చెదిరిన స్వప్నం

0
9

[dropcap]స[/dropcap]ముద్రపు అలలు తాకుతూ పద్దెనిమిది సంవత్సరాల వయస్సు గల ఒక కోమలిని తాకిన ఆ గాలి, విహరిస్తూ నా తనువును తాకి పోతూ ఉంటే, ఆ తాకిడికి చలించి పోయిన నా మనస్సు నా తనువును కూడా మరిచి పోయింది. అటువంటి సమయంలో చంద్రుని వెన్నెల కాంతులను కూడ కలుపుకుని నక్షత్ర కాంతిని విరజిమ్ముతూ, నా చెలి వయ్యారంగా హంస వలే అడుగులో అడుగు వేస్తూ నన్ను చేర వస్తుంది. అటువంటి సమయంలో తన కాలి అందెల సవ్వడికి నా హృదయం తాలం వేస్తూ, మనస్సులో రగిలించేను కొరికలేన్నో, తను చేరువయ్యే కొలది నాకు ఊపిరి కూడా ఆడనంత ఉత్సాహంతో తనువు తనను చేర వెళ్తుంది. కను రెప్ప కాలంలోనే తనను చేరుకున్న నా దేహం తన దేహంతో మల్లెతీగలా పెనవేసుకోవాలని తపన పడుతుంది. అటువంటి సమయంలో తను తన మృదు హస్తాలతో నా హృదయాన్ని తాకింది, ఆ తాకిడికి తాళలేని నా మనస్సు విరహయాతన పడుతూ కోర్కెను తీర్చమని ఆరాటపడుతుంది.

అప్పుడు నా మనస్సులోని మాటలు గొంతులోకి వచ్చి, కళ్యాణి నీ కరములతో బంధించి కాముడికి మనశ్శాంతిని కల్గించు అని చెప్పితిని. నా మాటలు విన్న కళ్యాణి ఆగాగు నేను నా ఇంటిలోని వారి నుండి తప్పించుకు వచ్చేందుకు ఎంత ఆరాట పడ్డానో నీకు తెలియదు, గృహాన్ని దాటిన తర్వాత వచ్చే ఆటంకాలను ఎదుర్కునేందుకు విల్లును ధరించి బాణాలను లక్షంవైపు ఎక్కుపెట్టిన మన్మధుడిని వెంట పెట్టుకొనివచ్చాను. ఇంత కష్టతర సమయంలోనైనా నీ కోసం వస్తే నీవు విరహంతో విర్రవీగుతావా..?? ఎంతటి అపరాధం అంటూ వయ్యారాలు వలికింది.

అలా కాదు కళ్యాణి నిన్ను చూసిన మన్మథుని మనస్సే చలిస్తే నీచ మానవుడిని నా మనస్సు చలించడంలో వింత ఏముంది సఖి అంటూ దగ్గరకు తీసుకున్నాను.

ఈ మాటలకు ఏమి తక్కువలేదులే కృష్ణ నాకు సమయం సమీపించుచున్నది నేను వెళ్ళాలి అంది కళ్యాణి. సమయము దేముందిలే కదిలే కాలచక్రాన్ని నిలువరింప తరమా కళ్యాణి అని యంటిని. అవునవును కాలచక్రమును నిలువరింపగలలేరు కానీ చేజిక్కిన చెలిన నిలుపుతురు మీ మగమహారాజులు మరీ అంది కళ్యాణి.

సరి సరి కానీ నా అధరములు అడుగుచున్నవి నీ అధరామృతాన్ని తాకే సమయమెన్నడు అని అన్నాను నేను. నీ కరముల బందీలో ఖైదీ అయిన నన్ను ఇంకా బ్రతిమాలడమేల, నీకు ఏమైనా మతి చలించినదా అని యోచనలో పడియుండి పోయింది నా మనస్సు అంది కళ్యాణి.

నిన్ను చూసిన తరుణం నుంచి ఊహాప్రపంచంలో విహరిస్తోంది నా మనస్సు, అందుచేత వర్తమానంలో ఏమి జరుగుతుందో గ్రహించలేక నీ ఆజ్ఞ కోసం వేచి చూస్తూ యుండిపోయింది నా తనువు యంటిని నేను. సర్వం అర్పించిన అనంతరం కార్యాన్ని మొదలెట్టక మీనమేషాలు లెక్కిస్తూ కాలాన్ని గమనంలోకి వెలేస్తే తర్వాత నేనేమిచేయలేను అంది కళ్యాణి.

అయితే ఉపేక్షించక మొదలెట్టేదను కార్యార్తినై యంటూ తనను నా కరములతో నా దేహాన్ని తన దేహంతో మల్లెతీగ పందిరి వల్లే అల్లుకుపోతూ, తన డొంక పై నా హస్తాన్ని వేసితిని, అట్టి సమయమున తను నా నుండి ఎందుకో దూరం కావాలనే యోచనలో ఉన్నట్లు నా హృదయం తెలుపుతున్నట్లు సందేశం వచ్చింది.

ఏమైంది ఎందుకు విచారిస్తూ ఉన్నావు అంటిని, అట్టి తరుణంలో ఏమి లేదు నేన్నిప్పుడు నీ అంతరంగంలో మునగలేను అందుకు సమయం వేరే యున్నది, కాస్త నీ బందికాన నుండి విముక్తి కల్గించూ అంటూ కన్నీటిని కార్చింది.

ఏమి ఎప్పుడు ఆ సమయం??, ప్రస్తుతం సమస్య ఏమి యని నా మధింపునా చింతించుచూ యుంటిని అన్నాను. మన కలయిక ఇదియే తొలి మరియు చివరి కలయికగా మిగిలిపోవును, ఎందుకనగా నాకు పెళ్ళి చూపులు జరుగుతూ ఉన్నవి, కావున అటుల జరగకూడదు అనిన యడల మన కళ్యాణ వైబోగము అనంతరం మనలను ఆపే శక్తి దేవుడికి కూడా ఉందజాలదు అంది కల్యాణి.

సరే మరి మన తక్షణ కర్తవ్యం తెలుప కొరుతుంటిని అన్నాను నేను. మన పెద్దలను సంప్రదించి అంగీకారం ఒంది కలువట మంచి అన్నది. సరి వెళ్దాము అని బయలుదేరి మా మామ ఇంటిలో మామగారు అని అంటూ ఉన్న వేళ, నా మిత్రుడి మామ అరే మామ యని నన్ను నిద్రయందు నుండి మెలికలోకి తీసుకువచ్చాడు. మామ నా మామ గారు, నా ప్రేయసి కళ్యాణి ఎక్కడ అని అంటే నీవు నిద్రలో కళలతో ఊహా ప్రపంచాన్ని చూసి వచ్చినట్లున్నావు, ఇక్కడ ఎవ్వరూ లేరు అన్నాడు నా మిత్రుడు.

సరే లేరా బంగారంలాంటి కలను, చూడ ముచ్చటగా ఉండే అపురూప సౌందర్యవతిని నా సుందర స్వప్నాన్ని చెదిరిన స్వప్నంగా చేశావు కదరా, ఎలా అయితేనేమి వింత అనుభూతిని కల్గించింది ఆ స్వప్నం.

సర్వే జనా సుఖినోభవంతు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here