అధ్యాయం 53: మాంత్రికుల పాలన
ఇది భూమి మీద చీకటి కాలం.
ఇక్కడే కాదు, సౌర వ్యవస్థ లోని అన్ని మానవ కాలనీల్లోనూ ఇలాగే ఉంది.
చంద్రుడు, గనీమీడ్, టైటాన్, లాండిస్ యొక్క ఫ్లోటింగ్ ప్లాట్‍ఫామ్, నెప్ట్యూన్ ఉపగ్రహం ట్రైటాన్ లలోని మానవ కాలనీలలోనూ ఇదే పరిస్థితి.
ఈ సామ్రాజ్యానికి కేంద్రం కుజగ్రహంలో ఉంది.
అరుణభూములలోని రాజధాని ‘మంత్ర’! కుజగ్రహంపై ఉన్న మానవ కాలనీ, దాని రాజధాని ‘లిబర్టీ’ పరిస్థితి ఇప్పుడెలా ఉంటుందో నేను ఊహించగలను. అరుణభూముల దళాల చేత ఈపాటికే నాశనం చేయబడి ఉండాలి!
సహస్రాబ్దుల పాటు అద్భుతమైన ప్రగతి సాధించిన మానవ నాగరికతలు – అంతరిక్ష ప్రయాణాలు, స్పేస్ కాలనీలు, కమ్యూనికేషన్లు, వైద్యశాస్త్రం, సైనిక మరియు అణుపాటవం… ఇవన్నీ సమూరా యొక్క విశ్వాసపాత్రులు, విశ్వశక్తి సాధకులు అయిన అనుచరగణం చేతిలో నాశనమైపోయాయి. మాంత్రిక చక్రవర్తి నిశ్శబ్దంగా ప్రభుత్వాలను కూలదోసి ఆక్రమించుకోవడం, ఇంకా నియంత్రించడం జరిగింది.
వారు ఎక్కడైనా హత్యలు, దాడుల ద్వారానే దీనిని సాధించారు. అవకాశమున్న చోట చర్చలు, బెదిరింపులు ఉపయోగించారు. మానవ సంస్కృతి, వ్యవస్థలు, రక్షణ వ్యవస్థలు క్షుద్రశక్తులకి ఇలా లొంగిపోతాయని అత్యంత నిరాశావాదైన చరిత్రకారుడు లేదా ఆలోచనాపరుడు మాత్రమే ఊహించగలడు.
కానీ నేను కుజగ్రహంపై అరుణభూముల దళాలు మానవులతో యుద్ధం చేయడం చూశాను. ఆమ్ల వర్షం, క్లోన్డ్ సైనికులు, మనోశక్తి ద్వారా క్షిపణులను దారి మళ్ళించడం… విశ్వశక్తి, క్షుద్రశక్తి ఆధారంగా మొత్తం మానవుల ఆయుధ వ్యవస్థనే తిప్పికొట్టారు. ప్రణాళికలు, మోసపూరిత దౌత్యం, ఉన్నత హోదాలలో ఉన్న రహస్య అనుచరులు తిరుగుబాటు చేశారు – దాంతో భూమిపైనా, ఇంకా ఇతర ప్రాంతాలలో మానవ పాలన అంతమైంది.
ఇంకా నేను సమూరాకి అందించిన అద్భుత వస్తువులు ఇందుకు నిస్సందేహంగా కారణాలే.
“కానీ మాస్టర్! మీలాంటి మనుషులు ఇంకొందరు, ఎంపికైన వ్యక్తులు చాలామంది ఎన్నో రకాలుగా సమూరా చక్రవర్తికి సహాయం చేసి ఉండవచ్చు. పైగా నాలాంటి రోబోలు ప్రత్యేకంగా అతని తాంత్రికుల ద్వారా ప్రోగ్రామ్ చేయబడినవి… సౌకర్యాలను కల్పించి ఉంటాయి” చెప్పింది యురేకస్.
ఆమ్రపాలి గ్రామంలో మేము విశ్రాంతి తీసుకుంటున్నాము, మహా పొలం నుంచి తిరిగి రాగానే… ఆయన ఇంట్లో అందుబాటులో ఉన్న పాలు, రొట్టెలు, కొన్ని తృణధాన్యాలను ఆహారంగా తీసుకునే వాళ్ళం. భూమి యొక్క గత దశాబ్ద చరిత్రను బ్రౌజ్ చేయడానికి ఐజి నెట్‌కి కనెక్ట్ అయ్యేవాడిని.
కార్మికులను నియంత్రించేందుకు తాంత్రిక దళాలు, గార్డులు ఉన్నారు, కాని మాకెవరూ ఏ ఆటంకమూ కలగనివ్వలేదు.
50 క్రోమోజోములు, 10000 కంటే ఎక్కువ నక్షత్రాల స్థాయి ఉన్న ఒక మాంత్రికుడిని కావడం, నాతో సమాన మాంత్రిక శక్తి కలిగిన భార్య ఉండడం, ఒక గ్రహాంతర మాంత్రికుడు సహాయకుడిగా ఉండడం, యుద్ధ సామర్థ్యం గల రోబోని కలిగి ఉండడం నాలో దైధీభావం కలిగిస్తోంది. ఇక్కడ మాదో ప్రత్యేక హోదా.
సౌరవ్యవస్థలో నేను అధికార వర్గానికి చెందినవాడిని. నాతో అలాగే ప్రవర్తిస్తున్నారు. ప్రతి గ్రహంలో ప్రతి యుద్ధం యొక్క చరిత్రనీ రాయొచ్చు, కానీ దుర్భరమైన బతుకు చిత్రం ఎక్కడైనా ఒకేలా ఉంది!
ఉరితీయబడిన నాయకులు, ధ్వంసమైన రక్షణ సంస్థలు, తమ క్షిపణులను తమవైపే గురిపెట్టిన వైనం…
దహనమైన ‘న్యూ హోప్’ నగరం.
అరుణభూములలో సమూరా పట్టాభిషేకము.
న్యూ హోప్ నగరానికి సమూరా రాక. ఓ సమావేశంలో భూమి యొక్క ప్రజలను ఉద్దేశించి ప్రసంగం. మానవ పాలకుల స్థానంలో మాంత్రిక ప్రభుత్వం ఏర్పడింది. ఆసియాలో అఘోరాలు, ఆఫ్రికాలోని ఊడూ, దక్షిణ అమెరికాలోని విచ్ డాక్టర్స్ వంటి పెద్ద స్థానిక ఉపాసక బృందాలకు ప్రాధాన్యనతీయడంలో రాజకీయంగా మార్పులు సంభవించాయి. వాళ్ళకి భారీ స్థాయిలో భూభాగాలను పాలించుకోడానికి కానుకగా ఇచ్చారు.
చంద్రగ్రహం ఓడింది. అది ఇప్పుడు వింత జీవులకు, విశ్వశక్తి సాధకులకు ఓ ధ్యాన కేంద్రం.
ఇవీ వార్తలు….
సైన్యంలో తాంత్రిక నాయకులు ఉన్నారు. అణ్వాయుధాలు వారి చేతుల్లో ఉన్నాయి. కర్మాగారాలు, పారిశ్రామిక సంస్థలన్నీ మానవ సాంకేతిక నిపుణుల అదుపులోనే ఉన్నాయి… కానీ ఈ మానవులు తాంత్రికులచే నియంత్రించబడుతున్నారు.
అన్ని దేశాలలోనూ మనుషుల మానసిక స్థితి ఒకేలా ఉంటుంది. అధికారంలో ఉన్నవారికి విధేయులుగా ఉంటారు.
కొందరు, చాలా తక్కువంది – విలువలు, ధైర్యం, దేశభక్తి ఉన్నవారు మాత్రమే తిరుగుబాటు చేస్తారు.
అన్ని గ్రహాల కాలనీలు ఒకే పాలనలో ఉన్నందున ఒక దశాబ్దం పాటు వ్యవస్థలన్నీ ఇలాగే కొనసాగాయి.
గెలాక్టిక్ కౌన్సిల్ లేదా వేర్వేరు వ్యవస్థల్లోని కాలనీల్లోని మానవులు ఎన్నడూ సహాయం చేయలేదు. దేశాల అంతర్గత వ్యవహారాల్లో ఎవరూ జోక్యం చేసుకోరు, వారి సొంత భద్రతకి ప్రమాదం ఎదురైతే తప్ప లేదా ఆర్థిక వ్యవస్థ పతనమైతే తప్ప.
మేము ఆ ఇంటిలో మహాతో వారం రోజులు గడిపాము. అనేక వివరాలను తెలుసుకున్నాము.
మా కథ అర్థం చేసుకోవడం మా మావగారికి కష్టంగా ఉంది –
ఎందుకంటే నేను సుప్తావస్థలో దాదాపు ఒక దశాబ్దం లేదా అంతకంటే ఎక్కువ గడిపాను; సుదూర గ్రహాలలో ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నా కోసం స్థానిక తాంత్రిక పాలకుల వద్ద నుండి రోజూ ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు.
కానీ నేను మాంత్రికుడిని కాబట్టి ఇక్కడో ప్రముఖుడిగా చలామణీ అవుతున్నాను. ఈ ప్రాంతపు కొత్త అధికారి నాకు బహుమతులు పంపాడు. ఇప్పుడు ఒక్కో గ్రామానికి ఒక్కో పెద్ద లేడు, వంద గ్రామాలు మరియు పట్టణాల్లో ఒకే ఒక్క అధికారి ఉన్నాడు.
“నా జీవితమంతా నేను మాంత్రికులని ద్వేషించాను. మేము మీ అమ్మనీ, నాన్ననీ బహిష్కరించాము. ఇప్పుడు నా సొంత కూతురు, అల్లుడు తాంత్రికులుగా ఉన్నారు. కానీ మళ్ళీ దుష్ట గ్రహాంతరవాసుల చేతిలో నేను బాధపడ్డాను. దేవుని పద్ధతులు అర్థంకానివి!” అన్నాడు మహా.
మహాను కార్మిక శిబిరం నుంచి విడుదల చేసి, తన ఇల్లు, ఆస్తికి తిరిగి ఇచ్చేయమని మాంత్రిక పాలకులను కోరాను.
నా మాట మన్నించి, కొన్ని రోజుల్లో నేను అడిగినట్లే చేశారు పాలకులు.
మేము మా ఇళ్లకు తిరిగి వెళ్ళాము. నాకు నా పూర్వీకుల ఇంటికి, మహా గారు తనింటికి.
తరువాత ఒకరోజు నాకు ఐజి నెట్ ద్వారా ఒక సందేశం వచ్చింది. రెండు నెలల తర్వాత సమూరా కుజగ్రహం నుంచి న్యూ హోప్ సిటీకి వస్తున్నాడట. వచ్చి చక్రవర్తిని కలుసుకోమని ఆదేశిస్తూ సందేశం వచ్చింది.
“తాంత్రిక సామ్రాజ్యానికి మీరు చేసిన సేవలకు, మీరు చేసిన త్యాగాలకు గాను మీకు ‘ఆర్డర్ ఆఫ్ విజార్డ్ ఎంపైర్’ పురస్కారం అందజేయబడుతుంది. హనీ ఆమ్రపాలి, చక్రవర్తికి మీరు చేసిన సేవకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం!”
దాని యొక్క ద్వంద్వత భయపెడుతోంది.
ఇప్పుడు నేను గౌరవించబడ్డాను!
ఒకప్పుడు నేను వేటాడబడ్డాను!
కానీ నా మనస్సు ఒక పరిష్కారాన్నీ, ప్రతీకారాన్నీ బలంగా కోరుకుంటోంది. ఈ దుష్ట కుజగ్రహ మాంత్రికులు భూమిని, సౌర వ్యవస్థలో ఉన్న అన్నిటిని నాశనం చేశారు. సమూరా నా తల్లిదండ్రులను చంపాడు, నన్ను ఇంకా ఎందరినో దోచుకున్నాడు. ఇప్పుడు అతనిచ్చే పురస్కారాలు ఎవడికి కావాలి?
“విశ్వాసపాత్రులైన మానవులంతా ఎక్కడికి వెళ్లిపోయారు?” అంటూ అరిచాను.
మేధావులు, శాస్త్రవేత్తలు మరియు సైనికులు ఎక్కడ ఉన్నారు? ఎర్త్ కౌన్సిల్ – రక్షణ విభాగం ఎక్కడ?
ఎక్కడో అక్కడ తప్పనిసరిగా ప్రతిఘటన వస్తుంది. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం కోసం మానవుల ప్రతిఘటన.
కాని ఎక్కడ? ఇది శాశ్వతంగా కొనసాగడానికి వీల్లేదు! వెతుకు! యురేకస్, వెతుకు!”