారు. కాని బానిసలు కష్టంతో కూడిన, అలిసిపోగొట్టే, మురికి పనులను చేసేవారు. ఆ నగర వైభవం తమది కూడా అని వారికి తెలియదు. ఆ నగర దేవతలు వారి వారు కూడా. కాని జ్ఞానుల పరమోన్నత బోధలు వారికి చెప్పబడేవి కావు. వారికి హెలెనిక్ వేదాంతపు విలువగానీ, దేవతల ఉత్తమగుణాలు గానీ తెలియవు. తాము వెట్టిచాకిరి కోసమే పుట్టామని మాత్రమే వారికి తెలుసు. ఇతరులు మాత్రం తీరుబాటుకు, ఉన్నత ఆలోచనలకు, అందమైన జీవితానికి కోసమే పుట్టారు. నెమ్మదిగా, ఒక సమయం ఆసన్నమైంది. వారి దుర్విధిని ఒక గుదిబండగా వాళ్లు భావించడం ప్రారంభించారు. వారి అంతరాంతరాల్లో, ఒక తిరుగుబాటుకు అంకురార్పణ జరిగింది.

పాల్, ఇంకా తొలి క్రైస్తవ మఠాధిపతులు, అప్పుడు పాలస్తీనా నుంచి వచ్చారు. గ్రీసు దేశపు నౌకాశ్రయాల నుండి, యూదుల పరగణాల నుండి, ఒక్క కొత్త బోధన బానిసల గుంపులకు వ్యాపించింది. అది రోమను సామ్రాజ్యామంతా విస్తరించింది. ఉత్తర దక్షిణాల్లోని ఆటవికులకు కూడా చేరింది. సమానత్వం నిరాకరించబడిన వారందిరినీ అక్కున చేర్చుకుంది. “మానవులంతా ఒక్కటే  మన ప్రభువు జీసస్ క్రీస్ట్ దృష్టిలో! ఆయనే మన ఏకైక రక్షకుడు.”

తొలిగా క్రైస్తవంలోకి మారిన వారిలో, ఉన్నత విద్య గొప్ప వంశంగల వారి ఉనికిని ఎవరూ కాదనలేదు. కాని వారు తక్కువమంది. క్రైస్తవ మతం యొక్క విజయానికి ముఖ్యకారణం, బానిసల విస్తృతమైన అహింసాయుతమైన తిరుగుబాటు, ఆటవిక జాతుల తిరుగుబాటు కూడా. ఇది రోమన్ సామ్రాజ్యపు (సహజంగా సనాతన గ్రీసుదేశపు) అప్పటి సామాజిక పరిస్థితులకు విరుద్ధంగా జరిగింది.

ఆ సామాజిక వ్యవస్థ, సరైన సమయానికి గనుక మారి ఉండి ఉంటే, దానిని సనాతనవాదులే చొరవ  తీసుకొని మార్చి ఉంటే, చరిత్ర మరో విధంగా ఉండేది. బానిసలు, సగం హెలెనీయులు ఐన ఆటవికులు, సనాతనత్వపు సాంస్కృతిక మరియు జాతీయ సంపదలు తమవే అని విస్తృతంగా తెలుసుకొని, ఆ సనాతనత్వానికి దన్నుగా ఏక శక్తిగా నిలబడేవారు. కాని, జ్ఞానులు, నాగరికులు ఐన ఆ కొద్ది మంది గ్రీసు రోమన్ ప్రపంచపు కులీన వర్గానికి, ఎవరైనా సాంఘిక సంస్కరణలను గురించి చెప్పి ఉంటే, వారు, భారతదేశంలోని చాలా మంది కులీనుల్లాగా, ఇలా జవాబు చెప్పే వారేమో! “మేము మా జన్మహక్కులను వదిలేసుకోవాలా? తక్కువ కులాల, అనాగరిక జాతుల సంపర్కంతో మా అతి పురాతన సంప్రదాయాలను చెడగొట్టుకోవడాన్ని అనుమతించాలా? మేం మా విలువ మీద అధారపడతాం. సంఖ్యా బలం మీద కాదు. ఆ విలువతోనే మేం మమ్మల్ని, మా సంస్కృతిని కాపాడుకుంటాం.”

ఫలితం? వాళ్లు గతించారు. వాళ్లతో బాటు ఏకమొత్తంగా పాశ్చాత్య, ఆర్య సనాతనత్వం కూడా! ఐరోపాలో, తన ఉన్నత కుటుంబ వారసత్వాన్ని, పురాతన గ్రీసు లేదా రోమను వంశ వృక్షానికి చెందిన దానినిగా, అవిచ్ఛిన్నమైన, కలుషితం కాని రక్తాన్ని కలిగిన దానిని వెతికి చూడగల వారు ప్రస్తుతం ఎవరైనా ఉన్నారా? తమ పూర్వీకుల్లో బానిసలుగాని, ఆటవికులు గానీ లేరని, నిజాయితీగా నిర్ధారించగల ఒక్క ఆధునిక రోమన్ గాని, గ్రీకు గాని ఉన్నాడా? లేరు. కొత్త సమాజం వచ్చింతర్వాత, గతంలో పాలించిన జన్మ హక్కులు విస్మరించబడినాయి. అంతా అయోమయం తప్ప మరేమీ లేదు. క్రైస్తవం ఉండి కూడా, కొత్త విశేషాధికారాలు, జన్మహక్కులు మెల్లగా దూరేంత వరకు అదే పరిస్థితి.

కాలపు ఒత్తిడికి వ్యతిరేకంగా నిలబడి, అణచివేయబడటం వలన ఏం లాభం? కపట పూరితమైన క్రైస్తవ ఐరోపాకు స్థానం కల్పించడానికి, సనాతన ధర్మపు సగం ఆరాధనలను, కళను, భావజాలాన్ని నిర్మూలించి, మిగతా సగాన్ని వస్తుప్రదర్శనశాలల్లో ఎవరు భద్రపరుస్తారు? అది నిజంగా అంత సమంజసం కాదు కూడా.

భారతీయుల ప్రస్తుత పరిస్థితి కూడా అదే. ఇప్పుడో తర్వాతో, వారి సంఖ్య, జనాభాలో 25 శాతం కంటే తక్కువగా ఉంటుంది. సంపూర్ణంగా అంతరించి పోవడం (స్వచ్ఛంద, లేదా విధిలేని అజ్ఞాతంలోకి వెళ్లడం ద్వారా, లేక ఇస్లాంలోకి మారడం ద్వారా, లేక ఇంకే విధంగా) అనేది ఎంతో దూరంలో లేదు, హిందువులు, వెంటనే, ఇప్పుడే, నిర్విరామంగా, మొక్కవోని ధైర్యంతో ఉద్యమించక పోతే. అది ఇలా జరగాలి.

  1. ఒక స్థిరమైన, చెక్కుచెదరని, ఆత్మ రక్షణలో శిక్షణ పొందిన సమూహంగా   ఏకం అవడం.
  2. ఆ సమూహంలోకి, కులమత భేదాలు లేకుండా అందర్నీతీసుకురావడం.
  3. హైందవత్వానికి కొంత ఉపయోగపడే వారిని, ప్రత్యేకంగా ఆ సమూహంలో చేర్చుకోవడం.
  4. భారతీయ సమాజంలో సనాతన ధర్మంలో ఆది నుంచి ఉన్న వాళ్లు, ఒకసారి ఇస్లాం లేక క్రైస్తవ మతంలోకి మారిన వారిని, తమ జాతీయ ఆరాధనలోకి ఆకర్షించడం.

మనం ఒక విషయాన్ని స్పష్టం చేయాలి. శతాబ్దాలుగా, ఉన్నత కులీనులైన హిందువులు ముఖ్యంగా బ్రాహ్మణులు, విశేషాధికారాలతో, వారసత్వంగా వచ్చిన నాగరికత విలువ పట్ల ఎంతో సున్నితమైన భావంతో ఉంటారు. మనకంటే కూడా భారతదేశం వెలుపల కూడా, భూమి మీది అతి చక్కని కులీన వర్గంగా ఉన్న భారతీయ బ్రాహ్మణులను గుర్తించే వారున్నారు. బహుశా, మనం అన్ని రకాల సుందరమైన ఆకృతి, గొప్పమేధస్సు, శీలం కలిగిన, అత్యున్నత మానవత్వం రూపుదాల్చిన ఒక వ్యక్తిని ఎన్నుకుంటే, ఒక భారతీయ బ్రాహ్మణునే ఎన్నుకోవాలి. ఇంకా బహుశా, తన కులానికి సంబంధించిన సుగుణాలను, తన జిజ్ఞాసను, అనుసంధించగల వారిని ఎన్నుకుంటే, అతడొక బెంగాలీ అవుతాడు. భారతదేశాన్ని ఒక విస్తారమైన తామరపూలతో కూడిన చెరువు అనుకుంటే, బ్రాహ్మణులందరూ, ఈ రోజు కూడా, దాని అందమైన, స్వచ్ఛమైన పద్మాలే. భారతీయతను  సమర్థించడమంటే వారిని సమర్థించడమే.

అదే సమయంలో మనం పద్మానికున్న ఎన్నో పర్యాయ పదాలను గుర్తు చేసుకుంటాం. ‘పంకజం’ అందులో ఒకటి. దానర్థం ‘బురదలో పుట్టినది’ అని. కాబట్టి, బురద, నీరు రెండూ అవసరమే పద్మాలకు. అవి లేకపోతే, అందమైన ఆ పుష్పాలు ఎండిపోతాయి. మచ్చలేని ఆ పూలను పరిరక్షించడం అంటే, మొదట అవి పుట్టి పెరిగిన చెరువును కాపాడుకోవాలి. అంటే సారవంతమైన ఆ మట్టిని, నీటిని అన్నమాట.

అట్లే, బ్రాహ్మణ సౌందర్యం, బ్రాహ్మణ సంస్కృతి, బ్రాహ్మణ ఆదర్శాలు, రాబోయే భారతీయ సమాజంలో ఏ విలువనూ కలిగి ఉండవు. ఎందుకంటే ఆ సమాజం అప్పటికి నూటికి నూరు శాతం మహమ్మదీయమైపోయి ఉంటుంది. ఇది, ఉత్తర తూర్పు బెంగాల్ లలో మరి కొద్ది సంవత్సరాల్లోనే సంభవం అవుతుంది. ఇస్లాంలోకి మతాంతరీకరణ వెంటనే ఆపకపోతే, భారతీయ ధర్మంలోకి     తిరిగి రప్పించుకోవడం వెంటనే ప్రారంభం అవకపోతే, కులీనులైన బ్రాహ్మణులు గొప్పత్యాగాలు చేయకపోతే ఇది సాధ్యం కాదు. ఈ త్యాగం, ‘మానవత్వం’ పేరిట గానీ ‘న్యాయం’ పేరిట గానీ ‘ప్రజాస్వామ్యం’ (మనకు ప్రజాస్వామ్యంలో నమ్మకమే లేదు) పేరిటగానీ కాదు, తమను తాము కాపాడుకునేటందుకు మాత్రమే. కులీనులైన బ్రాహ్మణుల ముందే కాదు,భారతీయులందరి  ముందున్న ప్రత్యామ్నాయం  ఒక్కటే! ముఖ్యంగా వారు సంఖ్యా పరమైన మెజారిటీలో లేని చోట. కులపరమైన విభేదాలను వెంటనే త్యాగం చేయండి. జీవించండి. మళ్లీ భారతదేశాన్ని పాలించండి లేదా, మీ మీ కుల పట్టింపులకీ కట్టుబడండి. ఉప్పెనలా వచ్చిపడే ఒత్తిడి రోజు రోజుకూ పెరుగుతుండగా, మరో ఒకటి రెండు తరాల్లోనే, మహామ్మదీయలుగా మారిపోండి!

భారతీయులే తేల్చుకోవాలి మరి!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here