భూతాల బంగ్లా-4

0
10

[box type=’note’ fontsize=’16’] ‘భూతాల బంగ్లా’ అనే నవలను ధారావాహికంగా అందిస్తున్నారు డా. నాగేశ్వరరావు బెల్లంకొండ. [/box]

[యువ అధికారి భరత్ తన సహచరులతో మాట్లాడుతూ కొన్ని ఔషధాలను మాదక ద్రవ్యాలుగా ఎలా వినియోగిస్తున్నారో వివరిస్తాడు. విశాఖపట్నంలోనూ, హైదారాబదులోనూ కెటమైన్‌ ఇంజెక్షన్ల దురుపయోగం గురించి చెప్తాడు. ఇటీవల పలువురు విద్యార్థులు, యువకులు ‘సేఫ్‌డ్రగ్స్‌’ వైపు మొగ్గు చూపుతున్నారని వివరిస్తాడు. కండల కోసం వాడే మందులని కూడా మత్తు మందులుగా వాడుతున్నారని చెప్తాడు. మాదక ద్రవ్యాలు శరీరంపై ఎలా ప్రభావం చూపుతాయో చెప్తాడు. మాదక ద్రవ్యాలు విక్రయించడం వల్ల పడే శిక్షల గురించి చెప్తాడు. తప్పని తెలిసీ డ్రగ్స్ మాయలో యువత ఎలా పడతారో వెల్లడిస్తాడు. డ్రగ్స్ మాఫియని అణచివేయడంలో తన సహచరుల సహకారం కోరుతాడు భరత్. ఇక చదవండి.]

[dropcap]క[/dropcap]డుపు నొప్పితో బాధపడుతున్న తన ఆరేళ్ళ పిల్లవాడిని తమ ప్యామిలీ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాడు కృష్టమూర్తి. పరీక్షించిన డాక్టర్ “భయపడకండి, చిన్న సర్జరీ చేయవలసి ఉంటుంది” అన్నాడు.

“డాక్టర్ ఆరేళ్ళ పిల్లవాడికి మత్తు ఇవ్వడం సాధ్యమా? మత్తు మందు గురించి వివరించండి” అన్నాడు కృష్టమూర్తి.

“మొదట మత్తు మందు ఎప్పుడు కనుగొన్నారంటే …1846 అక్టోబర్‌ 16వ తేదీన విలియం మోర్టన్ అనే దంత వైద్యుడు బోస్టన్‌ నగరంలో అనెస్థీషియాపై ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్రతి ఏటా అక్టోబర్ 16వ తేదీని ప్రపంచ అనెస్థీషియా దినంగా జరుపుకుంటున్నారు.

విక్టోరియన్ కాలం (1837-1901)లో ఆపరేషన్ అంటే భరించరాని నొప్పితో అత్యంత క్రూరంగా ఉండేది. అదొక మరణ శాసనం లాంటిది. ఇప్పుడు మత్తు మందులు కనిపెట్టడంతో హాయిగా, సురక్షితంగా శస్త్రచికిత్సలు చేయగలుగుతున్నారు.

బ్రిటన్‌కు చెందిన సర్జన్ రాబర్ట్ లిస్టన్ కేవలం 25 సెకన్లలోనే ఆపరేషన్ చేసి రోగి కాలు తొలగించేవారు. 1840లలో లండన్‌లోని యూనివర్శిటీ కాలేజ్ ఆస్పత్రిలో ఆయన శస్త్రచికిత్సలు చేసేవారు. వేగంగా ఆపరేషన్లు చేయడం, విజయం సాధించడంలో ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు.

డాక్టర్ రాబర్ట్ అవయవాలు తొలగించే క్రమంలో ప్రతి ఆరుగురు రోగుల్లో ఒకరు చనిపోయేవారు. అయితే, ఆ కాలంలోని మిగతా డాక్టర్లతో పోలిస్తే ఈయన దగ్గరే రోగులు తక్కువగా మరణించేవారు.

శస్త్రచికిత్స సమయంలో నొప్పితో అరుస్తున్న రోగులను అక్కడుండే సహాయకులు చెక్క బల్లకు అదిమి పట్టుకునేవారు.

ఎందుకంటే ఆ రోజుల్లో నొప్పిని తగ్గించే మందులు లేవు. వేగంగా ఆపరేషన్లు చేయడం వల్ల రోగులు భయంకరమైన నొప్పిని అనుభవించే సమయం తగ్గుతుంది.

అయితే, కత్తి చాలా వేగంగా కదలడం వల్ల ఒక్కోసారి ప్రమాదాలు కూడా జరిగేవి. ఉదాహరణకు.. రాబర్ట్ ఆపరేషన్ థియేటర్‌లో ఉండే ఒక అసిస్టెంట్ వేళ్లను ప్రమాదవశాత్తు కోసేశారు. ఇన్ఫెక్షన్‌తో ఆ రోగి చనిపోయాడు. ఆ తర్వాత అసిస్టెంట్ కూడా మరణించారు. షాక్‌తో మరొకరు చనిపోయారు.

19వ శతాబ్దంలో రాబర్ట్ లిస్టన్‌లాంటి డాక్టర్లు మరో మార్గం లేదనుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి ఆపరేషన్లు చేసేవాళ్లు. ఇన్ఫెక్షన్‌తో కాలు బాగా దెబ్బతిన్నప్పుడు, లేదా కాలు విరిగి చర్మం నుంచి ఎముక బయటకు వచ్చినప్పుడు కాలును తొలగించడం మినహా ఆ రోజుల్లో మరో మార్గం ఉండేది కాదు.

ఇలాంటి శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు మానసికంగా రోగి, డాక్టర్‌లపై పడే ప్రభావం గురించి కూడా ఆలోచించాలని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో మెడికల్ హిస్టోరియన్ సల్లీ ఫ్రాంప్టన్ అన్నారు. రోగికి, డాక్టర్‌కు కూడా ఇదొక భయంకరమైన అనుభవమని ఆయన అన్నారు.

ఒక వ్యక్తిని బల్లకు అదిమిపట్టి ఉంచినప్పుడు, మీరు అతనికి ఆపరేషన్ చేయడం ఎలా ఉంటుందో ఊహించగలరా అని ఆయన ప్రశ్నించారు.

ఆపరేషన్లు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని భావించిన ఒక లండన్‌ వైద్య విద్యార్థి తన చదువును మధ్యలోనే ఆపేసి, కవిగా మారిపోయారని చెప్పారు.

ఆ రోజుల్లో అనెస్థీషియా ఇవ్వకుండా ఆపరేషన్ చేయడం వల్ల రోగులు నొప్పితో విలవిల్లాడేవారు. అందుకే రోగులను బల్లకు అదిమిపట్టుకుని ఆపరేషన్లు చేసేవాళ్లు.

1. నైట్రస్ ఆక్సైడ్‌ గ్యాస్‌:

సర్జన్లు కొత్త కొత్త పద్ధతులు కనిపెట్టడంతో శస్త్రచికిత్సలు పెరిగాయి. రోగులకు నొప్పి తెలియకుండా చేసే ప్రయత్నాలు క్రమంగా ఊపందుకున్నాయి. అయితే, మరణం అంచుల్లో ఉన్న వారు, లేదంటే నొప్పిని ఇక ఏమాత్రం భరించలేని వాళ్లు మాత్రమే ఆపరేషన్లు చేయించుకునేందుకు ముందుకొచ్చేవాళ్లని ఫ్రాంప్టన్ చెప్పారు.

హిప్నటైజ్ చేసి రోగులను నిద్రపుచ్చే ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ ఇది పెద్దగా ఫలితాలను ఇవ్వలేదు.

1845లో హొరేస్ వెల్స్ అనే దంత వైద్యుడు నైట్రస్ ఆక్సైడ్‌గ్యాస్‌ ఉపయోగించి నొప్పి లేకుండా రోగి పన్ను తొలగిస్తానని చెప్పారు. బోస్టన్‌లో ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు. కానీ ఆ ప్రయత్నం విఫలమైంది.

నొప్పితో రోగి బిగ్గరగా అరుస్తుంటే, డాక్టర్‌ను చూసి జనం నవ్వారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

2. ఈథర్:

కొన్ని నెలల తర్వాత విలియం మోర్టన్ అనే మరొక దంత వైద్యుడు దీనికొక పరిష్కారం కనిపెట్టారు. అదే ఈథర్. సల్ఫూరిక్ యాసిడ్, ఆల్కహాల్ మిశ్రమాన్ని సంశ్లేషణ చేసి దీన్ని తయారు చేశారు.

1846 అక్టోబర్‌లో మరోసారి బోస్టన్‌లో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈథర్ ఇచ్చి రోగిని నిద్రపుచ్చిన తర్వాత, నొప్పి తెలియకుండా అతని పంటిని విజయవంతంగా తొలగించారు.

ఈథర్ మిశ్రమం చాలా ఘాటుగా ఉంటుంది. దాన్ని పీల్చుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే రోగులు తరచూ దగ్గుతుంటారు. కొందరైతే వాంతులు కూడా చేసుకుంటారు. అంతేకాదు.. పేలే ప్రమాదం దీనికి ఎక్కువగా ఉంటుంది

కొన్ని వారాల తర్వాత సర్జన్ రాబర్ట్ లిస్టన్ లండన్‌లో ఫ్రెడరిక్ చర్చిల్ అనే వంటవాడిపై ఈ టెక్నిక్ ఉపయోగించారు. ఆపరేషన్ చేసి, కాలును తొలగించిన కాసేపటి తర్వాత చర్చిల్‌కు మెలకువ వచ్చింది. అప్పుడు ఆయన “ఆపరేషన్ ఎప్పుడు మొదలుపెడతారు” అని డాక్టర్‌ను అడగడంతో అక్కడున్న వాళ్లంతా నవ్వుకున్నారు.

కానీ ఈథర్‌కు కూడా కొన్ని లోపాలున్నాయి. పీల్చుకోవడం కష్టంగా ఉండటం, రోగులు దగ్గడం, వాంతులు చేసుకోవడం ఒక్కటే దీని సమస్య కాదు. పేలే స్వభావం కూడా దీనికి ఎక్కువ ఉంటుంది.

విక్టోరియన్ గ్యాస్ లైటింగ్, అనెస్థీటిక్ గ్యాస్ కలయిక ప్రాణాంతకం. దాని మూలాలపై కొందరికి అనుమానాలు కూడా ఉన్నాయి.

3. క్లోరోఫామ్:

తనపై, తన స్నేహితులపై చేసిన ప్రయోగాలతో స్కాట్లాండ్‌కు చెందిన ప్రసూతివైద్యం ప్రొఫెసర్ జేమ్స్ సింప్సన్ దీనికొక ప్రత్యామ్నాయం కనిపెట్టారు. అదే క్లోరోఫామ్. ఒక రుమాలుపై కొన్ని చుక్కల క్లోరోఫామ్ వేసి దాన్ని రోగికి వాసన చూపిస్తే చాలు. అతను నిద్రలోకి జారుకుంటాడు. క్రమంగా అనెస్థీషియా వైద్యులందరూ దీన్ని వాడటం మొదలుపెట్టారు.

అయితే, క్లోరోఫామ్ వాడటం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లిన రోగులు నిద్రలోనే చనిపోవడం మొదలైంది. 1848లో ఇలాంటి మొదటి ఘటన చోటు చేసుకుంది.

ఇంగ్లండ్‌కు చెందిన 15 సంవత్సరాల హన్నా గ్రీనెర్ తన కాలి గోరు తీయించుకునేందుకు సర్జన్ థామస్ మెగ్గిసన్‌ దగ్గరకు వెళ్లింది. ఒక గుడ్డపై కొంత క్లోరోఫామ్ వేసి, దాన్ని ఆమె ముఖం దగ్గర పెట్టారు. ఆ వాసన పీల్చుకుని తను చనిపోయింది.

సర్జన్ అది గుర్తించలేదు. ఆమె కాలి గోరును తొలగించడం మొదలుపెట్టారు. కాసేపటి తర్వాత, తను ఊపిరి తీసుకోవడం లేదని గుర్తించిన డాక్టర్ ఆమెను తిరిగి స్పృహలోకి తీసుకొచ్చేందుకు ఆమెకు కొద్దిగా బ్రాందీ ఇవ్వడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే ఆలస్యమైంది. తను చనిపోయింది.

ఇక్కడ సమస్య ఏమిటంటే.. ఎవరికి ఎంత పరిమాణంలో (సరైన డోస్) క్లోరోఫామ్ ఇవ్వాలన్నది ఎవరూ కనిపెట్టలేదు. క్లోరోఫామ్ వాడకంతో మరణిస్తున్న రోగుల సంఖ్య పెరుగుతుండటంతో కొందరు సర్జన్లు దీన్ని వాడేందుకు ఇష్టపడలేదు.

క్లోరోఫామ్‌తో రోగులు చనిపోతుండటంతో పేషెంట్లను నిద్రపుచ్చే నమ్మకమైన మందుల అవసరం ఏర్పడింది.

క్వీన్ విక్టోరియాకు క్లోరోఫామ్:

1850లలో మత్తు మందుల లాభనష్టాలపై విపరీతమైన చర్చ జరిగిందని స్టెఫెనీ స్నో చెప్పారు. మాంచెస్టర్ యూనివర్శిటీలో ఈమె మెడిసిన్ హిస్టోరియన్‌గా ఉన్నారు. అలాగే హిస్టరీ ఆఫ్ అనెస్థీషియా పుస్తకం రాశారు.

విక్టోరియన్ పబ్లిక్ హెల్త్‌లో జాన్ స్నోను మార్గదర్శిగా భావిస్తారు. జంతువులపై పరిశోధనలు చేసిన ఆయన.. రోగులు మరణించకుండా ఉండటానికి ఎంత పరిమాణంలో క్లోరోఫామ్ ఇవ్వాలన్న విషయాన్ని కనిపెట్టారు. ఒక కళగా ఉన్న అనెస్థీషియాను ఆయన ఒక సైన్సుగా మార్చేశారు.

అయితే, శస్త్ర చికిత్సల సమయంలో నొప్పి ఉండటం అవసరమని వాదించే వాళ్లూ కొందరున్నారు.

క్రిమియన్ యుద్ధం(1853-1856)లో గాయపడిన సైనికులకు క్లోరోఫామ్ ఇవ్వడంపై బ్రిటిష్ ఆర్మీ మెడిసిన్ విభాగం హెడ్ నిషేధం విధించారు. కత్తితో కోస్తున్నప్పుడు సైనికులు నొప్పితో అరవాలని తాను కోరుకుంటానని ఒక మిలటరీ సర్జన్ చెప్పారు. వాళ్లు మనుగడ కోసం పోరాడుతున్నారని ఆయన అన్నారు.

నొప్పి అనేది శరీరం నిర్వహించే ఒక కీలక పని. ఆపరేషన్ కలిగించే స్ట్రెస్‌నుంచి బయటపడేందుకు శరీరానికి నొప్పి ఒక ఉద్దీపనలా పని చేస్తుందని మాంచెస్టర్ యూనివర్శిటీలో మెడిసిన్ హిస్టోరియన్‌ స్టెఫెనీ స్నో చెప్పారు.

అయితే, ఎక్కువ నొప్పి కూడా ప్రమాదకరమేనని, మత్తు మందు ఇవ్వడం వల్ల రోగులను ఆ ప్రమాదం నుంచి కాపాడొచ్చని జాన్ స్నో వాదించారు.

జాన్ స్నో తన సైన్స్‌ను ఎంతో నమ్మారు. 1853లో ఎనిమిదో కాన్పు సమయంలో క్వీన్ విక్టోరియాకు ఆయన క్లోరోఫామ్ ఇచ్చారు.

క్వీన్ విక్టోరియాకు అనెస్థీషియా ఇచ్చి ఆమె ప్రాణాలను ఆయన ప్రమాదంలోకి నెట్టేశారని లాన్సెట్ మెడికల్ జర్నల్ తన సంపాదకీయంలో విమర్శించింది.

అయితే, సర్జరీ సమయంలో వచ్చే నొప్పి, కాన్పు సమయంలో వచ్చే నొప్పి రెండూ ఒక్కటేనని జాన్ స్నో వాదించారు.

1860ల నాటికి మత్తు మందు విస్తృతంగా వాడకంలోకి వచ్చింది. రోగులు కూడా శస్త్రచికిత్సలకు విముఖత చూపడం తగ్గింది. సర్జన్లు కొత్త కొత్త పద్ధతుల్లో ధైర్యంగా, ఎక్కువ సమయం పాటు ఆపరేషన్లు చేయడానికి వెనుకాడలేదు.

కానీ వ్యాధులకు అసలు కారణాలు తెలియకపోవడం వల్ల గాయాలు క్రమంగా ఇన్ఫెక్షన్లుగా మారి రోగులు చనిపోయేవారు. 1860ల్లో యాంటీ సెప్టిక్ పద్ధతుల కనిపెట్టిన తర్వాత ఆపరేషన్లు మారాయి. 20వ శతాబ్దం ప్రారంభంలో.. కొకైన్ ఆధారంగా మొదటిసారిగా లోకల్ అనెస్థీషియా అందుబాటులోకి వచ్చింది. ఇదొక ప్రత్యేక వృత్తిగా అవతరించడం మొదలైంది. ఈథర్ లేదా క్లోరోఫామ్ లేదా కొన్నిసార్లు రెండింటిని కలిపి వాడతారు. అప్పటి వరకు ఉన్న సాధారణ అనెస్థీషియా మందులు ఇవే.

1930ల్లో అనెస్థీషియాగా క్లోరోఫామ్‌ వాడటం తగ్గింది. ఎందుకంటే ఇది ఈథర్‌ అంత సురక్షితమైనది కాదని అధ్యయనాల్లో తేలింది. కానీ ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లలో వాడుతున్న మందులు, గ్యాస్‌లను తయారు చేయడానికి చాలాకాలం పట్టింది.

మళ్లీ ఈథర్.. ఇప్పటికీ అదే..:

ఇప్పటికీ అనెస్థీషియాగా తాను ఒకరకమైన ఈథర్‌నే వాడుతున్నానని రాయల్ కాలేజ్ ఆఫ్ అనెస్థీషియన్స్‌కు చెందిన క్లినికల్ క్వాలిటీ, రెసెర్చ్ బోర్డ్ చైర్మన్ విలియం హరోప్ గ్రిఫీత్ చెప్పారు.

గతంలో మత్తుమందుగా వాడిన ఈథర్‌ కంటే ఆధునిక వెర్షన్‌లోని ఈథర్‌లో ఫ్లోరైడ్‌ను రసాయనికంగా జోడించారు.

ఈథర్‌కు రసాయనిక చర్య ద్వారా ఫ్లోరైడ్‌ను కలిపితే దానికి పేలుడు లేదా మండే స్వభావం ఉండదు. కానీ మత్తుమందుగా చాలా బాగా పని చేస్తుందని విలియం చెప్పారు.

నేను మధ్యాహ్నం మాట్లాడే సమయానికి ఆయన అప్పటికే ఇద్దరికి మత్తుమందు ఇచ్చారు. మరొక చిన్నారికి జనరల్ మత్తుమందు ఇస్తున్నారు.

వేల మంది మరణానికి కారణమైనా.. లక్షలాది మందిని కాపాడే మందులు.

అణ్వాయుధాలకు యురేనియం హెక్సాఫ్లోరైడ్ అవసరం. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఫ్లోరైడేషన్ కెమిస్ట్రీలో వచ్చిన మార్పులు.. సమర్థవంతంగా, చక్కగా పనిచేసే మత్తు మందులను తయారు చేయడానికి సాయం చేశాయని విలియం వివరించారు. వేల మంది మరణానికి కారణమైన వాటి నుంచి లక్షలాది మందిని కాపాడే మందులు వచ్చాయని ఆయన అన్నారు.

ఆపరేషన్ సమయంలో రోగులను సురక్షితంగా నిద్రలోకి పంపడంలో మత్తు మందుల్లో వచ్చిన ఆవిష్కరణలు మాత్రమే కాదు.. పేషెంట్ల ఆరోగ్యాన్ని కనిపెట్టుకుని ఉండేలా ఎన్నో పరికరాలు, పద్ధతులు అందుబాటులోకి రావడం కూడా ఒక కారణమే.

పేషెంట్‌ శరీరంలో చోటు చేసుకునే మార్పులను పర్యవేక్షించే సామర్థ్యం పెరగడమే గతంలో కంటే ఇప్పుడు సురక్షితంగా ఉండటానికి ప్రధాన కారణమని తాను అనుకుంటున్నట్లు హరోప్ గ్రిఫిత్ చెప్పారు.

ఇవాళ మత్తుమందు డాక్టర్లు ఉపయోగించే అనేక పరికరాలు 1970ల నుంచి రోగి పల్స్, బీపీ, ఆక్సిజన్ స్థాయిలు, కార్బన్‌డైయాక్సైడ్లలను నిరంతరం పర్యవేక్షించడానికి సాయం చేస్తున్నాయి.

మానవ శరీరం అత్యంత సంక్షిష్టంగా నిర్మితమైంది. అన్నవాహిక, శ్వాసనాళం కలిసే ఉంటాయని హరోప్ గ్రిఫిత్ వివరించారు.

శ్వాసనాళంలోకి ట్యూబ్ వేస్తే రోగి బతుకుతాడు. కానీ అన్నవాహికకు రెండు సెంటీమీటర్ల దూరంలో ట్యూబ్‌ పెడితే పేషెంట్ చనిపోతాడు. రోగి ఊపిరితిత్తులు సరిగ్గానే పని చేస్తున్నాయని తెలుసుకోవడానికి కార్బన్‌ డైయాక్సైడ్‌ను కొలవడం క్రమంగా కీలకంగా మారుతోందని ఆయన వివరించారు.

ఇవాళ కూడా అనెస్థీషియా డాక్టర్లకు పూర్తిగా రిస్క్ లేదని చెప్పలేం. ఆపరేషన్ చేస్తుండగా అప్పుడప్పుడు రోగులు మధ్యలో మేల్కోవచ్చు. జనరల్ అనెస్థీషియా ఇచ్చినప్పుడు కొన్ని రోజుల పాటు పేషెంట్లకు మగతగా ఉంటుంది. లోకల్ అనెస్థీషియా కోసం ఇచ్చే ఇంజెక్షన్లు నొప్పి కలిగించేవిగా ఉంటాయి.

బ్రిటన్‌లో ప్రణాళికబద్దమైన ఆపరేషన్ చేస్తున్న సమయంలో లక్ష మందిలో ఒకరు చనిపోయే ప్రమాదం ఉంది. అయితే, రాబర్ట్ లిస్టన్‌ దగ్గర ఆపరేషన్ చేయించుకోవడం కంటే ఇది చాలా ఉత్తమం.

(రిచర్డ్ హొలింగ్‌హమ్ సైన్స్, స్పేస్ జర్నలిస్ట్. బీబీసీ ఫ్యూచర్‌కు కథనాలు రాస్తుంటారు. బ్లడ్ అండ్ గట్స్, ఏ హిస్టరీ ఆఫ్ సర్జరీ పుస్తకాలు రాశారు.) అని చెప్పి, “భయపడ వలసినదేమిలేదు, ఇది చాలా చిన్న సర్జరీ. మరుదినం మీరు ఇంటికి వెళ్ళవచ్చు” అన్నాడు డాక్టర్.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here