అధ్యాయం10:ప్రేరణ
[dropcap]అ[/dropcap]వును! చెన్ లీ తెలివైన రాజకీయవేత్త! ఆమ్రపాలిలో ఆ వర్షపు సాయంత్రాన్నీ, ఆమ్రపాలి గ్రామంలోని దక్షిణపు పొలాలలో మా అమ్మా నాన్నలైన నయన, నారాలను చంపబడిన ఆనాటి సాయంత్రాన్ని నాకు మృదువుగా గుర్తుచేశాడు.
అవును, దక్షిణ హిందూ మహాసముద్రంలోని మాంట్‌గొమెరీ యొక్క స్పేస్ ఎలివేటర్‍లో మేము సయోనిని చంపగలిగాం, కానీ సమూరా తప్పించుకున్నాడు. భైరవ ఆలయంలోని నేలమాళిగలో దాచిన అద్భుత శక్తిగల వస్తువు – వెండి కొవ్వొత్తిని స్వాధీనం చేసుకుని పారిపోయాడు.
“నీవు ఊహించింది నిజమే, మిస్టర్ హనీ! సమూరా తప్పించుకున్నాడు. అతని వద్ద అనుభవజ్ఞులైన మాంత్రికుల సంఘం (సిండికేట్ ఆఫ్ సీనియర్ విజార్డ్స్ – ఎస్.ఎస్.డబ్ల్యూ) అని పిలవబడే మాంత్రికుల బృందం ద్వారా సౌర వ్యవస్థలోని వివిధ గ్రహాలలో దాచిన రెండు అద్భుత శక్తులున్న వస్తువులు ఉన్నాయి. అతను మరణమే ఉండని ఆ అమృత ఔషధాన్ని తాగాడు, పైగా వెండి కొవ్వొత్తి అతని దగ్గరే ఉంది. అతను చావడు, మనం చంపలేము. అతను తన కోల్పోయిన శక్తులు మెల్లగా తిరిగి పొందడాని కోరుకుంటున్నాడు. ఇప్పటికే అతనో అద్భుత శక్తిగల వస్తువుని… అదే… ఇప్పటికే వెండి కొవ్వొత్తిని సాధించాడు! ఇప్పుడు అతను చంద్రుడి ఇమ్మిగ్రేషన్ సెంటర్లో కనిపించాడని, చట్టవిరుద్ధంగా ప్రవేశించి, చంద్రుడిలో చీకటి వైపు దాక్కున్నాడని తెలిసింది … “
“సర్, నాకు గుర్తుంది. నా రోబో యురేకస్ 7776 చెప్పిన వివరాల ప్రకారం మూడో అద్బుత వస్తువు చంద్రునిపై ఉంది. అనుభవజ్ఞులైన మాంత్రికుల సంఘం దాచి ఉంచిన యూనివర్సల్ మిర్రర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ చంద్రుడిపైనే ఉంది. అయితే, ఈ ఆధునిక సమాచార యుగంలో అదంతా చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది” అన్నాను.
“అవును. మనం అతనిని, అతని అనుచరులను పట్టుకోవాలి. అతను – ఆ సమూరా – భూమి, గ్వానిమెడ్, టైటాన్ మరియు చంద్రుడి పైన దాక్కున్న రహస్య దుష్ట శక్తులకు దేవుడిలాంటివాడు. మరింతమంది అనుచరులను సంపాదించి ప్రభుత్వ వ్యవస్థలను అణచివేయాలని, మానవ నివాసాలను ఆక్రమించుకోవాలని కోరుకుంటున్నాడు! ఎలివేటర్‍లో మీమీద ఎలా దాడి జరిగిందో చూశారుగా …! “
“అలా జరగడానికి పూర్తి అవకాశం ఉంది సర్!” అన్నాను. “మీరు నన్ను అనుమతించినట్లయితే, ఓ విషయం చెబుతాను. నాకు టెలీపతి శక్తి ఉంది, జరగబోయేవాటిని దర్శించగలిగే యోగదృష్టి ఉంది. ఓ భయానక కలలో చంద్రునిపై సమూరా సయోనీని పునరుత్థానం చేయడం చూశాను…” అంటూ చెప్పుకొచ్చాను. వివిధ గ్రహాల నాయకులు విస్తుపోయి వింటుండగా నేను పీడకలని వర్ణించాను.
కాసేపటికికి హోటల్ వద్ద మిసెస్ హిరానీతో కలిసి మాకు స్వాగతం పలికిన మిస్టర్ వోజోస్కీ గొంతు సవరించుకుని చెప్పసాగాడు:
“హనీ! మేము కలల యొక్క యథార్థతని విశ్వసిస్తాము. మేము చంద్రుడి ఇమ్మిగ్రేషన్ కౌంటర్లో మానిటర్ కెమెరాల నుండి వీడియో క్లిప్పింగ్ మాత్రమే పొందగలిగాము. అయితే ఇప్పుడు మనం సమూరా, సౌర వ్యవస్థలోని ఇతర గ్రహాంతరవాసులతో కలసి చంద్రుడిపై ప్రవేశించాడని, చంద్రుడి చీకటి వైపు ఎక్కడో దాక్కున్నాడని నమ్మకతప్పదు. చంద్రుడి చీకటి వైపు గురించి మనకి చాలా తక్కువ తెలుసు లేదా అక్కడ నుంచి ఏ సంకేతాలను పొందలేకపోయాము. అక్కడంతా చీకటి, చల్లదనం ఉన్నాయి. ప్రధాన కాలనీలు – అమెరికా వారి అమృతా, రష్యా వారి లైకా కాలనీలు, చంద్రుడి ద్రువాల వద్ద ఉన్నాయి. అమృత కాలనీ దక్షిణ ధృవంలోని షాక్లెటన్ క్రేటర్‌లో నిర్మించబడింది. కాలనీకి అన్ని సౌకర్యాలు సౌర శక్తి ద్వారా లభిస్తాయి. చండ్రుడి చుట్టూ తిరుగుతున్న సౌల ఫలకాలు సూర్యుడి నుంచి శక్తిని గ్రహించి అందిస్తాయి.”
“క్రేటర్స్ ఎందుకు?” అమాయకంగా అడిగాను నేను. “మార్స్‌లో నేను డోములున్న కాలనీలు చూశాను.”
“అవును! చంద్రుడికి మానవ వలస ప్రారంభమైన కొత్తల్లో, క్రేటర్లను చౌకైన ప్రత్యామ్నాయాలుగా పరిగణించారు. ఉల్కాపాతం మరియు తుఫానులు నుండి రక్షణ ఉంది. వారు చంద్రుని నేలలో లోతుగా త్రవ్వి, నిర్మాణాలను ఏర్పాటు చేసుకున్నారు. నెలలో 15 రోజులు మాత్రమే సూర్య కాంతి ఉంటుంది. కాబట్టి వారి కాలనీలు నిరంతరం కక్ష్యలోని సౌర ఫలకాలను ద్వారా శక్తిని పొందుతాయి. అంతేకాకుండా, చంద్రుని యొక్క కేంద్ర భాగం వలె కాకుండా ఈ ప్రాంతం మరింత ఎక్కువ కాలం పాటు సూర్య కాంతిని పొందుతుంది. ఇది 21వ శతాబ్దంలో వివరించబడిన శాశ్వత కాంతి ప్రాంతం. ఉత్తర ధ్రువంలో కనుగొన్న భూగర్భ మంచు నుండి నీరు లభించింది. కానీ చీకటి వైపు ఎల్లప్పుడూ భూమి నుండి దూరంగా ఉంటుంది! దాని గురించి ఎవరికీ తెలియదు, ఎవరికీ పెద్దగా ఆసక్తి కూడా లేదు.”
“సరే. ఇక సమావేశం ముగిద్దాం. ఇప్పుడు హనీ మిషన్‌కి నాయకత్వం వహించడానికి అంగీకరించాడు కాబట్టి, వివరణాత్మక ప్రణాళికలు మరియు ఇతర ఏర్పాట్ల గురించి చిన్న సమావేశాలలో చర్చించండి. హనీ ఆమ్రపాలికి శుభాకాంక్షలు! విశ్వశక్తి అతనికి ఎల్లప్పుడూ సహాయం చేస్తుంది!”
సమావేశంలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. గ్రహంతర కాలనీల అధిపతులు సమావేశం ముగిసింది.
(సశేషం)