సినిమా క్విజ్-23

0
6

‘సినిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. బి. విఠలాచార్య దర్శకత్వంలో రామకృష్ణ, జయసుధలు నటించిన జానపద చిత్రం ఏది?
  2. నటి ప్రభ తొలి చిత్రం ఏది? నరసింహరాజు, నూతన్ ప్రసాద్‍లు నటించిన ఈ సినిమాకి సంగీతం ‘సత్యం’.
  3. వి. మధుసూదన రావు దర్శకత్వంలో ఎన్‍.టి.ఆర్., జయప్రద నటించిన ‘సూపర్‌మేన్’ చిత్రంలో ఆంజనేయస్వామి పాత్రధారి ఎవరు?
  4. చెళ్లపిళ్ల సత్యం సంగీత దర్శకత్వంలో, డి. యోగనంద్ దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., మంజుల, పండరీబాయి నటించిన చిత్రం ఏది?
  5. హిందీ చిత్రం ‘అల్‌బేలా’కు రీమేక్‌గా, అక్కినేని సంజీవి దర్శకత్వంలో నాగభూషణం, కాంచన నటించిన చిత్రం పేరు?
  6. 1974లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తెలుగు నిర్మాత, దర్శకుడు ఎవరు?
  7. తమిళ చిత్రం ‘ఎన్ తంగాచి పడిచావ’ ఆధారంగా తెలుగులో కోడి రామకృష్ణ – బాలకృష్ణ, విజయశాంతి, సీత గార్లతో తీసిన సినిమా?
  8. ‘పెదరాయుడు’ సినిమాలో మోహన్‍బాబు వేసిన టైటిల్ పాత్రని తమిళంలో ‘నాట్టామై’ లో ఎవరు పోషించారు?
  9. పునీత్ రాజ్‍కుమార్ కన్నడంలో నటించిన ‘అప్పు’ చిత్రాన్ని తెలుగులో పూరీ జగన్నాథ్ రవితేజతో ఏ పేరిట తీశాడు?
  10. తమిళంలో ఎ. మురుగదాస్ విజయకాంత్‌తో ‘రమణ’ తీయగా, తెలుగులో వి. వి. వినాయక్ చిరంజీవితో తీసిన చిత్రం పేరు?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 ఫిబ్రవరి 14వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 23 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 ఫిబ్రవరి 19 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 21 జవాబులు:

1.భలే జోడి 2. వాల్టర్ వేట్రివేల్ 3. మూగ ప్రేమ (1971) 4. కై కొడుత్తు దైవం (1964) 5. మిస్టర్ భరత్ 6. వేగుచుక్క 7. అన్నైకిళ్ళి (1976) 8. నాగభూషణం 9. ఇండియానా జోన్స్ 10. ఘోస్ట్ అండ్ డార్క్‌నెస్

సినిమా క్విజ్ 21 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పి.వి.ఎన్. కృష్ణశర్మ
  • రంగావఝల శారద
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • శిష్ట్లా అనిత
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
  • శ్రేయ ఎస్. క్షీరసాగర్
  • శంభర వెంకట రామ జోగారావు
  • సునీతా ప్రకాష్
  • వనమాల రామలింగాచారి
  • తాతిరాజు జగం‌
  • భరత్. టి
  • హేమలత. డి
  • సౌఖ్యశ్రీ. బి
  • రేవతి. టి
  • శ్రీమయి డి
  • మల్లేష్ డి
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here