భూమి నుంచి ప్లూటో దాకా… – 4

    0
    6

    [box type=’note’ fontsize=’16’] విలువలున్న మానవజాతికీ, క్షుద్రశక్తులున్న మాంత్రికులకీ…. అంటే మంచికి చెడుకి మధ్య జరిగే పోరాటాన్ని ఒక స్పేస్ ఒపెరా ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ నవలగా అందిస్తున్నారు డా. చిత్తర్వు మధు. తెలుగు సేత: కొల్లూరి సోమ శంకర్. [/box]

    అధ్యాయం 9: సమావేశం

    [dropcap]మే[/dropcap]ము ఎర్త్ కౌన్సిల్ భవనం యొక్క గ్రాండ్ కాన్ఫరెన్స్ హాలులోకి అడుగుపెట్టగానే, మార్స్ లోని గ్రాండ్ హాల్ యొక్క జ్ఞాపకాలు నాలో మెదిలాయి. అప్పుడు నేను సమారా, సయోనీల ఖైదీని. నేను తప్పించుకోడానికి ఎటువంటి అవకాశాలు లేవు.

    కాని, ఇది నా సొంత గ్రహం. నేను ఖైదీని కాదు. నేను ఆహ్వానితుడి. నాతో పాటు నా ప్రియమైన నెచ్చెలి ఉంది. కానీ అప్పటికీ ఇప్పటికీ పెద్దగా తేడా లేదని అనిపించింది.

    నేను మరో మిషన్ కోసం నియమించబడుతున్నాను!

    ఈసారి నేను సుదూరంలోని అరుణ గ్రహం యొక్క అరుణ మైదానాలలోని దుష్టుల కోసం పని చేయడం లేదు, కానీ నా సొంత గ్రహం యొక్క నైరూప్యమైన, అత్యంత శక్తిమంతమైన ఎర్త్ కౌన్సిల్ కోసం పని చేయాలి.

    ఇది ఒక పెద్ద హాల్, కానీ మార్స్ లోని రెడ్ ప్లెయిన్స్ యొక్క ‘గ్రేట్ హాల్’లా జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు గదిని విస్తరించవచ్చా? ఏమో నేను విశ్లేషించలేకపోయాను.

    అక్కడ ఓ మెరుస్తున్న భారీ గోధుమ రంగు దీర్ఘచతురస్రాకార టేబుల్ ఉంది. దాని చుట్టూ సీనియర్ బ్యూరోక్రాట్లలా కనిపిస్తున్న పది మంది వ్యక్తులు గంభీరంగా కూర్చుని ఉన్నారు.

    వారు అన్ని జాతులకి చెందినవారు. తెలుపు, నలుపు, పసుపు మరియు గోధుమ వర్ణాల శరీరాలున్నవారు, నీలం లేదా నల్ల కళ్ళు, అందగత్తె లేదా నల్ల జుట్టు వంకరగా లేదా పొడవాటి ముక్కులు లేదా కుంచించుకుపోయిన ముక్కులున్న వారు… మానవ జాతి మరియు భూమి యొక్క అన్ని జాతుల ప్రతినిధులు వీళ్ళు. వీళ్ళల్లో ఇద్దరు స్త్రీలు ఉన్నారు. ఒక శ్వేతవనిత మరియు ఒక నల్లమహిళ. గంభీర దృక్కులతో చూస్తున్నారు.

    సాక్షిని న్యాయస్థానంలో ప్రవేశబెట్టినట్టుగా నన్ను, ప్రకృతినీ లోపలికి తీసుకొచ్చి మా గురించి గట్టిగా ప్రకటించి, మమ్మల్ని టేబుల్‌కి చివరగా ఓ మూలగా కూర్చోమని వోజోస్కి చెప్పారు!

    “కౌన్సిల్ యొక్క గౌరవప్రదమైన సభ్యులారా, మిడిల్ ఆసియా జోన్ లోని ఇండికా సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన హనీ ఆమ్రపాలి ఇతను, ఈమె అతని భార్య ప్రకృతి.  వీరిద్దరూ ప్రోటోకాల్ ప్రకారం పరీక్షించి నిర్ధారించబడిన గ్రేడ్ 100 పిసియుఎఫ్‌లు” అంటూ సభకి వివరించారు వోజోస్కి.

    “ఇక మీరు వెళ్ళి కూర్చోవచ్చు” అని నాతో అన్నారాయన.

    ఆ తర్వాత వోజోస్కీ హీరానీ వైపు చూశారు, ఆమె లేచి నిలబడి తలుపు వెనుకకు వెళ్లి మర్యాదపూర్వకంగా దానిని తెరిచారు.

    ఒక గంట మోగింది. చిన్న జుట్టు, చిన్న మంగోలాయిడ్ కళ్ళు, మేక గడ్డం కలిగిన ఓ పొట్టి మనిషి లోపలికి వచ్చాడు. తెల్లని కోటు మరియు ట్రౌజర్‌ ధరించాడాయన.

    “మిస్టర్ చెన్ లీ. ఎర్త్ కౌన్సిల్ ప్రెసిడెంట్!”

    మిస్టర్ చెన్ లీ నడిచి వస్తున్నప్పుడు పది మంది సభ్యులు లేచి నిలబడ్డారు. అతను టేబుల్ యొక్క మరో చివరలో తనకు కేటాయించిన కుర్చీలో కూర్చున్నాడు.

    అతను పదకొండో సభ్యుడు మరియు కౌన్సిల్ యొక్క కమాండింగ్ లీడర్. సమానుల మధ్య నిర్ణాయక వోటును కలిగి ఉన్నాడు. అతనిని చూసినప్పుడు నాకలా అనిపించింది.

    34వ శతాబ్దపు భూమిని బహుళ-జాతుల, బహువర్ణాల, బహు తెగల ఎర్త్ కౌన్సిల్ పరిపాలిస్తుంది.

    ఇప్పుడు నేను సందర్భానికి తగ్గట్టుగా సర్దుబాటు చేసుకున్నాను. లేచి నిలబడి అందరికీ వందనం చేశాను. ఎందుకంటే నేను ఒక మధ్యవర్తిని, స్పీకర్‌ని, మార్స్ పాలకులచే గౌరవించబడినవాడిని!

    “సర్! గ్రీటింగ్స్! అధ్యక్షులు మరియు కౌన్సిల్ సభ్యులారా! నేను ఉండడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను” అన్నాను.

    మరీ ఫార్మాలిటీలు అక్కర్లేదన్నట్టుగా, “ఓహ్!” అంటూ మిస్టర్ చెన్ లీ తన చేతిని ఊపాడు.

    అతను మాట్లాడినప్పుడు, అతని నోటి నుండి వెలువడుతున్న ‘టి’ మరియు ‘డి’ అక్షరాల ధ్వనులు ఇప్పటికీ మృదువుగా ఉన్నాయి,  అది ఆసియా ప్రజల ఉచ్చారణ సమస్య. శతాబ్దాలుగా కొనసాగింది.

    “మిస్టర్ హనీ! వీటికంత సమయం లేదు. మీ ప్రతిభ పట్ల మాకు గౌరవం ఉంది. భూమి పైనా, ఇంకా సౌరవ్యవస్థలోనూ తిరుగుతున్న నేరపూరిత తీవ్రవాద ముఠాని పట్టుకోవడంలో మీ సహాయం కావాలి. చీఫ్ ఆఫ్ ఆపరేషన్ వోజోస్కీ మరియు హిరానీలు మీకు వివరాలు చెబుతారు. కానీ కౌన్సిల్ అధిపతిగా, నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.”

    “యువర్ ఎక్స్‌లెన్సీ! మిస్టర్ ప్రెసిడెంట్! సర్, దయచేసి నా దురవస్థను పరిగణించండి. నేను విశ్వశక్తి అనే ఒక జన్యు పరమైన లేదా గుర్తింపు లేని ఒక శక్తిని కలిగి ఉన్న ఒక సాధారణ మానవుడిని. అయితే విశ్వశక్తిని నేను అసాధారణ ఉద్వేగం కలిగినప్పుడే ఉపయోగిస్తాను, ఏకాగ్రతతో చేస్తానని ఒప్పుకుంటున్నాను. ఈ సువిశాలమైన విశ్వంలో గ్రహాంతరవాసుల మార్మిక మరియు దుష్ట శక్తుల గుంపుతో జరిపే పోరాటంలో నేను, ప్రకృతి చిన్న అణువులలాంటివాళ్ళం. ఖచ్చితంగా నేను ఎంపిక చేయబడిన వాడిని కాదు సర్! నాకు నా జీవితం కావాలి. నా బోధన, నా పరిశోధన, మరియు నా స్వంత ఇండికా సెంట్రల్ లోని నా విద్యార్ధులు నాక్కావాలి! అయితే ఈ దుష్టశక్తులపై పోరాటంలో నేను మీకు సహాయం చేయాలనుకుంటున్నాను… కాని నాకున్న తక్కువ నైపుణ్యంతో ఇందుకు ప్రయత్నించడం కాస్త ఎబ్బెట్టుగా ఉంది…”

    మిస్టర్ చెన్ లీ నిశ్శబ్దంగా ఉండిపోయాడు, తన సహాయకుడి కేసి చూశాడు.

    ఇప్పుడు అదే గంట మోగింది. హాల్ చివరలో ఉన్న భారీ చెక్క తలుపులు తెరవబడ్డాయి.

    అప్పుడు ఒక్కొక్కటిగా నాలుగు పొడవైన మానవ రూపాలు హాల్లో ప్రవేశించాయి. వారు తమ తమ జాతుల నాయకులు లేదా రాజుల వలె ఉన్నారు.

    మొదటి వ్యక్తి, కండలు తిరిగిన శరీరం మీద ఎర్రటి బిగుతైన దుస్తులు ధరించి, తలపై మెరుస్తున్న ఎరుపు టోపీపై త్రిశూలం యొక్క చిహ్నంతో క్రీడాకారుడిలా ఉన్న అతను….

    ఇంకెవరు…!

    టేబుల్ వైపు నడిచివస్తున్న అతన్ని ఆశ్చర్యంతోనూ, గగుర్పాటుతోనూ గుర్తించాను.

    అంగారక గ్రహంలోని మానవ కాలనీ యొక్క జనరల్ గ్యాని అన్-గారక్. అతని పశువుల కొట్టంలోని వింత జంతువులు, చెక్-పోస్ట్స్‌ల గుండా మమ్మలి తరమడం, హైవే డోమ్స్ ద్వారా తప్పించుకోడం; మార్స్ మానవ కాలనీ రాజధాని లిబర్టీ సిటీ నుండి నేను నా సహచరులు – నేరస్థుల్లా తరమబడడం; అదృష్టం కొద్దీ, ఇంటర్ గెలాక్టిక్ కౌన్సిల్ సహాయంతో మార్స్ జైళ్లలో పడకుండా తప్పించుకోవడం – అన్నీ గుర్తొచ్చాయి.

    అవును! నేను వారి దృష్టిలో ఫోర్స్ లేదా మంత్రవిద్య సాధన చేసే ఒక నేరస్థుడిని. అతను నన్ను వెంబడించాడు. నన్ను అరెస్టు చేయడానికి వచ్చాడా?

    “హలో! హనీ అమ్రాపాలి! శుభాకాంక్షలు! మనం ఈసారి మంచి పరిస్థితులలో మళ్ళీ కలుసుకున్నాము!” అంటూ జనరల్ గ్యాని అన్-గారక్ పలకరించాడు. “నేను నీకు విరోధంగా ఉన్నానని అనుకోవద్దు! అది ముగిసింది. ఇప్పుడు మరొక పోరాటానికే ఈ సమావేశం.”

    ఎర్త్ కౌన్సిల్ సభ్యులందరూ అతడిని స్వాగతించారు. అక్కడున్న ప్రతి ఒక్కరినీ గమనిస్తూ, టేబుల్ చివర ఉన్న ఖాళీ కుర్చీలలో ఒకదాంట్లో కూర్చున్నాడు. “ఎందుకిలా? నాకిది చాలా ఆశ్చర్యమూ, ఆనందమూ కలిగిస్తోంది. మీకు నా వందనాలు జనరల్” అన్నాను కాస్త బలహీనంగా.

    తరువాత వచ్చింది మృదువైన జుట్టు, నీలి కళ్లతో ఉన్న పొడవైన హ్యుమనాయిడ్. మెరిసే లోహ రంగు స్యూట్ ధరించి ఉన్నాడు. తన కోటు లేబుల్‌పై గద్ద చిహ్నం ఉంది. చెయ్యి ఊపుతూ అందరినీ పలకరించి, వెళ్ళి గ్యాని వెనుకగా కూర్చొన్నాడు.

    “మిస్టర్ జేమ్స్ కన్నింగ్‍హమ్. మూన్ యొక్క అమృతా కాలనీ ప్రభుత్వంలో పారానార్మల్ డిఫెన్స్ మినిస్టర్” అంటూ గుమ్మం దగ్గర ఉన్న ఉద్యోగి ప్రకటించాడు. అతను పూర్తిగా అమెరికన్. చూపులకి ఓ అధికారిలా ఉన్నాడు, సాంకేతిక నిపుణుడిలా కనిపిస్తున్నాడు.

    అప్పుడు మిగతావాళ్ళు లోపలికి వచ్చారు.

    శనిగ్రహపు ఉపగ్రహం టైటాన్ యొక్క భూగర్భ ఆవాసం రక్షణ బాధ్యతలు నిర్వహించే మిస్టర్ లెనాయిడ్ పోలెన్‍స్కీ.

    మానవ జంతువుల నివాసమైన గ్వానిమెడ్‌ – మార్స్‌పై నాతో స్నేహం కలిసిన ఏనిమాయిడ్‌‌ని ఉండే చోటు –  నుంచి మిస్టర్ టిగ్రోయిడ్ టైగ్రిస్ వచ్చాడు.

    ఆశ్చర్యంగా ఉంది – ఇక్కడ భూమి మీద నేను అతిథిగా ఉన్న ఓ రౌండ్ టేబుల్ సమావేశంలో ఇంతమంది గ్రహాంతరవాసులు పాల్గొనడమా?

    “మిస్టర్ హనీ అమ్రాపాలి!” గర్జించాడు జనరల్ గ్యాని. “మీరు భయపడవలసిన అవసరం లేదు! మీరు ఇక మీదట మార్స్ మానవ కాలనీలో నేరస్థులు కాదు. మీపై ఉన్న అన్ని ఆరోపణలు పూర్తి విచారణ అనంతరం ఎత్తివేయబడ్డాయి. కాబట్టి మీరు నిర్భయంగా ఉండండి, ప్రస్తుత పరిస్థితిని చర్చించండి.”

    “ఓహ్! ధన్యవాదాలు జనరల్” అని గొణిగాను. గ్యాని నివాసం నుండి మార్స్ యొక్క స్పేస్‌డ్రోమ్ వరకూ హైవే మీద తరమబడిన జ్ఞాపకాలింకా నా మనస్సులో తాజాగా ఉన్నాయి.

    “ఇప్పుడు!” ఎర్త్ కౌన్సిల్ అధ్యక్షుడు మిస్టర్ చెన్ లీ గర్జించాడు. “అసలు విషయానికి వద్దాం, హనీ, ప్రస్తుత అత్యవసర పరిస్థితి గురించి మీకు వివరిస్తాను మార్స్, మూన్, గ్వానిమెడ్, టైటాన్ యొక్క ముఖ్యమైన రక్షణ నాయకులను మీరు ఇక్కడ చూడవచ్చు! అర్థం చేసుకోండి!”

    “సర్” అన్నాను.

    ‘టి’ మరియు ‘డి’ అక్షరాల ధ్వనులను మృదువుగా పలుకుతూ చెన్ లీ తన ప్రసంగాన్ని కొనసాగించాడు.

    “నాల్గవ సహస్రాబ్ది కొత్త ధూర్తులు, దుష్ట శక్తుల యొక్క సాధకులు కనీసం ఐదు దశాబ్దాలుగా సౌర వ్యవస్థలో మాకు సమస్యలను సృష్టిస్తున్నారు. మార్స్ రెడ్ ప్లెయిన్స్‌లో మీరు వారిని చూశారు. వాస్తవానికి భూమి మీద, గ్వానిమెడ్, టైటాన్ మరియు చంద్రుడిపై కూడా వీళ్ల విస్తారమైన అథోలోకపు తీవ్రవాద నెట్‌వర్క్ మరియు స్లీపర్ నెట్‌వర్క్ ఉన్నాయి. ఇంకా మార్స్ మీద కూడా. రెడ్ ప్లెయిన్స్‌లో ఒక స్నేహపూర్వక నాయకుడు మీరోస్‌ని అధిపతిగా చేయడంలో మీరు సాయం చేసారు.”

    “అవును సర్!” అన్నాను. “అతను ఒక గొప్ప వ్యక్తి. పైగా అందరు పిసియుఎఫ్‌లు చెడ్డవారు కాదు. ఇదొక జీవన విధానం, ఒక జన్యు పరివర్తన. సాధారణ మానవుల నుండి ఈ శక్తులను స్వాధీనం పొందారు!”

    “నిజం” చెన్ లీ అన్నారు. “సమూరా, సయోనీ ఇంకా వారి సహచరులకు సౌర వ్యవస్థ యొక్క అన్ని గ్రహాలపై అధికారంలోకి రావాలన్న కోరిక ఉంది. సమూరా ఒక చిన్న పొరపాటుతో తన శక్తులను కోల్పోయాడు. మీ తెలివితేటలతొ మీరోస్‍ని పాలకుడిగా చేయడంలో సహాయపడ్డారు. కానీ సమురా భూమికి తిరిగి వచ్చాడు. మీరు సయోనీని చంపగలిగారు, మిగతా వారు పారిపోయారు. కానీ ఇప్పుడు వాళ్ళు చంద్రుని యొక్క చీకటి వైపు దాక్కున్నారన్న సమాచారం ఉంది. అక్కడ క్రేటర్స్‌లో ఉన్న మానవుల అమృతా కాలనీపై దాడి చేయటానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.”

    “ఓహ్, వ్లీలేదు!” అంటూ నేను ఆశ్చర్యపోయాను. “ఇలా జరగవచ్చని నేనూ అనుకున్నాను కానీ వాటిని ఓ భయానక మానసిక స్థితిలో ఏర్పడిన భావనగా కొట్టిపారేసాను.”

    ప్రకృతి జోక్యం చేసుకుంటూ… “సారీ సర్, కాని అంత వృద్ధులైన పిసియుఎఫ్‌‌లు చంద్రునిపై అధునాతనమైన మానవ కాలనీకి నష్టం కలిగించగలరా?” అని అడిగింది.

    చెన్ లీ మళ్ళీ గట్టిగా చెప్పాడు “అవును, మాడమ్. వారు రహస్య కార్యకలాపాలు మొదలుపెట్టారు. ఎందుకో, అవేంటో ఖచ్చితంగా తెలియదు. ఇటువంటి దుష్ట మాంత్రికులు … క్షమించండి… నిషేధించబడిన పదం వాడాను… పిసియుఎఫ్‌లు అన్ని గ్రహాలలోనూ ఉన్నారు. వారు మహత్వోన్మాదులు మరియు ఆయా గ్రహాల పాలకులు కావాలని కోరుకుంటారు.”

    “మిస్టర్ ప్రెసిడెంట్, సర్, సమూరా మొత్తం గెలాక్సీని పాలించాలని కోరుకున్నాడు! ఎంత అవివేకం! హాస్యాస్పదంగా ఉంది” అన్నాను.

    “అవును. దుష్టులకు అలాంటి కోరికలు ఉన్నాయి. సౌర వ్యవస్థలో మరియు సమీపంలోని కెప్లెర్ వ్యవస్థలో అసంఖ్యాకమైన దుష్ట శక్తులు ఉన్నాయి. పాలపుంత, గెలాక్సీలోని వివిధ గ్రహ వ్యవస్థలలో ఉన్న అలాంటి దుష్ట శక్తుల గురించి అలాంటి దుష్టశక్తుల గురించి మనకి తెలియనంత దూరంలో ఉన్నాం. బహుశా వారు అంతర్గత సమాచారం కలిగి ఉంటారు. వారందరికీ నిగూఢమైన శక్తులు మరియు లక్ష్యాలు ఉన్నాయి. కొందరు తమ గ్రహాలను పరిపాలిస్తున్నారు, చాలామంది రహస్యంగా దాక్కుని ఉన్నారు. అన్ని నెట్‌వర్స్ ఏదోక రోజున ఏకమవుతాయి, పరోక్షంగా గెలాక్సీను పాలిస్తాయి. “

    “మన్నించండి మిస్టర్ ప్రెసిడెంట్!” అన్నాను. “మార్స్‌లో జరిగిన యుద్ధాన్ని భూమి మీద అందరూ ఓ విలేకరి ఊహగా భావించారు, హాస్యమాడారు. వారు రెడ్ ప్లెయిన్స్ యొక్క వృద్ధ ధ్యాన సన్యాసులనూ హేళన చేశారు. సౌర వ్యవస్థలోని ఇతర గ్రహాల కాలనీల్లో ఎవరూ దీని గురించి మాట్లాడలేదు.” అన్నాను.

    “అవును, అవును!” అన్నాడు చంద్రుని కాలనీకి చెందిన జేమ్స్ కన్నింగ్‌హామ్. “నేను పారానార్మల్ రక్షణ మంత్రిని. అన్ని పారానార్మల్ శక్తుల తాకిడిని రహస్యంగా మరియు హడావిడి లేకుండా ఎదుర్కోవాలని మేం నిర్ణయించుకున్నాము. మొగ్గలో దాన్ని తుంచాలి. దుష్టులతో పోరాడటానికి ఇతర గ్రహాల కాలనీల్లోని విశ్వశక్తి కలిగి ఉన్న ‘మంచి’ వ్యక్తులను నియమించడం తెలివైన పని అని మేము భావించాము. కాబట్టే మిమ్మల్ని సంప్రదించాం.”

    నేను విస్తుపోయాను. “నేనొక్కడినే ఒంటరిగా ఆ దుష్టశక్తులతో ఎలా పోరాడగలను? సర్, ఇది హాస్యాస్పదంగా ఉంది!”

    మిస్టర్ జేమ్స్ నవ్వాడు. “మీరు ఒంటరిగా ఎందుకుంటారు? అలా చెయ్యాలని మేము ఎన్నడూ సూచించము. మీరు ఓ చిన్న మిషన్‌కి నాయకుడిగా ఉంటారు. యునైటెడ్ ఆర్మీ, వైమానిక దళం మరియు కౌంటర్ టెర్రరిజం దళాల బృందాలకు నాయకత్వం వహిస్తారు. అంతే. పౌరులలో భయాందోళనలను నివారించడానికి ఈ ఆపరేషన్‌ని రహస్యంగా ఉంచాలని నిర్ణయించుకున్నాము. సరేనా? మీరు ఒంటరిగా ఉండరు.”

    గంట మళ్ళీ మోగింది. సమావేశం హాల్ చివరలో ఉన్న తలుపు తెరవబడింది. ప్రకాశవంతమైన కాంతి గదిలో ప్రసరించింది.

    ఒక్కొక్కటిగా పొడవైన మానవాకారాలు లోపలికి వచ్చాయి.

    ఎత్తైన, తెల్లని, మృదువైన జుట్టు, నీలం రంగు కళ్లతో అథ్లెటిక్‌గా కనిపిస్తున్నఆ వ్యక్తి …

    “మిస్టర్ చాంద్, చంద్ర గ్రహం నుంచి వచ్చారు” అంటూ ఓ స్వరం వినిపించింది.

    తరువాత మరో ఆశ్చర్యకరమైన ఘటన.

    పొడవైన రూపం, కండలు తిరిగిన శరీరం, మెటాలిక్ కవచం ధరించి, తలపై ఒక కొమ్ముతో….

    ఎవరో కాదు… ఏనిమోయిడ్, నా పాత స్నేహితుడు (మార్స్ మీద) గ్వానిమెడ్ నుండి! నేను ఆనందాశ్చర్యాలలో ఉండగానే అందాల కులుకుల డిమిట్రి అతన్ని అనుసరించి వచ్చింది. తను టైటాన్‌కి చెందిన డిమిట్రి పొసయిడాన్. చివరగా మార్స్ మానవ కాలనీకి చెందిన వాన్ కు జాక్ వచ్చారు. ఇతను నాకు తెలియదు.

    వాళ్ళందరూ చాంద్, ఏనిమోయిడ్, డిమిట్రి మరియు వాన్ కుక్ జాక్ లోపలికి వచ్చారు. ఒక నిమిషంలో ఏనిమోయిడ్ మరియు డిమిట్రీ నా దగ్గరికి వచ్చి ‘ఓహ్! హనీ! నిన్ను కలుసుకోడం ఎంత సంతోషంగా ఉందో!’ అంటూ నన్ను ఆలింగనం చేసుకున్నారు. ప్రకృతి ఇదంతా చిరునవ్వుతో చూస్తోంది. నేను ఆమెకి ఒక్కొక్కరిని పరిచయం చేశాను.

    మా ఈ ఆశ్చర్యకరమైన పునఃకలయికని ఇతర గ్రహాల కాలనీల అగ్రనేతలు చిరునవ్వులతో చూస్తున్నారు.

    అందమైన శరీరాకృతి, పొడవాటి చెవులు కలిగిన సెక్సీ టైటానియన్ డిమిట్రి “హనీ! నువ్వు ఒక విద్రోహివి! మీ స్వంత గ్రహం అమ్మాయిని వివాహం చేసుకున్నావు. నన్ను వదిలేశావు!” అంటూ మళ్ళీ మళ్ళీ గట్టిగా నవ్వసాగింది.

    ప్రకృతి భారతీయ వధువు, ఇవన్నీ వింటూ సిగ్గుల మొగ్గయ్యింది. ఇంతలో మిస్టర్ చెన్ లీ గొంతు గంభీరంగా వినబడింది.

    “మేమంతా కూడా చాలా సంతోషిస్తున్నాం హనీ! ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నువ్వు నేతృత్వం వహిస్తున్న మిషన్ కోసం మీరు చంద్రుడి పైకి వెళ్ళాలి! ఈ పర్యటన మీకూ వ్యక్తిగతంగా అవసరమే! “

    అందరూ మౌనంగా ఉండడంతో చెన్ లీ ప్రసంగం కొనసాగింది. నా తల్లిదండ్రులు హత్య గురించి ప్రస్తావించడంతో నాకూ వ్యక్తిగత అవసరమైందీ మిషన్.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here