భారతీయుడిని భారతీయుడిగా..

1
14

[శరచ్చంద్రిక గారు రచించిన ‘భారతీయుడిని భారతీయుడిగా..’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

భారతదేశానికి పశ్చిమ దేశాల నుండీ మతాలు 

[dropcap]భా[/dropcap]రతదేశానికి పశ్చిమ దేశాల నుండీ యూదులు, పార్సీలు, మహమ్మదీయులు, క్రైస్తవులు వచ్చారు. భారతదేశానికి వచ్చిన ఈ మతాలు భారతీయ సంస్కృతితో సంబంధం లేనివి . ఈ విషయం భిన్నత్వంలో ఏకత్వం అనే నా వ్యాసం చదివితే సామాన్యులకి కూడా అర్థమవుతుంది.

శరణార్థుల్లాగా వచ్చిన వారు యూదులు, పార్సీలు. పార్సీలు తాము పాలల్లో చక్కెరలా కలిసిపోతాము అన్నారు. ఈ రెండు మతాలకి తమ మతవ్యాప్తి చేయాలి అన్న ఉద్దేశం లేదు. వారిని మతం మారమని భారతదేశంలో ఎవరూ బలవంత పెట్టలేదు. వారికి ఏ రోజునా భారతదేశంలో తమ identity మార్చుకోవాల్సిన అవసరం రాలేదు. ‘భారతదేశంలో మా హక్కులకు భంగం కలిగింది’ అని వారు చెప్పగా ఎప్పుడూ వినలేదు కూడా.

స్వామి వివేకానందుల వారు చెప్పినట్లు భారతీయులు భిన్నత్వాన్ని accept చేసారు. Religious Tolerance అనే పదాన్ని తరచూ వింటూ ఉంటాం. Tolerate అంటే భరించడం. నొప్పి అనేదాన్ని భరిస్తాం. కానీ భారతీయులు ‘accept’ చేసారు. అంటే అంగీకరించారు. వారు యూదులని గౌరవించినట్లే మహమ్మదీయులను, క్రైస్తవులను కూడా గౌరవించారు. కానీ ఈ రెండు మతాలు తమ మతాధిపత్యం చూపిస్తూ భారతీయులకి ఏమన్నా ఉపకారం చేసాయా? లేదే? తమ భిన్నత్వాన్ని ఆమోదించి, తమని నమ్మి ఆహ్వానించిన → భారతీయులను ఎన్నో విధాలుగా వంచించి, హింసించి, మారణకాండలు సృష్టించి 1200 ఏళ్ళ పాటు రాజ్యమేలాయి.

దండయాత్రలు చేసి మతవ్యాప్తి చేసినవారు మహమ్మదీయులు. వీరితో ఎన్నో యుద్ధాలు జరిగాయి. కొన్ని వేల గుళ్ళని ధ్వంసం చేసారు అంటే భారతదేశపు సంస్కృతి యొక్క ఉనికి లేకుండా చేసి, వారి మతవ్యాప్తి చేసుకోవడం కోసమే వచ్చారు అన్నది సత్యం. ఈ విషయాలు  విపులంగా ఈ వ్యాసంలో చదవచ్చు భారతీయులు కాపాడుకున్న దేవతామూర్తులు . కొందరిని బలవంతపు మత మార్పిడి చేస్తే, కొందరు ఇష్టపూర్వకంగానే మతం మారారు. ఈ మతం మారిన వారు కొందరు తమ పూర్వీకుల మూలం ‘భారతీయతత్వమే’ అన్న సంగతి మర్చిపోయారు. వీరు ‘టర్కీ, అరేబియా మూల వాసులం’ అంటూ, ‘హిందూ నాయకులు (ఆనాటి Indian congress) పరిపాలించే ఈ రాజ్యంలో మేము కలిసి ఉండలేము’ అంటూ వేరే దేశం కావాలన్నారు. మారణకాండ సృష్టించి భారతదేశపు రెండు రెక్కలని విరిచి మూడు ముక్కలు చేసి, భారతదేశం తిరిగి ఎగరకుండా ఆ వాణిజ్య రహదారిని శాశ్వతంగా మూసివేశారు.

వ్యాపారం పేరుతో అతిథుల్లా వచ్చి మతవ్యాప్తి చేసినవారు క్రైస్తవులు. గోవాలో మతప్రచారం చేస్తూ భారతీయులు తిరిగి తమ మతంలోకి వెళ్ళిపోతున్నారని Goa Inquisition ఉండాలని మొట్ట మొదట కోరిన వాడు Francis Xavier . Inquisition పేరుతో భారతీయుల మీద బుడతకీచులు చేయని అరాచకం లేదు. విగ్రహారాధన అంటూ గుళ్ళని ధ్వంసం చేసారు. గోవాలో నివసించే వారి కట్టు, బొట్టు, భాష అన్నీ మార్చేశారు. తరువాత ఫ్రెంచ్, బ్రిటిష్ వారు వచ్చారు. రవి అస్తమించని ఆంగ్ల సామ్రాజ్యంలో చేరింది భారత్. ‘భారతీయులకు నాగరికత తెలీదు’ అన్నారు. రాణీ వారు పరిపాలించారు. ఆంగ్లవిద్య పేరుతో విద్యావ్యవస్థ పూర్తిగా నాశనం చేసారు. “మీకు అందరికీ ‘caste‘ ఉంది” అన్నారు..  ‘బ్రాహ్మణులే అన్నిటికీ కారణం’ అని తెలిపారు . ‘మీలో కొందరు పుట్టుకతోటే నేరస్థులు’ అన్నారు. దానికి తగ్గ చట్టం తెచ్చారు. అందుకు స్టూవర్టుపురం లాంటి settlements ఏర్పాటు చేసారు. Salvation Army (Mukthi Fauj) వారు వచ్చి వాళ్ళకి మతం ఇచ్చి ముక్తిని ప్రసాదించామన్నారు. భారతదేశ సంపదని సముద్రతీర పట్టణాలకు తరలించడానికి రైళ్ల లైన్లు వేస్తూ పనిలో పని క్రైస్తవం ద్వారా అందర్నీ కలిపారు. కరువులు సృష్టించారు. వేల మరణాలకు కారణం అయ్యారు. ప్రపంచ యుద్ధాలల్లో ‘మీరు మా వాళ్ళే. కాబట్టి మా వైపు నుండీ యుద్ధం చేయాలి’ అన్నారు. యుద్ధంలో ప్రాణాలున్నంత వరకే ‘మా వాళ్ళు’, ప్రాణాలు పోయాక తద్దినాలు పెట్టే ఆనవాయితీ లేదు కాబట్టి ‘మీరెవరో’ అనుకున్నారు. ఈవిధంగా అనేక విధాలుగా మారణకాండలు సృష్టించి, దోచుకున్నంత దోచుకుని, భరతభూమిలోని ఎన్నో వ్యవస్థలని పూర్తిగా సర్వనాశనం చేసి, ‘మీకు స్వాతంత్య్రం ఇచ్చేశాం’ అన్నారు. ఈ విధంగా మొదలయిన క్రైస్తవ మత మార్పిడి, ఆధిపత్యం ఈ రోజుకి కూడా కొనసాగుతోంది. భారత రాజ్యాంగానికి తల్లి వంటిది బ్రిటన్ రాజ్యాంగం అన్నారు. అందులో ‘Denominations’ కే స్థానం కానీసంప్రదాయాలకు స్థానం లేదు. క్రైస్తవ మత మార్పిడి Joshua Project లాంటి వాటితో కొనసాగుతోంది. ‘విగ్రహారాధన చేసేవారు అన్యులు’ అంటూ బోధనలు జరుగుతూనే ఉన్నాయి. ‘భరతమాతకి ఎందరు భర్తలు?’ అని అడిగే పాస్టర్లు వచ్చారు.

హిట్లర్‌ని ఎవరూ ఎప్పుడూ మెచ్చుకోకూడదు

చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఆనాటి భారతీయులను ఎవరైతే హింసించారో వారిని ‘హీరో’లని చేసి ఉత్సవాలు చేయడం చేస్తుంటారు.

అందుకు ఉదాహరణలు:

  • Feast of St Francis Xavier అనే వేడుకలు ఈనాటికీ గోవాలో సంబరాలుగా జరుపుతారు.
  • ఇటీవలే కొల్హాపూర్ (అష్టాదశ శక్తీ పీఠం ఉన్న ప్రదేశం) లో ఔరంగజేబుని glorify చేస్తూ వాట్సాప్‌లో సందేశాలు పంపారుట. (ఇది వరకే చెప్పాను కదా). ఒవైసీ గారి సోదరుడు ఔరంగజేబు సమాధిని కూడా దర్శించుకుని వచ్చారు కూడా!
  • ఇటీవల కాలంలో భారతదేశంలో పోలీసులని కూడా లెక్కచేయకుండా ‘పాకిస్తాన్ జిందాబాద్’ అనే నినాదాలు విన్పిస్తున్నారు. ‘మేము మహమ్మదీయులం. హిందువులతో మేము కలిసి ఉండలేము’ అని పరోక్షంగా చెప్తున్నారా అన్నట్లు ఉన్నది.
  • మొన్నటికి మొన్న టిప్పు సుల్తానుని ఓ దేశభక్తుడిగా చెప్పే టపాలు వచ్చాయి. ఆయన మెల్కొటే లో బ్రాహ్మణ అయ్యంగార్లని నరకచతుర్దశి రోజు హతమార్చిన సంగతి వీళ్ళకి తెలీదా?
  • ఔరంగజేబు విషయంలో కొందరు చరిత్రకారులు ఆయనని చాలా తప్పుగా అర్థం చేసుకున్నట్లు, చాలా గొప్ప వ్యక్తి అయినట్లుగా మాట్లాడుతారు. అమెరికాలోని Rutgers University–Newark లో Professor Audrey Truschke ఏకంగా ఒక పుస్తకాన్నే వ్రాసారు. ఆవిడ చేసే పని మెచ్చుకుంటూ బోలెడన్ని నిధులు వేల డాల్లర్ల రూపంలో కూడా వచ్చాయి.

ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ఔరంగజేబు హిందువుల దేవాలయాలు ధ్వంసం చేసినందుకు, వారిని మతం మారమని, మారని వారికీ జిజియా పన్ను వేసినపుడు ఆయనను ‘ఒక నిజమైన మహమ్మదీయుడు’ అన్నారుట ఆనాటి ఇస్లాము మత పెద్దలు. భిన్నత్వాన్ని ఆమోదించిన అక్బర్ ‘నిజమైన మహమ్మదీయుడు కాదు’ అని కూడా చెప్పారుట. ఈ మాటలు ఒక పాకిస్తాన్ చరిత్రకారుడు చెప్పినవి.

హిట్లర్‌ని ఎవరూ ఎప్పుడూ మెచ్చుకోకూడదు. మెచ్చుకోరు. ఎన్నో మారణకాండలు సృష్టించిన ఔరంగజేబు వంటి వారిని, టిప్పు సుల్తాను వంటి వారిని glorify చేస్తున్నవారు ఆ నియంతలకి మద్దతు ఇస్తున్నట్లే కాదు. వారి లాగే హిందువుల ఉనికిని కూడా ద్వేషిస్తున్నట్లే. 

ఈ మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా Hinduphobia ఘటనలు / హిందువులపై జరిగిన హింసాకాండ:

  • ఏప్రిల్ 2020లో పాల్గర్‌లో ‘పిల్లల్ని ఎత్తుకుపోయేవారు’ అంటూ సాధువుల హత్య
  • తమిళనాడులో జనవరి 2022లో లావణ్య అనే 17 ఏళ్ళ అమ్మాయి క్రైస్తవ మతం స్వీకరించకలేదని బళ్ళో ఎన్నో హింసలు పెట్టిన కారణంగా ఆత్మహత్య చేసుకుంది.
  • ఆంధ్రప్రదేశ్‌లో కోటపాడు అనే గ్రామంలో హిందువులు వారి రుద్రభూమిలో శివుడి విగ్రహం పెట్టకూడదు అని క్రైస్తవ మతానికి చెందిన వారు నిరసనలు తెలియజేసారు.
  • బైయింసాలో హింస, మే 2021 బెంగాల్ ఎన్నికల తరువాత హింసాకాండ, నూపుర్ శర్మ ఘట్టం తరువాత జరిగిన దారుణమైన హత్యలు, మొన్నటికి మొన్న ఒక ఢిల్లీలో సాక్షి అనే అమ్మాయి హత్య (ఇవన్నీ అంతర్జాతీయ మీడియాకి తెలియదన్నట్లే ఉంటారు)
  • సెప్టెంబర్ 11, 2021 న అమెరికాలో Dismantling Global Hindutva అనే conference మూడు రోజుల పాటు నిర్వహించారు. అందులో అమెరికా విశ్వవిద్యాలయాలలోని South Asian Departments పేరు ఉండటం ఓ విశేషం.
  • అక్టోబర్ 2021 లో బంగ్లాదేశ్‌లో దసరాల్లో హిందువులపై దాడి, ఆడవారిపై మానభంగాలు. ఇస్కాన్ పైన కూడా దాడి/హత్య.
  • గత ఏడాది Leicester, UK లో ఎన్నో గొడవలు సృష్టించారు. దీని పైన Pandit Satish Sharma గారి మాటలు యూట్యూబ్‌లో వినవచ్చు.
  • అమెరికాలో ‘మేము హిందువులం. మమ్మల్నికులాల పరంగా విడదీయద్దు. మా ప్రాథమిక హక్కుని భంగపరుస్తున్నారు’ అంటూ చెప్తున్నా, ప్రతీ చోటా ‘Caste’ ని anti-discrimination policy లో చేరుస్తున్నారు. కొన్ని విశ్వవిద్యాలయాల్లోచేర్చారు కూడా.
  • ఆ మధ్య Rep. Ilan Omar గారు ఒక Anti-Hindu resolution తేవడానికి మద్దతు ఇచ్చారు.
  • అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలో Senator Aisha Wahab గారు SB 403 మార్పులు తెచ్చారు.
  • మొన్నటికి మొన్న ‘ఈ సాధు, సన్యాసులు అన్నింటినీ త్యాగం చేసాము అంటారు, ఏమీ చేత గాక, కట్టుకున్న దానిని పోషించలేక, వ్యసనాలకు, సోమరితనానికి బానిస అయ్యి, ఆ బాట పడుతారు, ఎక్కడో ఒక చోట ఇంత ఆహారం దొరుకుతుంది తమ ఆహార్యన్ని చూసి అని..’ అని 2013లో కేదారనాథ్‌లో దారుణాలు చేసారు అంటూ ముఖపుస్తకంలో ఓ hinduphobic post వ్రాసాడు ఇమ్రాన్ మొగల్ అనే ఓ మహానుభావుడు. నిజానిజాలు తెలీక చాలా మంది ఆ టపాని viral చేసారు.

NO Reconciliation 

భారతదేశంలో ఇటువంటి రక్త చరిత్ర సృష్టించినది ఈ రెండు మతాలు. భారత స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు గడిచినా చర్చి మత పెద్దల నుంచి కానీ, మహమ్మదీయ మత పెద్దల నుంచీ కానీ ఎటువంటి reconciliation వంటి మాటలు లేవు. బ్రిటన్ వారు ప్రపంచయుద్ధంలో వారి వైపు నుంచీ పోరాడి మరణించిన భారతజాతి సైనికులకు ఒక స్మారక చిహ్నమూ కట్టించలేదు. అసలు భారతీయులకి ఈ విధంగా ప్రశ్నించాలని కూడా తెలియదు. ఎందుకంటే హిందువులు అనబడే ఆనాటి భారతీయుల వారసులుకు తమ పూర్వీకుల చరిత్ర తెలీదు. ‘Caste’ లాంటి కొన్ని అంశాల్లో పూర్తి స్థాయి పరిశోధనలు కూడా జరగలేదు. పాఠ్యాంశాలలో చరిత్ర మొత్తం వక్రీకరించారు.

హిందువులు మతోన్మాదులు కాదు 

హిందువు తన సంస్కృతి గొప్పగా చెప్పుకుంటాడేమో కానీ, ప్రపంచమంతా తన మతం మారాలి అని చెప్పడు. మత విస్తరణ అనేది హిందువు ముఖ్య ఉద్దేశం కాదు. అందరితో కలిసిపోవాలన్న ధ్యేయం తోటే ఉంటాడు.

భారతదేశంలో ఏ పుణ్యక్షేత్రం తీసుకున్నా విరిగిన విగ్రహాలు, సమాధులు చాలా మాములు దృశ్యాలు. అవి ఏవీ గమనించనట్టు ఇంకో గుడి కట్టుకుంటాడు హిందువు.

నిజంగా హిందువులు అంత మతోన్మాదులే అయితే ప్రతీ ముస్లింని, ప్రతీ క్రైస్తవుడినీ ద్వేషించాలి కదా? ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారిని, భారత్ కోసం క్షిపణులు తయారు చేసిన అబ్దుల్ కలాం గారిని, తమ మతం వారు పడగొట్టిన గుళ్ళని తిరిగి పునరుద్ధిస్తూ ‘ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను’ అన్న KK మహమ్మద్ గారిని కూడా ద్వేషించాలిగా? ద్వేషించడం అటుంచి ఇటువంటి మహనీయులని నెత్తిన పెట్టుకుంటారు హిందువులు. చాగంటి గారు, కలాం గారి మీద ఏకంగా ప్రవచనాలే చెప్పారు. అబ్దుల్ కలాం గారు చనిపోతే కోట్లమంది బాధ పడ్డారు.

వ్యాసం మొదట్లో చెప్పినట్లే ఎన్నో వందల ఏళ్ళ భారతదేశంలో నుంచీ ఉన్న యూదులు, పారశీలు భారతీయులతో కలిసిపోవడమే కాదు వారి identity ని కూడా మార్చుకునే అవసరం వారికి లేకపోవడం అనేది హిందువులు మతోన్మాదులు కాదు అని చెప్పడానికి చక్కటి ఉదాహరణ.

సూడో సెక్యూలర్ వామపక్షవాదులు

మరి ఇన్ని వందల ఏళ్ళ తరువాత కూడా ఈ రెండు మతాల వారికి భారతదేశ చరిత్ర , భారతీయుల మూలాలు అర్థం చేసుకునేందుకు అవకాశం ఇవ్వలేదు వామపక్ష వాదులు. చరిత్రని చాప కింద తోసివేయడంలో వీరి పాత్ర చాలా ఉంది. పైగా అగ్నిలో ఆజ్యం పోసినట్లు భాజపా ని గెలిపించి అధికారం ఇచ్చిన కారణానికి హిందువులకి హిందుత్వ వాదులు, కుల రాజకీయాలు, మనుస్మృతి అంటూ ముద్రలు వేసి హిందువులని చులకనగా మాట్లాడటం, వారి ఆచారాలను మూడాచారాలు అనడం, వారి భగవదస్వరూపాలను కించపరచడం చేస్తున్నారు ఈ సూడో సెక్యూలర్ వామపక్షవాదులు. ఒక్కమాటలో చెప్పాలి అంటే ‘భారతీయత’ అనే సంస్కృతిని demonize చేస్తున్నారు.

హిందువుల ఉనికి ప్రశ్నార్థకం

1948 రజాకార్ల ఉద్యమం, బంగ్లాదేశ్‌లో 1971 లో హిందువుల ఊతకోచ, 1992 లో కాశ్మీరు పండితుల మారణకాండ వంటి వాటిని కళ్ళతో చూసిన తరంలో ఇంకా కొందరు మిగిలే ఉన్నారు. తమ భావితరాలతో అవి చర్చించడానికి కూడా భయపడతారు వారు. ఇన్ని హింసాకాండలు చూసిన సాక్ష్యాలు కళ్ళెదుట కనిపిస్తుంటే, మానుతున్న ఆ గాయాన్ని రేపి హిందువులను ‘మీరు మతోన్మాదులు’ అనటం ఎంత వరకూ న్యాయం? ఇంకొక పాకిస్తాన్ ,బంగ్లాదేశ్ ఉద్భావిస్తాయేమోనన్న భయం హిందువుని ఎపుడూ వెంటాడుతూనే ఉంటుంది. భారతదేశంలో ఒక హిందువు ఉనికి ప్రశ్నార్థకం అయిపోతోంది. తన ఉనికిని కాపాడుకునేందుకు హిందువులు తమకి కావాల్సిన నాయకుడిని ఎన్నుకోవడంలో తప్పేంటి? రాజకీయంగా తమకి అండగా ఒక పార్టీ ఉండాలి అనుకోవడం తప్పా? తన ఉనికి తాను కాపాడుకుంటే అది మతోన్మాదం అవుతుందా?

భారతీయుడిని భారతీయుడిగా గౌరవించాలి

భారతదేశంలోభిన్నత్వంలో ఏకత్వంఉండాలి అంటే భారతీయుడిని భారతీయుడిగా గౌరవించాలి. 1200 సంవత్సరాల చరిత్ర చేసిన మారణకాండ, హింసాకాండ ఈ ప్రపంచం గుర్తించాలి. అది పునరావృత్తం కాకుండా చట్టాలు రావాలి. 

A country that doesn’t learn from its past can never see a glorious future – దుశ్యంత్ శ్రీధర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here