నిజాయితీపరుడైన అధికారి అనుభవాలు, ఆలోచనలు

0
8

[dropcap]ని[/dropcap]జాయితీ గల ఆఫీసరుగా, ఎలాంటి ఒత్తిళ్ళకు లొంగకుండా కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వహించే ఉత్తమ ఆఫీసర్‌గా జె.సి.మెహంతి అందరికీ పరిచయం. ఆయన ఐఎఎస్ ఆఫీసరుగా తన అనుభవాలను చిన్న చిన్న సంఘటనల రూపంలో ఆసక్తికరంగా పొందుపరిచిన పుస్తకం ‘బ్రేకింగ్ థ్రూ న్యూ ఎర్త్’. ఇందులో కేవలం అనుభవాలే కాక, ఆయన ఆలోచనలు, సూచనలు కూడా ఉన్నాయి.

ఒరిస్సా లోని జాజ్పూర్ వద్ద జన్మించిన మొహంతిపై తండ్రి ప్రభావం అమితంగా ఉంది. అతని తండ్రి నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయతం మొహంతిపై ప్రభావం చూపింది. శాస్త్రవేత్తగా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించిన మొహంతి, 1979లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులో చేరారు. “I stepped into the Indian Administrative Service with a scientific temperament and a penchant for innovation as I went along” అంటారు ఆయన పుస్తకానికి ముందుమాటలో.

ఈ పుస్తకం రాయటంలో ఆయన ఉద్దేశాన్ని వివరిస్తూ, ఉద్యోగ విధులలో భాగంగా, తాను అనుభవించిన ఆసక్తికరమైన అంశాలతో పాటు తాను గ్రహించిన సత్యాలనూ ఈ పుస్తకంలో పొందుపరచానన్నారు. పాలనా విధానాన్ని మరింతగా మెరుగుపరిచేందుకు వ్యవస్థలో జరగాల్సిన మార్పులను సూచిస్తూ, ఒక వ్యక్తి తలచుకుంటే మార్పును ఆరంభించటమే కాక, శాశ్వతంగా వ్యవస్థను రూపాంతరం చెందించటానికి కారణమవగలడంటారాయన. అయితే ఈ పుస్తకం కేవలం తన అనుభవాలను చెప్పటం కోసమే కాదని, “I was driven by the deep desire to write of Ideas and people that have inspired me” అంటారు. ఈ పుస్తకం యువ హృదయాలలో ప్రజలకు సేవ చేయాలన్న తపనను రగిలిస్తే తన లక్ష్యం నెరవేరినట్టే అంటారు.

పుస్తకంలో మొత్తం 10 అధ్యాయాలున్నాయి. The Human Touch, Reading between the Lines of the Ruler, Effective Elections, A Delectable Efficiency, A Special Theory of Relativity, Undoing Stereotypes, Charmed by Innovation, The Tech Tonic Shift, Turning Around a Whole Organization, Breaking a New Earth of Public Service అనే పది అధ్యాయాలలో తన అనుభవాలను వర్గీకరించి పొందుపరచారు.

ప్రతి అధ్యాయంలోని సంఘటనలు ఆసక్తికరంగా ఉండటమే కాదు, ఎలాంటి వర్ణనలు, వివరణలు లేకుండా సూటిగా, చక్కగా ఉండడంతో చదవటం ఆసక్తికరంగా వేగవంతంగా సాగుతుంది.  ప్రతి సంఘటనతో పాటూ ఆయా సందర్భాలలో చిన్న చిన్న వాక్యాలలో తన భావనలను, తాను అర్థం చేసుకున్న సత్యాలను పొందుపరచారు రచయిత. వీటన్నిటినీ కనుక ఒక చోట చేరిస్తే చక్కని వ్యక్తిత్వ వికాస సూత్రాలుగా, ఆనందకర జీవితానికి దారి చూపే మంచిమాటలుగా ఉపయోగపడతాయి. మచ్చుకి:

  1. Sometimes, an officer is rendered completely helpless, trapped between the papers of the rule books (pp 50).
  2. Finding midway situations can go a long in creating value. (pp 27)
  3. When I am seeking a solution, I often start with the simplest of them at first. Often the simpler a solution, the more we tend to overlook it. (pp 116)
  4. The right kind of planning, team work, and firm decisions can go a long way in accomplishing just about any goal. (pp 118)
  5. It is lightly imperative for officers to recognize the efforts of staff, to appreciate their extraordinary contributions and inspire other to learn from them. (pp 146)
  6. The people we work with cannot help but turn into second family. (pp 151)
  7. Encouraging people – irrespective of their status in the organization to contribute their thoughts and suggestions adds immense value. (pp 210)

ఇలా అడుగడుగునా ఆలోచింపచేసే వ్యాఖ్యలతో రచన సాగుతుంది.

ఇక ఈ పుస్తకంలో రచయిత ప్రస్తావించిన పలు సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అనేక విషయాలపై అవగాహన కలిగిస్తాయి. అనేక ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు గురించి మనకు తెలియని విషయాలను తెలియజేస్తూ ప్రభుత్వ పనితీరుపై, నిర్ణయాలు తీసుకునే విధానంపై అవగాహన కలిగిస్తాయి. ప్రభుత్వ సంస్థల పనితీరు, అధికారులు, ఉద్యోగుల మనస్తత్వాలు, వాటి పని బాగు చేసేందుకు అమలు చేయాల్సిన పద్ధతులు వంటి విషయాలపై కూడా అవగాహన కలుగుతుంది. ఆలోచన కలుగుతుంది. అనేక సందర్భాలలో మనకు పైపైన కనిపించిన విషయాలు, మార్పుల వెనుక ఎంతెంతమంది, ఎన్నెన్ని రకాలుగా కష్టపడ్డారో, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొని ఈ ఫలితాన్ని సాధించారో తెర వెనుక కథలు తెలుస్తాయి.

ఇంతేకాక, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు పర్యటనకు వచ్చిన సమయంలో అధికారుల పరిస్థితి, వారు అధిగమించాల్సిన సమస్యలు, ఎదుర్కునే ఉద్విగ్నతల వంటి విషయాలు తెలుస్తాయి. అంటే ఈ పుస్తకం చదువుతుంటే ఒక ప్రభుత్వ అధికారి జీవితంలో తెర వెనుక కథలు తెలియటమే కాక, ఐఎఎస్ అధికారిగా సమర్థవంతంగా ప్రజాసేవ చేయాలంటే ఉండాల్సిన పట్టుదల, దీక్షలు బోధపడతాయి. ఐఎఎస్ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారే కాదు, ప్రతి ఒక్క పౌరుడూ చదవాల్సిన పుస్తకం ఇది. సమర్థవంతమైన అధికారులు తమ ఉద్యోగ అనుభవాలను ప్రజలకు చేరువ చేయటం అభినందనీయమైనదే కాదు, ఆవశ్యకమైనది కూడా.

***

Breaking Through New Earth

రచన: జతీష్ చంద్ర మొహంతి

పేజీలు: 340

వెల: ₹ 799/-

ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు

email: mybook@wingspublication.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here