సినిమా క్విజ్-12

0
14

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. జగ్గయ్య, సావిత్రి, విజయనిర్మల నటించిన చిత్రం ఏది?
  2. ధర్మేంద్ర, సావిత్రి నటించిన హిందీ చిత్రం ఏది?
  3. ఎన్‍.టి.ఆర్ నటించిన ‘ఎవరు దేవుడు’ చిత్రానికి దర్శకుడు ఎవరు?
  4. ఎన్‍.టి.ఆర్ నటించిన ‘భీష్మ’ చిత్రంలో పరశురామునిగా నటించినది ఎవరు?
  5. ‘ఓహో వరాల రాజా ఓహో వరాల రాణి’ పాటను ఘంటసాల, జిక్కీ పాడగా, సంగీతం అందించినది ఎవరు?
  6. ‘కన్నుల్లో నీ బొమ్మ చూడు, అది కమ్మని పాటను పాడు’ – ఘంటసాల, రాధా జయలక్ష్మి పాడగా, సంగీత దర్శకుడి పేరేమి?
  7. కృష్ణ, వాణిశ్రీలు నటించిన ‘జగత్ కిలాడీలు’ చిత్రంలోని విలన్ ఎవరు?
  8. జెమినీ గణేషన్, సావిత్రిలు నటించిన కలర్ చిత్రం ‘మురిపించే మువ్వలు’ – చిత్రానికి తమిళ మాతృక పేరు?
  9. దర్శకుడు కె.ఎస్.ఆర్. దాస్ గారు దర్శకుడిగా కాకముందు చిత్రాలకు ______ గా పనిచేశారు.
  10. దర్శకుడు కె. విశ్వనాథ్ గారు దర్శకుడిగా కాకముందు చిత్రాలకు ______ గా పనిచేశారు.

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2022 నవంబరు 29వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 12 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2022 డిసెంబరు 04 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 10 జవాబులు:

1.అంతులేని వింత కథ 2. ప్రేమ్ పత్ర్ 3. బిదాయి 4. సుబాహ్ కా తారా 5. చౌదవీ కా చాంద్ 6. కోడెద్దులు ఎకరా నేల 7. చైనా టౌన్ 8. ప్యార్ కియా తో డర్నా క్యా 9. ఏక్ రాజ్ 10. ఘరానా

సినిమా క్విజ్ 10 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • పి.వి.ఎన్. కృష్ణశర్మ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • ఎస్. సునీతా ప్రకాష్
  • వనమాల రామలింగాచారి
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here