భారతీయులకు హెచ్చరిక-8

0
12

[box type=’note’ fontsize=’16’] భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినం గా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష అనువాద రచన ఇది. 1939లో ప్రచురితమైన సావిత్రి దేవి రచించిన ‘ఎ వార్నింగ్ టు ది హిందూస్’ అన్న పుస్తకాన్ని అనువదించి అందిస్తున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ. సావిత్రి దేవి గ్రీకు మహిళ. ఆమె భారత్ వచ్చి, భారతీయుడిని వివాహం చేసుకుని ఇక్కడే హిందువుగా స్థిరపడింది. దేశంలో జరుగుతున్న పరిణామాలను అవగాహన చేసుకుని భవిష్యద్దర్శనం చేసినట్టు 1939లో ఆమె రచించిన గ్రంథం ఇది. ఈ పుస్తకానికి వీర్ సావర్కర్ ముందుమాట రాశారు. ఈ పుస్తకంలో ఆమె ఏదయితే జరిగే ప్రమాదం వుందని హెచ్చరించిందో అదే నిజమవటం ఈ పుస్తకం ప్రాధాన్యాన్నీ విలువను పెంచుతుంది. ప్రస్తుతం దేశంలో మళ్ళీ అనుమానాలు, ఆవేశాలు, ద్వేషాలు అధికమై సామరస్య వాతావరణాన్ని రాజకీయ లబ్ధి కోసం కలుషితంచేసి వికృత విషపుటాలోచనలను విస్తృతంగా వెదజల్లుతున్న తరుణంలో గతంలోని పొరపాట్లను స్మరించటం ద్వారా చరిత్ర పునరావృతం కాకుండా జాగ్రత్తపడే వీలుంటుందని, చరిత్రలో మరుగున పడ్డ అనేక సత్యాలను తెలుగు పాఠకులకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఈ అనువాదాన్ని అందిస్తున్నాము. [/box]

భారత జాతీయతావాదం, చైతన్యం

మొదటి ప్రకరణము – ఐదవ అధ్యాయము-2

[dropcap]“ఎం[/dropcap]త వరకు ఈ కుల విభేదాలను త్వాగం చేయాలి, హైందవత్వాన్ని రక్షించుకోడానికి?” అని చాలా మంది అంటారు. కుల విభేదాలను త్యాగం చేయడమంటే, కేవలం అంటరానితనాన్ని నిర్మూరించి, హిందువులందరికీ దేవాలయాల్లో ప్రవేశాలు కల్పించడమేనా? పెద్ద కులాల హిందువులందరూ, ప్రతి హిందువు ఇచ్చిన నీరు తాగడమేనా, భోజనం చెయ్యడమేనా, కులాంతర వివాహాలను అనుమతించడమేనా, దీనికి హద్దు ఎక్కడ? (ఇలాంటి మినహాయింపులకు హద్దంటూ ఉంటే).

ఈ ప్రశ్నలకు వివరమైన జవాబు లేదు. రక్షించుకొనే మార్గాలు ఎదుర్కోబోయే ప్రమాదాలకు సమతూకంగా ఉండాలి. ఆ ప్రమాదం మీదే అంతా ఆధాపడి ఉంటుంది. పశ్చిమ బెంగాల్ లోని మిద్నాపూర్ జిల్లాలో ముస్లింల సంఖ్య కేవలం ఆరు శాతం. వారి సమస్య బోగ్రా జిల్లాలోని హిందువుల సమస్య అంత విషాదకరమైంది కాదు. ఎందుకంటే, అక్కడ ముస్లింల సంఖ్య తొంభై శాతం కంటే ఎక్కువ. మిద్నాపూర్ హిందువులు మరో యాభై సంవత్సరాలు, ప్రమాదం లేకుండా వేచి ఉండగలరు. బోగ్రా హిందువులు ఉండలేరు. అలాగే పాబ్నా, రంగ్‌పూర్, ఢాకా, నోఖాలీ, కోమల్లా, చిట్టగాంగ్ లోని హిందువులు కూడా వేచి ఉండలేరు. ఒక మాటలో చెప్పాలంటే ఉత్తర, తూర్పు బెంగాల్‌లో ఉన్న వారంతా, జల్పాయ్‌గురి నుంచి బంగాళాఖాతం వరకు, బర్మా, అస్సాం సరిహద్దుల వరకు అస్సాంలోని హిందువులకు కూడా ఇది వర్తిస్తుంది. అక్కడ ఇస్లాం మత ప్రచారంతో బాటు, గత కొన్ని దశాబ్దాల నుండి, ఆ కొండ దారుల్లో, భారీ ఆర్థిక సాయంతో, వ్యవస్థాగతంగా నడుస్తున్న క్రైస్తవ మిషనరీల ప్రాబల్యం కూడా ఉంది. వారే కాదు భారతదేశంలోని ఏ భాగానికి చెందిన హిందువులైనా సరే వేచి ఉండలేరు. ఒక బలమైన, చైతన్యం గల, కులరహిత సమాజం అభివృద్ధి చెందిన, లేదా రూపుదిద్దుకుంటున్న పరిస్థితుల్లో, హైందవత్వానికి సమాంతరంగా అది చాప కింద నీరులాగా ప్రాకుతున్నపుడు, ఏ హిందువూ వేచి ఉండకూడదు. కులరహితమైనదైనా, వర్గ రహితమైనదైనా, ఇంకో రకంగా విడిభాగాలయినది, ఒక విభక్త సమాజం, ఎప్పుడూ, ఎక్కడా, ఒక అవిభక్త సమాజపు పోటీని తట్టుకొని నిలబడ్డ దాఖలాలు లేవు.

ఎంత వరకు ఈ కులవిభేదాలను మరి త్యాగం చేయాలి? అది మనం చెప్పలేము. అది ప్రతి హిందువు ఇంట్లో పాటించవలసిన విషయం, నిజాయితీగా బ్రతకాలనుకునే హిందువులు తమంత తాము నిర్ణయించుకోవాల్సిన విషయం. ఇంత మటుకు మనం చెప్పగలం. హైందవత్వాన్ని తొక్కి వేయాలనుకునే శక్తులు (సాధ్యమైతే) ఎలాంటివంటే, వాటివల్ల వచ్చే ప్రమాదం ఎంత తప్పనిదంటే, ఏవో అతుకులు వేసి హైందవత్వాన్ని రిపేరు చేసేంత సమయం లేదు. ఇప్పటికే ఆలస్యం అయింది. ఉన్నత కులాల పవిత్రతను కలుషితం చేసే ఏ నిమ్న కులాల నుండి, నీటి ద్వారా ఇది జరుగుతుంది? హిందువులందరూ వారి చేతి నీటిని తాగడానికి ఇప్పట్నుంచి అంగీకరిస్తారా?  ఆ ప్రశ్నకు అర్థం లేదు. హైందవత్వంలోని అణగారిన కులాలలోని తీవ్రత చాలా లోతుగా ఉంది. షరతులు లేని సమానత్వాన్ని వారికివ్వ చూపినా, హైందవత్వం వెలుపలి పరిస్థితి వారికి చాలా ఆకర్షణీయంగా ఉంది. వారికి కొన్ని అక్కడ కూడా విశేషాధికారాలను మంజూరు చేయడం, కొన్ని మినహాయింపులు ఇవ్వడం, కొన్ని అనిశిత ఆశలు కల్పించడం ఇక సాధ్యం కాదు. వారిని ఇప్పుడు, చాలా కాలం వరకు హిందూ పరిధిలో ఉంచడం వీలుపడదు.

వారిలో క్రమంగా, ఒక పద్ధతి ప్రకారం, ఒక భావన తీవ్ర రూపుదాలుస్తూ ఉంది. పెద్ద కులాల హిందువులే తమకు చెందల్సిన హక్కులను, తమకు లేకుండా చేశారనీ, తమను విపరీతంగా దోపిడీకి గురి చేశారనీ వారు అనుకుంటున్నారు. ఉమ్మడి వర్గ ప్రయోజనాల కోసం ఇటీవల జరిగిన, కార్మికోద్యమం, రైతు ఉద్యమం లాంటి ప్రజాస్వామ్యయుతమైన ఉద్యమాల్లో, ఇది బాగా ద్యోతకం అవుతుంది.

ఈ వివిధ ‘ఉద్యమాల్లో’ ముందుకు తేబడిన సిద్ధాంతాలన్నీ కొంత మంది భారతీయ ఆదర్శవాదుల నుంచి తెచ్చుకున్నవే. వారు హైందవత్వంలోని ఉన్నత కులాలకు చెందిన వారే ఎక్కువగా. కాని వారి బోధనల ఫలితం, అసంతృప్తి చందిన నిమ్మకులాల హిందువులు మరియు మహ్మదీయులతో ఒక ఐక్య కూటమి అతి త్వరగా ఏర్పడటం. అది వర్గ ప్రయోజనాల ప్రాతిపదికగా, విశేషాధికారాలు గల హిందువుల నందరినీ ఏకమొత్తంగా వదిలించుకోవడం. అర్ధాకలితో అలమటించే ఒక రైతు, ఒక కౌలుదారు, ఒక కార్మికుడు, ఇలా అణగారిన వర్గాల వారంతా. భూస్వాముల, వడ్డీవ్యాపారుల, దోపిడీదారులకు విరుద్ధంగా (వీళ్లంతా హిందువులే) చేసే పోరాటానికి. మౌల్వీలు తెలివిగా రగిలించిన ముస్లిం సమూహాల మతోన్మాదం తోడైంది చాలా సహజంగా. వారిలో వర్గ చైతన్యం బాగా పెరిగింది. నిమ్మ కులాల హిందువుల రైతుల శ్రామికుల మనోభావాలు అందుకే అంత సహజంగా, సులభంగా ఒక తీవ్రమైన తిరుగుబాటు స్ఫూర్తితో, ఆ పోరాటంలో ప్రవేశించాయి.

శతాబ్దాల తరబడి ఉన్నత కులాల హిందూసమాజానికి దూరంగా ఉన్నారు వారు, ఇప్పుడు వారికి తమదైన ఒక సామాజిక చైతన్యం ఉంది. అది హైందవత్వంలో వారనుభవించిన చైతన్యం కన్న భిన్నమైనది. దానికి ఒక సాంస్కృతిక పునాది లేదు. కాని ఒక ఆర్థిక పునాది ఉంది. అది రోజు రోజుకూ అణగారిన నిమ్మకులాల హిందువులను మహమ్మదీయులకు దగ్గర చేస్తుంది. ముస్లింలు ఎక్కడ ఎక్కువగా, రైతులుగా, కూలీలుగా ఉంటారో, అక్కడ, భారతదేశంలో జరిగిన ప్రజస్వామిక ఉద్యమాలన్నీ ముస్లిం ఉద్యమాలయినాయి.

వాళ్ల చేతి నీళ్లు తాగితే, అప్పడప్పుడు వారి యిండ్లలో అన్నం తింటే, ఈ చైతన్యం పొందిన నిమ్మ కులాల హిందువులు మళ్లీ తమ గత అణగి ఉండే స్వభావంలోకి వస్తారని అనుకోలేం. అణగి ఉండి, విధేయత చూపే కాలాలు పోయాయి. రోజు రోజుకు, వారు తమ ప్రాముఖ్యతను, తమ బలాన్ని గుర్తెరుగుతూ ఉన్నారు.

పెద్ద కులాల హిందువుల కులవిభేదాల త్యాగం ఎలా వుండాలి? (వారి కోసం, వారు ప్రాతినిధ్యం వహించే హిందూ సంస్కృతి కోసం) నిమ్మ కులాల వారు, అస్పృశ్యులతో సహా, హైందవత్వం ప్రమాదంలో పడినప్పుడు, దాన్ని రక్షించుకోడానికి, సంతోషంగా తమ బలాన్ని ఉపయోగించడానికి సిద్ధపడేలా, ఆ త్యాగాలు చేయగలగాలి.

ప్రమాదం మరీ దూరంలో ఏమీ లేదు. ఇప్పటికీ చాలా చోట్ల హిందువులు దాన్ని హింసాత్మకమైన గొడవల రూపంలో చవి చూశారు. వారిలో ఐక్యత లేకపోవడం వల్ల, వారు సిద్ధంగా లేకపోవడం వల్ల, ఆ గొడవల్లో వారు బాగా నలిగిపోయారు కూడా.

కాని, గతంలో భారతదేశంలో జరిగిన గొడవల కంటే భయంకరమైనవి, సమీప భవిష్యత్తులో జరగవచ్చు. రాజకీయ స్వాతంత్ర్యం కోసం  భారతదేశం తనను తాను సమాయత్తం చేసుకుంటూ ఉన్నది. నిజం ఏమిటంటే, విదేశీ ఆధిపత్యం లోంచి స్వపరిపాలనలోకి వచ్చిన ఏ దేశమైనా, కొంత అయోమయ పరిస్థితికి, కొంత కాలం పాటు గురవక తప్పదు. దానిలో, గత ప్రభుత్వం ఉండదు. కొత్త ప్రభుత్వం సమర్థవంతంగా ఇంకా నిలదొక్కుకోదు. న్యాయపరమైన రక్షణ ఉండదు. పోలీసు వ్యవస్థ ఉండదు. అలాంటి స్థితి ఒక నెల ఉండవచ్చు, ఒక సంవత్సరం కూడా ఉండవచ్చు. మనం హిందువులను ఇలా అడుగుదాం – “మీరు ఒకసారి ఊహించుకోండి. ఉత్తర, తూర్పు బెంగాల్‌లో, ఇరవై ఐదు శాతం కంటే తక్కువ, కొన్ని సార్లు పది శాతం కంటే ఉన్న మీరు, కేవలం మూడు రోజులు, ఏ ప్రభుత్వ, పోలీసు రక్షణ లేకుండా, కేవలం దేవుని దయపై, మీ అదృష్టంపై ఆధారపడి ఎలా వుండగలరో!” ఐదువందల మంది మస్లింలున్న గ్రామాల్లో, కేవలం ఐదు హిందూ కుటుంబాలుంటే వారి పరిస్థితి ఏమిటి? అప్పుడు నిమ్మకులాల వారి, అసంతృప్తి చెందిన దృక్పథం ఎలా వుంటుంది? వారి మీద శ్రామిక ప్రచారం, తమదిగా భావించని హైందవత్వం ఏమైపోతే ఏమనీ నిర్లక్ష్యం, ఆకలి కలసి వారిని ఆదిమకాలపు ధ్వంస రచనోద్రేకానికి పురికొల్పుతాయి. వారు, అలాంటి సమస్యలే గల ముస్లింలతో జతకట్టరనీ, వారితో పాటు లూటీ చేసిన సొమ్మును పంచుకోరనీ, పంచుకోకముందో, తర్వాతో, ఇస్లాం సౌభ్రాతృత్వ భావనను కూడా పంచుకోరనీ, గ్యారంటీ ఏముంది? లేదా, వారు తమ బలాన్ని తమ అగ్రకులాల సహదేశభక్తులకు మద్దతుగా అందించి, నిజమైన భారతదేశాన్ని పరిరక్షించడం కోసం, హైందవత్వానికి వెన్నుదన్నుగా నిలబడతారని ఎవరు గ్యారంటీ ఇవ్వగలరు?

కాని, వారి దృష్టిలో, నిజమైన భారదేదేశం అంటే ఏమిటి? గ్రీసు దేశంలోని బానిసలకు నిజమైన గ్రీస్, దాని సంస్కృతి అంటే ఏమిటి? రోమ్ లోని బానిసలకు, నిజమైన రోమ్, దాని వైభవం అంటే ఏమిటి?

కులపరమైన ప్రత్యేక అధికారాలు, విభేదాలను, సామాజిక విశ్వాసాలు, ఆచారాలను ఎంత వరకు విడనాడాలి? అంటే, అవి ఒక సమైక్య హిందూ చైతన్యానికి, హిందువులందరూ కలసి పోరాడే పటిమకు అవి అవరోధం కానంత వరకు.

హిందువులందరికీ, వారి మతపరిధిలో, వారికి ఎక్కువ గౌరవం, ఎక్కువ న్యాయం, వ్యక్తిత్వ వికాసానికి కావలసిన ఎక్కువ వెసులుబాట్లు లభించేంత వరకు, వారు ఆ మతపరిధిలో ఉండటాన్ని ఇష్టపడరు. వారిలో మరింత ఎక్కువ మంది దాన్ని వదలి వెళ్లడమే మంచిదని అనుకుంటారు. ఇక హిందువులుగా మిగిలిన వారిలో ఎక్కువ మంది హైందవత్వం గురించి పట్టించుకోరు. దాన్ని సమర్థించడానికి, అవసరమైతే దానికి సహాయం చేయడానికి, కనీసం వారి చిటికెన వేలు కూడా కదల్చరు.

హిందువులకు కొంత స్వేచ్ఛ, సాంఘిక సహనం, వారి మత పరిధిలో లభించకపోతే, వారు స్వచ్ఛందంగా, అధిక సంఖ్యలో వేరే మత పరిధిలోకి, తమ కిష్టం వచ్చినట్లు బ్రతకడానికి వెళ్లిపోతారు. సాంఘిక విషయాల్లో ఎక్కువ వ్యక్తిగతమైన స్వాతంత్ర్యాన్ని కల్పిస్తామనే ఇతర మతాల వారి ప్రలోభాల వల్ల, అయిష్టంగానే ఐనా వారు బయటకి పంపిచబడతారు. వాళ్లు మంచివారైనా, చెడ్డవారైనా, హైందవత్వం, వారిని కోల్పోవడానికి, దాని ద్వారా మూల్యం చెల్లించడానికి, సిద్ధంగా లేని, శక్తులు అవుతారు. హిందువులు ఒక విషయం గుర్తుంచుకోవాలి. అత్యంత ప్రమాదకారులైన మహామ్మదీయ పరిపాలకుల్లో, కొందరు హిందూ వారసులు కూడా ఉన్నారు. వారు హైందవత్వం నుండి బయటకు పంపబడినవారే. ఒకప్పుడు అలాంటి అవాంఛనీయ వ్యక్తులను బయటకి పంపించి, తనను తాను శుద్ధి చేసుకోడానికి, హైందవత్వానికి అదొక ప్రయోజనంగా ఉండేది. కాని ఇప్పుడు భారతదేశంలో హైందవత్వం ఒకటే సమాజం కాదు. దాని పక్కనే రెండు పోటీ సమాజాలున్నాయి. అవి ప్రత్యక్షంగానో పరోక్షంగానో, హైందవత్వాన్ని దెబ్బ తీయాలనీ, దానికి హాని చేయాలనీ తహ తహలాడుతున్నాయి. ప్రతి అవకాశం వినియోగించుకుంటున్నాయి. అలాంటప్పుడు సామాజిక విషయాల్లో ఖచ్చితమైన కట్టుబాట్లు దానికి నష్టాన్ని కలుగచేస్తాయి. ఒక అస్పృశ్యుడైన హిందువు, హిందూమత పరిధిలోంచి బయట పడిన వాడికి, హైందవత్వానికి శత్రువుల సంఖ్యను పెంచడానికి సులువుగా ఉంటుంది. హిందువులంతా, హైందవత్వ వైభవమే తన వైభవంగా భావించనంత వరకు, దాని కళాత్మక, సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వాన్ని తమ సొంత సంపదగా భావించనంత వరకు ఐక్య హిందూ చైతన్యం, ఐక్య లక్ష్యం, ఉమ్మడి ప్రయోజనం, ఉమ్మడి ఆస్తకి, ఉమ్మడి ప్రేమ, హిందువుల ఏకీకరణ సాధ్యం కాదు. అంత వరకు హైందవత్వానికి మనగలిగే ఆశ వుండదు. అగ్ర కులాల హిందువులు, వేదాలు, ఉపనిషత్తులు, కావ్యాలు, శాస్త్రాలు, అన్నీ ‘తమవి’ అనుకుంటారు. హైందవత్వంలో ఎలాంటి కొత్త వాతావరణం సృష్టించబడాలంటే, ప్రతి హిందూ చేపలు పట్టే వాడిలో కూడా వ్యాసదేవుని మహాభారతం, ‘తనది కూడా’ అని అనుకోవాలి. భారతం, దాని రచయిత గురించి అతడు కూడా గర్వపడాలి. అప్పుడే హైందవత్వం ఐక్యంగా బలంగా  ఉటుంది.

భారతదేశంలోని కొండ జాతుల వాళ్లు (సర్వజీవరాశిలో, వస్తురాశిలో ఆధ్యాత్మికతను దర్శించేవారు) తమ ఆదిమ దేవతారాధనా విధానాలు, బహుళమైన హైందవత్వపు అంశాలలో భాగమని భావించనంత వరకు, వారు కూడా హైందవత్వంలో ఒక అంతర్భాగమని అనుకోనంత వరకు, వారి బలం హైందవత్వం కోసం ఉపయోగపడదు. వారు గొప్ప పోరాట యోధులనేది దయనీయమైన విషయం. హిందువులు వారిని తమ వారుగా కలుపుకొనేంత వరకు వారు తమను తాము హిందువులమని అనుకోలేరు. హిందువుల ప్రవర్తన తదనుగుణంగా ఉండాలి.

పుట్టుకతో హిందువులైన వారు – తమ దృష్టిలో, మళ్లీ హిందూమతంలోకి మారిన వారు కూడా హిందువులే అని నిర్ధారించుకొనేంత వరకు, హిందూమత పరిధిని దాటి వెళ్లిపోయిన వారు భారీ ఎత్తున మళ్లీ హిందూమతంలోకి తిరిగి వచ్చే అవకాశాలు మృగ్యంగా ఉంటాయి. ఈ విషయాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించేంత వరకు, హైందవత్వం తన సంఖ్యాపరమైన బలాన్ని నిరంతరం కోల్పోతూనే ఉంటుంది. తిరిగి దాన్ని పొందే సూచనలు కూడా ఉండవు. క్రైస్తవం, ఇస్లాంల ముందు తలదించుకొని నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

హిందూమత పరిధిలోంచి వెళ్లిపోయిన వారు, మళ్లీ దాంట్లోకి తిరిగి రావడం అనేది బయటకు కనపడేటంత సులభమైన విషయం కాదు.

దాని వల్ల ఒక పరిస్థితి ఉత్పన్నం అవుతంది. ఉదాహరణకు ఒక హిందువు తన సాంప్రదాయికమైన తిండిని, హిందూ అలవాట్లను వదిలిపెట్టి, మహమ్మదీయ మతంలోకి మారితే, అతడు, ఛాందసమైన హిందూదృక్పథంలో, ఒక విదేశీయుని కంటే మెరుగైనవాడు, స్వచ్ఛమైనవాడు కానే కాదు. కాబట్టి, తగిన వాడని ఋజువైనా, హైందవ సమాజం బయట నుండి వచ్చిన వాడు స్వీకరించాల్సిన వాడు కాదన్నట్లే. హిందువులు పూర్వీకులైన, ఒక  హిందువు కుటుంబంలో రక్త సంకరం అసలు జరగలేదు అని ఇంత వరకు నిరూపించబడ లేదు. కాబట్టి, తార్కికంగా చూస్తే, హైందవత్వం తన ఛాందసత్వాన్ని వదిలేసి, అలాంటి వారిని హిందూమతంలోకి ఆహ్వానిస్తే, దానిలో నిజాయితీగా రావాలనుకుంటున్న అందర్నీ స్వీకరించడానికి సిద్ధపడాల్సి ఉంటుంది.

ఇతర మతాలు మతాంతీకరణ (proselytism) ను ఎందుకు సులభంగా ప్రోత్సహించగలగుతున్నాయి? వాటి మతపరమైన ఐక్యత, కేవలం విశ్వాసాధారితమైనది కాబట్టి, వాటి అనుయాయులందరూ ఒకే ‘సత్యాన్ని’ అంగీకరిస్తే సరిపోతుంది. కాబట్టి, కాని హిందూమతం, మనం ముందుగానే చెప్పినట్లుగా, ఒక విశ్వాసం కాదు. హైందవత్వపు ఐక్యత అనేది ఏదైనా, ఒక ఉమ్మడి సాంస్కృతిక వారసత్వం చేత, ఒక ఉమ్మడి నాగరికత చేత, ఒక ఉమ్మడి జాతీయ ఉనికి చేత ఏర్పడుతుంది. హిందు మతంలోకి మారడం అంటే, జాతీయీకరణ సిద్ధాంతాన్ని అంగీకరించడమే. ఇది అన్ని ఆధునిక దేశాల్లో ఉన్నదే. ఇక్కడ దాన్ని వర్తింపజేస్తే దానర్థం ఇది. “ఎవరు భారతదేశానికి తగిన వారో, వారే భారతీయులు కాగలరు.” ఇంత వరకు, బయట కనబడే సమస్యలు లేవు.

కులాన్ని పరిగణించినపుడు, కొన్ని ప్రయోగాత్మకమైన సమస్యలు వస్తాయి. ఒకడు ఆరు నెలలు మహామ్మదీయ మతంలో ఉన్నాడనుకోండి. ఒక హిందూ ‘కులం’ అతన్ని మళ్లీ తనలోకి స్వీకరించలేదు. ఒక వేళ అలా తీసుకున్నారనుకుందాం. తిరిగి హిందూమతంలోకి వచ్చిన వారి కులం ఏమిటి? వారి పూర్వీకులు పది తరాల క్రిందట మహామ్మదీయులనుకుందాం. వారికి వారి గత కులం ఏమిటో తెలియదనుకుందాం. అలాగే, పుట్టుకతో విదేశీయుడైన ఒక వ్యక్తి, హిందూ నాగరికత మీద అభిమానంతో, ఒక హిందువుగా, ఒక భారతీయుడుగా మారాలనుకుంటే, అతని కులం ఏమిటి?

ఈ ప్రశ్నలకు జవాబు దొరకకపోతే, హిందూ మతాంతీకరణకు అనుకూలంగా జరిగే ఏ ఉద్యమమైనా నిరుపయోగమే. ఒక కొత్తగా వచ్చే వాడికి, అతని వ్యక్తిగత అర్హత ఆధారంగా హిందూ సమాజంలో భాగం కల్పించాలన్నా  కూడా సాధ్యం కాదు. ఎందుకంటే, పుట్టుకతో హిందువులైన వారికే, వారి ప్రతిభ ప్రకారం, స్థానం దొరకనంత వరకు, పైన చెప్పింది కుదరదు. తిరిగి హిందూమతంలోకి వచ్చిన, లేక కొత్తగా వచ్చిన వాడిని ఒక బ్రాహ్మణుడిని చేయలేం. అతడెంత జ్ఞానం, సంస్కారం, సుగుణం కలవాడైనా సరే. ఎందుకంటే ప్రస్తుతం హిందూ సమాజం ఉన్న పరిస్థితుల్లో, అరవింద ఘోష్ లాంటి వాడే బ్రాహ్మణుడిగా స్వీకరించబడలేదు.

ఒక మాటలో చెప్పాలంటే, హైందవత్వం బ్రతికి, అభివృద్ధి చెంది, పరిపాలించాలంటే, ఏదో ఫలానాది, ఫలాన ఆచారం వదిలేస్తే సరిపోదు. మొత్తం హైందవత్వం యొక్క సామాజిక వాతావరణమే మార్చుకోవాలి.

హైందవత్వాన్ని ఐకీకరణ చెయ్యలేం, బలపరచలేం, విస్తరించలేం కూడా! లక్షలాది హిందువుల హృదయ పూర్వకమైన సహకారం లేకుండా, హిందువులయినందుకు వారంతా సంతోషపడకుండా, గర్వపడకుండా, అది సాధ్యం కాదు. వారు అలా వుండకుండా నిరోధిస్తున్న అణచివేత లేకుండా, లక్షలాది హిందువులు తమను తాము హిందువులుగా రూపుదిద్దుకోకుండా, హిందువులకు దన్నుగా నిలబడకుండా నిరోధిస్తున్న అణచివేత లేకుండా ఇది సాధ్యం కానే కాదు.

మనం కులవ్యవస్థ యొక్క అణచివేతను ప్రబోధించం. సాంఘిక దుర్మార్గం యొక్క అణచివేత, అది కులవ్యవస్థ అనే ప్రవిత్రమైన పేరిట అమలు చేయబడినా సరే, దాన్ని ప్రబోధిస్తాం. సామాజిక అసహనం పోగొట్టలంటే, కులం తన కరడు కట్టిన, అసలు మారని స్వభావం పోగొట్టుకోవాలి. హిందువులు ఇతర మతాలలోకి మారకుండా ఉండాలంటే, కూడా ఈ సామాజిక అసహనం పోవాల్సిందే. అప్పుడే హిందుమతంలోకి ఇతరులు రావడం, ప్రయోగాత్మకంగా సాధ్యమవుతుంది.

చాలా మంది హిందువులు హిందూ ఐక్యత యొక్క విలువను ప్రశంసించడం ప్రారంభించారు. హైందవత్వంలోని బలహీనతలకు కారణాలను కూడా వారు అర్థం చేసుకుంటున్నారు. సమాజంలో రావల్సిన కొన్ని మార్పులు వెంటనే అవసరమని కూడా వారు తెలుసుకుంటున్నారు. ఆ సామాజిక మార్పుల అర్థం ఏమిటో వారు గ్రహించలేకపోతున్నారు.

సమాజానికి పునాది, ఒక గృహస్థు ఇల్లు. అంతే కాని సంత జరిగే చోటు కాదు. టీ కొట్టు కాదు. టెన్నిస్ ఆడే స్థలం కాదు. గుడి కూడా కాదు. కాని ఇల్లు మాత్రమే. భూమి మీద అతి పవిత్రమైన స్థలం అదే. గుళ్లలో పూజలందుకునే దేవుళ్లు దేవతలంతా, ఇళ్లలో మగవారుగా ఆడవారుగా జన్మనెత్తిన వారే. ఒక గుడి ప్రాంగణంలో జరిగే హిందువుల పండగలల్లోని ఐక్యత, అందరు హిందువుల్లో, వారి ఇళ్లల్లో కనుక లేకపోతే, అది ఐక్యతే కాదు. హైందవత్వం శిధిలం కాకుండా కావాలసిన సాంఘిక సంస్కరణలు ఏవైనా కావచ్చు. అవి ఇంటి స్థాయిలోనే ప్రారంభం కావాలి. లేకపోతే వాటికి ప్రయోజనం శూన్యం. మనం ముందుగా అనుకున్నట్లుగా అవి వెంటనే, ఇప్పుడే, కనీసం హిందువులు అల్ప సంఖ్యాకులుగా ఉన్న ఉత్తర, తూర్పు బెంగాల్ లాంటి  ప్రాంతాల్లో, అస్సాం లాంటి, వారి మెజారిటీ వేగంగా తగ్గిపోతున్న ప్రాంతాల్లో జరగాలి. అన్ని వైపుల నుంచి బెదిరింపులకు గురవుతున్న హైందవత్వం, ఇక ఏ మాత్రం వేచి ఉండే పరిస్థితి లేదు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here