సినిమా క్విజ్-115

0
13

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. పొన్నలూరి వసంతకుమార్ రెడ్డి దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., జయశ్రీ (నటి జయచిత్ర తల్లి), శోభన్ బాబు నటించిన ‘దైవబలం’ (1959) సినిమాలో ఎన్.టి.ఆర్. తల్లి పాత్రలో నటించినదెవరు?
  2. పి. పుల్లయ్య దర్శకత్వంలో అక్కినేని, అంజలీదేవి, గుమ్మడి నటించిన ‘జయభేరి’ (1959) సినిమాలో అక్కినేనికి వదినగా నటించినదెవరు?
  3. నిర్మాతలు రంగారావు, రాజేంద్రప్రసాద్ మొదటిసారిగా వి. మధుసూదనరావు దర్శకత్వంలో జగ్గయ్య, జమున గుమ్మడి గార్లతో 1960లో తీసిన సినిమా ఏది? ఈ సినిమాకి సుసర్ల దక్షిణామూర్తి సంగీతం సమకూర్చారు. (క్లూ: ‘తళతళా మిలమిలా పగటిపూట వెన్నెలా ఎందువలన’ అనే పాట ఈ సినిమాలోదే)
  4. కబీర్ దాస్ దర్శకత్వంలో అంజలీదేవి, గుమ్మడి, చలం, కృష్ణకుమారి నటించిన 1960లో వచ్చిన ఈ సినిమాకి బెంగాలీ రచయిత్రి ప్రభావతి సరస్వతి రచించిన కథ ఆధారం. కొండేపూడి లక్ష్మీ నారాయణ మాటలు వ్రాయగా, మాస్టర్ వేణు సంగీతం అందించారు. ఈ సినిమా ఏది? (క్లూ: ‘పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడైపోయెను గూడు’ అనే పాట ఈ సినిమాలోదే)
  5. బి.ఎస్. నారాయణ దర్శకత్వంలో కాంతారావు, దేవిక, రామకృష్ణ, రాజశ్రీ నటించిన 1960లో వచ్చిన ఈ సినిమాకి కె. వి. మహదేవన్ సంగీతం అందించగా, ఆచార్య ఆత్రేయ పాటలు రాశారు. సినిమా పేరు? (క్లూ: ‘తాతయ్యా కోతయ్యా తాళండయ్యా కాస్తా తాడో పేడో తేల్చేస్తా’ అనే పాట ఈ సినిమాలోదే)
  6. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని, సావిత్రి, ఎస్. వి. రంగారావు, గుమ్మడి నటించిన ‘నమ్మిన బంటు’ (1960) సినిమాకి సుంకర సత్యనారాయణ గారితో పాటుగా సంభాషణలు అందిచింనదెవరు?
  7. కె.ఎస్. ప్రకాశరావు దర్శకత్వంలో గుమ్మడి, జి. వరలక్ష్మి, జగ్గయ్య, జమున నటించిన ‘రేణుకాదేవి మహత్యం’ (1960) సినిమాకి సంగీతం అందించినదెవరు?
  8. పి. రామకృష్ణ దర్శకత్వంలో అక్కినేని, అంజలీదేవి నటించిన ‘భక్త జయదేవ’ (1961) సినిమాలో ‘లక్ష్మణసేన మహారాజు’ పాత్ర పోషించిన నటుడెవరు?
  9. తమిళ చిత్రం ‘కుముదం’ (1961) ఆధారంగా తెలుగులో అక్కినేని, ఎస్.వి. రంగారావు, సావిత్రి, షావుకారు జానకిలతో ‘మంచి మనసులు’ (1962) తీశారు. తమిళ సినిమాకి దర్శకుడెవరు?
  10. బి. విఠలాచార్య దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., కృష్ణకుమారి, గుమ్మడి, రాజనాల నటించిన ‘బందిపోటు’ (1963) సినిమాకి కథ, మాటలు అందించినదెవరు?

~

ఈ ప్రశ్నలకు జవాబులను 2024 నవంబర్ 19వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 115 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 నవంబర్ 24 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 113 జవాబులు:

1.మిక్కిలినేని 2. అమర్‍నాథ్ 3. కళ్యాణకుమార్ 4. వాణిశ్రీ 5. విశాల హృదయాలు 6. శోభన్‍బాబు 7. ఉదయకుమార్ 8. బియాండ్ దిస్ ప్లేస్ 9. బెకెట్ 10. హై నూన్

సినిమా క్విజ్ 113 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • సిహెచ్.వి. బృందావన రావు, నెల్లూరు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • మంజులదత్త కె, ఆదోని
  • పి.వి.రాజు
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి, ఒంగోలు
  • సునీతా ప్రకాష్, బెంగుళూరు
  • శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు
  • వనమాల రామలింగాచారి, యాదగిరి గుట్ట

వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

గమనిక:

  1. సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.
  2. ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  3. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here