సినిమా క్విజ్-104

0
11

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. 1953లో వచ్చిన ‘గుమాస్తా’ చిత్రంలో నాగయ్య, పండరీబాయి నటించగా కథ, స్క్రీన్ ప్లే ఆచార్య ఆత్రేయ అందించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకులు ఎవరు?
  2. ఎన్టీఆర్, భానుమతి, ముక్కామల, రేలంగి నటించిన ‘అగ్గిరాముడు’ (1954) చిత్రానికి మాటలు, పాటలు వ్రాసిన వారు ఆచార్య ఆత్రేయ. దర్శకుడు ఎస్. ఎం. శ్రీరాములు నాయుడు. ‘రాముడు’ టైటిల్‌తో వచ్చిన మొదటి చిత్రం. దీనికి కథను సమకూర్చిన వారి పేరు?
  3. దర్శకుడు బి.ఏ. సుబ్బారావు గారు మార్క్ ట్వయిన్ గారి నవల ‘ది ప్రిన్స్ అండ్ ది పాపర్’ (1881) ఆధారంగా, సంభాషణలు పినిశెట్టి వాయగా, సంగీతం ఎస్. రాజేశ్వర రావు సమకూర్చిన చిత్రంలో ఎన్టీఆర్ లక్ష్మి రాజ్యం, ఎస్.వి. రంగారావు, మాస్టర్ సుధాకర్ నటించారు. ఆ చిత్రం పేరు?
  4. కె.వి. రెడ్డి, డి.వి.నరసరాజు, దుక్కిపాటి మధుసూధనరావు కథ సమకూర్చగా, మాటలు డి.వి.నరసరాజు వ్రాసిన ‘దొంగరాముడు’ (1955) చిత్రంలో అక్కినేని, సావిత్రి, జమున, జగ్గయ్య, రేలంగి నటించారు. ఈ సినిమాకు దర్శకుడు కె.వి.రెడ్డి. ఛాయాగ్రహణ దర్శకత్వం వహించినదెవరు?
  5. శ్రీ మైత్రో గారి బెంగాలీ నాటకం ‘మన్‍మోయీ గర్ల్స్ స్కూల్’ ఆధారంగా తీసిన ఈ చిత్రానికి సంగీతం ఎస్.రాజేశ్వర రావు. దర్శకుడు ఎల్. వి.ప్రసాద్. అగ్రనటులు NTR, ANR, సావిత్రి, జమున, ఎస్. వి. రంగారావు నటించిన ఈ చిత్రం పేరు?
  6. సి. ఎం. అన్నాదురై కథ, దర్శకత్వం సి.పి. దీక్షిత్ వహించిన ఈ సినిమాకి, విశ్వనాధన్- రామ్మూర్తి సంగీతం అందించారు. ఎన్టీఆర్, అంజలి, జమున, జగ్గయ్యలు నటించిన ఈ చిత్రాన్ని హిందీలో ‘నయా ఆద్మీ’గా తీశారు. తెలుగు చిత్రం ఏది?
  7. యోగానంద్ దర్శకత్వంలో రామనాధన్, విశ్వనాథన్. రామ్మూర్తి సంగీత దర్శకత్వం వహించగా, NTR, పద్మిని నటించగా, మాటలు, పాటలు సముద్రాల జూనియర్ వ్రాయగా ఒకేసారి తెలుగులోనూ, తమిళంలోనూ తీసారీ సినిమాని. తమిళంలో సినిమా పేరు ‘కావేరి’. తెలుగులో ఏ పేరిట తీశారు?
  8. కాళ్లకూరి నారాయణరావు నాటకం ఆధారంగా S.రామకృష్ణ దర్శకత్వంలో అద్దేపల్లి రామారావు, T.V.రాజు సంగీత దర్శకత్వంలో NTR, భానుమతి, S.V. రంగారావు, జమునతో తీసిన చిత్రం ఏది?
  9. కె.ప్రత్యగాత్మ కథను వ్రాయగా, స్క్రీన్ ప్లే – దర్శకత్వం తాతినేని ప్రకాశరావు చేయగా, (అసిస్టెంట్స్‌గా కె. పత్యగాత్మ, వి. మధుసూదనరావులు), ఛాయా గ్రహణం కమల్ ఘోష్, సంగీతం ఘంటసాల అందించిన చిత్రంలో NTR, అంజలి, జానకి, రేలంగి నటించారు. ఆ చిత్రం ఏది?
  10. శిష్ట్లా జానకి (ప్లేబాక్ సింగర్) మొదటిసారిగా పాటలు పాడిన సినిమా ఏది? K. B. తిలక్ దర్శకత్వంలో, పెండ్యాల సంగీత దర్శకత్వంలో వచ్చిందీ చిత్రం. ఇందులో జగ్గయ్య, సావిత్రి నటించారు.

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2024 సెప్టెంబర్ 03 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 104 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 సెప్టెంబర్ 08 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 102 జవాబులు:

1.శ్రీ గౌరీ మహాత్మ్యం (1956) 2. రఘునాథ పాణిగ్రాహి 3. బి.ఎస్.రంగా 4. సావిత్రి 5. పి. భానుమతి 6. పల్లెటూరు (1952) 7. నిరుపేదలు (1954) 8. వద్దంటే డబ్బు (1954) 9. బంగారు పాప (1955) 10. కొండేపూడి లక్ష్మీనారాయణ

సినిమా క్విజ్ 102 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • సిహెచ్.వి. బృందావన రావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • పి. వి. రాజు
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • సునీతా ప్రకాశ్
  • శంబర వెంకట రామ జోగారావు
  • వనమాల రామలింగాచారి
  • జి. స్వప్నకుమారి
  • టి. మమన్ బాబు

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here