భూతాల బంగ్లా-9

0
6

[box type=’note’ fontsize=’16’] ‘భూతాల బంగ్లా’ అనే నవలను ధారావాహికంగా అందిస్తున్నారు డా. నాగేశ్వరరావు బెల్లంకొండ. [/box]

[భరత్ తన సిబ్బందికి ధూమపానం గురించి వివరిస్తుంటాడు. పొగాకు సొలనేసి కుటుంబానికి చెందిన చిన్న మొక్క అని చెప్తాడు. వివిధ దేశాలలో పొగాకుని ఏ ఏ రకాలుగా వినియోగిస్తున్నారో, ఏఏ దేశాలలో పొగాకుని అమితంగా పండిస్తున్నారో చెప్తాడు. పొగాకు వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఎంతమంది చనిపోతున్నారో, ఎందరు అనారోగ్యానికి లోనవుతున్నారో వివరిస్తాడు. దేశంలో 10.9 శాతం మంది ఏదో రూపంలో పొగాకు తీసుకుంటున్నారనీ, ఇందులో 82 శాతం మంది దీని వల్ల సంక్రమించే వ్యాధులతో బాధపడుతున్నారని వెల్లడిస్తాడు. నగరాలలో పబ్ కల్చర్, హుక్కా సెంటర్లు పెరగడం వల్ల యువత పొగాకుకు మరింత బానిసలవుతున్నారని అంటాడు. మహిళలలో కూడా పొగ తాగే అలవాటు పెరుగుతోందని చెప్తాడు. గర్భిణిలు పొగ తాగడం వల్ల జన్మించే శిశువులకు ప్రమాదమని గుర్తు చేస్తాడు. చెన్నయ్‍లో తాము పరిశోధిస్తున్న ఈ కేసులో విజయం సాధిస్తామనే నమ్మకం తనకు ఉందంటూ సమావేశాన్ని ముగిస్తాడు భరత్. ఇక చదవండి.]

[dropcap]మా[/dropcap]దకద్రవ్యాల రిటైల్ డీలర్లు ఇరువురు ఒకేసారి మరణించడంతో, మాదకద్రవ్యాల రవాణా ఎక్కడిది అక్కడే ఆగిపోయింది. చెన్నయ్ డీలర్ల ఎన్‌కౌంటర్ విషయం తెలిసి విలవిలలాడసాగారు.

విషయం తెలుసుకున్న చెన్నయ్ నగరంలోని చిన్నడీలర్లు, రౌడీషీటర్లు, పేరు మోసిన గూండాలు తక్షణం నగరం వదిలి అదృశ్యమైపోయారు.

నగరంలోని పోలీసు ఉన్నత అధికారులు స్థానిక పోలీస్ క్లబ్‌లో అత్యవసర రహస్య సమావేశం నిర్వహించారు.

పోడియం వద్దకు వచ్చిన ఆ యువకుడు “డియర్ ప్రెండ్స్, నా పేరు భరత్. చెన్నయ్‌లో మత్తు పదార్ధాల దిగుమతిదారుడు ఎవరో తెలుసుకోవడానికి నన్ను ప్రత్యేక అధికారిగా కేంద్రం నియమించింది. మీ అందరి సహాకారంతో మనం తక్షణం ఈ మాఫియాని అరికట్టాలి. భారతదేశం అంతటికి మత్తు పదార్ధాలతోపాటు, బ్లూ సిగరెట్ ఇక్కడనుండే సరఫరా అవుతుందని నా వద్ద సమాచారం ఉంది. ఈ బ్లూ సిగరెట్ విదేశాలనుండి దిగుమతి అవుతుంది. అది మామూలు సిగరెట్టులా ఉన్నా అత్యంత ప్రమాదకరమైనది.

ఇక్కడ మనం వ్యాధిని నయం చేయడం కాదు, ఆ వ్యాధి రావడానికి కారణం కనుగొనాలి. మాదకద్రవ్యాలను అమ్మేవారిని అరెస్టు చేస్తే మరొకడు అమ్మకానికి వస్తాడు. అసలు మూలం ఎక్కడ నుండి వస్తున్నాయి, దీనికి సూత్రధారి ఎవరు అన్నది తెలుసుకోగలిగితే సమాజాన్ని ఈ రుగ్మతనుండి కాపాడే ప్రయత్నం చేయవచ్చు. మనం దేని కోసం పోరాడుతున్నామో దానిపై అవగాహన కలిగేందుకు మీకు అర్థం అయ్యేలా కొన్ని విషయాలు చెపుతాను.

దేశం అంతటా పెరుగుతున్న డ్రగ్స్‌ వినియోగం మీకు తెలిసిందే. విద్యార్థులే టార్గెట్‌గా మాదకద్రవ్యాల వ్యాపారం విస్తరిస్తోంది. కళాశాలల్లో విద్యార్థి దశలోనే మత్తు బానిసలవుతున్న వైనం మనకు తెలిసినదే. ఉరికే యవ్వనం, ఒంటరితనం, మానసిక బలహీనతలే కారణం. అవగాహన లేక జీవితం నాశనం చేసుకుంటున్న యువతరం. అటు వాడకం.. ఇటు సరఫరా.. రెండింటి ఉచ్చుల్లో యువతీయువకులు చిక్కుకుంటున్నారు. డబ్బుకు ఆశపడి ఏజెన్సీనుంచి గంజాయి రవాణా చేస్తున్న నిరుద్యోగ యువత ఆపై కేసులతో సతమతం అవుతోంది. కఠిన చట్టాలతో జీవితాలు అగమ్యగోచరం.

గంజాయి, నల్లమందు, బ్రౌన్‌షుగర్‌, హెరాయిన్‌, కొకైన్‌, చెర్రస్‌ తదితర మాదకద్రవ్యాలకు బానిసలై కొంతమంది యువత తమ భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. క్షణకాలం సంతోషం నూరేళ్ల జీవితంలోని వెలుగును దూరం చేస్తుంది. విద్యార్థి దశలోనే గాడి తప్పుతూ డ్రగ్స్‌ మత్తులో పడి యువత తమ బంగారు భవిష్యత్తును అంధకారమయం చేసుకుంటోంది. ఒంటరితనం, మానసిక బలహీనత, ఉరికే యవ్వనం.. ఇలా అనేక కారణాలతో కొందరు మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. ఈ మాదకద్రవ్యాలకు చాలామంది ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ వంటివి చదువుతున్న విద్యావంతులే అలవాటు పడుతున్నారు. పరిస్థితి చేజారాక మానసిక వైద్యనిపుణల వద్దకు వస్తున్నవారి గణాంకాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. ఇదంతా ఒక వైపైతే గంజాయి రవాణాలో చిక్కుకుని పోలీసులకు పట్టుబడి జీవితం జైలు పాలు చేసుకుంటున్న వారు ఎందరో ఉంటున్నారు. ఆర్థిక ఇబ్బందులకు లొంగి మత్తుపదార్ధాలు చేరవేసేందుకు ఒప్పుకొని అనుకోకుండా పోలీసులకు దొరికి చెరసాల జీవితం గడిపేవారు ఎందరో.

గంజాయి, నల్లమందు, బ్రౌన్‌షుగర్‌, హెరాయిన్‌, కొకైన్‌, చెర్రస్‌ తదితర మాదకద్రవ్యాలు అయస్కాంతాలు లాంటివి. ఒక్కసారి వినియోగిస్తే ఆ మత్తుతో జోగేందుకు ఇష్టపడతారు తప్ప తిండిపై ధ్యాస ఉండదు. వాటి వినియోగంతో స్వర్గంలో విహరించినట్లుగా భావిస్తారు. మద్యం తాగితే కిక్‌ ఇస్తుంది. సిగరెట్‌ తాగితే రిలాక్స్‌గా అనిపిస్తుంది. గంజాయి దమ్ము పీల్చితే తెలియని లోకంలో తేలియాడి నట్లుంటుంది. అదే డ్రగ్స్‌ తీసుకుంటే ప్రపంచమే సొంతమైనంత తాత్కాలిక ఆనందం కలుగుతుంది. కానీ ఇదంతా వట్టి భ్రమేనని, శారీరకంగా, మానసికంగా అలిసిపోయి ఉన్న మనిషి ఊహించుకుని ఉర్రూతలూగే మార్పు తప్ప వాస్తవంగా ఏమీ ఉండదని మానసిక నిపుణులు చెబుతున్నారు. యథార్థంగా మన నాడీ మండల వ్యవస్ధ దారుణంగా దెబ్బతింటుంది.

ఏటా మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచంలో పెట్రోల్‌, ఆయుధాల వ్యాపారం తర్వాత రూ.500 మిలియన్‌ డాలర్ల టర్నోవర్‌తో మాదక ద్రవ్యాల మార్కెట్‌ మూడోస్థానంలో ఉండడం చూస్తే వీటికి ఏ స్థాయిలో డిమాండ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ దేశాల అభివృద్ధికి పెనుముప్పుగా వాటిల్లుతున్న మాదకద్రవ్యాల వినియోగానికి పూర్తిగా అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి ఏటా జూన్‌ 26వ తేదీని ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినంగా 1987లో ప్రకటించింది.

యువత రెండు రకాలుగా మత్తు వలలో చిక్కుకుంటున్నారు. విదేశాలనుంచి మన దేశానికి వచ్చినవారినుంచి అక్కడి సంస్కృతిని కొందరు అలవర్చుకుంటున్నారు. విశాఖ, తూర్పుగోదావరి సరిహద్దు ఏజెన్సీ ప్రాంతాల్లో సాగు చేసిన గంజాయిని అనేక రూపాల్లో రకరకాల మార్గాల ద్వారా నగరాలకు చేర్చి యువతకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వీటితోపాటు మత్తు మాత్రలు, మత్తు ఇంజెక్షన్‌లకు యవత ఆకర్షణ కావడం శోచనీయం. నైజీరియా తదితర విదేశాల నుంచి చదువుకునేందుకు మన దేశం వస్తున్న యువకులు డ్రగ్స్‌ను రహస్యంగా తీసుకొచ్చి ఇక్కడ చదువుకుంటున్న స్థానిక విద్యార్థులకు అధిక ధరలకు విక్రయిస్తూ బానిసలుగా మార్చడం ఆవేదన కలిగిస్తోంది. అమాయక ఈ మత్తు మాదకద్రవ్యాల బారిన పడి జైలుపాలవుతున్నారు. కుటుంబాలకు దూరమవుతున్నారు. ఉదాహరణకు రాజమహేంద్రవరం అర్బన్‌ పరిధిలో 2017 నుంచి చూస్తే ఇప్పటికి 42 కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో రూ.8 కోట్ల 25లక్షల 36వేల 200 గంజాయిని అర్బన్‌ జిల్లా పోలీసులు సీజ్‌చేశారు. ఆయా కేసుల్లో వందలాది మందిని అరెస్టు చేసి జైళ్లలో పెట్టారు. అందులో 50శాతం మందికి బెయిల్‌ కూడా రాక ఇబ్బందులు పడుతున్నారు.

పేదరికం ఒకవైపు అయితే, లగ్జరీ, జల్సాలకు అలవాటు పడిన యువత మరొకవైపు ఇలా అవసరాలు కలిగిన యువతనే గంజాయి స్మగ్లర్లు టార్గెట్‌చేస్తున్నారు. నయానో, భయానో ఆ రొంపిలోకి యువతను దింపేస్తున్నారు. తూర్పు ఏజెన్సీ విశాఖ మన్యం సరిహద్దు ప్రాంతాల్లోని దట్టమైన అడవిలో కొండపోడు మాదిరి గంజాయి సాగు చేస్తున్న స్మగ్లర్లు అక్కడ ఉన్న కొంతమంది అమాయక గిరిజనులను వినియోగించి కావడిలు వేయించి గంజాయిని కట్టలుగా కట్టి కొండలు దాటించి రహదారి మార్గానికి చేరువలో చేర్పించడం, అటుపై అక్కడ నుంచి రవాణాకోసం మరికొంతమంది బలి పశువులను సిద్ధం చేయిస్తున్నారు. ఈ పనులన్నీ స్మగ్లర్ల చేతిలో కీలుబొమ్మలుగా మారి అమాయక యువత డబ్బుకోసం చేస్తున్నారు.

ఈ మత్తు పదార్థాల బాధ అన్ని రాష్ట్రాలు అనుభవిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలలో గంజాయి వంటివి అత్యంత రహస్యంగా సాగుచేస్తూ ఎంతో గోప్యంగా రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు.

కొంతమంది యువతీ యువకులు మత్తుకు అలవాటు పడి గంజాయి బారిన పడుతున్నారు. ఎక్కువగా పట్టణాల్లో నగరాల్లో ఈ తరహా బానిసలు అధికమైపోయారు. నగరాల్లో అటువంటి వారిని క్యాచ్‌ చేసి వారికి గంజాయి సఫ్లై చేసే పనిలో స్మగ్లర్లు నిమగ్నమై ఉన్నారు. అసలు గంజాయి మత్తు ఎలా ఉంటుందో చూద్దామనుకున్న యువతను కూడా ఆకర్షించి ఈ రొంపిలోకి దింపేస్తున్నారు. ఒకసారి గంజాయి మత్తును అలవాటు చేస్తున్నారు. ఇక అటుపై వారికి నిరంతరం సరఫరా చేస్తున్నారు. ఆ సరఫరా చేసేందుకు ఒక పెద్ద వ్యవస్థనే స్మగ్లర్లు తయారు చేసుకుంటున్నారు. పట్టణాలు, గంజాయిని వాటి బానిసలకు అందుబాటులో ఉంచి సిగరెట్‌ల రూపంలోను, చిన్న చిన్న ప్యాకెట్లుగాను తయారు చేసి సరఫరా చేస్తున్నారు. ఈ గంజాయికి అలవాటుపడ్డ వారిలో అత్యధిక శాతం విద్యావంతులే ఉంటున్నారు.

డ్రగ్స్‌కి పడితే అటు చదువులు, ఇటు భవిష్యత్‌ నాశనమవుతాయి.

ఒక్కసారిగా విచక్షణ కోల్పోయి నేర ప్రవృత్తికి అలవాటు పడతారు.

మత్తులో విచక్షణ కోల్పోయి దాడులు చేయడం, కొట్టి చంపేయడం, విలాసవంతంగా ఉండడం చేస్తారు. సమయానికి గంజాయి కావాలంటే సరిపడ డబ్బులు కావాలి. దానికోసం దొంగతనాలు చేయడానికి కూడా వెనుకాడడం లేదు. కాసేపు మత్తు పదార్థం లభించకుంటే పిచ్చివాడిగా మారిపోతారు. చోరీలు, దొంతనాలకు తెగబడతారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. మత్తుకు బానిసైన వ్యక్తి వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతాడు. తన కుటుంబాన్ని తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. పలురకాల రుగ్మతలకు లోనై నరకప్రాయమైన జీవితం అనుభవించవలసివస్తుంది. పని చేసే శక్తి అంతరిస్తుంది.

చాలా కుటుంబాల్లో దంపతులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుండడం, పరిమిత కుటుంబాలు కావడంతో పిల్లలపై సరైన పర్యవేక్షణ ఉండడం లేదు. దీంతో తమను ప్రశ్నించేవారే లేరన్న భావనతో సరదా కోసం, ఫ్యాషన్‌, మోజు, స్నేహితుల ఒత్తిడి కారణాలతో మత్తుమందులు వినియోగానికి అలవాటు పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. సరదాగా ఒక్కసారి అన్న భావనతో మత్తుమందుల వినియోగం ప్రారంభించినప్పటికీ వాటిని వినియోగించినప్పుడు కలిగే తాత్కాలిక ఆనందం బానిసలుగా మార్చేస్తోంది. చివరకు మత్తుమందు తీసుకోకుంటే తట్టుకోలేని పరిస్థితికి చేరుకుంటున్నారు. వాటిని సమకూర్చుకోవడానికి ఎంతకైనా తెగించేస్తున్నారు.

మత్తు పదార్థాల వినియోగం ప్రాణాంతకం. దేహాన్ని మనకు తెలియకుండానే పీల్చిపిప్పి చేసి రోగాలు పాలు చేసే డ్రగ్స్‌ చివరికి మనిషిని జీవచ్ఛవంగా మార్చేస్తాయి. శారీరకంగా, మానసికంగా కుంగిపోయాలా చేస్తాయి. డ్రగ్స్‌కు బానిసైతే నాడీ వ్యవస్థ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తనపై నియంత్రణ కోల్పోయి విచక్షణారహితంగా ప్రవర్తించేలా చేస్తుంది. మాదకద్రవ్యాల వినియోగం కోసం డబ్బు సంపాదించే క్రమంలో చోరీలు, దోపిడీలకు పాల్పడడం అలాగే ఒక్కోసారి హత్యలకు, అత్యాచారాలకు పాల్పడడం జరుగుతుంది. కొకైన్‌, హెరాయిన్‌, బ్రౌన్‌షుగర్‌, చెర్రస్‌వంటి అతి ఖరీదైన డ్రగ్స్‌. గంజాయి, నల్లమందు తదితర మత్తు పదార్థాలు గతంలో పెద్ద నగరాల్లో విదేశీయులు మన దేశంలో యువతకు విక్రయించేవారు. ఇప్పుడు నెమ్మదినెమ్మదిగా పట్టణాలు, గ్రామాల్లో కూడా విస్తరించడంతో అనేక ఘోరాలకు చోటు చేసుకుంటున్నాయి.

చాపకింద నీరులా మరింత ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలు విషపు కోరలు చాస్తున్నాయి. అత్యంత రహస్యంగా జరుగుతున్నఈ ప్రమాదకర వ్యాపారం నగరాలకు కూడా పాకిందని చెప్తున్నారు. గంజాయి కంటే ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలు లభ్యమౌతున్నాయి. వీటి ధరలు కాస్త ఎక్కువగా ఉండడంతో సంపన్న వర్గాల పిల్లలు వీటికి అలవాటు పడుతున్నారు. ఇకనైనా ఎవరికివారు మేలుకోకుంటే పెను ఉప్పెనను ఎదుర్కోవాల్సి రావచ్చు.

ఎల్‌ఎస్‌డీ, నైట్రోజిఫామ్‌ కాఫీ, హ్యాష్‌ఆయిల్‌, కేక్‌ వంటివి గంజాయి కంటే ప్రమాదకరమైనవి. ఇప్పుడిప్పుడే నగరాలకు పాకుతున్నాయి. వీటిని సులభంగా రవాణా చేయవచ్చు. వాడుక పదంగా చెప్పాలంటే గోరంత పదార్థం పది గంటల మైకాన్ని ఇస్తుంది. వీటిని మహానగర  ప్రాంతాల నుంచి తీసుకువస్తారని తెలుస్తోంది.

లైసర్జిర్‌ యాసిడ్‌ డెరివేటివ్‌: లైసర్జిర్‌ యాసిడ్‌ డెరివేటివ్‌. దీన్ని అత్యంత తక్కువ పరిమాణంలో వినియోగిస్తారు. ద్రవ రూపంలో ఉండే ఎల్‌ఎస్‌డీ ఒక చుక్కను దాదాపు 0.5చదరపు సెంటీ మీటర్లు పరిమాణంలో ఉండే మైకా కవర్‌పై వేసి నోట్లో పెట్టుకుంటారు. ఇది 0.5 చదరపు సెంటీమీటర్లు రూ.3 నుంచి రూ.4వేలు ఉంటుందట. ఇది ఆరు గంటల పైనే పని చేస్తుందట.

హ్యాష్‌ఆయిల్‌: దీన్ని గంజాయి నుంచి తయారు చేస్తారు. దాని నుంచి తీసే నూనెను హ్యాష్‌ఆయిల్‌ అంటారు. దీని రంగు తాగునీటి మాదిరిగా ఉంటుంది. అందువల్ల వాటర్‌బాటిల్‌లా పట్టుకెళ్లవచ్చు. దీని లీటర్‌ఖరీదు రూ.లక్షల్లోనే ఉంటుంది. 10ఎంఎల్‌ రూ.4వేలకు అమ్ముతారని సమాచారం. ఈ ఆయిల్‌ చుక్క సిగరెట్‌ మొదట్లో వేస్తారు. తర్వాత సిగరెట్‌ను కొద్దిగా వేడి చేస్తారు. దీంతో ఆయిల్ సిగరెట్‌ అంతా పడుతుంది. అప్పుడు దాని పొగ పీలుస్తారు. హ్యాష్‌ఆయిల్‌ను అత్యంత సులభంగా తయారు చేయవచ్చు. గంజాయిని ఫ్రేక్షనల్‌ క్రిస్టలైజేషన్‌ అనే రసాయనిక చర్యకు గురిచేస్తే హ్యాష్‌ఆయిల్‌ వస్తుంది.

మాదక ద్రవ్యాలు అనగా మానవ శరీరానికి మిక్కిలి హాని కలిగించే కొన్ని పదార్ధాలు. వీటిని ప్రపంచమంతా డ్రగ్స్ అని వ్యవహరిస్తారు. మాదక ద్రవ్యాల వాడకం ఒక ప్రమాదకరమైన వ్యసనము (Addiction). ఈనాటి యువతరాన్ని దారి మళ్ళించి చెడు మార్గాల్లో నడిపిస్తున్న దురలవాట్లలో మాదక ద్రవ్యాల వినియోగం తీవ్రమైనది. ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాల కన్నా తీవ్రమైన ప్రభావకాలు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 5.6 శాతం జనాభా అనగా 185 మిలియన్ల మంది ఇలా మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు అంచనాలు తెలుపుతున్నాయి.

మాదకద్రవ్యాలలో వివిధ రకాలున్నాయి. నల్లమందు, మార్ఫిన్, హెరాయిన్, చరస్, గంజాయి, మారిజువానా, కొకైన్, ఎల్.ఎస్.డి. మొదలైనవి ముఖ్యమైనవి.

మాదక ద్రవ్యాలు నల్ల బజారులో అందుబాటులో ఉంటున్నాయి. వీనికి వివిధ ప్రాంతాలలో సంకేత నామాలతో చలామణీ అవుతుంటాయి. ఇలా అక్రమ వ్యాపారాలు దొంగ రవాణాకు పాల్పడుతూ కోట్లాది రూపాయల్ని గడిస్తుంటే, యువత వానిని వినియోగిస్తూ చెడిపోయి వారి జీవితాలను ధ్వంసం చేసుకుంటూ, దేశానికి ద్రోహం చేస్తున్నారు. వీటికి అలవాటు పడిన విద్యార్థులు, యువకులు చదువులు వదిలి సర్వస్వం కోల్పోయి నిర్భాగ్యులౌతున్నారు. ఒకసారి దీనికి బానిసలైన తర్వాత వీనిని సంపాదించడానికి ఎంతటి అకృత్యాలు, నేరాలు చేయడానికి వెనుకాడరు.

మాదక ద్రవ్యాల నిరోధానికి భారతప్రభుత్వం నార్కోటిక్స్, డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సస్ చట్టాన్ని చేసింది. సాధారణంగా ‘ఎన్‌డిపిఎస్’ చట్టం అని పిలుస్తారు. ఇది భారతదేశం యొక్క పార్లమెంటు రూపొందించిన చట్టం, ఈ చట్టం వలన ఏదైనా మాదక ఔషధం లేదా మానసిక పదార్థాన్ని తినే వ్యక్తిని లేదా ఉత్పత్తి చేసే/తయారీ/పెంపకం, స్వాధీనం (కలిగి ఉండటం), అమ్మకం, కొనుగోలు, రవాణా లేదా నిల్వ చేసే వ్యక్తిని నిషేధిస్తుంది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ బిల్లు 1985 ఆగస్టు 23 నాడు లోక్‌సభలో ప్రవేశపెట్టబడింది. పార్లమెంటు ఉభయ చట్టసభలు ద్వారా ఆమోదం పొందింది. 1985 సెప్టెంబరు 16 న ఆనాటి రాష్ట్రపతి నుంచి అనుమతి పొందింది, 1985 నవంబరు 14న అమల్లోకి వచ్చింది. ఎన్‌డిపిఎస్ చట్టం ప్రారంభం నుండి 1988, 2001, 2014 సంవత్సరాల్లో మూడుసార్లు సవరించబడింది. ఈ చట్టం భారతదేశం మొత్తం విస్తరించబడింది. భారతదేశం వెలుపల గల భారతదేశ పౌరులకు, భారతదేశంలో ఓడలు, విమానాలలో నమోదు చేయబడిన వారందరికీ ఇది వర్తిస్తుంది. ఈ చట్టం యొక్క నిబంధనలలో ఒకటైన, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అనేది మార్చి 1986 నుండి అమలులోకి వచ్చింది. నార్కోటిక్ ఔషధాలపై సింగిల్ కన్వెన్షన్, సైకోట్రోపిక్ సబ్‌స్టెన్సెస్లు కన్వెన్షన్, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టెన్సెస్ లలో అక్రమ రవాణాకు వ్యతిరేకంగా యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ కింద భారతదేశం యొక్క ఒప్పంద బాధ్యతలను నెరవేర్చడానికి ఈ చట్టం రూపొందించబడింది.1985 వరకు భారతదేశానికి నార్కోటిక్స్‌కు సంబంధించి ఎటువంటి చట్టం లేదు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here