సినిమా క్విజ్-26

0
7

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. 1976లో జయలలిత, ముత్తురామన్ నటించిన తమిళ చిత్రం ‘కణవన్ మానైవి’ని దాసరి నారాయణరావు గారు కృష్ణంరాజు, జయప్రదలతో 1980లో ఏ పేరుతో తీశారు?
  2. 1982లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ‘ఓ ఆడది ఓ మగాడు’ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు?
  3. ‘పున్నగై దేశం’ తమిళ చిత్రాన్ని ప్రియమణి, తరుణ్‌లతో షాజహాన్ దర్శకత్వంలో తీసి, తెలుగులో వీరితోనే తీసిన చిత్రం ఏది?
  4. హిందీలో వచ్చిన ‘తను వెడ్స్ మను’ చిత్రాన్ని తెలుగులో హాస్య నటుడు సునీల్, ఇషా చావ్లాలతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  5. ‘నీవరువాయన’ అనే తమిళ చిత్రం ఏ పేరుతో నాగార్జున, సౌందర్య, శ్రీకాంత్ లతో తెలుగులో రీమేక్ అయింది?
  6. మలయాళ చిత్రం ‘ఫ్రెండ్స్’ ఆధారంగా తెలుగులో నాగార్జున, సుమంత్, భూమికలు నటించిన చిత్రం ఏది?
  7. బాలశేఖరన్ దర్శకత్వంలో విజయ్, సువలక్ష్మి నటించిన తమిళ చిత్రం ‘లవ్ టుడే’ (1997) ఏ పేరుతో తెలుగులో రీమేక్ అయింది?
  8. ‘ఉన్నిడతిల్ ఎన్నై కొడుతేన్’ అనే తమిళ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్, సౌందర్యలతో ముప్పలనేని శివ దర్శకత్వంలో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  9. తమిళ చిత్రం ‘తిరుపొచ్చి’ తెలుగులో పవన్ కళ్యాణ్, ఆసిన్ లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  10. 2000 సంవత్సరంలో శరత్ కుమార్, మీనాలు నటించిన ‘మాయి’ అనే తమిళ చిత్రం, తెలుగులో డా. రాజశేఖర్, సాక్షి శివానంద్ లతో ఏ పేరుతో రీమేక్ అయింది?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 మార్చి 07వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 26 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 మార్చి 12 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 24 జవాబులు:

1.బిదాయి 2. మొరటోడు 3. దొరికితే దొంగలు 4. రామ్మోహన్ 5. మహంకాళి వెంకయ్య 6. తోలేటి వెంకట రెడ్డి 7. సంఘం 8. శివాజీ గణేశన్, బి. సరోజా దేవి 9. ఊరికి ఉపకారి 10. హిందీ తార హెలెన్

సినిమా క్విజ్ 24 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • జానకి సుభద్ర పెయ్యేటి
  • మణి నాగేంద్రరావు బి.
  • మత్స్యరాజ విజయ
  • పి.వి.ఎన్. కృష్ణశర్మ
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • సునీతా ప్రకాష్
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం‌
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వర్ధని మాదిరాజు
  • వనమాల రామలింగాచారి
  • డి. హేమలత
  • టి. రేవతి
  • బి. సౌజన్యశ్రీ
  • డి. శ్రీమయి
  • ఎ. లక్ష్మి
  • టి. భరత్
  • డి. మల్లేష్
  • బి. నాగరాజు

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here