చెలిమి ఊట

0
9

[box type=’note’ fontsize=’16’] చెలిమి ఊట…. ఎప్పటికీ రంగురంగుల పూలపరిమళాలు వెదజల్లుతున్న చంటిపాపాయి లాంటిదేనంటున్నరు జయంతి వాసరచెట్ల ఈ కవితలో. [/box]

[dropcap]నా[/dropcap] జీవిత ప్రయాణంలో
ఆత్మీయతానుబంధాలెన్నో
అనుక్షణం వెన్నంటి ఉండే జ్ఞాపకాల
ఊటలెన్నో
కనిపెంచిన ప్రేమ కన్నా ఆత్మీయత పంచిన
మనసు మిన్న అన్నట్లు

నడుస్తున్న దారిలో దొరికిన
ఆత్మీయత మొగ్గలు
అనుక్షణం విచ్చుకున్నపరిమళాలు
వెదజల్లుతూ వేధిస్తుంటే
కళ్ళల్లోకి ప్రేమను ఒంపుకునే చోటు దొరకక
దారి పోంటీ కళ్ళు పరుగెడుతూ నే ఉన్నాయి
ఎన్నీళ్ళ ముచ్చట్లైనా కొన్ని క్షణాల ముందే జరిగినట్టు మనసు తలుపు తడుతూనే ఉన్నాయి
సృజన లో తప్ప నిజంగా కనిపించనంత
వేగంగా పారిపోతున్నాయి
ఆడుకున్న చిన్ననాటి చెలిమిలు చెలిమెలుచేసి
వెళ్ళిపోయాయి
ఆర్తి గా ఎదురుచూసినా రానంత దూరంగా
అప్పుడెప్పుడో పంచిన ఆత్మీయత వదిలి అందనంత దూరంగా………
ఉన్నవారు ఒడిదుడుకులను కప్పుకొని
ఒత్తిడుల మధ్య ఒదిగిపోయారు
కాలం నడుస్తూనే ఉన్నా………
కలిసితిరిగిన నేస్తాలు మాత్రం
ఎదురు పడినా ప్లాస్టిక్ పూల
రంగులు పులుముకున్నట్లు
పాతరోజుల కొన్ని గురుతులు మాత్రం మోసుకొస్తున్నాయి
వయసుబరువు పెరుగుతున్నాకొద్ది…..
ఆ పంచిన మమకారాల తాలూకు
కొన్ని జ్ఞాపకాలు దూదిపింజలా
గాలిలోకి తేలుతున్నాయి
ఎంతైనా చెలిమి ఊట ……..ఎప్పటికీ
రంగురంగుల పూలపరిమళాలు
వెదజల్లుతున్న  చంటిపాపాయేకదా!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here