సినిమా క్విజ్-20

0
9

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. ఎన్.టి.ఆర్. ‘భట్టి విక్రమార్క’ చిత్రంలో కాళికాదేవి పాత్ర ధరించిన నటి ఎవరు?
  2. తెలుగు ‘తెనాలి రామకృష్ణ’ పాత్రధారి ‘అక్కినేని’ గారయితే, తమిళంలో ‘తెనాలి రామన్’ పాత్రధారి ఎవరు?
  3. ‘ఈ రోజు మంచి రోజు, మధురమైనదీ, మరపురానిది’ పాట పి. సుశీల, వాణీ జయరామ్‍లు పాడిన చిత్రం?
  4. దర్శకుడు కోడి రామకృష్ణ ముఖ్య పాత్ర ధరించిన భానుచందర్, సుహాసినిల చిత్రం పేరు?
  5. ముక్కామల, ఎన్.టి.ఆర్., మురళీమోహన్‍ల చిత్రం పేరు ఒక్కటే –
  6. కె. ప్రత్యగాత్మ దర్శకుడిగా ‘భార్యాభర్తలు’ చిత్రం హిందీలో ఎవరి దర్శకత్వంలో వచ్చింది?
  7. ‘చైర్మన్ చలమయ్య’గా చలం నటించిన చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు?
  8. తెలుగు రీమేక్ ‘రాము’ (ఎన్.టి.ఆర్.) చిత్రానికి సంగీతం ఆర్. గోవర్ధనం అయితే, మాతృక తమిళ చిత్రానికి సంగీతం ఎవరు సమకూర్చారు?
  9. శివాజీ గణేశన్, కన్నాంబ, గిరిజలు నటించిన 1954 నాటి సూపర్ హిట్ తమిళ చిత్రానికి దర్శకుడు ఎవరు?
  10. ‘నిజం చెబితే నమ్మరు’ చిత్రానికి సంగీతం ఎవరు అందించారు?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 జనవరి 24వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 20 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 జనవరి 29 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 18 జవాబులు:

1.బేటీ బేటే 2. బహురాణి 3. రాజ్‍కపూర్ 4. కంగన్ 5. వద్దంటే డబ్బు 6. ఏప్రిల్ 1 విడుదల 7. జాగృతి 8. భారతంలో అర్జునుడు 9. సన్ ఆఫ్ సర్దార్ 10. షాలిమార్

సినిమా క్విజ్ 18 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పి.వి.ఎన్. కృష్ణశర్మ
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
  • సునీతా ప్రకాష్
  • వనమాల రామలింగాచారి
  • భరత్. T
  • బుడిగే నాగరాజు
  • రాము
  • లక్మి
  • టి. రేవతి
  • డి. హేమలత
  • బి. సౌఖ్య
  • డి. శ్రీమయి
  • బి. అలివేలు
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here