చర్యాపదాలు – పుస్తక పరిచయం

0
9

[dropcap]బౌ[/dropcap]ద్ధులు చేసే రహస్య పూజలో పాడే పదాలను చర్యాపదాలు అంటారు.  చర్య  అన్న పదానికి అర్థం బోధచర్య. వీటిని చర్యాగీతాలని కూడా అంటారు. ఇవి తాత్వికమే కాక, సంకేతాత్మక రచనలు. ఇందులో సామాన్యులకు కూడా సులభంగా బోధపడే సామాన్యర్థం, సాధకులు మాత్రమే గ్రహించగలిగే ప్రతీకాత్మకమైన, మార్మికమైన అర్థం ప్రతి పదంలోనూ ఉంటాయి. ఈ కవితల్లో అప్పటి వారి సామాజిక స్పృహ, ఆధునికత కలగలిసి ఉంటాయని అనువాదం చేసిన ముకుంద రామారావు ముందుమాటలో చెప్పారు.

“ఈ గ్రంథం తెలుగు జాతికి ముకుంద రామారావు అందిస్తున్న గొప్ప బహుమానం” అని డా. డి. విజయభాస్కర్ తన సందేశంలో అన్నారు.

“ఇదొక శుభారంభం. చర్యాగీతాలపై శోధించాల్సింది ఇంకా ఎంతో ఉంది. అపురూపమైన ఈ గ్రంథాన్ని తెలుగువారికి అందజేసిన ముకుంద రామారావు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను” అని సంపాదకుడి మాటలలో ఉణుదుర్తి సుధాకర్ రాశారు.

ఈ పుస్తకంలో మొత్తం 50 చర్యాపదాల తాత్పర్యం, అర్థ వివరణ ఉన్నాయి. పుస్తకం చివర్లో చర్చాపదాల సిద్ధాచార్యుల గురించి వివరణ విశేషాలు పొందుపరిచారు. బౌద్ధం పట్ల ఆసక్తి ఉన్నవారికి, తాత్వికత పట్ల అనురక్తి ఉన్నవారికి అత్యంత ఆనందాన్ని కలిగిస్తుందీ పుస్తకం.

***

చర్యాపదాలు- అనేక భాషల ప్రథమ కావ్యం
(పదవ శతాబ్దపు మహాయాన బౌద్ధుల నిర్వాణ గీతాలు)
అనువాదం: ముకుంద రామారావు
సంపాదకులు: ఉణుదుర్తి సుధాకర్
పేజీలు: 160; వెల: ₹ 99/-
ప్రతులకు: ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ లాంగ్వేజ్ అండ్ కల్చరల్ డిపార్ట్‌మెంట్, అమరావతి, ఆంధ్రప్రదేశ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here